సింగరాజు స్పీడుగా స్ప్రింగ్ డోర్ నెట్టుకుంటూ డాక్టర్ రొమ లోకి దూసుకుని వచ్చాడు. అతని భుజాన్ని తల వ్రేలాడేస్తూ అరెళ్ళా అబ్బాయి వున్నాడు కూడా.
"దాకత్ర్, ఈ అబ్బాయిని త్వరగా చూడండి. మెదడు వాపుజబ్బు వచ్చినట్లు వుంది. ఉదయం నుంచి జ్వరం వుంది. ఏదోలే అని ఉఉరుకుమ్తే సాయంత్రానికల్లా రెండు వంతులైనాయి. కళ్ళుతేలేశాడు. ఫీట్సుకూడా వస్తున్నాట్లున్నాయి."అంటూ అందోళనతో అంతా వర్ణించసాగాడు_ సింగరాజు.
ఆ కుర్రావాని విషయం విషయంగా వుందో లేదో వేరే విసహాయంగాని, సింగరాజుని చూస్తె మాత్రం ముందే ఇతను కళ్ళు తిరిగి పడిపోతాడా అన్నట్లు వున్నాడు. మనస్సులో మెదడువాపు అనే భయం రావడం వల్లనో ఏమోగాని మేఖంనిండా చమటలు పట్టేసి వున్నాయి. మాటల సరిగ్గా చెప్పాలేకపోతున్నాడు. పెదవులు వణుకుతున్నాయి. అంతులేని అందోళన మేఖంలో కనబడుతొంది.
నిజమే మరి. అబ్బాయికి మెదడువాపు జాబు వచ్చిందని అనుమానం కలిగితే భయం కలగక ఏమవుతుంది. అదేకాకా ఎవరికైనా పిల్లలంతే ప్రాణాం కదా! అందుకనే ఈనాడు మెదడువాపు జబ్బు ఉన్నచోట్ల, లేని చోట్ల కూడా పిల్లలకి ఏ మాత్రం జ్వరం వచ్చి తలనొప్పి అనిపించినా ,ఒకటి రెండు వంతులు అయినా మెదడువాపు జాబు లక్షణాలేమోననే భయం తల్లితండ్రులని, తక్కివారిని అదరగొట్టేస్తోంది. ఇదివరకు ఇంతకంటే ఎక్కువ జ్వరారం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఫిత్సులా వచ్చినా అతి తెలికిగా తీసుకునే తల్లితండ్రులు స్మ్గారాజువలె అందోళన చెంది పోతున్నారు. మరి ఇంతమందిని భ్రమపెడుతున్న మెదడువాపు జబ్బు లక్షణాలు ఏమిటి? అది ఎలా సంక్రమిస్తోంది?
ఇప్పుడు ఎక్కువ వస్తున్నా మెదడువాపు జబ్బుని "జపనీస్ ఎన్ సేఫలైటిస్" అని అత్తరు. ఈ వ్యాధి అతి సూక్ష్మక్రిమి అయిన వైరస్ వల్ల వస్తుంది. మెదడువాపు జబ్బు తక్కిన అంతు వ్యాదుళవలె ఒకరి నుంచి మరొకరికి సోకడం జరగదు. సాధారణంగా అంటువ్యాధులువ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మడంవల్లనో, దగ్గడంవల్లనో, రాగి విసర్జించిన మల మాత్రాలతో కలుషితమైనా నేరు త్రాగడం వల్లనో, ఆహార పదార్ధాలు తినడంవల్లనో ఇంకొకరికి ఆ వ్యాధులు రావడం జరుగుతుంది. కాని మెదడువాపు జబ్బు విచిత్రమైనా పద్దతిల్లో ఇంకొకరికి సంక్రమించుతుంది.ఈ వ్యాధికి సంభందించిన వైరస్ క్రిములు మనిషికి దోమలు కుట్టడం ద్వారా సంక్రమించడం జరుగుతుంది.
ముఖ్యంగా ఈ దోమలు కూలేక్స్ జాతికి చెందిన అడదోమలు. ఈ కూలేక్స్ అడదోమలు కుట్టడం వల్లనే మామూలు బోదకాలు (ఫైలేరియా) రావడం జరుగుతుంది. ఆ దోమలే ఈనాడు ఈ మెదడువాపు జబ్బుకి కరణమవుతున్నాయి. అయితే ఈ దోమలు మెదడువాపు జబ్బుకి వచ్చిన కాటువేసి తరువాత మరొక వ్యక్తిని కుట్టినా ఈ వ్యాధి రావడం జరగదు. దోమ పందినికుట్టి ఆ పంది నుంచి సంక్రమించిన వ్యాధిక్రిముల వల్లనే మరొక మనిషికి చేరిన వ్యాధిక్రిములే నష్టంచేస్తాయి. కాని, మనిషినుంచి మరొక మనిషికి చేరిన వ్యాధిక్రిములు కలిగించలేవు. మరొక విచిత్రం ఏమిటంటే ఏ వ్యాధి క్రిములు సోకడంవల్ల మనిషికి మెదడువాపు జబ్బు ప్రమాదం కలుగుతుందో, అవే క్రిములు పండిలో వున్నా పందికి ఎటువంటి వ్యాధి రావడం జరగదు. మనుష్యులకి మెదడువాపుని కలిగించేవైరస్ క్రిములు పందులలోనేకాదు, మామూలుగా మన ఇళ్ళల్లో వుందే ఇతర పశువుల్లోను, బాతులు గబ్బిశాల్లోనూ, పక్షుల్లోనూఉండటం అరుదు.