శ్రీ శాస్త్రిగారు నెఱపు ట్రేట్మెంటు పద్ధతినిగూర్చి పాఠకులుసరికి తెలియగోరుచుందురు. ఉభయసంధ్యల యందను నొకచో నుపవిష్టుల్తే శాస్త్రిగారు వారు గురు దేవులను స్మరించి, నమస్కరించి, కనులు మూసికొని కొంత తడవు అతర్విక్షణములో నుందురు. వారిలో నేమి జరుగునో మనకు తెలియరాదు. రుగ్మతాపిడితులుగూడ అసమయములందు వారి సన్నిధిని చేరి కూర్చుండి, వారి వారి యనారోగ్యములు నాయమగునట్లు అనుగ్రహింపుమని కరుణాసముద్రుఁ డ్తెనభాగ వానుని వేడికొని, కనులు మూసికొని శరీరములో నేమి జారుగునో సాక్షిమాత్రముగ గమనింతురు. కొందరుఱికి వింత వింత సుందరతరదృశ్యములు కనుపడును. కొందరికి శరీరమున నొవ్వు గలభాగమూలం దేదియో కదలించినట్లును, సవరించి నట్లును తేలియనగును. కొందరు చికుచింతలు మరచి హాయిగా నిద్ర జేందుదురు. ధ్యానానంతరము శరీర ముత్సాహముగాను, బాధావిహీనముగను ఉండును. కొన్ని పూట లిట్లు జరగినచొ క్రమస్దిరారోగ్యమేర్పడును. ఎప్పటికప్పుడు ధ్యాననమయమున జరగిన విశేషము లన్నియు రికార్డు చేయబడుచుండును.
ఒకప్పుడు ఒకరి యనారోగ్యకారణము మానసికము అయి యుండవచ్చును. అట్టియెడ నాకారణము నన్వేషించి యేరుకకుఁ దెచ్చుకొని దిద్దుకొన్ననేగాని ఆ యనారోగ్యము చక్కబడదు, శారీరకమ్తేనను, మానసికమ్తెనను అనారోగ్య స్వరూప మంతయు చికిత్సకునికి అవగాహన కానిదే చక్కబడదు. ఇందునుగూర్చిన అద్బుతమ్తెన విశేషము లెన్నియో చికిత్సాక్తె వచ్చిణవారురికార్డు చేసినవె చాల గ్రంథము కలదు___
దగ్గర కూర్చున్న వారికే శ్రీశాస్త్రిగారు సుదూరమున నున్న వారికిగూడ చికిత్స జరపుటయు , ఆశ్చర్యకరముగ వారారోగ్యము పొందుటయు గలదు. ఒకప్పుడు ప్రమాద సమయ మానితోచినపుడు ఇతరోపాయము అన్నియు కట్టుబడినపుడు, శ్రీ శాస్త్రిగారికి టెలిగ్రాము పంపుటయు, ఆ తంతి చేరి చెరక మున్నె ఇచట సౌఖ్యము గలుగుటయు గలదు.
శ్రీ శాస్త్రిగారు వ్యక్తులకును, రుగ్మతలకును ట్రేట్మెంటు చేయుటయే గాక దేశము మొత్తమును పిడించుసమస్యల సుఖపరిష్కారముణక్తె గాఢామ్తెన తపస్సు చేయుటయుగలదు. 1946 ప్రాంతమందలి రాయలసీమ కరువునుగూర్చియూ, 1947 భారతదేశ స్వాతంత్ర్యమునుగూర్చియూ వారు చేసినఅమోఘ తపస్సును, అందువారు పొందిన దివ్యానుభూతులును మరువ రానివి, ఈసందర్భమున గాంధిజీ ఉపవాసములలో శ్రీ శాస్త్రి గారు వారి క్షేమమునక్తె యెంతగానో కృషి చేసెడివారని వెల్లడించక యూరకుండఁజాలను. శ్రీశాస్త్రిగారు తమ సహజ వినయశిలమువలన నిట్టివి బహిరంగపఱచెదివారు అయన ఆహింసాతతత్వమును, హరిజనసంస్కరణ, దేవాలయప్రవేశ ఉద్యమములను బలపరచేడువారు. ఆ యధ్బుత విశేషము లెల్ల ప్రకటించవలసినదే! గ్రంధవి స్తరభీతిచే వాని నన్నింటిని వదలితిని వారి పరిచయు లెల్లరు వాని నేఱుదురు
శ్రీ శాస్త్రిగారివలెనె పలువురు భృకతరహిత తారక రాజయోగమున దీక్ష బడసిరి వారేవారు గారి ఇంతటి పట్టు దలతో, విజయవంతముగా నిత్యము ట్రేట్మెంటు పద్ధతిని గూర్చి వేఱు అభిప్రాయములు గూడంగలవు. ఒకటి ____ ట్రేట్మెంటు చేయు వారాపడాలపాలగుదురు రెండు __ ఈ యోగముట్రేట్మెంటులక్తే ఏర్పడ లేదు ,____ అని వీరి మతము ఈ విషయమ్తె శ్రీ శాస్త్రిగారివలన మేము తెలిసికొన్న దేమనంగా: