Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 11

                           ష డం గ ము ల  వి వ ర ము :-   

    అనుధృతము :- ఇది ధృవక యను  సశ్శబ్ద క్రియచేత వాడబడుచున్నది. అనగా  ఒక ఘాత వేయుట.
                         _________   
 ఒక అక్షరకాలము గలది. అర్ధచంద్రము. వ్యంజనము, ఆనునాశికము, అవ్యక్తము, విరామము, అనుధృతము. అను ఆరును దీని పేర్లు. దీనికి గుర్తు U. ఇది 1/4 మాత్రకాలము కల్గియుండును.

    దృతము :- ఇది ధృవకయను, సశ్శబ్ద క్రియచేతను. "విసర్జిత" యను నిశ్శబ్ద క్రియచేతను వాడబడుచున్నది. అనగా, ఒక ఘాతవేసి, పిమ్మట ఒక ఉసిని, (చేతిని వెనుకకు విసరుట) వేయుట. రెండక్షరముల కాలము గల్గియుండును. అర్ధమాత్రవ్యోమము. బిందుకము, వలయము. దృతము అని పేర్లు. దీనకి గుర్తు O. ఇది 1/2 మాత్రకాలమున గల్గియుండును.

    లఘువు :- ఇది ధృవక, విక్షిప్త, అనుసశబ్ద క్రియలచేత వాడబడుచున్నది. అనగా ఘాతవేసిన తరువాత చిటికెనవ్రేలు మొదలు వ్రేళ్ళను లెక్కించుట. నాల్గు యక్షరముల కాలము గల్గియుండును. దేశ్య తాళములగు  ధృవాది సప్తతాళముల  సందర్భములో ఘాతయును, యెంచబడిన వ్రేళ్ళ  సంఖ్యయును  గలసి లఘువుయొక్క  మొత్త అక్షరకాలపుమగుచున్నది, మాత్ర, సరళము, హ్రస్యము, కళ, లఘువు, అని దీనికి పేర్లు గలవు. దీనికి గుర్తు I. ఇది ఒక మాత్రకాలము కలిగియుండును.

    గురువు :- ఇది ధృవక, విక్షిప్త, పతిత యను క్రియలచేత  వాడదగినది. అనగా  ఘాతవేసి తదుపరి మూడువేళ్ళను యెంచి. పిమ్మట ఆ కుడిచేతిని  యెడమచేతి మీదుగా నాలుగు అక్షరముల కాలము విసరుట. ఒక ఘాతవేసి పిమ్మట ఏడు వ్రేళ్ళను ఎంచవలయునను  అభిప్రాయభేదముండినటుల  గోచరించుచున్నది. ఎనిమిది  అక్షరముల  కాలము గలిగియున్నది, ద్విమాత్రకము, వక్రకము ,కాణము, యమళము, దీర్ఘము, గురువు అని దీనికి పేర్లు,
        ______________________________________    
 దీనికి గుర్తు  8. ఇది రెండు  మాత్రలకాలము కలిగియుండును.

    ప్లుతము :- ఇది ధృవక, విక్షిప్త సర్పిణి ,కృష్య, అను నాలుగు క్రియలచే వాడబడవలయును. అనగా ఘాతవేసి, మూడువ్రేళ్ళను యెంచి, ఆ చేతిని నాల్గు అక్షరముల  కాలము  కుడివైపుకు విసరుట, ఇది పన్నెండు అక్షరముల కాలము గల్గియుండును. సమోద్భవము  దీప్తము త్రియంగము త్రిమాత్రకము ప్లుతము  అని దీనికి పేర్లు గలవు. దీనికి గుర్తు  3. ఇది మూడు మాత్రల కాలము కల్గియుండును.

    కాకపాదము :- ఇది సర్పిణి, కృష్య, పతాక, పతిత యను క్రియలచే  వాడవలయును. అనగా చేతికి  నాలుగు అక్షరముల కాలము చొప్పున ఎడమ వైపునకు, కుడివైపునకును  విసరి పిమ్మట  నాల్గు అక్షరముల కాలములో ఆ చేతిని క్రిందకు తెచ్చుకొనుట. ఇది పదియారు అక్షరముల కాలము కలిగియుండును. హంసపాదము నిశ్శబ్దము చతుర్ల ఘువు  కాకపాదము అని దీనికి పేర్లు గలవు. దీనికి గుర్తు +.  ఇది నాల్గు మాత్రకాలము కలిగియుండును. ఈ అంగమునకు  అన్నియు నిశ్శబ్ద క్రియలే.


                             షో డ శాం గ  ప్ర స్థా ర ము

        అంగముల పేర్లు                     గుర్తులు                 అక్షరకాలం
    1    అనుధృతము                                    U                                  1
   
    2    ధృతము                                           O                                  2

    3    ధృత విరామము                               UO                               3

    4    లఘువు                                            I                                  4

    5    లఘు విరామము                               UI                               5
  
    6    లఘుధృతము                                     OI                               6

    7    లఘు ధృత విరామము                      UOI                              7

    8    గురువు                                              S                                 8

    9    గురువు విరామము                           US                               9

    10    గురుధృతము                                 OS                              10

    11    గురుధృత విరామము                     UOS                           11

    12    ప్లుతము                                            3                              12

    13    ప్లుతవిరామము                              U3                               13

    14    ప్లుతధృతము                                   O3                              14
   
    15    ప్లుతధృత  విరామము                    UO3                              15

    16    కాకపాదము                                    +                                 16
   

 Previous Page Next Page