ఒక ఫాస్ట్ టైప్ గాళ్ కి పెళ్ళి అయింది. నెలరోజులు సంసారం చేశాక ఓ అర్దరాత్రి రెండింటికి తన తల్లికి ఫోన్ చేసింది.
"మమ్మీ! నాకూ, మా హజ్ బెండ్ కీ పెద్ద ఫైటింగ్ జరిగింది!" అందా అమ్మాయ్ ఆయాసంతో ఒగరుస్తూ.
"నువ్వేం వర్రీ అవకమ్మా! ఇలాంటి వన్నీ మామూలే! పెళ్ళయిన సంవత్సరం తరువాతగానీ అన్నీ సెటిలవ్వవ్. అయినా ఇది మొదటి ఫైటింగే కదా! ఇంతకాలం ఒక్కసారి దెబ్బలాడుకోకుండా సంసారం చేశావంటే నువ్వు చాలా గ్రేట్" అంది తల్లి.
"ఆ సంగతి నాకూ తెలుసుగానీ ఇంతకూ ఆయన డెడ్ బాడీనేం చేయాలో చెప్పు త్వరగా-"
డాక్టర్ గారికి ఓ యాభై ఏళ్ళ పేషెంట్ ఫోన్ చేశాడు.
"డాక్టర్ గారూ! ఇవాళ్టితో నాకు యాభై ఏళ్ళు పూర్తయినయ్. ఈ శుభ సందర్భంలో నాదో చిన్న కోరిక!"
"చెప్పండి! ఏం ఫరవాలేదు -ఏమిటది?"
"అదే- నాకు వందేళ్ళూ శుభ్రంగా బతకాలని ఉంది- ఏమయినా ఉపాయం చెప్పగలరా?"
"బ్రహ్మాండమైన అయిడియా ఉంది! అదేంటంటే వెంటనే తాగుడు, సిగరెట్లు సెక్స్ మూడూ పూర్తిగా మానేయండి! ఇంక తిరుగుండదు-"
"అంటే అవి మూడూ మానేస్తే నిజంగా వందేళ్ళూ బ్రతుకుతానంటారా?"
"ఆ మాటెవరన్నారు? అవి మానేస్తే - మరుక్షణం నుంచే వందేళ్ళూ బ్రతికేసిన ఫీలింగ్ కలుగుతుంది-"
ఒక రాజకీయ నాయకుడు వందేళ్ళూ ప్రజల్ని దోచుకుతిన్నాక తీరిగ్గా పై లోకాల కొచ్చాడు.
తను చేసిన పాపాల లిస్ట్ చిత్రగుప్తుడు చదవకముందే తనే తన పాపాల లిస్ట్ అంతా యమధర్మరాజుకి చదివి వినిపించేశాడు.
"నేను చేసిన వెధవ పనులకు నాకు నరకం ప్రసాదించేయండి సార్! నరకంలో శిక్షలనుభవిస్తే వచ్చే జన్మలో మళ్ళీ పాత జన్మ తాలూకూ పాపాలకు శిక్ష అనుభవించకుండా హాపీగా ఉంటాను-" అంటూ బ్రతిమాలాడు.
యమధర్మరాజు ఒప్పుకున్నాడు.
"అది ఓకే గానీ ప్రస్తుతం మా దగ్గర మూడు రకాల నరకాలున్నయ్. ఒకటి తెలుగు నరకం, రెండోది బీహార్ నరకం, మూడోది కేంద్రం నరకం. మూడు నరకాల్లో శిక్ష అనుభవిస్తేనే నీకు మోక్షం లభిస్తుంది" అన్నాడు యమధర్మరాజు.
రాజకీయ నాయకుడు హాపీగా ఆ నరకాలు చూడ్డానికి బయలుదేరాడు.
ఆంధ్రప్రదేశ్ నరకం గురించి దాని ఇన్ ఛార్జ్ వివరించాడు.
"ఇందులో ఒక ఎలక్ట్రిక్ చైయిర్ ఉంటుంది- అందులో కూర్చోబెట్టి గంటసేపు హై వోల్టేజ్ కరెంట్ పాస్ చేస్తారు - ఆ తరువాత నిన్ను కూకట్ పల్లి నుంచి చార్మినార్ వరకు కారులో పంపిస్తారు. ఆఖర్లో చంద్రబాబునాయుడు నీ ఎదురుగ్గా నిలబడి మూడు గంటలపాటు ఎలక్షన్స్ స్పీచ్ ఇస్తాడు - నువ్వు గిలగిల కొట్టుకొని మళ్ళీ ఛస్తావ్."
రాజకీయ నాయకుడు బీహార్ నరకం దగ్గర కెళ్ళాడు.
"ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ చైర్ ఉంటుంది. అలాగే కార్లో పాట్నా మెయిన్ రోడ్ మీద ఊరేగిస్తారు. ఆఖర్లో లాలూ స్పీచ్ ఉంటుంది.
"ఆంధ్రప్రదేశ్ జైలూ, బీహార్ జైలూ ఒకటే టైపన్నమాట"
"బీహార్ ది కొంచెం తేడా ఉంటుంది. ఎలక్ట్రిక్ చైర్ ఉంటుంది గానీ అందులో కూర్చునే లోగానే ఎవడో నిన్ను గన్ తో షూట్ చేసేస్తాడు. కూర్చీలోంచి దిగాక ఎలక్ట్రిక్ వైర్ తెగి నీ మీద పడి షాక్ కొట్టి మళ్ళీ ఛస్తావ్!
ఆ తరువాత పాట్నా మెయిన్ రోడ్ లో కార్లో నీ మీద పెట్రోల్ పోసి నిప్పంటిస్తారు. దాంతో మూడోసారి ఛస్తావ్. ఆఖర్లో లాలూ ఇంగ్లీష్ లో ఉపన్యాసం ఇస్తాడు- దాంతో శాశ్వతంగా ఛస్తావ్-"
"మరి కేంద్రం నరకం సంగతేంటి?"
"ఇందులో ఓ మాంఛి కుషన్డ్ చైర్ ఉంటుంది. అందులో కూర్చోగానే లెఫ్టిస్ట్ పార్టీలూ, బీజేపీ, మాయావతీ, ములాయం- ....అందరూ నిన్ను రాళ్ళతో కొడతారు. ఆ దెబ్బలతో చచ్చాక ఢిల్లీ మెయిన్ రోడ్ లో కార్లో తిప్పుతారు. మధ్యలో కొంతమంది తాగుబోతులు నిన్ను ఎత్తుకుపోయి, రేప్ చేస్తారు. తరువాత నిన్ను తందూరీ కిచెన్ లో కాల్చి రోస్ట్ చేస్తారు.
ఆ తరువాత సోనియాగాంధీ మూడు గంటలపాటు హిందీలో మాట్లాడుతుంది. దాంతో నువ్ శాశ్వత చావు ఛస్తావ్-"
"అయితే అన్నిట్లోకీ ఆంద్రప్రదేశ్ నరకమే బెటర్! నన్ను అందులోనే వేసేయండి" అన్నాడు రాజకీయ నాయకుడు- వెంటనే అతన్ని ఆ నరకంలో పడేశారు.
ఎలక్ట్రిక్ చైర్ లో కూర్చుని పదిగంటలైనా కరెంట్ రాలేదు. పవర్ కట్. ఒకసారి వచ్చింది గానీ లో వోల్టేజ్. కుర్చీ ఫీజులు కాలిపోయాయి. ఆ టెన్షన్ భరించలేక రెండుసార్లు చచ్చాడతను. ఆ తరువాత కార్లో వెళ్తోంటే పంజాగుట్ట ట్రాఫిక్ జామ్ లోనూ, ఆ పొల్యూషన్ లోనూ చిత్రవధ అనుభవించి మళ్ళీ చచ్చాడు.
ఆఖర్లో అతన్ని కాళ్ళతో కట్టేసి చంద్రబాబు ముందు నిలబెట్టారు. ఉపన్యాసం స్టార్టవకుండానే మళ్ళీ చచ్చాడు.
దాంతో మోక్షం కాన్నిలై మళ్ళీ యమధర్మరాజు ముందు నిలబడ్డాడు.
ఓ సరసాల్రావ్ దగ్గరకు ఓ జ్యోతిష్యుడు వచ్చాడు.
"ఈ జ్యోతిష్యాలన్నీ బోగసోయ్! సెంట్ పర్సెంట్ నిజాలు చెప్పటం ఎవడి వల్లా కాదు-" అన్నాడు సరసాల్రావ్ ఛాలెంజ్ చేస్తూ-
"నేను ఆ టైప్ కాద్సార్- సెంట్ పర్సెంట్ టైప్"
"అలాగా అయితే నేనే టైపో చెప్పు చూద్దాం-"
"నాకు తెలుస్సార్- సీతాకోక చిలుక టైప్- బోలెడు ఫ్లవర్స్ మీద వాలుతున్నారు"
"ఓర్నీ భలే పట్టేశావే- కరెక్టే-"
"ఇంకో సెంట్ పర్సెంట్ నిజం కూడా చెప్తాన్సార్-"
"ఏమిటది?"
"మీకు ముగ్గురు పిల్లలున్నారు-"
"అహ్హహ్హ! చూశావా- పప్పులో కాలేశావ్- నాకు నలుగురు పిల్లలు-"
"అని మీరనుకుంటున్నారు సార్-నిజానికి మీరు ముగ్గురు పిల్లలకే తండ్రి!"
ఓ పెద్దమనిషి హడావుడిగా పోలీస్ స్టేషన్ కొచ్చాడు.
"ఇన్ స్పెక్టర్ గారూ! మూడు నెలల్నుంచీ నాకు బెదిరింపు లేఖలు వస్తున్నాయ్. అవి రాస్తున్న వాడిని వెంటనే మీరు జైల్లోకి తోయాలి-"
"రాస్తుందెవరో తెలుసా మీకు?"
"తెలుస్సార్-"
"ఎవరతను?"
"నా గాళ్ ఫ్రెండ్ హజ్ బెండ్-"
"అబ్బ! నిన్న రాత్రి నేను చూసిన సినిమా ఎంత భయం కలిగించిందో తెలుసా? మొదట్నుంచీ చివరిదాకా టెర్రర్ అనుకో-"
"ఆ సినిమా నేనూ చూశా! ఏం సస్పెన్స్ లేదు, టెర్రర్ లేదు. చెత్త సినిమా"
"భలేదానివే! మా బాయ్ ఫ్రెండ్ అయితే సినిమా లాస్ట్ వరకూ వణుకుతూ నన్ను వదలకుండా పట్టుక్కూర్చున్నాడు-"
ఓ అప్పారావ్ మీద వాళ్ళ బాస్ కి అనుమానం వచ్చింది.
"చూడు అప్పారావ్! ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం! నేను నీకిచ్చే జీతం నెలకు పదివేలు! పదివేలూ నీ ఇంటి ఖర్చులకే చాలదు. అయినా నువ్ ఫోర్డ్ కార్లో తిరుగుతున్నావ్. నా సూట్స్ కంటే ఖరీదయిన సూట్లు వేస్తున్నావ్- నేను వెళ్ళే రెస్టారెంట్ కంటే ఖరీదయిన రెస్టారెంట్స్ కెళ్తున్నావ్- ఎక్కడినుంచి వస్తోందీ డబ్బు నీకు?"