11. పసిపిల్లలను శాశ్వతంగా విక లాంగులను చేసే 'పోలియో'వ్యాధి.
ఆ చిన్నారి పాప పగలంతా బాగానే ఆడుకుంది సాయంత్రం అయ్యేసరికి కాస్త నలతగా కనబడింది. ఒళ్ళు వేచ్చగా అనిపించింది, ఒకటి_రెండు వాంతులు, విరేచనాలయ్యాయి. పిల్లలకుఇలామ్టివి మామూలే అని ఊరుకుంది ఊర్మిళ. ఏడుస్తున్న పాపను జోకొట్టి బుజ్జాగించి తనుకూడా నిద్రపోయింది. ఉదయంలేచి పాపను కూర్చోపెట్టబోతే కూర్చోలేకపోయింది. చేతికి ఆటవస్తువు ఇవ్వబోతే పట్టుకోలేకపోయింది. రెండు చేతులు పట్టుకుని, లేపి నించో పెట్టబోతే నిలవలేక పోయింది. దాంతో ఊర్మిళ మనసులో పోలియో గురించి భయం కలిగి అదిరిపోయింది.
ఊర్మిళ భయపడినంతాజరిగింది. డాక్టరుకి చూపిస్తే పోలియో వ్యాధి వచ్చిందని నిర్దారించదు. కాని అంతకు ముందురోజు వరకు చక్కగా ఆడుకున్న పాపకు ముందురోజు వరకు చక్కగా ఆడుకున్న పాపకు అకస్మాత్తుగా పోలియో వ్యాధి ఒకరకమైన వైరస్ క్రిమివల్ల వస్తుంది. ముఖ్యంగా ఈ వ్యాధి రెండు_ మూడు సంవత్సరాల వయస్సు పిల్లలకే సోకుతుంది. ఇంతకంటెతక్కువ వయస్సు పిల్లలకి పోలియో వ్యాధి కేవలం పిల్లలకే కాకుండా అరుదుగా పెద్దవాళ్ళకి కూడా వస్తుంది. పోలియో క్రిములు ముఖ్యమ్గాముక్కులలోను, జీర్ణకోశం పేగుల్లోనూస్థావరం ఏర్పరచుకున్న అక్కడనుంచి రక్తంలోనికివైరాస్ క్రిములు నరాలను శక్తిహీనమై క్షీణీస్తాయి. అందుకే పోలియో వచ్చివారికి శరీరంలో కొన్నిభాగాలు సన్నబడిపోతాయి!
పోలియో వ్యాధి క్రిములు వాతవరణంలో ఎప్పుడూ ఉంటాయి. అందుకునే సంవత్సరం పొడుగునా ఎవరికో ఒకరికి పోలియో వస్తూ యుంటుంది. కొన్ని సందర్భాలలో ఈ వ్యాధి సంభందించిన క్రిములు విజ్రుంభించిన అంటుజాడ్యంలా ఎందరికో సోకుతాయి. ఆహారం, నేరు ద్వారా ముఖ్యంగా ఈ వ్యాధిక్రిములు జీర్ణకోశంలోనికి ప్రవేశిస్తాయి. ఈగలవల్లా,ఇతర త్రానూ ఈ వ్యాధి వ్యాపిస్తూ వుంటుంది. పోలియోవ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన వరం_ పదిరోజుల్లో వ్యాధి లక్ష్యణాలుబయటపడతాయి. అంటువ్యాధిలా ప్రబలంగా పోలియో వ్యాధి లక్ష్యణాలు బయటబడతాయి. అంటువ్యాధిలా ప్రబలంగా పోలియో రావడమనేది ముఖ్యంగా వేసవిలోనే.