"మీరు పొరపాటు ఏమి చెయ్యలేదు. అన్నీ జాగ్రత్తగా అలోచించే చేశారు. ఆస్థి పాస్తులన్ని అప్పుల్లో వున్నాయి. జలజలాంటి మీ వంశాల్లో ఆడపిల్లలు సరదాగా మీతో కలిసి తిరుగుతారే తప్ప ఆస్తి పాస్తులు లేని మిమ్మల్ని పెళ్ళి చేసుకోరు. అంచేత మీ వివరాలేమీ తెలియని నన్ను మోసం చేసి పెళ్ళి చేసుకున్నారు."
"ఏమిటి? నేను నిన్ను మోసం చేశానా! నన్నెవరు పెళ్ళి చేసుకోరా! నీకు బుద్ది చెప్పడానికైనా నిన్ను తలదన్నే లాంటి మా వంశం అమ్మయిని పెళ్ళి చేసుకొని తీసుకువస్తాను. ఎవడడోస్తాడో చూస్తాను.'
"ఎవడు అడ్డురాడు. నేనిప్పుడే పోతున్నాను. కావలసినవాళ్ళని తెచ్చుకోండి."
ఈ మాటలంటుండగా అణువేద మోకాళ్ళు వోనికాయి. నిలబడలేనట్లు తిరిగిపోతోంది. వ్యవహారం చెయ్యి దాటిపోతోంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోతోంది.
వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. గిరుక్కున వెనక్కి తిరిగి పెట్టె సర్దుకునే వంకతో పెట్టె ముందు కూలబడిపోయి చేతికందిన బట్టలు తనవి కూతురివి పెట్టెలో పడేసింది. కళ్ళ నుండి నీటి చుక్క జారిపడకుండా విశ్వప్రయత్నం చేస్తోంది.
విషయం ఇంతవరకు వచ్చాక తెల్లబోయాడు జీవన్. అనాలోచితంగా చిక్కు దారుల్లో పరుగెత్తి భయంకర భూతం ఎదుట నిలబడినట్లుంది అతని మానసిక స్థితి. మొదట్నుంచి ఏ సమస్యనైనా ఎలా పరిష్కరించుకోవాలో తెలియనట్లే ఈ భూతాన్ని కూడా ఎలా ఎదుర్కోవాలో అతనికి అర్ధం కాలేదు. బెదిరిపోయిన పసిపిల్లాడిలా అణువేదని చూస్తూ నిలబడిపోయాడు. ఆ చూపులు ఆమె మనస్సును కదిలించాయి.
ఒక్కమాటంటే ఒక్క మాట" నువు ఎక్కడికి వెళ్లొద్దు వుండిపో ఆయామ్ సారీ! అని జీవన్ అంటే ఎంత బాగుండును?" అని ఆక్రోశిస్తోంది ఆమె మనస్సు. కని ఏం మాట్లాడాలో , ఏం చెయ్యాలో జీవన్ కి తోచడం లేదు. ఎప్పటిలాగా యిప్పుడు అణువేద సలహా కోసమే ఎదురు చూస్తున్నట్లు ఆమెనే చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు. అణువేద పెట్టె సర్దుకుంది. అతి నెమ్మదిగా రాగమాలని తయారుచేసింది.
తను తయారైంది. ఆమె ఎదురుచూస్తున్న మాట జీవన్ నోటంట రాలేదు. బ్రెయిన్ కి పెద్ద దెబ్బ తగిలినవాడిలా కళ్ళప్పజెప్పి నిలబడిపోయాడు. అహం అణచుకొని అణువేద వెనక్కి తగ్గడానికి వీల్లేకుండా జలజ అక్కడే నవుతూ చోద్యం చూస్తూ నిలబడింది. అక్కడున్న ముగ్గురు ఆడవాళ్ళలో ఏ వోక్కరు ఎదురైనా విషమ పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నించడంలేదు. అయాని పంపి అటో పిలిపించింది.
రాగమాలకి ఏం తోచిందో తండ్రి మీదకు దూకి తండ్రి మెడ కౌగలించుకుని బావురుమని ఏడవడం మొదలుపెట్టింది. తన కన్నీళ్ళని వెనక్కి పంపుతూ అతని చేతుల్లోంచి పాపని లాక్కుంది. అప్పుడైనా అడ్డు చెప్తాడేమోనని ఆశపడింది. కని జీవన్ చైతన్యం నశించినా వాడిలా పాపని ఆమెకి అప్పగించేశాడు. రాగమాలతో ఆటోలో కూర్చుంది. అణువేద. ఎక్కడికి వెళ్తున్నావని కూడా అడగలేకపోయాడు జీవన్.
భువనేశ్వర్ చేరుకొని మేనమామ సాయంతో అక్కడ స్వంతంగా డాన్సు స్కూలు ప్రారంభించింది అణువేద. ఎప్పటికప్పుడు జీవన్ పశ్చాత్తాపంతో తన దగ్గరికి వస్తాడని ఆశతో ఎదురు చూస్తోనే గడుపుతోంది. ఎంతపని చేశాడు. కన్న కూతురిని కిడ్నాప్ చెయ్యడానికి గుండాలని నియమించాడు. అందులోను చైల్డ్ రేపిస్ట్.
రాగమాలకి ఏడేళ్ళు నిండి ఎనిమిదో ఏడు వచ్చింది. అందంగా ఆకర్షనియంగా వుండడమే కాదు చురుగ్గా వుంటుంది. తల్లి రాగమాల అని పేరు పెట్టినందుకు రేడియోలోను టి.వి. ల్లోనూ వచ్చే పాటల రాగాలన్నీ పట్టుకుంటుంది.
గిరీశం దగ్గరనుంచి వచ్చిన ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోగానే అణువేద మనోనేత్రం ముందు భయంతో కళ్ళు పెద్దవి చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ, "అమ్మా! అమ్మా!" అని తనను సహాయానికి పిలుస్తోన్న రాగమాల రూపం కదిలింది.
"రాగా!" అని పిలిచింది. ఆరాటంగా సమాధానం రాలేదు. రవీంద్రభవన్ రోడ్డులో సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్ అది. ఉన్న రెండు గదులు రాగా! రాగా!" అని ఆక్రోశిస్తున్నట్లు పిలుస్తూ ఐదారుసార్లు కలయతిరిగింది. పిచ్చెక్కినట్లు అయిపొయింది. వెనక చిన్న బాల్కాని వుంది అక్కడి కొచ్చింది. అక్కడొక మూల తన తాయిస్ అల్మారా దగ్గర కూర్చుని దొంగ చూపులు చూస్తోంది రాగమాల.
చటుక్కున పాపని గుండె కదుముకుని నుదుటి మీద, చెంపల మీద ముద్దు పెట్టుకుంది. చెమ్మగిల్లిన కళ్ళతో తెల్లబోయి చూసింది రాగ. ఆ పిల్లకి తెలిసినంతవరకు, తల్లి యెప్పుడు ఇలా ముద్దులుతో తన ప్రేమని ప్రదర్శించలేదు. మనులో చెలరేగిన అశాంతి కెరటం వెనక్కి తగ్గాక తన ఎమోషన్సుకి తనే సిగ్గుపడింది అణువేద. ఎప్పటిలా సీరియస్ గా అయిపోవడానికి ప్రయత్నిస్తూ "ఏం చేస్తున్నావిక్కడ?" అంది. రాగ బెదురుగా పక్కకి చూసింది.
అక్కడ సుందరేశ్వరరావు రాగకి కొత్తగా ప్రజెంటు చేసిన కీ యిస్తే పరుగులు తీసే మోటారు కారు ఏ భాగానికా భాగం వుదిపోయిపడి వుంది. అణుకి నవువచ్చినా ఆపుకుని "ఏం చేశావు ఆ కారుని?" అని కోప్పడింది. "ఈకారు చక్రాలతో ఎలా పరిగేడుతుందా! అని చూస్తున్నాను." చెప్పింది ఏ పార్టుకాపార్టు వుడదిసి పెట్టిన కుప్పని చూపిస్తూ.
రాగమాలలో ప్రతి చిన్న విషయం పరిశీలించి తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. బొమ్మలతో బుద్దిగా ఆదుకుని దాచేసుకోదు. డాన్సు చేసే బొమ్మ ఎలా డాన్సు చేస్తుందో, పరిగెత్తే రైలు ఎలా పరిగెడుతుందో తెలుసుకునే వరకు స్థిమితపడదు. ఆ ప్రయత్నంలో ఎన్ని బొమ్మలు పాడు చేసిందో లెక్కలేదు. ఖరీదైన బొమ్మలు పాడవుతున్నందుకు నొచ్చుకున్నా కూతురిలో జిజ్ఞాస అణుకి ఆనందమే కలిగిస్తుంది.
"సరే! లోపలికి రా! టిఫిన్ తిన్నావా? స్నానం చెయ్యి"
"స్కూలుకా?"
ఉలిక్కిపడింది అణువేద. పాపని స్కూలుకి పంపడమా? మానటమా? స్కూలు నించి కిడ్నాప్ చెయ్యడం తేలికౌతుందేమో? అలాగని యింట్లో వుంచడం మాత్రం ఎలా సాధ్యం? ఎన్ని రోజులని తను డాన్సు స్కూలు మానుకుని యింట్లో కుర్చోగలదు. ఒక స్కూలు ఆర్గనైజ్ చెయ్యడం కూడా మాటలు కాదు. వెయ్యి కళ్ళతో అన్నీ సూపర్ వైజ్ చేసుకుంటే గాని స్కూలుకి మంచి పేరు రాడు. వచ్చిన పేరు నిలవదు. అప్పటికి డాన్సు స్కూలు ఫోర్ సేక్షన్సుతో ఫుల్ సింగ్ లో నడుస్తోంది. మూడు వందల పైగా వుంది స్త్రెంత్. ఏంటో కష్టపడి వృద్దిలోకి తీసుకొచ్చిన స్కూలుని నిర్లక్ష్యం చెయ్యడానికి వీలులేదు. ఆలోచించింది కొంత సేపు.
"వద్దు. నువు స్కూలుకి వెళ్ళక్కరాలేదు. నాతో మాడాన్సు స్కూలుకి వచ్చేయి."
"అక్కడికా! అక్కడ నాకెవరు పాటాలు చెప్తారు?"
"ఇవాళ ఎవరూ చెప్పరు. రేపటినుంచి ట్యుషన్ ఏర్పాటు చేస్తాను."
"నో....నాకు ట్యుషను అక్కరలేదు. నేను మా స్కూలుకె వెళ్తాను. స్పందన నా బ్లూ పెన్సిలు తీసుకుంది. ఇవాళ తెచ్చి పెడ్తానంది. ఇవాళ రవి బర్త్ డే అందరికి చాక్లెట్లు పంచి పెడ్తానన్నాడు. ఈవినింగు లాస్టు పిరియడ్ యింగ్లిషు మ్యూజిక్ వుంది. మా మిస్ యివాళ కొత్త పాటలు నేర్పిస్తానంది. నేను డుమ్మా కొట్టను. "కాళ్ళతో గారాబంగా నేలను తంతూ హటం చేసింది. చిన్నపిలలు మొదట్లో స్కూలుకి వెళ్ళడానికి పేచీలు పెడ్తారు. కాని ఒక్కసారి స్కూలు వాతావరణానికి అలావాటైపోయిందంటే అందులోను ఆ పిల్లలు తెలివైన వాళ్ళు టీచర్స్ ప్రశంసలు అందుకోగలిగిన వాళ్ళయితే స్కూలు మానడానికి యెంత మాత్రం వొప్పుకోరు. సమస్య అర్ధమౌతుంది అణువేదకి. ఈ పసిపిల్లని స్కూలు నించి ఎక్కువ రోజులు దూరంగా వుంచడం సాధ్యం కాదు. న్యాయము కాదు. కాని ఎదుట వున్న భయంకరమైన సమస్యని పసిపాపకి అర్ధమయ్యేలా ఎలా చెప్పాలి?