"సత్కారం సరిపోదేమో. ఆడపిల్లలను బలత్కారం చేస్తారు."
"అయితే అత్తగారింటికి పంపాల్సిందే"
"అంతేనంటారా!"
"అక్షరాలా అంతేనంటాం........"
అందరూ కుపేవైపు వెళ్ళారు. అయిదు నిమిషాల్లో నల్గురిని విరిచి పట్టుకుని వచ్చారు.
వాళ్ళు గింజుకోవాలని ప్రయత్నించారు. ఉప్పుగూడ స్టేషన్ వచ్చింది. నల్గురిని తీసుకుని వెళ్ళఇ పోలీసులకు అప్పగించారు.
"మీరు దిగండి రాధికా నెక్ట్స్ ట్రైన్ కు వెళ్దాం." అన్నాడు.
ఇకను అనవసరంగా తలదూర్చి చాలా సమస్యలు తేస్తాడేమో అనుకున్నా, అతని ధైర్యానికి ముచ్చట పడింది.
ఏం జరిగిందో, వాళ్ళేం చెప్పారోగాని, రాధిక స్టేట్ మెంటు తీసుకున్నారు. ట్రైన్ రౌడీల బాధ విరగడయింది.
తరువాత బండి ఎక్కింది.
"థాంక్స్ శ్రీనివాస్ గారూ...." అన్నది.
"థాంక్స్ దేనికి! వాళ్ళు నేరం చేస్తూ నాకంట పడాలనుకున్నాను. పడ్డారు." అన్నాడు చిరునవ్వుతో
ఆరడుగుల అందగాడా? కాడు.
నొక్ుల జుట్టువాడా! కాడు.
తెల్లని మేనిఛాయా? కాదు.
ఆ ముఖంలో, ఆ నవ్వులో, ఆ మాటలో విపరీతమైన ఆకర్షణ ఉంది. అదే అతడిని ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ఆరోజు తరువాత అప్రయత్నంగా రాధిక కళ్ళు అతనికోసం చూచేవి. అతన్ని గమనించగా, అతనికి ఉన్నవి రెండు జతల బట్టలు అయినా వాటిని శుభ్రంగా, నీటుగా ఉంచుకున్నాడు. అందరిలో చవక రకం బట్టలు వేసుకున్నాడు.
అందరిలో హుందాగా ఉన్నాడు.
ఒకరోజు పువ్వుల టీషర్ట్. గోధుమరంగు ఫ్యాంటు వేసుకునేవాడు.
మరొకరోజు లేత నీలం టీ షర్ట్ కి ముదురు నీలం కాలంరుండేది. ముదురు నీలం ప్యాంటు వేసుకునేవాడు.
రెండూ కొత్తగా మడత అప్పుడే విప్పినట్టు ఉండేవి అవి చూస్తే ఆమెకెంతో ముచ్చట. 'అబ్బ ఎంత బాగా మేంటేన్ చేస్తాడు' అనుకునేది.
ఒకరోజు ఇక ఆగలేక అతని దగ్గరగావెళ్ళి చిరుగా నవ్వింది.
"హల్లో! మీరా రాధికా! యెప్పుడు పరీక్షలు!"
"రేపటినుండి ప్రిపరేషన్ హాలిడేస్. ఇంకా ఇరవై రోజులుంది పరీక్ష."
"బాగా చదువుతున్నారా!"
"బాగానే చదువుతున్నాను" అన్నది.
అలా పరీక్షలకు ప్రిపేరవుతూ, అతన్ని చూడలేదు. ఆమె మనసెందుకో అతన్ని చూడాలని తహ, తహలాడేది. ఆ క్షణంలో అతను తమదగ్గర పాలేరుగా పనిచేసినవ్యక్తి కొడుకనిగాని, పేద అనిగాని ఆలోచన రాలేదు. తమిద్దరిమధ్య ఉన్న అంతస్తు బేధం గుర్తుకురాలేదు.
ఆఖరి పరీక్ష రాసినరోజు, బండి కేన్సిల్ అయింది. ఏం చేయాలో తోచలేదు రాధికకు.
తనమీద తనకే కోపం వచ్చింది.
తండ్రి జీపు తీసుకుని వెళ్ళమన్నాడు. రైలుబండిలో వెళ్తే శ్రీనివాస్ ను చూడవచ్చని, కనిపిస్తాడేమోనన్న ఆశ.
ఆమెకేం పాలుపోలేదు. ఫ్లాట్ ఫార్మ్ కు అవతలివైపు దిగుతున్న శ్రీనివాస్ కనిపించాడు.
"శ్రీనివాస్ గారూ! ఏమండోయ్......" చప్పట్లు కొట్టి పిలిచింది.
యెవరన్నట్టు చూచాడు.
"హల్లో రాధికా! యెలా చేసావ్ ఆన్సర్స్."
"ఫస్ట్ క్లాసు వస్తుంది. మీకు సెలవలు లేవా!"