Previous Page Next Page 
పాదాభివందనం పేజి 12

బావుందిరా వ్యవహారం! ఆయన వద్ద దాచుకోలేధంటే అలా మొండిగా ప్రాధేయపడతావేం? దాచుకున్నట్టు ఏదైనా గుర్తుందా?"

రెడ్డి! మాలాటోళ్ళకి సాచ్చికాల? ఆయనే గుర్తు రాసిత్తానంటే వద్దన్నాను. కంచే సేను మేస్తుంటే కాదనే వాళ్ళు ఎవరు సామీ! నా బతుకంతానీ కాడ ఎల్లమాడిపోయింది. ఇంత తిండి పెట్టి గుడ్డ యిచ్చినావు. ఇప్పుడు నా చావుకూ నీవే కారణం అయితావు" అన్నాడు వీరయ్య.

కోపంగా చూసి, "ఒరే వీరయ్య! మంచికి పొతే చెడు ఎదురైందిరా. ఇదంతా నా మంచి తెచ్చిన తంటా. నేనూ అందరిలాగా ఉంటె యీనాడు నాకి నిందా వచ్చేది కాదు. వెళ్ళు వెళ్ళు ఇక చాలు నీ నేస్తం. నాకు బాగా బుద్ది వచ్చింది. ఎక్కడుంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి." రామలింగయ్య.

గోడుగోడున గుండె బాదుకుంటూ ఏదో చెప్పబోతున్న వీరయ్యని కసిరి అన్నాడు సర్పంచ్.

"ఇదిగో వీరయ్య! మాటలతో ఏడ్పులతో లాభంలేదు. అయన దగ్గర దాచుకున్నట్టు ఏదైనా సాక్ష్యమో గుర్తు వుంటే చూపించు. నేను నమ్ముతాను నలుగురూ నమ్ముతారు. నిజమో అబద్దమో భగవంతుడికి తెలుసు. అయినా అయనతో సొమ్మిప్పిస్తాను."

"వీరయ్య మెదడులో ఏదో మెరుపు మెరిసింది."

"అయ్యా! నాకిప్పుడు గుర్తుకొస్తుంది. ఈయనకి లేక్కచ్చినపుదల్లానూ యింటికాడ పరంధామయ్య గారి గోడకు లెక్క రాసుకున్నాను. రండి సుపిత్తాను. అన్నాడు మెరిసే కళ్ళతో.

క్షణకాలం రామలింగయ్య ముఖంలో బూచులు తారట్లడాయి కానీ ఏదో గుర్తుకొచ్చి ముఖం వికసించింది. వీరయ్య వెంట కదలి వెళ్ళారు యిద్దరూ.

పరంధామయ్య యింటి ముందు అభేరిరాగంలో "సమయానికి తగుమాటలాడి" అన్నత్యాగరాజసామి కీర్తన చెరిగిపోస్తున్నాడు దక్షిణాదిన సన్నాయి నేర్చుకుని వచ్చిన వేణుగోపాల్.

సంగీతానికి పరవశించిపోతూ ఆ యిల్లు దాటి పలుకరింపులకి నవ్వుతూ యిద్దరూ వీరయ్య యింటి వద్దకి నడిచారు.

గుడిసె వెనుక వేపుకి వెళ్ళి గోడవైపు చూసిన వీరయ్య పై ప్రాణాలు పైనే పోయాయి. తెల్లగా వెల్లవేసిన గోడలాగే అయింది అతని ముఖం. మనం ప్రాణం ఒకేసారి పోయాయి. నిలువునా విరుచుకుని పడిపోయాడతను.

ఎందుకిలా విళ్లోచ్చారా అని అర్ధం కాక వాళ్ల వెనుకే వచ్చిన వీరయ్య భార్య సుబ్బమ్మ భర్త అలా కట్టెలా విరుచుకుని పడిపోవటం చూసి గాబరాగా అక్కడికి పరుగెత్తి శవంగా మారిపోయిన అతన్ని చూసి గోలుగొల్లున ఏడవసాగింది.

నిర్ఘాంతపోయాడు రామలింగయ్య.

నిశ్చేష్టుడయ్యాడు వెంకటరెడ్డి.

"ఈ గోలంతా వినిపించకుండా వేణుగోపాల్ సృష్టిస్తోన్న నాదస్వరం గాలితో పోటిపడి సంగీత లోకాన్ని సృష్టిస్తుంది.

బలియాసి కేవలమిశరాజ్ఞా

సీట్లో కూర్చుంటునే టపాల్ చూసుకోవటం అలవాటు విజయ్ కి. ఆఫీసుకి సంబంధించిన నటపాల్ ఆవో వేపూ , పర్సనల్ టపాల్ ఓ వేపూ విడివిడిగా పెడుతూ ఉండాలని చార్జీ తీసుకున్న మొదటిరోజే చెప్పాడతను. ప్యూన్ అక్షరాల ఆచరణలో పెడుతున్నాడు దాన్ని.

ఆఫీస్ టపాల్ ఓ వారగా త్రోసి తనకు వచ్చిన జాబులు చూసుకోసాగాడు . నాన్నగారు ఉత్తరం వ్రాశారు పంపిన డబ్బు అందినట్లు, క్షేమ సమాచారాలు తెలపమంటూ, మరో వుత్తరం అభిమాన మాస పత్రిక భారతి ఆఫీస్ నుండి చందా ముగిసింది తిరిగి పంపమంటూ , మూడో ఉత్తరం కవర్ పై అక్షరాలు పరిచితంగానే ఉన్నా మాములుగా వచ్చే ఉత్తరాలలోనిది కాదు.

ఎంత ఆలోచించినా ఆ ఉత్తరం వ్రాసిందేవరో తెలుసుకోలేకపోయాడు విజయ్. తర్వాత అలోచించి గానీ తెరవరాదనుకుని అటుగా పెట్టి నాలుగవ కవర్ తీసుకున్నాడు.

అది బుక్ పోస్టు కవర్. ఎవరో పంపిన పెళ్ళి పత్రిక. వూరకే అలా చూసి పక్కన వేద్దమనుకున్నాడు. వేసవి కాలంలో పెళ్ళిళ్ళకేం కొదవ? అందునా అసిస్టెంట్ కలక్టర్ గా ఉన్న వాడి పై బంధువులకి కూడా ప్రీతి ఎక్కువ. అనుకుని శుభలేక విప్పాడు.    

పెళ్ళిపత్రిక తెరవగానే పెళ్ళికొడుకు పేరు చూశాడు. అతనిలో కలిగిన ఆశ్చర్యం అనందం వర్ణించరాదని తన ఫ్రెండ్......తన క్లాస్ మేట్ .......జగన్నాధం పెళ్ళికొడుకవుతున్నాడు.

"ఎన్నాళ్ళకెన్నాళ్ళకు?"

"జీవితంలో అనుకున్నది సాధించాక కానీ పెళ్ళి చేసుకోనోయ్" అనే వాడు జగన్నాధం......చివరకి సాధించాడు. అనుకున్నట్టు పెళ్ళి చేసుకుంటున్నాడు.

"నేను ఫారిన్ డిగ్రి అందుకొంది పెళ్ళి చేసుకోనోయ్. అమ్మాయి కనీసం ఫస్ట్ క్లాస్ డిగ్రి హోల్దారన్న అయి ఉండాలి. డాక్టరవుతే యిబ్బందే లేదు." అనేవాడు ఎప్పుడూ.

అనుకున్నట్టుగానే మెడిసిన్ పూర్తీ చేస్తూనే స్కాలర్ షిప్ పై అమెరికా వెళ్ళాడు. న్యూయార్క్ నుండి ఉత్తరాలు కుడా వ్రాస్తూ ఉండేవాడు. ఆరు నెలల క్రితం కాబోలు జాబు వచ్చింది. తనే జవాబు యివటంలో ఫెయిలయ్యాడు. అంతేకానీ అతని నుండి జాబు లేదు మళ్ళీ ఇదో ఈ శుభలేక.

అక్షయతుణిరం నుంచి బాణాలు వెలికి వచ్చినట్టుగా ఒకదాని వెంటా ఒకటి జగన్నాధం గురించి ఆలోచనలు వస్తున్నాయి.

'ఎలాగయినా జగన్నాధం పెళ్ళికి వెళ్ళి తీరాలి" అనుకున్నాడు విజయ్. దాంతో అతనికి తన పెళ్ళినాటి సంఘటనలు ఒకటోకటే గుర్తుకు రాసాగాయి.

విజయ్ తరపున చలాకీగా మాట్లాడే ఆడవాళ్ళు లేరు.

అందుకనే బాధ్యత అంత తనపై వేసుకున్నాడు జగన్నాధం. మొదలే జగన్నాధం వసపిట్ట. అందునా తన పెళ్ళి!

'ఆగండి బాబాయిగారూ! అలా తరపడితే ఎలా? ఆ పెళ్ళిళ్ళ అంత! అయినా మూడు వందల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చిన పెళ్ళి కొడుకుని నాలుగడుగులు ముందుకు రమ్మని అనకుంటే మన అమ్మాయిని కాస్త మూడడుగులు ముందుకు రమ్మనరాదా?

అది ఎదుర్కోలు సమయం.

ఆ మాటకి పెళ్ళికూతురి అక్కగారు కాబోలు కలగజేసుకుని బావుందబ్బాయ్, బావుంది. మున్నురామడ నడిచి వచ్చినా ముందు మగవాడే రావాలంటారు. మీ పెళ్ళికొడుకునే పెద్ద మనసు చేసుకుని నాలుగడుగులు నడవమనరాదూ'అ అంది జవాబుగా.

మీ మాటని కాదనలేం అక్కయ్యగారూ! కానీ మావాడు పరమ సుకుమారుడు అనేమాట మరవకండి. బస్సులో అంత దూరం ప్రయాణం చేసి అలసి పోవటం అటుంచి బస్సు రోడ్డుని దిగి యీ నాలుగు మైళ్ళు బళ్ల బాట పై వచ్చినంత దూరము యమబాధపడ్డాడు పాపం! మరిది మీద కాస్త దయ చూపి చెల్లమ్మనే చొరవ చేసి చేరి సగం దూరం నడిచేట్టయినా చెయ్యండి అన్నాడు.

మళ్ళీ భోజనాలకి ఆలస్యమవుతుందబ్బాయ్ అన్నాడో ముసలాయన, అన్న గత ప్రాణి.

"పెళ్లన్నాక భోజనానికి ఆలస్యం కాక పోతుందా పెద్దయ్యగారూ, రాత్రి భోజనాలు పండెండు పగటి భోజనాలు నాలుగింటికి అవుతేనే అది బ్రాహ్మల పెళ్ళి అన్నాడు టపిమని జగన్నాధం.  

 Previous Page Next Page