Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 12

 

                             ఆమె ఎవరు ?
                                                                    వసుంధర
    నేను దిగులుగా కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్నాను. నిన్నటి సంఘటన ఇంకా నా మనసును దొలుస్తూనే ఉంది. అంతర్జాతీయ స్మగ్లర్ రామూని ప్రాణాలతో పట్టుకునే అవకాశం చూస్తుండగానే జారిపోయింది.
    అపరాధ పరిశోధన నాకు హాబీ. ఎన్నో పర్యాయాలు ఎన్నో కేసులలో పోలీసులకు నేను సహాయపడి ఉన్నాను. నాకు లభించిన అనేక విజయాల కారణంగా - వృత్తి రీత్యా నేను డిటెక్టివ్ ని కానప్పటికీ, ప్రజలలో నేను డిటెక్టివ్ - రాజుగా పేరు పడ్డాను.
    స్మగ్లర్ రామూ విషయంలో నేను చాలా కాలంగా ఆసక్తి చూపిస్తూ వస్తున్నాను. అతగాడి వల్ల ఎన్నో రహస్యాలు లాగావలసి వున్న కారణంగా పోలీసులతన్ని ప్రాణాలతో పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. అందువల్ల ఎన్నో పర్యాయాలు రామూ ఆచూకీ లభించినా నేనతన్ని విచిత్ర పరిస్థితులలో వదిలిపెట్ట వలసి వస్తూ ఉండేది.
    కానీ నిన్నటి దినం అనుకోకుండా చాలామంఛి అవకాశం వచ్చింది. అజంతా హోటల్ లో టిఫిన్ చేస్తుండగా సుపరిచితమైన కంఠ స్వరాన్ని వినడం జరిగింది. అది రామూ దేనని నాను తెలుసు. అటు వైపుగా చూసి మారువేషంలో ఉన్న రామూని గుర్తించగలిగాను.
    ఒకసారి విన్న కంఠ స్వరాన్ని నేనో పట్టాన మరచి పోలేను. ఇది నాకు దేవుడిచ్చిన శక్తి యేమోననిపిస్తుంది. ఆ శక్తి ఇప్పుడు నేను రామూని గుర్తించడం జరిగాక వెంటనే అక్కడ నుంచి లేచి హోటల్ కౌంటర్ వద్ద నున్న టెలిఫోన్ వరకు నడిచాను.
    నాకు వెంకట్రావని ఒక స్నేహితుడున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులకు ఫోన్ చేయవలసి వచ్చినపుడు నేను సాధారాణంగా కోడ్ భాషలో వెంకట్రావ్ కు ఫోన్ చేస్తాను. అందవలసిన సమాచారం అతని ద్వారా పోలీసులకు చేర్తుంది. ఇప్పుడు నేను రామూ ఇక్కడ ఉన్న విషయమూ అర్జంటుగా పోలీసులు ఇక్కడకు రావలసి ఉంటుందన్న విషయమూ వెంకట్రావ్ కు ఫోన్ చేసి చెప్పాను. ఆ తర్వాత నుంచి రామూని ఓ కంట కనిపెడుతున్నాను. రామూ అప్పటికి ఒవల్టీన్ తాగుతున్నాడు.
    పాపం, రామూ ఒవాల్టీన్ చాలాసేపే తాగాడు. అతనికి అ హోటల్ తో పని ముగిసినట్లుంది. తన స్నేహితుడితో పాటు కౌంటర్ దాకా నడిచి వచ్చాడు. బిల్లు తనే ఇచ్చాడు. బయటకు నడవబోతున్నాడు. నాకు కంగారు పట్టుకుంది. పోలీసులు వస్తున్న జాడ లేదు. రామూని పట్టుకోడానికి ఇంతకూ మించి అప్పూర్వవకాశం మళ్ళీ రాకపోవచ్చు. తన నెవరూ గుర్తుపట్టి ఉండరన్న ధీమాతో ఉన్నట్లున్నాడు రామూ.
    నేను హడావుడిగా వెళ్ళి హోటల్ గుమ్మం దగ్గర రామూని అటకాయించి -- "హలో కామేశ్వర్రావ్ --- ఎన్నాళ్ళయింది వూరోచ్చి ?" అంటూ పలకరించాను. రామూ స్నేహితుడు రామూని కామేశ్వర్రావ్ అని పిలవడం నేను విని ఉన్నాను.
    రామూ ముఖంలో ఆశ్చర్యం కనపడింది. అతడు నావంక అదోలా చూసి -- "సారీ- మీరెవరో నేను గుర్తుపట్ట లేకుండా ఉన్నాను-" అన్నాడు.
    నేను నవ్వి -- "అదేమిటోయ్ - గుర్తు పట్ట లేకపోవడానికి నేనే మన్నా మారు వేషంలో ఉన్నానా? నేను - రాజుని. అంతా నన్ను డిటెక్టివ్ రాజు అని కూడా అంటారు -" అన్నాను. అదే సమయంలో దూరంగా వస్తున్న పోలీస్ వాన్ నా కళ్ళ బడింది.
    రామూ నన్ను గుర్తు పట్టినట్లున్నాడు. పోలీస్ వాన్ కూడా అతన్ని కళ్ళ బడ్డట్లుంది. మాట్లాడకుండా అతను వెనక్కి తిరిగి త్వరత్వరగా హోటల్లోకి అడుగులు వేశాడు.
    సరిగ్గా అప్పుడే పోలీస్ వ్యాన్ హోటల్ ముందు ఆగింది. ఇన్ స్పెక్టర్ స్వామీ నా దగ్గరకు వచ్చి విష్ చేశాడు. అప్పటికి రామూ స్నేహితుడి చేయి నా చేతిలో ఉంది. నేను హడావుడిగా ఇన్ స్పెక్టర్ తో -- "ఇతను స్మగ్లర్ రామూ స్నేహితుడు. హడావుడిగా అలా పోతున్న అతడే స్మగ్లర్ రామూ -" అన్నాను. అని నేను ముందుకు కదిలాను. అనుకోకుండా కలిసి వచ్చిన ఈ అవకాశంతో రామూ స్మగ్లింగ్ నేరానికి స్వస్తి వాచకం పలికించాలని నాకు చాలా కోరికగా ఉంది.
    రామూ హోటల్ మొదటి అంతస్తుకు మెట్లు ఎక్కి వెడుతున్నాడు. నేనూ వెళ్ళాను. రామూ పరుగెత్తాడు. నేనూ పరుగెత్తాను. సరిగ్గా పదిహేను మెట్లయినా ఎక్కానో లేదో నాకు విపరీతంగా కళ్ళు తిరగడం మొదలైంది. నేనింక అడుగు ముందుకు వెయ్యలేక పోయాను. అందిన ఊతాన్ని పత్తుకుని కొద్ది క్షణాల పాటు అలాగే ఉండిపోయాను.
    నిజానికి రామూ నాకు చేతి వాటు దూరం నుండి తప్పించుకున్నాడు. అతని వంటి సమర్ధుడికి ఇప్పుడు నేనిచ్చినంత సమయం చాలా ఎక్కువ. అయినా ఆశ చావక నేను నెమ్మదిగా మెట్లు ఎక్కి పై అంతస్టుకు వెళ్ళాను. రామూ ఇంకా పైకే వెళ్లుంటాడని నాకు తెలుసు. అందుకే నేను కాస్త నెమ్మదిగా అయినాప్పటికి మూదంతస్తులు దాటి భవనం పైభాగానికి చేరుకున్నాను. అక్కడ రామూ ఉన్నాడు. అతను తప్పించుకునే మార్గం కోసం అన్వేషిస్తున్నట్లున్నాడు. బహుశా ఈ పాటికి భవనం చుట్టూ పోలీసులు కాపలా కాసి ఉంటారు.
    రామూ నన్ను చూశాడు. "మిస్టర్ రామూ -- మర్యదగా లొంగిపో" అన్నాన్నేను.
    రామూ అదోలా నవ్వి -- "ఇంత సులభంగా గుర్తించ బడతానని నేనెన్నడూ అనుకోలేదు. కానీ నన్ను పట్టుకోవాడం నీ వల్ల కాదు - "అంటూ నాలుగడుగులు వెనక్కి వేశాడు. రామూ ఏం చేయబోతున్నాడో నాకు తెలిసింది. కానీ అతన్ని నేను ఆపలేను. అతనికీ, భవంతి అంచుకూ ఉన్న దూరం కంటే నాకూ, అతనికీ మధ్య నున్న దూరం చాలా ఎక్కువ.
    అనుకున్న విధంగా అతని స్మగ్లింగ్ జీవితంతో పాటు అనుకోని విధంగా అతని జీవితానికి కూడా స్వస్తి వాచకం పలికించడం కేవలం నాకారణంగా నిన్నటి దినం జరిగింది.
    రామూ వెనుక నా బదులు మరెవరైనా పడి ఉంటె -- బహుశా రామూ ప్రాణాలతో పట్టుబడి ఉండేవాడేమో? నేనెంతో విచారంగా ఉన్న విషయం గమనించిన ఇన్ స్పెక్టర్ స్వామి నా భుజం తట్టి - "విచారించకు మిస్టర్ రాజా! దేశానికి చీడ పురుగులా పట్టిన ఒక స్మగ్లర్ నాశనం కావడానికి సహకరించావు. వాడిని ప్రాణాలతో పట్టుకోలేక పోయినందుకు విచారించవలసిన అవసరంలేదు" అన్నాడు.
    కానీ నా బాధ వేరు. రామూని అంతం చేసే అవకాశాలు ఇదివరలో కూడా ఒకటి రెండు పర్యాయాలు నాకు లభించాయి. ఇతన్ని ప్రాణాలతో పట్టుకు తీరాలన్నదే నా ఆశయం . అది ఈ రోజు చేతివాటు దూరంలో తప్పిపోయింది.
    అవును -- నిజంగా చేతివాటు దూరమే! అంతే దూరంలో అంతనుండగా నాకు కళ్ళు తిరిగాయి. రామూ తప్పించుకున్నాడన్న వ్యధ కంటే కూడా ఈ కళ్ళు తిరగడం నాకు చాలా విచారాన్ని కలిగిస్తోంది.
    ఇటువంటి జబ్బొకటి నక్కున్నదని అంతవరకూ నేను గుర్తించనే లేదు. నిన్నరాత్రి నన్ను నేను పరీక్షించుకున్నాను. వేగంగా మెట్లు ఎక్కితే నాకు కళ్ళు తిరుగుతాయి. అంతేకాదు, సుమారు ఏడెనిమిదడుగులు ఎత్తు మీద నిలబడి కిందకు చూస్తె నాకు కళ్ళు తిరుగుతాయి. ఆ తిరగడం సామాన్యంగా ఉండదు. కొద్ది క్షణాల పాటు నాకు స్పృహ తప్పిన పరిస్థితి లాంటిది ఏర్పడుతుంది. ఈ వివరాలన్నీ నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతాల ఒక పత్రికా విలేఖరికి వివరించి చెప్పాను. రామూ కేసు విషయంలో ఆ విలేఖరి కొన్ని ప్రత్యెక వివరాలు ప్రచురించాలని నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. ఆ పేపర్లో ఈరోజు అప్పుడే ఆ వివరాలన్నీ అచ్చయ్యాయి. అవి చదువు తూ వుంటే నాకు మరింత దిగులు కలుగుతోంది.
    
                                     2
    "లోపలకు రావచ్చు"అన్నాను నేను.
    తలుపు తోసుకుని ఒకతను లోనికి వచ్చాడు. ముఖం పరిచితమైనదిగా నాకు తోచలేదు. "నా పేరు శోభనాద్రి --" అన్నాడతను తన్ను తాను పరిచయం చేసుకుంటూ.

 Previous Page Next Page