Previous Page Next Page 
హేల్త్ సైన్స్ పేజి 12

    పోలియో వచ్చినప్పుడు శరీరంలో కొద్దిభాగంకాని, ఎక్కువభాగం కాని బలహీనమవుతుంది. ఇది ఎక్కువుగా కాళ్ళకే వస్తుంది. కొన్ని సందర్భాలలో ఛాతీ కండరాలకు వచ్చి శ్వాస తీయడం కూడా కష్టమై ప్రాణాపాయంకూడా కలగావచ్చు. చాలమందిపిల్లలు పోలియో వచ్చేముందు ఒకటి, రెండురోజులు కోడిపాటిగా జ్వరం వచ్చి నలతగా కనబడతారు. తలనొప్పి వుంటుంది. విరేచానలవుటాయి. ఇటువంటి లక్ష్యణాలు ఇతరత్రాకూడా చాలా వాటిల్లో కనబడతాయి. కానుక వీటిని పోలియో పడిపోయినప్పుడే ఆ లక్షణాలు ఈ వ్యాధివల్ల కలిగాయని గుర్తిస్తారు.

    కొందరిలో ముందుగా గుర్తించడానికి వేలులేకుండా పోలియో వ్యాధి వస్తే మరికొందరిలో వెంటనే తెలిసిపోయెలావస్తుంది. ఇటువంటి సందర్భాలలో ఒకటి_ రెండు రోజులు జ్వరం, తలనొప్పి, విరేచనాలవంటి లక్షణాలు కనబడి ఎటువంటి దుష్పలితాలు లేకుండా మళ్ళీ కోలుకున్నట్లు అవుతారు. కాని వరం తిరిగేలోగా తీవ్రమైనా తలనొప్పి, జ్వరం వచ్చి మెడనరాలు బిగవేస్తున్నట్టవుతుంది. రెండు కళ్ళ పిక్కలు కూడా కనబతాయి. ఇలా రెండు_మూడు రోజులు పిల్లలు భాధపడి పక్ష్యవాతం లక్షణాలు బయటపడతాయి. అంతటితో జ్వరం, తలనొప్పి తగ్గిపోతాయి. కాని కండరాల నొప్పులు మాత్రం మిగిలే వుంటాయి.

    ఒకసరి పక్షవాతం లక్షణాలు ప్రారంభమైనా తరువాత 24గంటల్లోగా ఏంట భాగం పోలియోకి గురి అయిందో తెలిసిపోతుంది కొందరిలో వరంరోజుల వరకు ఒకదాని తరువాత మరొకటి బలహీనమవడం కణబడుతూ వుంటుంది. పోలియోవల్ల పడిపోయామానుకున్న శరీర భాగాలూ తిరిగి చాలవరకు కోలుకుంతాయి. నేలరోజులలో ఎంతవరకు కోలుకుంటయో అంతవరకు మళ్ళీ స్వాస్థం చిక్కినట్లే. తరువాత ఏ కొంచెమో కోలుకుంన్నా అది పెద్ద లెక్కలోకి రాదు.

    పోలియో వ్యాధి రాకుండా ఇప్పుడు చుక్కుల మందు అందరికీ అందుబాటలో ఉంది. బిడ్డ పుట్టిన3,4,5, నెలల్లో నేల నేలా, తరువాత 3వ సంవత్సరంలోనౌ, 5వ సంవత్సరంలోనూ పోలియో చుక్కల మందు వేయిస్తే పిల్లలు  ఏ వ్యాధికి గురికాకుండా చేసుకోవచ్చు.

    పోలియో వచ్చిన తరువాత మాత్రం పోలియో చుక్కలు వేయడం వల్ల ఫలితం ఏమీలేదు. ఏ బిడ్డకైనా పోలియోవస్తే ఆరువారాలు ఆ బిడ్డను తక్కిన పిల్లలకి దూరంగా ఉంచి పూర్తీ విశ్రాంతినివ్వాలి. పోలియో అంటువ్యాదులా ఎక్కువ మందికి ప్రబలుతున్న రోజుల్లో తక్కిన పిల్లల వాళ్ళు పీకిమ్చడం, టాన్సిల్స్ ఆపరేషన్ చేయించడం వంటివి వాయిదా వేయాలి. ఇటువంటి పనులవల్ల పిల్లల్లో బయటపడకుండా దాగి ఉన్న పోలియో క్రిములు ఒక్కసారిగా బయటపడతాయి. పిల్లలు పోలియో వచ్చి శాశ్వతంగా వికలాంగులైతే సర్జరీ ద్వారా కొంతవరకు సరి చేయడానికి ఇప్పుడు వీలికలుగుతోంది కాని అసలు ఈ వ్యాధే రాకుండా ముందే పిల్లల్ని రక్షించుకోవడం మంచిది కదా!

 Previous Page Next Page