Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 11


   
    "అబ్బ!బంగారంలాంటి నిద్ర పాడు చేశావు మమ్మి" అటు తిరిగి పాడుకుంటూ అన్నడతను.

    "అదికాదురా! నేను డాడి వూరేలుతున్నాం."

    "ఊరా?ఏ వూరు  మమ్మి?"  బలవంతంగా కళ్ళు తెరిచి ప్రశ్నంచాడతను.

    "శోభన్ మామయ్యకు పెళ్ళి సంబంధం కుదిరింది. ఈరోజు తాంబూలాలు తీసుకుంటూన్నారు. అందుకని వెళుతూన్నం. ఇంట్లో నేను కూడా లేకపోతే ఇక నీ సంగతి ఎవరు పట్టించుకుంటారు చెప్పు అందుకే  నిన్ను లేపి వెళ్ళడానికొచ్చాను....టిఫిన్ రడిగా వుంది. లేచి స్నానం చేయి."

    "అలాగే మమ్మి. మీరు వెళ్ళండి" లుంగి సరిచేసుకుంటూ బెడ్ దిగుతూ అన్నాడతను.

    "టిఫిన్ వేడి చల్లారకముందే వెళ్ళి తిను మేం సాయంత్రనికల్లా తిరిగి  వచ్చేస్తాము" అంటూ ఇంకా ఏదో చెప్పుబోయిందామే.

    "అబ్బ.....మమ్మి నేనేం  చిన్నపిల్లాడిని కాదుకాని....ముందు మీరే ళ్ళాండి" విసుక్కున్నాడు అనిల్.

    మరొకసారి హెచ్చరించి కొడుకు గదిలోనుంచి బయటకు వచ్చింది ఆ తల్లి.

    అంతవరకూ చూసి చూసి విసుగుపుట్టి భార్యకోసం ప్తెకి వస్తున్నాడు ముకుందరావు.

    "ఏమిటి? తల్లికొడుకుల పరామర్శలు అయిపోయాయా? మేలు కోలుపు పాడివస్తున్నవన్నమాట " కోపంగా అన్నాడతను.

    "ఏదో ఒకటిలేండి....వచ్చేశానుగా  పదండి."

    అరటిపండ్లగేల, బట్టలు పాకెట్లు స్వీట్స్ లాంటి సారంజామా అంతా ఒక కారులోనూ.....రెండవ కారులో ముకుందరావు దంపతులు బయలుదేరారు.

    ఆ ఇంట్లోనీ నౌకర్లు అందరూ ఎవరి పనిలో వాళ్ళున్నారు.

    అనిల్ బాత్ రూమ్ డోర్ తెరిచి కూనిరాగం తీసుకుంటూ షెవింగ్  చేసుకుంటున్నాడు. ఉన్నట్టుండి కరెంట్ పోవడం తో గోడకు బిగించివున్న అడ్డం ముందు ల్తెటు ఆగిపోయింది.

    చిరాకుపడుతూ షేవింగ్  ముగించడంతో సర్రున బ్లేడ్ తెగి..... చెంపప్తే గాటు పడిందతనికి బుసబుసమంటూ రక్తం పొంగింది.

    ఒకసారిగా అనిల్ ప్రాణం  జివ్వుమన్నది.

    వెంటనే  యంటి సెప్టిక్ లోషన్ రాయడం తో కొద్దిగా ఉపశమించింది.

    తిరిగి కరెంట్ వచ్చ్సింది.

    బ్రష్ ప్తె అతని చెవులకు వేండిమువ్వల చప్పుడు వినిపించింది.

    ఠక్కున తలతిప్పి చూశాడతను.

    మరుక్షణం కనురెప్పలను నయితం కదల్చలేకపోయాను.

    పరువంతో  పిటపిటలాడుతున్న  కన్నేపడుచు వయ్యారంగా నిలుచుని వున్నది, మోకాళ్ళకు కొంచెం క్రిందవరమా మాత్రమే వున్న పొట్టిలంగా.....ఒణ్ణి వున్నా లేనట్టు పొంకంగా ముందుకు పొడుచుకు  వస్తున్నట్టున్న ఆ మోఘమయిన ఎడ ఎత్తులు....లంగాకు జాకెట్ మధ్య ఖాలిగా వున్న నున్ననీ ప్రదేశం....లంగా బొందు బిగించి కట్టడంవలన  ప్తెకి ఉబికినట్టు స్పష్టంగా కనువిందు చేస్తున్న లోతయిన నాభి.....

    తలుపు దగ్గరున్న కర్దేన్ ను చాటు చేసుకుని నిలుచోవడం  వలన ఆమె ముఖం మాత్రం కనిపించలేదు తప్పించి మిగిలిన శరీరమంతా  అతనికి పనసపండు వలిచి చేతిలో పెట్టినంత  దగ్గరగా  కనిపిస్తోంది.

    "ఏంటి బాబూ! మాటలు రానివాడిలా అలా గుడ్లు మిటకరించి  చూస్తున్నారు?" వయ్యారంగా  ఒక చేయి ప్తెకెత్తి తలుపు ప్తె భాగానా అన్బి రెండవ చేతిని నడుము ప్తె వేసుకుంటూ కవ్వింపుగా  అన్నదామె. అప్సరసలాంటి అందగత్తే....

    ప్తె పెచ్చున వయ్యారంగా అలా నిలుచోవడం చూసిన అనిల్ కు గుటకలు  పడడంలేదు.

    కావాలనే  చాటుచేసుకోవడం వలన ఆమె ముఖం ఇంకెంత అందమయిందో చూసే అవకాశం  మాత్రం అతనికి కలుగలేదు.

    బలంగా, ఆరోగ్యవంతంగా వున్న ఆమె శరీరం ....ఎక్కడ చూసినా కండపట్టి పుష్టికరంగా కనిపిస్తున్న ఆమె అవయన  సంపద.... ప్తె పెచ్చు ఆమె నించున్న ఆ భంగిమ చూస్తూ తనను తమాయించుకో లేకపోతున్నడతను.

    "నువ్వు...."

    ఎలాగో ఈ రెండక్షరాలను ఉచ్చరించగలిగడతను.

    "నేనే బాబూ! మీ ఇంట్లో చేరిన కోత్హ పనిమనిషిని"

    "ఓహొ.....పనిదానివా?"

    అప్పటికి కొంచెం అర్ధం అయిందతనికి.

    తను ఇంతవరకూ  చూడకపోవడం వలన ఎవరా ఈమె అని, తనఇంట్లోకి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నాడు.

    "ముందు మీరు చేసే పని కానివ్వండి బాబూ!"

    ఆమె కంఠం కోయిలలు  కూస్తున్నట్టుగా వున్నది.

    నోట్లో బ్రష్ వున్న విషయం  గుర్తుకొచ్చ్చి చకచకా ముఖం కడుక్కున్నాడు. ఎంత త్వరగా గదిలోకి  వెళ్ళిఅ అమ్మాయితో  మాటలు చెప్పి, ఎలాగోలా ఆమెను తన ల్తేన్ లో  పెట్టుకుందామా అనే ఆతురతగా  వుందతనికి.

    తలుపు దగ్గరనుంచి  కదిలి  గదిలోకి వచ్చిందామె.

    వెండి మువ్వలు ఘల్లుఘల్లుమని చప్పుడు  చేస్తున్నాయి.

    ఆమె ఒక్కొక్క అడుగు  వెస్తూ సమీపిస్తున్న కొద్ది అప్సరబామని తన అందచందాలతో విందుచేయడానికి తన వడిలో వాలిపోవడానికి వస్తున్నట్టు ఆనందంతో ఉబ్బితబ్బిబ్త్సేపోయాడతను.

    టవల్ తో ముఖాన్ని అద్దుకుంటూ గాదిలోకొచ్చాడు అనిల్.

 Previous Page Next Page