Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 11

    "నా మిడ్డీ సంగతి తర్వాత! ముదు నీ జీన్ ప్యాంట్  వెనక చూసుకో! కొనుక్కొని చూసుకోకుండా వేసుకున్నట్టున్నావు- అందుకే అదుగో... క్యూ స్టార్ట్ అయింది!" అంది అక్కడున్న బాయ్స్ వైపు చూపిస్తూ.
    అటుచూసి కంగారుగా తన జీన్ ప్యాంట్ వెనుక చూసుకుంది! అక్కడ 'ప్లీజ్.... కిస్ మీ!' అని రాసిన పేపర్ అతికించి వుంది.
    "అంతే...!
    "య్యూఁ...! నువ్వేకదా చేసిందిది!" అంటూ స్ఫూర్తి షర్ట్ కాలర్ పట్టుకుంది రేవతి.
    "మరి, నీలా కళ్ళు జోకులెయ్యను! చేసేదేదో ప్రాక్టికల్ గా చేస్తాను" అని రేవతిని వెనక్కి నెట్టింది.
    "ఏయ్ఁ....స్టుపిడ్ గర్ల్స్! మీ ఫైటింగ్ ఆపండి! చెయ్యవే బక్కపిల్లా!"
    "చేస్తానాగు!" స్ఫూర్తిని పట్టుకోబోయింది.
    జ్ఞాపిక రేవతిని ఆపి పట్టుకుంది. కామిని స్ఫూర్తిని పట్టుకుంది!
    "మీ ఫైటింగ్ కు కాలేజే దొరికిందా? అందరూ మిమ్మల్నే చూస్తున్నారు!"
    "చూడ్నీ! దీని సంగతి తేల్చేస్తా!"
    "షటప్! మీరిద్దరూ మాట్లాడుకుంటే నామీద ఒట్టు!!" జ్ఞాపిక గట్టిగా అనడంతో ఉరిమురిమి చూసుకుంటూ ఆగిపోయారిద్దరూ.
    'థాంక్ గాడ్!'  అనుకున్నారు జ్ఞాపికా, కామినిలు.
    "ఇంటిగ్రల్ వాల్యూ' కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందే! ఇంకోసారి లాబ్ కెళ్దామా?" జ్ఞాపిక అడిగింది కామినిని!
    "అవును! నాకూ అలాగే ఉంది! క్లాస్ లో కాన్ సన్ ట్రేట్ చెయ్యలేకపోయాను" కామిని అంది.
    "అదర్థం కాకపోతే మీదెంత మమ్ బ్రెయినో మాకర్థమయిపోయింది. కదే... రేవతీ!" అంది స్ఫూర్తి.
    "అవునే! మన నలుగుర్లో మనిద్దరమే ఇంటలిజెంట్స్ అని ప్రూవ్  అయిపోయింది!" రేవతి వెక్కిరింతగా చూసింది- జ్ఞాపిక, కామినిల వైపు.
    "మనిద్దరం కాదు... నేను మాత్రమే!" స్ఫూర్తి.
    "షటప్... నేను మాత్రమే!" రేవతి.
    "ప్లీజ్! మీరు హాస్టల్ కెళ్లి తన్నుకోండి! బ్రతికున్నవాళ్ళు మాకు ఫోన్ చెయ్యండి! ఒకర్ని పోస్ట్ మార్టమ్ కు , ఒకర్ని పోలీస్ స్టేషన్ కు పపిస్తాం!" అని గట్టిగా కోప్పడి, మేం లాబ్ కెళ్లి వస్తాం! మీరు పోండి!" అని వాళ్ళను వదిలేసి లాబ్ కెళ్లారు జ్ఞాపికా, కామినీ- పోట్లాడుకుంటూ వెళ్తున్న స్ఫూర్తీ, రేవతిలను చూసి.
    "విషయం తెలీక స్ఫూర్తి అంత హ్యాపీ గా ఉంది! విషయం తెలిశాక ఇలా ఉంటుందంటావా? దాని హ్యాపి నెస్ చూస్తె దానికా విషయం చెప్పబుద్దవట్లా!" అంది జ్ఞాపిక.
    "విషయం తెలిశాక కూడా ఇంత హ్యాపీగా ఉండేలా చేయడమే మన గొప్పదనం!" అంది కామిని.
    రేవంత్, క్రాంత్ ఎదురొచ్చారు.
    "మాక్కొంచెం 'ఇంటిగ్రల్ వాల్యూ'కు  కొంచెం గైడెన్స్ కావాలి" అడిగారిద్దరూ!
    "అది చాలా ఈజీ! జస్ట్... లాజిక్ బిల్దవ్ మెయిన్. మీరు  ఆప్ సెంట్ మైండ్ లో ఉండి ఉంటారు. లేపోతే మీకు ఈజీగా అర్థమయ్యేది!" రేవంత్ అన్నాడు.
    ఏ విషయమైనా సరే- 'దిస్ ఈజ్ వెరీఈజీ!' అంటూ స్టార్ట్ చేస్తాడు రేవత్. దాంతో ఏ విషయమైనా సరే....చెప్పబోయేది 'చాలాఈజీ' అనే భావనోచ్చేసి, ఎంత కష్టమైందయినా ఈజీగా అనిపిస్తుంది. రేవంత్ లో జ్ఞాపికకు నచ్చే మొట్టమొదటి గుణమదే!
    అసలేవరయినా సరే- 'ఇది చాలాఈజీ' అనుకుని మొదలెడితే ఈజీగా ఎంత కష్టమైనా ఈజీగా చేసేయొచ్చు. 'ఇది చాలాకష్టం!' అంటూ మొదలెడితే ఈజీగ  ఉండేది కూడా కష్టంగా  మారి కూర్చుంటుంది. 'ఏవిటో ఈ  మెదడు....  దీన్నెప్పుడూ భావాలతో కట్టిపెట్టి ఆడిస్తూ ఉండాలి- తోలు బొమ్మలాట లాగా!....  అనుకుంది జ్ఞాపిక.
    "విషయం చెప్పారా స్ఫూర్తికి?" రేవంత్ అడిగాడు రిటన్ లో.
    "లేదు. ఎలా మొదలెట్టాలో తెలీలా! నువ్వు  ఈష్ కు చెప్పావా?" కామిని.
    "నాదీ అదే  ప్రాబ్లమ్!" రేవంత్.
    "ఈరోజు ఏదోలా చెప్పేయాలి!" తేల్చేసింది జ్ఞాపిక.
    'ఓ.కే.!' అనుకుని విడిపోయారు.
    వచ్చేసరికి కంగారుగా ఎదురుచూస్తోంది రేవతి.
    వీళ్ళు రాగానే ఎదురెళ్లి "ఏయ్.... స్ఫూర్తికి వన్ అవర్ లో ఐదుసార్లు వామిటింగ్స్ అయ్యాయే! వార్డెన్ కు చెప్పలా! 'కాలేజ్ క్యాంటీన్లో ఏవయినా తిన్నారా..?' అని కోప్పడతుందని మీకోసం వెయిటింగ్!" అంది. అప్పటివరకూ పోట్లాడుకున్న ఇద్దరూ ఇప్పుడు ఒకరికోసం ఒకరు కంగారుపడుతున్నారు.
    జ్ఞాపిక, కామినీలలో రియాక్షన్ లేదు.
    "ఏవిటేఁ....అలా క్యాజువల్ గా చూస్తారు దానికి వామిటింగ్ అంటే?! డీహైడ్రేషన్ అయితే? అసలే సమ్మర్ ..!" అంది రేవతి. మాట్లాడకుండా లోపలికొచ్చారిద్దరూ.
    "ఒసేయ్ఁ....చాటర్ బాక్సూ! అందరికీ టామ్ టామ్ చేస్తున్నావా- నాకు వామిటింగ్స్ అయ్యాయనీ!" కసిరింది స్ఫూర్తి.
    "అందరికేం చెప్పలా! జస్ట్.... ఇటుప్రక్క అటుప్రక్క రూమ్ వాళ్ళకీ, కారిడార్ లో ఉన్న గ్రూప్ కూ, కుక్ కూ ఆయాకూ, జ్ఞాపికాకు, కామినికే!"
    "ఇంక వదిలిందెవర్నే నువ్వు?"
    "వాచ్ మెన్ ను!"
    "మీరిద్దరూ నోరు మూసుకుంటే మేమొక సీరియస్  విషయం మాట్లాడాలి!"
    'అసలు దొంగలు పడ్డప్పటినుంచీ మీరు మాట్లాడేవన్నీ సీరియస్ గానే మాట్లాడుతున్నారు. ఇప్పుడేం స్పెషల్ గా చెప్పిమరీ ఏం  మాట్లాడక్కర్లా!" అంది స్ఫూర్తి.
    "థాంక్యూ... థాంక్యూ! నేనూ అందామనుకున్నా!" రేవతి.
    "తలుపేసిరా రేవతీ!" కామిని అంది.
    "ఎందుకే... కేబరే చేద్దామా?" రేవతి.
    "కాదు... కథాకళి! ముందు తలుపెయ్!" కామిని కసిరేసరికి తలుపేసి వచ్చి కూర్చుంది రేవతి కామ్ గా!
    "చూడు స్ఫూర్తీ! నువ్విపుడు ప్రెగ్నెంట్!" అంది డైరెక్ట్ గా కామిని.
    కిసుక్కున నవ్వింది జోక్ లా రేవతి.
    "నాకు తెలుసు" స్ఫూర్తి అంది.
    "తెలుసా..?" బిత్తరపోయారిద్దరూ.
    "అవును... తెలుసు! అంతా తెలుసు! రాత్రి ఈష్ కల్లోకొచ్చాడు. డ్యూయెట్ కూడా పాడుకున్నం! మరి, ప్రెగ్నెన్సీ రాదేంటీ...?!" స్ఫూర్తి అంది.
    "అవును... నేనే ఎవిడెన్స్! నేను రాత్రి బాత్ రూమ్ లేచినపుడు ఇది దిండును వాటేసుకుని ఏదో కలవరిస్తోంది!" రేవతి సాక్ష్యం.
    "స్ఫూర్తీ... రేవతి చెప్పేది వినండి! జోకులాపండి. నిజంగా స్ఫూర్తీ... నువ్వు ప్రెగ్నెన్సీ, అండ్ చైల్డ్ బర్త్!' అని గిన్నిస్ బుక్ లో కెక్కేస్తా!" అంది స్ఫూర్తి.
    "ఏయ్ఁ... నేనూ ప్రెగ్నెంట్ నవుతానే! నేనూ గిన్నిస్ బుక్ లో కెక్కుతానే!" రేవతి చిన్నపిల్లలా చప్పట్లు కొట్టింది.
    "నీమొహంఁ....కళ్ళద్దాల్లేందే కాలేజీ మెట్లెక్కలేవుగానీ, గిన్నెస్ బుక్కెక్కుతుందట! నీతో కాంపిటీషన్  అన్నిటికీ! క్యాడ్ బరీస్ తినడం  అనుకుంటుంది.... నాతో పోటీ అంటే! o" స్ఫూర్తి  ఎగతాళిగా నవ్వింది.
    "పిచ్చిమొహమా! నీకంటే నేను వెయ్యిరెట్లు నయం! నువ్వెంత పూరో జనరల్ నాలెడ్జ్ లో ఇప్పుడే నిరూపించుకున్నావు. కాలేజీకి మెట్లుంటాయి కానీ, ఎక్కడానికి గిన్నెస్ బుక్ కు మెట్లుండవే! డైరెక్ట్ జంప్! కళ్ళు మూసుకుని కూడా జంప్ చెయొచ్చు కదే!" సాక్ష్యం కోసం జ్ఞాపికా, కామినిల వైపు చూసింది. వాళ్ళిద్దరూ తలలు పట్టుకుకూర్చున్నారు.
    "నువ్వలాగే జంప్ లు చెయ్యి! ప్రెగ్నెన్సీ రాకపోయినా 'ఫ్రాక్చర్స్ ఇన్ ది బాడీ' లో నిన్ను గిన్నిస్ బుక్ లోకి ఎవరో ఒకరు చెప్పబోయింది.
    "ఛ....కల్లోకొచ్చాడు కదా- అని ఈష్ ను అంత విలన్ను చేయక్కర్లేదు. డ్యూయెట్ పాడేసరికే తెల్లారిపోయింది. ఈష్ కు స్టెప్పులు సరిగారాక డ్యూయెట్ లేటయింది!" అంది స్ఫూర్తి!
    'అసలు ఎలా నమ్మించాలి..., ఎలా మొదలెట్టాలి?' ఇద్దరికీ అర్తంకాలా!
    తనకు ఇంటర్ కోర్స్ అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుందని తెలిసిన ఆడపిల్లను, ఇంటర్ కోర్స్ కాలేదని అనుకుంటున్న ఆడపిల్లను, 'నకు ప్రెగ్నెన్సీ' అని మాటలతో నమ్మించమెలా? ఎలా సాధ్యం? అందుకే వాళ్ళకు వీలుకాలా! ఆరోజు వాళ్ళు ఫెయిలయ్యారు... స్ఫూర్తీనీ, రేవతినీ నమ్మించడంలో!
    పైగా.... రేవతీ, స్ఫూర్తిల దృష్టిలో పూల్సయ్యారు కూడా! "వీళ్ళీమధ్య ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకే అర్థంకావడం లేదే!" అని స్ఫూర్తీ,
    "వీళ్ళకసలు జోక్ లెలా వెయ్యాలి, ఎలా కట్ చెయ్యాలీ తెలీక, జోకులు కూడా సీరియస్ గా  ఫెయిలయిపోతున్నారే! మనం కాస్త ఎంకరేజ్ చెయ్యాలి వాళ్ళను.... జోకులు వేయడం ఎలాగో నేర్పడంలో!" అని రేవతీ అనుకుని పడుకున్నారు.
    కామినీ, జ్ఞాపికలు ఒకర్ని చూసుకుని ఒకరు తలకొట్టుకుని బోర్లాపడుకున్నారు. 'వీళ్ళకర్తమయ్యేలా ఎలా చెప్పాల్రా దేవుడా...!' అనుకుంటూ.
    రేవంత్ వేరే దారి కనిపెట్టాడు- ఈష్ విషయంలో!
    ఆరోజు బీచ్ ఒడ్డులో కూర్చున్నారు ముగ్గురూ... రేవంత్, ఈష్, క్రాంత్.
    సముద్రపు అలల పైకి తేలుతున్న నురగలు చూస్తూ రేవంత్ అన్నాడు-
    "నాకు జ్ఞాపిక అంటే ఇష్టం!" అని.
    "అది నువ్వు చెప్పకముందే తెలుసు! మేం చిన్నపిల్లలం కాదు.... అంతమాత్రం కనుక్కోలేక పోవడానికి! పైగా... ఈష్ కు స్ఫూర్తి అంటే కూడా ఇష్టం కదూ!" అన్నాడు క్రాంత్ - ఈష్ వైపు చూస్తూ!
    ఈష్ ఇసుకలో రాశాడు- "YES" అని.
    "ఒక అల వచ్చి దాన్ని చెరిపేసి వెళ్లింది.
    మళ్లీ రాశాడు- "YES"అని. ఈసారి అల రాలా! అది అలాగే ఉండిపోయింది.
    "ఇష్టం గురించి కాదు మాట్లాడేది! కష్టం గురించి!! రేవంత్ సీరియస్ గా అన్నాడు.
    "ఇష్టాలున్నపుడు కష్టాలు సహజం! అవి కూడా భరించాలి!" ఈష్ అన్నాడు.
    "ఎలాంటి కష్టమో చెబితే - మీరే 'ఇష్టం ఉన్నా భరించాల్సిన అవసరం లేదు' అంటారు" రేవంత్.
    "నో! కష్టం పంచుకోకపోతే ఇష్టపడే అర్హత లేదు" క్రాంతి అన్నాడు.
    "యస్! హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్! కష్టం  పంచుకోవడంలోనే ఇష్టం దాగుంది!" ఈష్.
    "అయితే ... కష్టం చెబుతాను! నేను పంచుకోవాలా, వద్దా.... అనేది నా క్లోజ్ ఫ్రెండ్స్ గా, నా శ్రేయోభిలాషులుగా నావైపు నుంచి ఆలోచించి చెప్పండి!" అన్నాడు బరువుగా- ఇసుకను గుప్పెట్లోంచి కిందకు జారవిడుస్తూ!
    "అంత సీరియస్ గా చెబుతున్నావంటే ఆలోచించాల్సిన విషయమే అయిఉంటుంది. చెప్పు! మేమిద్దరం నీ ఆత్మలుగా నీవైపే నిలబడి సలహా ఇస్తాం~" అన్నాడు ఈష్.
    "య్యా! కమాన్ యార్! కమౌట్!" అన్నాడు క్రాంతి.
    "జ్ఞాపిక వాళ్ళ రూమ్ లో దొంగతనం జరిగింది....తెలుసుగా?"
    "పాత విషయం!"
    "జ్ఞాపిక  నన్నూ, నేను జ్ఞాపికను ఇష్టపడుతున్నవిషయంమ్ జీవితం పంచుకోబోతామన్న విషయం మీరూహించగలరనుకుంటాను!"
    "డెఫినెట్ గా!"
    "దొంగతనం జరిగినరోజు రేప్ చేయబడింది!"
`    "షటప్! పిచ్చిగా వాక్కు! కష్టాలను సృష్టించడంలో ఇంతపెద్ద కష్టాన్నే సృష్టింఛక్కర్లేదు!" క్రాంత్ విసుక్కున్నాడు.
    "అవునూ... ఇది అబద్దం! ఎందుకంటే- రేప్ చెయ్యబడిన అమ్మాయిలా  జ్ఞాపిక మాకెప్పుడూ కనిపించలేదు. ఇంత క్లోజ్ గా  ఉన్న మానుంచి కూడా తను ఫీలింగ్స్ దాచుకొనే ఆత్మస్థయిర్యం ఆ అమ్మాయికి ఉండదు."
    "ఉంటుంది! రేప్ చెయ్యబడ్డానని తనకు తెలియనపుడు!"
    "అంటే.... తనకు తెలీదా రేప్ చెయ్యబడిందని?!" ఈష్ యాంగ్జయిటీ.
    "తెలియదు... మత్తులో తనను రేప్ చేశారు! అదీ ముగ్గురు.... గ్యాంగ్ రేప్!"
    "మైగాడ్! ఈజిట్ ట్రూ...?" రేవంత్ భుజాలు పట్టుకుని కుదిపాడు.
    "అంటే... అబద్దం చెప్పి నా జ్ఞాపికను నేను  అవమానించుకుంటానా?"
    "నో!నో!నో!నో! ఇట్స్  ఫాల్స్ న్యూస్!!" ఈష్ తల అడ్డంగా  తిప్పాడు.
    "ఫాల్స్ న్యూస్  చెప్పి మీ సింపతీ పొందాల్సిన అవసరం  నాకుగానీ, జ్ఞాపికకుగానీ ఉందా ? ఇలాంటి ఫాల్స్ బ్యూస్ చెప్పి తనను  నేను బ్లేమ్ చెయ్యగలనా?!"
    "అయితే.... పోలీస్ కంప్లయింట్లో అబద్దం ఎందుకు చెప్పింది?"
    "మా  అందరి సజెషన్ మీద!" అని, వాళ్ళా సజెషన్ ఎందుకిచ్చారో, జ్ఞాపిక తండ్రిని కూడా ఎందుకు ఒప్పించారో చెప్పి వాళ్ళను కన్విన్స్ చేశాడు.
    "ఇప్పుడు మాకీ విషయం  చెప్పాల్సిన అవసరం ఏంవుందో!"
    "ఇప్పుడు నేనేం చెయ్యాలో మీరే  నిర్ణయించాలి గనుక!" రేవంత్.
    "అది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం! నీ జీవితానికి సంబందించింది...., నీ మనసుకు సంబంధించింది! ముందు నీ నిర్ణయం చెప్పు... తరువాత మా నిర్ణయం చెబుతాం!" ఈష్ అలజడిగా అన్నాడు.
    "నేను తనను పెళ్ళి చేసుకోవడం లేదు! నా ప్రేమను విత్ డ్రా చేసుకుంటున్నాను."
    "యూ బ్లడీ! ప్రేమంటే బ్యాంక్ బాలెన్సారా- విత్ డ్రా  చేసుకోవడానికీ.., క్రెడిట్ చేసుకోవడానికీ!" క్రాంత్ గుప్పిడి తో చెస్ట్ మీద చిన్నగా కొట్టాడు.
    "తన తప్పేం లేదు..., తనకా విషయం తెలీదు. ఆలాంటప్పుడు తననెందుకురా పనిష్ చెయ్యడం? ఒకవేళ నిన్నే ఇంజక్షన్  ఇచ్చి ఇద్దరమ్మాయిలు రేప్ చేస్తే - తను నిన్ను వదులుకుంటుందా? అసలు ఆ విషయం నువ్వు ఆ ఆమ్మయికి చెప్తావా?" ఈష్ కోపంగా అడిగాడు.
    "నన్ను రేప్ చేస్తే నాకు ప్రెగ్నెన్సీ రాదురా! కానీ, అమ్మాయి కొచ్చింది!"
    ఈసారి షాక్ కు ఇద్దరూ పావుగంటసేపు మాట్లాడాలా! లేచి చెరోవైపూ వెళ్లి దూరంగా ఉన్న  పడవల మీద  కూర్చున్నారు మౌనంగా! రేవంత్ ఇసుకలో గీతలు గీస్తూ కూర్చున్నాడు.
    ముందుగా క్రాంత్ వచ్చాడు రేవంత్ దగ్గరకు. తరువాత ఈష్ వచ్చాడు.
    "ఒరేయ్ఁ.... నిజం చెప్పరా- ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావా?" క్రాంత్.
    "అవును! మనసా, వాచా, కర్మణా...! రేవంత్.
    "జీవితానికి భాగస్వామ్యం ఇవ్వాలనుకున్నావా?" క్రాంత్.  

 Previous Page Next Page