"భార్యా భర్తలన్నాక అన్నీ సమంగా భరించాలని చెప్పింది మీరు కదా?"
"ఆ మాట నీతో చెప్పానా? నేనింకా నా రెండో భార్యకు చెప్పానను కుంటున్నాను."
"మీ రెండో భార్యను కూడా నేనే! మిమ్మల్ని మోసగించడానికి డబుల్ ఏక్షన్ చేస్తున్నాను" ఇద్దరూ నవ్వేశారు.
"ఇంతకూ నీకొచ్చిన పీడకలేమిటి?"
"మా అమ్మా నాన్నా బ్రతికే వున్నారట. అందరం మాట్లాడుతుండగానే నాన్నగారు చనిపోయారని అంతిక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారట. అది భరించలేక నాకు ఎడుపొచ్చేసింది. దాంతో పాటు భయం."
"ఈ మాత్రానికేవరయినా భయపదిపోతారా?"
"ఆ కలకు అర్ధం ఏమిటో తెలుసా? మనింట్లో ఎవరికో అనారోగ్యం కలగబోతుందని."
"అలాగా, అయితే రేపే ఇద్దరం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయినయిపోదాం."
"నాతొ మాట్లాడకండి. మీ కన్నీ వేళాకోళాలే" అనేసి అతనికి దూరంగా జరిగి పడుకుంది. ఉదయం మెలకువ వచ్చేసరికి బాగా ఆలస్యమయిపోయింది.
సాధారణంగా ఏడుగంటల వరకూ పడుకోవటం ఎప్పుడూ జరగని విషయం. బహుశా రాత్రి చాలాసేపు నిద్రాభంగం అవటం వల్ల అలా జరిగి వుంటుంది.
చప్పున లేచి హల్లో కొచ్చేసరికి అప్పటికే రామచంద్రమూర్తి కుర్చీ ఎక్కి నిలబడి తన చేతిలో ఉన్న కాగితం చూస్తూ ఉపన్యాస ధోరణిలో చదువుతున్నాడు. అతని కేదురుగ్గా ప్రేక్షకుల్లా నటరాజ్ మస్తాన్ రావ్ , ఉమాదేవి కూర్చుని వున్నారు.
సోదర సోదరిమణులారా! మన ఏరియాలో సమస్యలు రోజు రోజుకి ఎక్కువయి పోతున్నాయ్. ఇంతవరకూ మన వార్డ్ నుంచి ఎన్నికయి కార్పొరేటర్లు బాగుపడ్డారు. గానీ మన సమస్యలు అలాగే వున్నాయ్. కనుక మీరిప్పుడు నన్ను ఎన్నుకుంటే మన వార్డ్ లో జరుగుతున్న దొంగతనాలు ఇకనుంచి పక్క వార్డ్ లో జరిగేట్లు చూస్తాను. మన వార్డ్ లో వున్నా నీటి కొరత కూడా ఇంకో వార్డ్ కి జరిగేట్లు చూసే పూచీ నాది. మన వార్డ్ రోడ్ల మీదున్న పిచ్చి కుక్కల్ని పక్క వార్డ్ లోకి తరిమి కొట్టే ఏర్పాట్లు చేయిస్తాను. అంటే రెండేళ్ళలో మన ఏరియా నందన వనం అయిపోతుంది. కానీ చుట్టు పక్కలున్న వార్డ్ లన్నీ నరకం అయిపోతాయ్. అయినా కూడా మనకేం పర్లేదు. ఎందుకంటే ప్రస్తుతం మన భారత ప్రభుత్వం పాలసీ కూడా అదే. ఒక వార్డ్ వల్లనో, ఒక ఇండస్ట్రీ వల్లనో ఆ చుట్టు పక్కలున్న ఏరియలన్నీటికీప్రమాదం ఏర్పడిందనుకొండి. అయినా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఉమాదేవి, నటరాజ్, మస్తాన్రావ్చప్పట్లు కొట్టారు.
"హియర్, హియర్" అన్నాడు నటరాజ్.
"కానీ ఇలా మన వార్డ్ సమస్యలన్నీ పక్క వార్డ్ కి తోసేస్తా ప్రామిస్ లు చేయటం అంత బావుండదనుకుంటాను నటరాజ్" అన్నాడు రామచంద్రమూర్తి.
"ఇదిగో చూడండి సార్. ఈ ఎలక్షన్లు, వ్యవహారాలు తెలుసా? మీకు తెలుసా? ఈ రికార్డ్ డాన్స్ ట్రూప్ లో నేను చాలా పార్టీల తరపున ప్రచారాలు చేశాను. ఇదే కరెక్ట్. నేను రాసింది రాసినట్లు చదవండి అంతే" ఖండితంగా అన్నాడు నటరాజ్.
"కానీ ఇలా మన వార్డ్ సమస్యలన్నీ పక్క వార్డ్ కి తోసేస్తా అని ప్రామిస్ లు చేయటం అంత బావుండదనుకుంటాను నటరాజ్" అన్నాడు రామచంద్రమూర్తి.
"ఇదుగో చూడండి సార్. ఈ ఎలక్షన్లు వ్యవహారాలు మీకు తెలుసా? మీకు తెలుసా? ఈ రికార్డ్ డాన్స్ ట్రూప్ లో నేను చాలా పార్టీల తరపున ప్రచారాలు చేశాను. ఇదే కరెక్ట్. నేను రాసినట్లు చదవండి అంతే" ఖండితంగా అన్నాడు నటరాజ్.
అవును బావగారూ నటరాజ్ చెప్పింది నిజమే' సపోర్ట్ చేసింది ఉమాదేవి" ఈ రోజుల్లో ఇలా రివర్స్ కొడితే గానీ బ్రతకలేం."
సీతకు కోపం నవ్వూ రెండూ వస్తున్నాయ్.
"మీ అందరికి పనీ పాటా ఏం లేనట్లుంది ఇక్కడ సమావేశమయ్యారు" అంది కోపంగా.
"ఛ ఛ! మీరు సీతక్కయ్యను చేసుకుని చాలా పెద్ద పొరపాటు చేశారు బావగారూ, ఎంతసేపూ మిమ్మల్ని కొంగుక్కట్టేసుకుని వంటింటి మొగాడిని చేసేద్దామనే. కళాపోషణ, సమజసేప, అనేవి ఏ కోశానా లేవు" అంది ఉమాదేవి. ఆమెని ఉడికిస్తూ. అవును! ఆ మాట నిజమే" వప్పుకున్నాడు రామచంద్రమూర్తి. "అప్పట్లో ఇవన్నీ ఆలోచించలేదు, పెళ్ళి చేసుకుందామా అని వెన్నెల్లో కాటుక కళ్ళేసుకుని అడిగేసరికి ఐస్ అయిపోయి సరే అన్నాను" ఆ మాటతో సీతకు రోషం వచ్చేసింది.
"ఏమిటి? నేను మిమ్మల్ననడిగానా పెళ్ళి చేసుకోమని? ఆ రోజు నేను కాలేజ్ కెళుతుంటే వెనుక నుంచి విజిల్ వేసిందెవరు?"
"విజిల్ వేసిన మాట నిజమే గానీ నీ కోసం కాదు"
"అలాగా మరెవరి కోసం?"
"ఆటో రిక్షా కోసం-- నువ్వేమో నిన్ను చూసి వేశాననుకుని నా వంక చూసి నవ్వావ్."
'అయితే ఆ రోజు వెన్నెల్లో పెళ్ళి చేసుకోమని అడిగింది మిమ్మల్ని కాదు."
"మరెవర్ని?"
"మీ నాన్నగారిని" అనేసి వంటిట్లో కెళ్ళిపోయింది. అందరూ నవ్వేశారు.