Previous Page Next Page 
అథర్వ వేద సంహిత పేజి 11

   

   తన సామర్ధ్యము, ప్రభావము అనుకొన్న వాడు గర్వపు రెక్కలు మొలిపించు కొనును. మరింత అధ్యయనము, పరిశోధన చేయడు. మంత్ర ప్రభావమో, భగవదనుగ్రహమో అనుకున్న వినయ వంతుడగును. మరిన్ని నేర్చుకొనుటకు ప్రయత్నించును.
   
2.    వ్యాధి పీడితా! చతష్పథమున హోయ మానమగు అగ్ని అభిమంత్రిత జలాభిమాని దేవతలతో కూడి నీకు సుఖదాయకమగును గాక. సోమ ప్రభువు ఔషధ సహితుడై నీకు సుఖములు కలిగించును గాక.
   
    "ఏవాహం త్వాం క్షేత్రియాన్నిర్రుత్యా జామి శంసాద్ ద్రుహో మంచామి వరుణస్య పాశాత్.
   
    అట్లనుచున్న నేను నిన్ను క్షేత్రీయ వ్యాధులనుండి, మృత్యుపరిష్వంగము నుండి, రక్తసంబంధీకుల ద్రోహము నుండి, వరుణ పాశముల నుండి విముక్తుని చేయుచున్నాను.
   
    "అనాగసం బ్రహ్మణా త్వా కృణోమి శివేతే ద్యావాపృథివీ ఉభేస్తామ్"
   
3.    అంతరిక్షమున పక్షులను ధరించు వాయువు నీకు సుఖకరము అగును గాక. సమస్త దిశలు నీకు శుభములు కలిగించును గాక.
   
    "ఏవాహం త్వాం క్షేత్రియాన్నిర్రుత్యా జామి శంసాద్ ద్రుహో ముంచామి వరుణస్య పాశాత్.
    అనాగసం బ్రహ్మణా త్వా కృణోమి శివేతే ద్యావాపృథివీ ఉభేస్తాత్".

   
4.    వాయు పత్నులగు దేవేరులు, వారిని సకల దిశల నుండి వీక్షించు సూర్యుడు, సమస్త దిశలు నీకు శుభములు కలిగించును గాక.
   
    "ఏవాహం త్వాం క్షేత్రియాన్నిర్రుత్యా జామి శంసాద్ ద్రుహో ముంచామి వరుణస్య పాశాత్.
    అనాగసం బ్రహ్మణా త్వా కృణోమి శివేతే ద్యావాపృథివీ ఉభేస్తామ్".
   

5.    ఆ దిశలందు నిన్ను వార్ధక్య పర్యంతము నిలుపుచున్నాను. నీకు రోగములు కలిగించు పాప దేవతకు పరాజయము కలుగును గాక.
   
    "ఏవాహం త్వాం క్షేత్రియాన్ని ర్రుత్యా జామి శంసాద్
     ద్రుహో ముంచామి వరుణస్య పాశాత్|
     అనాగసం బ్రహ్మణా త్వా కృణోమి శివేతే
     ద్యావాపృథివీ ఉభేస్తామ్||"

   
6.    నీవు యక్ష్మ నుండి విముక్తుడవు అగుచున్నావు. దుర్గతి నుండి విముక్తుడవు అగుచున్నావు. ద్రోహముల నుండి, పాశముల నుండి, గ్రహ బాధల నుండి విముక్తుడవు అగుచున్నావు.
   
    ఏవాహం త్వాం క్షేత్రియాన్ని ర్రుత్యా జామి శంసాద్
    ద్రుహో ముంచామి వరుణస్య పాశాత్|
    అనాగసం బ్రహ్మణా త్వా కృణోమి శివేతే
    ద్యావాపృథివీ ఉభేస్తామ్ ||

   
7.    శత్రువుల వంటి రోగములను విడిచినావు. సుఖములను చేరుచున్నావు. ఈ సుకృతముల భూలోకమున శాంతి, సుఖములు కలవాడవగుము.
   
    "ఏవాహం త్వాం క్షేత్రియాన్ని ర్రుత్యా జామి శంసాద్
     ద్రుహో ముంచామి వరుణస్య పాశాత్|
     అనాగసం బ్రహ్మణా త్వా కృణోమి శివేతే
     ద్యావాపృథివీ ఉభేస్తామ్||

   
8.    సత్య స్వరూపుడగు సూర్యుని గ్రహము నుండి విడిపించిన దేవతలు అతనిని పాపముల నుండి విముక్తుని చేసినారు.
   
    "ఏవాహం త్వాం క్షేత్రియాన్ని ర్రుత్యా జామి శంసాద్
     ద్రుహో ముంచామి వరుణస్య పాశాత్|
     అనాగసం బ్రహ్మణా త్వా కృణోమి శివేతే
     ద్యావాపృథివీ ఉభేస్తామ్"

   
                                                మూడవ అనువాకము
                                              
మొదటి సూక్తము - 11
   
వినియోగము :-
   
      1) స్త్రీ, శూద్రరాజు, బ్రాహ్మణ కాపాలికుడు, అంత్యజుడు, శాకిని మున్నగు వారు చేయు అభిచారము     నుండి రక్షణకు మరియు కృత్యను దూరము చేయుటకు తిలక మణిని హోమాభిమంత్రణలు చేసి కట్టవలెను.
   
      2) కృత్య పరిహరణమున దీనిని పఠించవలెను. కృత్యానిర్వారణార్ధ శాంత్యుదకమున దీనిచే ఆవాపన     చేయవలెను.
   
      3) "కృత్యదూషణ ఏవచ | చాతనే మాతృనామచ అథ శాంతైః కృత్యా దూషణై శ్చాతనైః"
   
      4) రాజ్యము, బ్రహ్మ తేజస్సు అభిలషించు వాని కొరకు బార్హస్పత్య శాంతి చేయవలెను.
   
      5) కృత్యా పరిహరణ కర్మమున మొదటి ఋక్కుచే దర్వితో మూడు మారులు 'సారూపవత్సే నాపోదకేన'     మథించి 'గుల్ఫ' మీద చల్లవలెను.
   
1.    దూషించు వారికీ దూషించు దానవగుము. హంతకులకు హంతకవగుము. వజ్రమునకు వజ్రమవగుము. "అధిక బలశాలి శత్రువును హతమార్చుము. సమాన బలశత్రువును అతిక్రమించి సాగుము"
   
            "ఆప్నుహి శ్రేయాంసమతి సమం క్రామ".
   
2.    మణీ! నీవు తిలక వృక్షముచే చేయబడిన దానవు. హతమార్చవచ్చిన 'కృత్య' ను తొలగించుదానవు.
   
            "ఆప్నుహి శ్రేయాంసమతి సమం క్రామ".
   
3.    మమ్ము ద్వేషించు వారిని, మేము ద్వేషించు వారిని నాశనము చేయుము.
   
            "ఆప్నుహి శ్రేయాంసమతి సమం క్రామ".   
   
4.    మణీ! నీవు తెలిసిన దానవు. వర్చస్సు గల దానవు. మా దేహములను రక్షించుదానవు.
   
            "ఆప్నుహి శ్రేయాంసమతి సమం క్రామ".

5.     శత్రువును ఏడిపించు దానవు, తేజస్వినివి, తపింప చేయుదానవు అగుచున్నావు.
   
             "ఆప్నుహి శ్రేయాంసమతి సమం క్రామ".
   
                                              రెండవ సూక్తము - 12
   
వినియోగము :-

   
      1) అభిచార కర్మ దీక్ష కొరకు ఈ సూక్తముచే వెదురు బొంగును కొట్టవలెను.
   
      2) శత్రు సంహారక కర్మమున దక్షిణ దిశగా పారిపోవు శత్రువు కాళ్ళకు అడ్డముగా ఆకులు వేయవలెను. వానిని     ముక్కలు చేసి కాల్చవలెను.
   
1.    ద్యులోకము, భూలోకము, విశాల అంతరిక్షము, అద్భుతులు స్తోతవ్యులగు లోకపాలురు, అంతరిక్షమందలి మరుత్తులు, అగుపించని వాయువు నన్ను తపింప చేయువానిని తపింపచేయుదురు గాక.
   
2.    యజ్ఞయోగ్యులగు దేవతలారా! భరద్వాజుడు నాకు ఫలసిద్ది కలిగించుటకు చదువుచున్న మంత్రములను ఆలకించండి మము బాధల పాశములతో బంధించిన వారు, మా మనసులను హింసించిన వారు మృత్యువుకు గురి అగుదురు గాక.
   
3.    సోమపానము చేయు ఇంద్రదేవా! హృదయ క్షోభ కలవాడనై నిన్ను మరల మరల పిలుచుచున్నాను. నా కేకలు వినుము. మా మనసునకు కష్టము కలిగించు వానిని - చెట్టును రంపముతో వలె - కోసి వేయుదును.
   
4.    త్రిసంఖ్యాక ఋక్కులు, సామగాయకులు, ఆదిత్యులు, వసువులు, అంగిరసులు, మా పితరులు సంతోషపరచుటకు చేసిన కార్యములు మమ్ము శత్రువుల నుండి రక్షించును గాక.
   
    (త్రిసంఖ్యాక ఋక్కులనగా ఐతరేయ మహా వ్రత క్రతువున బృహదుక్ధమందు సమామ్నాయము అని సాయణాచార్యులు.)
   
5.    నేను శత్రువును జయించుటకు సిద్దమగుచున్నాను. ద్యావాపృథ్వులారా! విశ్వే దేవతలారా! సోమపానము చేయు అంగిరులారా! పితరులారా! మీరు కూడ ఉద్యమించండి. మాకు వ్యతిరేకముగ పనిచేయు శత్రువును మృత్యువు కబళించును గాక.
   
6.    మరుత్తులారా! మమ్ము అణచివేయ దలచు వానిని, మా మంత్రానుష్టానమును నిందించు వారిని కాల్చివేయండి. మంత్ర ద్వేషులను ఆదిత్యుడు సకల దిశలందు దహించును గాక.
   
7.    శత్రువా! నీ ఏడు ప్రాణములను, ఎనిమిది నాడులను, ఇతర ప్రముఖ అవయవములను ఛేదించుచున్నాను. ఇప్పుడు నీవు శవము అయినావు కదా! అగ్ని దూతవగుము. యమపురికి చేరుము.
   
8.    శత్రువా! ఛిన్నాభిన్నమైన నీ దేహమును మండుచున్న అగ్నిలో వేయుచున్నాను. అగ్ని నీ అవయవములను, వాక్కును, ప్రాణములను దహించును గాక.
   
                                             మూడవ సూక్తము -13
   
వినియోగము :-

   
      1) గోదానమున శాంత్యుదకమున అను యోజనము చేయవలెను. దీనితోనే ఘ్రుతాహుతులిచ్చి బ్రహ్మచారి     తలపైకి "సంపాతములు" తేవలెను.
   
      2) 2, 3 ఋక్కులచే కొత్త వస్త్రము ఇవ్వవలెను. వీనితోనే పురోహితుడు ప్రతిరోజు ఉదయము     వస్త్రములను అభిమంత్రించి రాజుకు ఇవ్వవలెను.
   
      3) నాలుగవ మంత్రముచే కుడి కాలును రాతి మీద పెట్టించవలెను. రాజుకు హారతి ఇచ్చునపుడు 4వ     మంత్రమున నాలుగు ఇసుక రేణువులను నాలుగు వైపులు వేసి ఒక దానిని రాజు మీద వేయవలెను.
   
      4) 5వ మంత్రముచే మొదట పెట్టిన వస్త్రమును కర్త గ్రహించవలెను.

 Previous Page Next Page