Previous Page Next Page 
తుపాన్ పేజి 11

    ఇదంతా మా తలిదండ్రులను టోపీలో వేసుకునేందుకు కాదని నేను నిస్సందేహముగా చెప్పగలను. ఎందుకంటే, ఒంటిగా ఉన్నప్పుడు కూడా మా లోకం నేనుగాని, మా స్నేహితురాండ్రుగాని ఎవ్వరూ చూట్టం లేదను కొన్నప్పుడే అక్క బొమ్మ హృదయానికి అద్దుకొని కళ్ళనీళ్ళు తిరిగిపోతూ వుండగా, ఏదో పెదవులలో గొణుగుకుంటూ కుర్చీ మీద కూర్చొని ఉండేది. మా లోకానికి మా అక్క అంటే అంత ప్రేమ ఎందుకు కుదిరిందో? ఆ ప్రేమకు కారణం ఏమిటో తెలిసికోవాలన్న ప్రయత్నం చేశాను. నేను మా అక్కలా ఉంటానని, మా అక్క పోయేముందు మా బావతో తీయించుకున్న ఫోటోలో మా అక్క వేసిన వేషం నాకు వేసి, లోకం నా ఒళ్లో తల పెట్టుకొని కన్నీళ్ళు కార్చేది.

    ఒకరోజు నేనూ, లోకేశ్వరి నా విద్యామందిరంలో మాట్లాడుకుంటున్నాం. మందగమనంతో అవతరించినది నా రెండో ప్రాణ స్నేహితురాలు సోఫీ. సోఫీ భారతీయాంగ్లబాలిక, ఆమె తండ్రి నీలగిరిలో కాఫీతోటల యజమాని, లక్షాధికారి. తల్లి చిన్నతనంలో ఈమెను కని ఇంగ్లండులో చనిపోయింది. సోఫీ ఇంగ్లండులోనే చిన్న తరగతులు మాతామహుల ఇంట నుండి చదువుకుంది. తండ్రి ఆమెను వదిలి ఉండలేకపోయినాడు. కళాశాల చదువుకు హిందూదేశమే తీసుకువచ్చాడు. ఆమె నాతోపాటే ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంటరు చదువుకుంది. ఇప్పుడు నాల్గవ సంవత్సరము ఎం.బి.,బి. ఎస్. క్లాసు వైద్యకళాశాలలో చదువుతున్నది. తండ్రి, తాతలు ఇంగ్లండులోనే పుట్టినా జీవితాలు నీలగిరి కొండల్లో గడపతంచేత, వాళ్ళు సంపూర్ణంగా భారతీయులే అయ్యారు. సర్ విలియమ్స్ విలియంగారికి సోఫీ ఏకపుత్రిక, ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.

    నాకూ, సోఫీకి ఎందుచేతనో విపరీతమైన స్నేహం కుదిరింది. సోఫీ మగరాయుడు. రూపంలో గాడు సుమండీ! రూపంలో రతీదేవే! తండ్రి థియాసఫిస్టు అవడంచేత ఈవిడా థియాసఫిస్టే, అందువల్లనే ఆమెకూ నాకూ గాఢ స్నేహం అవడానికి కారణం అనుకుంటాను.

    ''నువ్వు నాతో ఇంగ్లండు రావాలి'' అని వేధిస్తూ ఉంటుంది.నాకూ వెళ్ళాలనీ ఉంది.

    ''యుద్ధం అవనీ సోఫీ!తప్పక వస్తాను '' అన్నాను.

    '' మనం ఇద్దరం నర్సులుగా చేరిపోదాం.''

    '' నీకు నర్సుపనేమి కర్మం?రేపు డాక్టరు పరీక్ష పూర్తిచేసి, ఏ లేడీ మేజరుగానో వెళ్తావు.''

    '' అందాకా ఈ యుద్దం ఉంటుందా? ఈ జర్మనీ, ఇటీవల పస మనం కూడా కనుక్కోకపోతే ఎట్లా హేమ్ ?

    '' జర్మనీ వాడి చెయ్యి పైగానే ఉంది.రష్యను చావగొడుతూ చొచ్చుకుపోతున్నాడు.''

    '' ఎంత దూరం అట్లా వెళ్ళగలడని?''

    '' మీ ఇంగ్లీషువారూ, అమెరికావారూ తిన్నగా సహాయం చెయ్యక పొతే, రష్యా ఏం చేస్తుంది? రెండో రంగమో అంటే, నిద్రపోతో కూర్చున్నారు ఈ మిత్రమండలివారు. అవతల ఆఫ్రికాలో రోమెల్ విజృంభించింది. ఇంగ్లీషు వారిని పరుగెత్తించి అలగ్జాండ్రియా వద్ద తిష వేసుక్కూర్చున్నాడు.''

    '' ఎంతకాలం వేసుకుంటాడు హేమ్!నేనే వేవల్ నయితేనా అసలు, రోమెల్ ని రానిద్దునా!''

    '' చేతుల్తో స్వయంగా పీక నులుముదువా? లేక కొరడా పుచ్చుకొని వెనక్కు కొట్టి కొట్టి వదులుదువా?''

    అప్పుడు పుస్తకము చదువుకోవడము మాని లోకేశ్వరి మావైపు తిరిగి ''సోఫీ, ఈ యుద్ధం మా భారతీయులకు ఏమీ హృదయ స్పందన కలిగించడంలేదు. మాకు అవసరం కాని ఈ యుద్ధం సంగతి మా హేమ కెందుకు చెప్పు? అని అన్నది.

    సోఫీ : నీ మాటలు, అన్నీ ఎప్పుడూ యింతేనే!గాంధీ మహాత్ముని శిష్యురాలనంటావు. ఆయన పేరు కూడా పాడుచేస్తున్నావు. ఈ యుద్ధం భారతీయులకే కాదు, సర్వ ప్రపంచానికీని. మా బ్రిటీషు వాళ్ళు భారతీయుల్ని అన్యాయం చేయలేదని నేను అనను. మీ డండర్ హేడ్డుల సహవాసం చేసి నాలో ఉన్న బ్రిటీషుతత్త్వం అంతా చంపుకున్నాను. స్లేడుకుమారి శ్రీమతీ మీరాబెన్ గారే నా గురవయింది.దుర్మార్గ శక్తులు నీరసులమీద దాడి వెళ్తే ఆ దుర్మార్గుల మీద సాగించే యుద్ధం, భారతీయుల యుద్ధం ఎందుకు కాదు? భారతీయులు జర్మనీ పక్షం చేరారు కదా!

    లోకే : ఈజిప్టువా రెవరిపక్షం చేరారు? భారతదేశం ఈజిప్టుకన్నాతీసిపోయిందా! ఏం? మనదేశం జర్మనీపైనగాని, ఇటలీపైనగాని కత్తిగట్టి యుద్ధంచేసే స్తితిలో ఉందా? బ్రిటీషువారి పాలన పుణ్యమా అని, భారతీయులు ఎంత నీచస్థితిలోకి వెళ్ళారో అంత నీచస్థితిలోకి వెళ్ళారు. ఆ భారతీయుల పేరున తామే యుద్ధం ప్రకటించారు!

    హేమ : ఏమర్రో! రాజకీయ నీతంతా ఈ పూటే నిర్ధారణ చేసే టట్టునారు మీరిద్దరూను!ఏ త్యగాతిగారో వింటే ఏమంటారు?

                                            ....        ....        ....


    లోకేస్వరికి కొంచెము కోపం వచ్చింది.చురుకుగానే మాట్లాడడం సాగించింది. కాని, మా మాటవల్ల చప్పున కరిగిపోయి, సోఫీని కౌగిలించుకొని '' సొఫీ ! ఏదో కాస్త చురుకుగా మాట్లాడాను క్షమించాలి'' అన్నది.

    సోఫీ లోకేస్వరిని గుండెకదుము కొని '' లో !నీకూ కోపము లేదు,నాకూ కోపము లేదు. నువ్వు వాదించడము ప్రారంభింస్తే నేనూ మళ్ళీ సిద్దంగా ఉన్నాను. వాదనలకు, ప్రేమకు సంబంధం యేమిటి?'' అని కాక లీస్వరాన పలికినది'

    హేమం : బాగుందిలెండి నాటకం! మీ యిద్దరూ మన తీర్ధమిత్రుని లాగే వాదించారు.

    సోఫీ : తీర్ధమిత్రుడంటే జ్ఞాపకం వచ్చింది. నిశాపతి ఎక్కడా కనపడడం లేదేమిటి?

                                       16

    ఈ ఇద్దరు స్నేహితురాండ్రూ ఆ నలుగురు పురుష స్నేహితులంటే నేనున్నంత ఎక్కువ అన్యోన్యంగా ఉండరు. చస్నువుగానే ఉంటారుకాని, ప్రాణ స్నేహంగా ఉండరు. ఒక్కొక్కప్పుడు ఏడుగురం కలిసి సినిమాలకు వెళ్తాం. ఒకనాడు ఏ ఎణ్నూరు రేపు బంగాలాకోపోయి, స్వంతంగా వంటలూ, పిండి వంటలూ చేసుకుని అల్లరిచేసి వస్తుంటాము.
                                                                                                         

 Previous Page Next Page