Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 13

    దయఁజూపువానిని అది  ద్వగునముగా వర్దిల్లఁజేయును" అని మహాకవి  షేక్స్పియరు చెప్పినది అక్షరశః నిజము.

    "The quality of mercy is not strain'd;
    It droppeth as the gentle rain from heaven
    Upon the place beneath;it is ywice blest;
    It blesseth him that gives and him that takes:"

            మరియు జీససు చెప్పినట్లు,

    "Blessed are the merciful:for they shall obtain mercy."__ Mathew, V, 7.

    రెండు:___ ఈ యోగము ట్రీట్మేంటుకై యేర్పడ లేదను వారికి శ్రీ శాస్త్రిగారు ట్రీట్మేంటులే లేనిచో నిది యెవరికి కావలయును? అని సమాధానము చెప్పెడివారు. అభ్యాసకాలమున శరీరముణ జరుగుకొన్ని స్పందనముల కొఱకెవ్వరు దీని నాశ్రయింపరు అని పలికెడువారు.

    ఇంతకు శ్రీ శాస్త్రిగారి సాధన వారి ప్రకృతి ననుసరించి విశిష్టమార్గ మవలంబించె నని తోఁచును. ఆత్మచింతన పదము కూడ సత్యదయోపకార సార్ధకముగానుండవలె నని వీరి నిశ్చయము. వీరి ఆత్మార్పణా విధానము జీమూతవాహనుని కధను, బౌద్ధజాతక కధలను స్మృతుకిఁ దెచ్చును.

    వీరి కడ ట్రీట్మేంటు పడయఁగోరి చేరిన వారు ఆరోగ్యమును బడసిన పిమ్మట తమ కారోగ్యమును ప్రసాదించిన దివ్యతత్త్వమును అన్వేషించెడివారు. మఱియు తమ బాధ నెపముగ వారు సర్వాంతర్యామి నెఱుకకు దెచ్చికొని ప్రయత్నించెడి వారు. ఒరుల క్లేశము నపనయించుటకు చికిత్సకుఁడు వారితో నైక్యతను భావించని దే ఫలము కలుగ దని వ్రాసితిని. ఇట్టి యెడ ట్రీట్మేంటు అనేకముగా గన్పట్టుచు నేక మగుపదార్ధమును గురుతించుటలో నొక యాభ్యాసముగ పని చెయుచున్నది. మనలను మనము చుచికొనుట కేర్పడిన భ్రుక్తరహిత తారక రాజయోగ సాధనకు ట్రీట్మేంటు  పద్ధతి సహాయకారియే యగుచున్నది.అవసరము కూడ నగుచున్నది.

    మఱియు- ఇతరుఁడు బాధపడుచుండఁ గా చూచి యోగి యూరకుండు టెట్లు?

    "ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున
    సుఖం వా యది వా దుఃఖమ్ స యోగీ పరమో మతః"
                    భగవద్గీత VI .32.

    "ఓ యర్జునా! ఎవఁడు సుఖములోను దుఃఖములోను సర్వులను తనవలెనే చూచునో వాఁడు పరమయోగి" అను భగవద్గీతా ప్రబోధమును గూడజ్ఞాప్తికిఁ దెచ్చుకొందము గాక!

                                             భృక్తరహితతారక రాజయోగము

    శ్రీ శాస్త్రిగారు ట్రీట్మేంటులో బాగు చేసిన వారితో ఆ బాగు చేయునది తాము కామనియు సర్వాంతర్యామి, సర్వద యామయుఁడు నగు ఈశ్వరుఁడే యనియు చెప్పెడివా రని వ్రాసితిని. వారి గురుదేవులే సాక్షాత్పర బ్రహ్మము! కాని వారి పేరైన ఎన్నడును ఉచ్చరించెడివారు కారు. కారణము- ఈ యోగమును గూర్చి ప్రచారము చేయవల దని సాధకులను వారి గురుదేవులు శాసించియుండు టయే! చరమదశవరకును శ్రీ శాస్త్రిగారీ నియమమును పాటించెడివారు. అంతియేగాక ఆ యొర వడినే తమ్ముగూర్చి గూడ ప్రచారము నిరోధించెడివారు శ్రీ శాస్త్రిగారు. అందు చేతనే లోకమున వారి కృషి తెలియఁ దగినంతగా తెలియఁ బడలేదు. వారి వలన ఉపకారము పొందిన వారిలో కొందఱును, వారి యాంతర్యము నెఱిఁగిన మిత్రులు కొందఱును పత్రికాముఖమున వెల్వరించిన దుఃఖపు వెల్లువ వలననే పలువురు మొదటి సారిగా వీరు యోగ సాధకులని తెలిసికొనిరి. ఎవఁడు లోకమును విడిన పిమ్మట లోకము వానిని కృతజ్ఞతతో స్మరించునో అట్టివాని పుట్టువు గదా ధన్యము!

    శ్రీ శాస్త్రిగా రావలంబించినది భృక్తరహిత తారక రాజయోగము. దీనిని 1910లో కుంభకోణముణ నొక మహాపురుషుఁడు స్ధాపించెను. వారి నామాక్షరములే ఈ యోగమునకు మూలమంత్రము. వారిని స్మరించి నస్కరించిన వారికి బ్రహ్మజ్ఞాన మిత్తు నని వారిప్రతిన. బ్రహ్మైక్య మును పడయవలసినది ఏదో సమాధిదశలోనో లేక దేహము విడచిన పిమ్మటనో గా దనియు, ఈ ప్రజ్ఞాతోనే ఈ లోకము ననే ఈ దేహముతోనే యనియు, వారి మతము. వీరు చెప్పిన వానిని బోలినకొన్ని విషయములు పూర్వ గ్రంధములం దుండవచ్చును. కాని వీరు ఏ గ్రంధము పైనను ఆధారపడి యీ యోగమును ఆరంభింప లేదు.అది కేవలము నూతన సృష్టి! వీరు సర్వస్వతంత్రులు! మిగుల మహిమాన్వితులు! వీరి నీ మండలి వారు సాక్షాత్పర బ్రహ్మముగా తలఁతురు.

    పూజ, భజన, హారతి మొదలగు బాహ్యచిహ్నము లేవియు వీరు వల దందురు. వీరిని తలఁచి నమస్కరించి నచో శరీరములో యోగక్రియ ఆరంభ మగును. సాధకుని వంతు సాక్షి మాత్రముగ తనలో జరుగుమార్పులను గమనించుటయే. ముద్రలు గాని, ఆసనములుగాని, ప్రాణాయామముగాని, హఠయోగాభ్యాసముగాని అక్కఱ లేదు. వానిని నిషేధింతురు గూడ! అభ్యాసకాలమున ప్రజ్ఞ సాధకుని స్వాధీనములోనే యుండును.

    ఆహారవిషయమున కఠిననియమము లేవియు లేవు శరీరమునకు చల్లదనమును, పిష్టిని కల్గించు సాత్త్వి కాహారము తిసికోనవలెను. సాధనకై ఇల్లు వాకిలి వదల రాదు.సన్యాసము పనికి రాదు. ఎవరినృత్తి వారు సాగించుచునే సాధన చేయవలెను. సాధకులు తమ్మితరులు గుఱతించుటకై ఎట్టి యార్భాటమును ప్రకటింపరాదు. ఈ సాధన వలన అనేక మహత్తులు లభించును వీని నెన్నఁ డును దుర్వినియోగము చేయరాదు. మఱియు అవి ప్రధానములును గావు. ఈ యోగగౌరవమునకు తగినట్లు సాధకులు తమ ప్రవర్తనను నీతి మార్గమున నడపించుకొనవలెను.

    ఇంకను ఈ యోగమును గూర్చి వ్రాయఁదగిన దెంతయో కలదు గాని ప్రస్తుతమున కింత యే చాలు నని విర మించుచున్నాను.

    గుంటూరు
      ఖర                                                            కొత్త వెంకటేశ్వరరావు .
    శ్రావణ బహుళ విదియ                                                         

 Previous Page Next Page