Previous Page Next Page 
హేల్త్ సైన్స్ పేజి 10

                                              10. చిన్నపిల్లలకు వచ్చే గజ్జి_ నివారణ

    విజయ్ కి ఒళ్ళంతా దురద, ముఖ్యంగా వేళ్ళ సందునపుట్టే దురద అతన్ని నిలవనివ్వడు. అలాంతపుడు ఆ వేళ్ళు రాయికేసి రుద్దాలనిపిస్తుంది. దురదపుట్టినచోట గోకిటేచాలు, నీరులా వస్తుంది ఈ దురద మొదట్లో చేతులకే వుండేది. తరువాత కొద్ది రోజులకే మెడదగ్గర చంకల్లోనూ, పొట్టమ్మీద. గజ్జల్లోనూ_ యిలా శరీరం మీద చాలా చోట్లకు అది పాకింది. ఇక రాత్రిపూట మరీ, భరించలేని దురద వల్లనా నిద్రపట్టదు. తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టరు కు చూపిస్తే, అ దురద అంతా గజ్జి రావడంవల్లనే అని అయనతేల్చి చెప్పాడు. కాని విజయ్ తల్లికి తన కొడుకుకు గజ్జి ఎందుకు వచ్చిందో అర్ధంకాక ఆశ్చర్యపోయింది. ఆమె దృష్టిలో 'గజ్జి' కేవలం మురికివాడలలో నివసించే పిల్లలకే  వస్తుంది.

    నిజమే! గజ్జి మురికివ్దలోని పిల్లల్లో ఎక్కువగానే వుంటుంది. కాని, అది ఇంకేవ్వరికీరాదని భావించడం మాత్రం పొరపాటే. అలా పోర పాటుపడి కొందరు తమకి గజ్జివచ్చి దురద పడుతున్నా, ఆ గజ్జి చీముపట్టి పొక్కులు తేలేవరకు ఏదో ఎలర్జీవచ్చి దురద కలిగిందని ఎనిల్ బిళ్ళలు వేసుకుంటో తాత్కాలిక ఉపశాంతి  పొంతూవుంటారు.

    గజ్జి ఎవరికైనా రావచ్చు. కాని శరీరం మురికి పట్టాకుండా చూసుకుంటూ, శుభ్రంగా రెండుపూటలా స్నానం చేసే శుభ్రత పాటించకపోతే గజ్జి తెలికిగా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి క్రిములు ఒకరి నుంచి మరొకరికి అతితేలికగా వ్యాపిస్తాయి. ఇంట్లో ఒకరికి గజ్జి వచ్చినా, వారివల్ల వారి దుస్తుళవలన రెండవవారికి అతి తొందరగాఈ వ్యాధి సంక్రమిస్తుంది.

    ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్లో అందరిటోకలిపి ఆడుకుంటూ ఉంటారు. వారిలో ఏ ఒక్కరికి గజ్జివున్నా, తక్కినవారికి అది అంతుకుంటుంది. గజ్జివున్న పిల్లలలో అదివచ్చి ఒంటిమీద నలుగు చెంబుల నీళ్ళు గుమ్మరించుకుని స్నానం అయిందనిపిస్తే మాత్రం ఒంటికి పట్టిన గజ్జి క్రిములు ఏ మాత్రం వదలవు. అవి చర్మంమీదే స్థావరం, ఏర్పరచుకుంటాయి.

    గజ్జి రావడానికి సార్కొపిటిస్ స్కాబీ అనే క్రిమి కారణం. ఇది శరీరంలో మడతలుగానూ,చర్మం పలచగానూ వున్నచోట్ల తొందరగా స్థావరం ఏర్పరుచుకుంటుంది. అలంటి శరీర భాగాల్లో చేతి వెళ్ళ సందులు చెప్పుకోతగ్గవి. అందుకే సూటుకి60_70మందికి గజ్జి చేతివెళ్ళసందున ప్రారంభం అవుతుంది. ఇక్కడే కాకుండా కొద్ది తక్కువ శతం కేసుల్లో మోచేతులు, చంకలు, గజ్జలు బీర్జాలు దగ్గరకూడా గజ్జి తొందరగా వస్తుంది.

    ఈ గజ్జికి సంభందించిన క్రిముల్లో మొగక్రిములు, అడ క్రిమితో సంయోగం చెందిన వెంటనే మోగక్రిమి చనిఅపోతుమ్ది. అ వెంటనే అడ క్రిమి చర్మం పొరల్లోకి చొచ్చుకుని పోయి 3_4 రోజుల్లో గుడ్లు పెట్టడంప్రరంభిస్తుంది. ఈ గుడ్ల నుండి వారం రోజుల్లో గజ్జి క్రిములు వేలివడి చర్మాన్ని తోలుచుకుని బయటకి వస్తాయి. ఇవి అతిచిన్న క్రిములే అయినా భూతఅద్దం పెట్టుకుని చూస్తె మామూలు కళలకే చక్కగా కనబడతాయి. ఈ క్రిములు మళ్ళీ ఇంకొకరికి తొందరగా సంక్రమిస్తాయి: లేదా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి.

    గజ్జి రావడంవల్ల దురద కలగడానికి కారణం ఈ క్రిములవల్ల షరీరంలో విడుదలయ్యే ఒక రకమైనా పదార్ధం ఎలర్జీలాగాపని చేయడమే. దురదవల్ల గోకదంతో ఆ ప్రాంతంలో ఇతర బాక్టీరియా క్రిములు చేరుతాయి. ఈ బాక్తిరీయా క్రిములవల్ల చీము పొక్కులు తయారవుతాయి. వీటినే గజి పొక్కులు అంటారు. చీము పొక్కులు తయరవనంటవరకుచర్మం మీద దురదగా ఉండడంతప్ప ఇతరట్రా ఏమీకనబడవు. మొదట్లో చిన్న_చిన్నచామాట పావుక్కులా అనిపించినా, తరువాత చీముపావుక్కులా తయరవుతాయి. గజ్జివలన ఏర్పడిన చీముపొక్కుల్లా తయారవుతాయి. గజ్జివలన ఏర్పడిన చీముపావుక్కులను నిర్లక్ష్యంచేస్తేకొందరిలో మూత్రపిండాలు దెబ్బ తినడానికి ఆస్కారం వుంది.

    గజ్జి రాకుండా జాగ్రత్తపడాలంటేదుమ్ము దూళీలోపనిచేసే వాళ్ళూ, ఆరుబయట ఆడుకునే పిల్లలు ఇంటికిరాగానే శుభ్రంగాస్నానం చేయాలి. కేవలం సబ్బుతో స్నానం చేయడమే కాకుండా బ్రష్ తో శరీరాన్ని జ్రాగ్రట్టగా శుభ్రపరచుకోవాలి. ఒకవేళఇంట్లోఏ ఒక్కరికైనా గజ్జివస్తే, తక్కినవారు ఆ వ్యక్తి ఉపయోగించే]తువ్వాలుగాని, పక్కదుప్పట్లు కాని వాడకుండా వేడినీళ్ళతో వాటిని ఉతకాలి. గజ్జివచ్చినప్పుడు చీము కురుపులు ఏర్పడితే, టెట్రాసైకిలోన్స్ లాంటి మందులు పూర్తీకోర్సువాడాలి.

    గజ్జి వచ్చిన చీము కురుపులు లేకపోయినా వేడినీళ్ళతో స్నానంఅయిపోయినతరువాత ఎస్కాబియాల్ గాని, స్కాబమా లోషన్గాని ముఖానికి తప్పఒళ్ళంతాబాగా ఇంకేతట్లురాయాలి. మళ్ళీ మరో రెండుసార్లు రోజు మొత్తం మీద లోషన్రాసి 30గంటలు గడిచిన తరువాతే స్నానం చేయాలి. అలా చేసినట్లయితే గజ్జికి సంభందించిన క్రిములు నిర్మూలింపబడతాయి. వారం రోజులకూ మళ్ళీ ఒకసరి పైపూట మందు వాడాలి గజ్జి చాలా సామాన్యమైనా వ్యాధి సరిగ్గా చికిత్స జరగని పక్షంలోఇది ఎగ్జిమాలాంటి మొండి చర్మవ్యాధిగా మారి ఇబ్బంది కలిగిస్తుంది.

                                      ***

 Previous Page Next Page