"ఫర్వాలేదు చెప్పండి. వీళ్ళందరూ నాక్లోజ్ ఫ్రెండ్సే" చెప్పింది అన్విత.
"ఇది ఇక్కడున్న అందరికీ తెలిసిన విషయమే, మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయం. నేనెంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నదీ చెప్పాలంటే....? మాటలతో చెప్పలేనంత ఇదిగా ప్రేమిస్తున్నాను. ఇది మీకు పరోక్షంగా రెండుమూడుసార్లు తెలియచేశాను. కాని మీరు మాత్రం ఏవిషయాన్ని తేల్చడంలేదు. మీ చుట్టూ తిప్పుకుంటారు? నాకున్న లీవులన్నీ మీ చుట్టూ తిరగటానికే సరిపోతున్నాయి. ఎంతకాలం ఇలా....సారి.... ఇలా మాట్లాడుతున్నానని ఏమి అనుకోవద్దు. సంవత్సరం నుంచి అదేదో బాధ్యతలాగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎవరేమని అనుకుంటారోనన్న ఫీలింగ్ కూడాపోయి చాలాకాలం అయింది. నా గురించి వీడు పిచ్చివాడు, పాపం పడక పడక అన్విత పిచ్చిలో పడ్డాడని ముందూ వెనకా అనుకుంటున్నారు. అయినా నాకిది ఆనందంగానే వుంది. మిమ్మల్ని ప్రేమించడం నేనో గొప్ప పనిగా భావిస్తున్నాను. మీరు నోరు విప్పకపోవడమే బావోలేదు." అతను అన్విత మాట్లాడుతుందేమోనన్న భావంతో చూశాడు.
రిమి అన్విత కాలుగోకింది మాట్లాడమన్నట్లు.
"పందెం గుర్తుచేస్తున్నట్లుగా చూశారందరూ..."
కాసేపు ఆలోచించిన తర్వాత నోరు విప్పింది అన్విత మొహంలో వీలయినంతవరకు ఏ భావమూ కనపడనీయకుండా జాగ్రత్తపడుతూ.
"మీరు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా!?
"ఈ విషయాన్ని మీ హాస్టల్ గేట్ కీపర్ ని, నైట్ వాచ్ మన్ ని హాస్టల్ ముందున్న టీ స్టాల్ వాడిని, ఫాన్సీ పాపువాడిని, హాస్టల్ కి కూరగాయలు తెచ్చే అమ్మాయిని, చివరకు ఆ రిక్షావాళ్ళనడిగినా చెబుతారు అక్కడ. ఇందులో మీకేమన్నా సందేహమా...?
"సారి! మీకు, మీ రిక్షావాళ్ళకి అనిపిస్తూ ఉండొచ్చు మీరు ప్రేమిస్తున్నారని. ఈ విషయంలో నాకు కొన్ని అనుమానాలున్నాయి. నాకే కాదు ఇక్కడున్న చాలామందికి మీరు లవ్ లెటర్స్ రాయటం, ఇరవై నాలుగు గంటలు వెంటపడటం, ప్రేమించటం లోకోస్తుందంటారా? ఇంతకన్నా పరచే మార్గాలు లేవా...?"
"వుంటే మీరు చెప్పచ్చుగా...?" ఆ మాట అన్న తరువాత అతని ఎందుకన్నా నా ఈ మాట అనిపించింది.
"భలేవారే... ఏ అమ్మాయయినా నన్ను ఈ విధంగా ప్రేమించండి, నేను ఏక్సెప్ట్ చేస్తానని అనదు." అంది సుజిత.
"అనదనుకోండి అని అన్విత వైపు తిరిగి "అయినా నేను ప్రేమని కొంచెం సినిమాటిక్ గా మీకు అనిపించవచ్చు. నాలో ఏదో క్వాలిటీ లోపించి వుండొచ్చు. మీకలా వుంటే నచ్చకపోవచ్చు. దాన్ని మీరు ఎక్స్ క్యూజ్ చేయచ్చుగా. అంటే పలానా విధంగానే ప్రేమించమని చెప్పటం కాదు ఆ వ్యక్తిలో పలానా క్వాలిటిస్ సరిచేసుకుంటే బావుంటుందని చెప్పటం... మీరేమంటారు?"
"మీరు అంతా విని కూడా మొదటకే వస్తున్నారు. మేమనేది మీ ప్రేమ స్వచ్చమైందా...? లేదా అని... ? సారీ! ఇక్కడ కొన్ని భరువైన డైలాగులు పడ్డాయి!? నవ్వుతూనే రెచ్చగోట్టటానికి ప్రయత్నించింది అన్విత.
ఆల్ రైట్ !... ఈ విషయంలో నన్నేమన్నా పరీక్షించదలచుకుంటే నాకే అభ్యంతరం లేదు. కాని ఓవిషయం మీరే తాజ్ మహల్ లాంటిదో కట్టించమంటే మాత్రం నావల్లకాదు...."
"అన్విత తాజ్ మహల్ గనుక అడిగితే వెంటనే కట్టించడానికి వాళ్ళ బావే సిద్ధంగా వున్నాడు" అందుకుంది రిమి.
"మీ స్నేహితురాలి టేస్ట్ మీద నాకా నమ్మకం వుంది. కాకపోతే మీరందరూ కలిసి తెలుగు సినిమా రిలీజ్ రోజు మొదటి ఆట టిక్కెట్లు బ్లాక్ లో కొనకుండా తీసుకురమ్మనటం లాటి పరీక్షలు పెడతారేమోనన్న భయం...." తన సెన్సాఫ్ హ్యూమర్ ని కూడా ప్రదర్శించాడు.
"మీకా భయం అక్కరలేదులెండి... మహా అయితే ఏ కొండమీద నుంచో దూకమంటుంది. అంతేకదా!" అడిగింది సునిత.
"అన్విత నుంచి ఏ సమాధానం రాకపోవడంతో..... మిత్రా
"మీ మిత్రురాలు దూకమనాలేగాని.... కొండెం కర్మ లిబర్టీస్టాల్స్ మీదనుంచి దూకుతాను. కాని మీరోకటి గమనించలేదు. నా ప్రేమని నా ప్రాణంతో ముడిపెడుతున్నారు. నాది స్వచ్చమయిన ప్రేమే అయినా నేను ఈ విషయంలో చావుకి కూడా సిద్ధమే అన్నాడు ఉద్వేగంగా.
"మీరు తొందరపడి ప్రాణత్యాగం చేసే పోగ్రామ్ లేవి పెట్టుకోకండి పోనీ నేనో సలహా నివ్వనా...?" అడిగింది రిమి.
కాని ఎవరి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో తాను సైలెంట్ అయిపోయింది. ఇవేమి పట్టనట్లు ఏదో ఆలోచిస్తోంది అన్విత. రెండు నిముషాల నిశ్శబ్దం తరువాత హటాత్తుగా అంది, మిస్టర్ కెన్ యు మర్డర్ సం బడీ? ఐ మీన్, ఎవరినైనా హత్య చేయగలరా?"
"హత్యా!" అదిరి పడ్డాడు మిత్రా.
"ఎస్.... హత్య చెయ్యాలి! మీకేమన్నా అభ్యంతరమా?"
మిగతా ఎవ్వరికీ అన్విత ఏమి మాట్లాడుతుందో అర్ధం కాలేదు సునిత అడిగింది.
"అన్వీ? అదేదో అర్ధమయ్యేలా చెప్పు" అంది ఉత్సుకతలో.