సుహాసిని, సుధీర్ ఇద్దరూ చక్కగా చదువుకున్నవాళ్ళే. మంచి హోదాలో వున్న వ్యక్తులే. వాళ్ళచంటి అబ్బాయి మాటలువింటే "ఆ అబ్బాయి, వీళ్ళాబ్బాయా లేక మరొకరి పిల్లవాడా" అనిపిస్తుంది. ఆ అబ్బాయి మాటలన్నీ యసగా వుంటాయి. ఈ మాటకి ఒత్తులు పలకడు. మొదట్లో ఏదో అనుకుని వదిలేశారు. తరువాత ఆ బాశే అలవాటు అయిపోయింది. వాస్తవానికి ఆ అబ్బాయి ఒత్తులు పలలేకకాదు అమ్మా_నాన్నళకంటే పనిపిల్ల దగ్గర ఎక్కువ పెరగాడంతో ఆ అమ్మాయి బాషే అతనికి అలవాటు అయింది. ఆ పరిస్తితి మారడానికి కొంచెం శ్రమ పడాల్సిండేమరి!
స్పష్టంగా. సరిగ్గా మాటాడలేక పోవడానికి మరికొన్ని కారాణాలు కూడా వున్నాయి, పుట్టుకతో చెవుడువున్నా, బుద్ధిమాద్యం వున్నా, మెడదూకి గాయం తగిలినా, పిల్లలు ఎదిగే పరిసరాలలో సరిగ్గా మాట్లాడే వరు లేకపోయినా వారి వారి ఉచ్చారణలో, మాట్లాడే తీరులో, మాట స్పష్టతలో తేడా వస్తుంది. అన్ని అవయవాయాలు చక్కగా వున్న పిల్లలు సుమారు 9 నెలల వయస్సు నుండి మాట్లాడాటారు.7వసంవత్సరం వయస్సు వచ్చేసరికి మాట్లాడటంలో, మాటల ఉచ్చరణలో పూర్తీ పరిపక్వత వస్తుంది. ఒకవేళ దీనికి అనుగుణంగా వారిలో అభివృద్ది లేకపోతే వారిలో "స్వీచ్ ప్రాబ్లమ్" వుందని గుర్తించాలి.
ఎదిగే పిల్లల్లో చెవుడు వున్నట్లయితే వాళ్ళు మాటలని సరిగ్గా వినలేక, మొదట్లోనే మరొక ఉచ్చారణని ఏర్పరచుకుంటారు. ఉచ్చారణ దోషాలు ఎక్కువ వున్నప్పుడు అ పిల్లల్లోవునబడటం తక్కువ వున్నదేమో గమనించాలి. చెవుడును ఆడియోమీటా ద్వారా కనుక్కోవచ్చు. చెవుడు తీవ్రతనిబట్టి వినబడటానికి చెవికి యంత్రాన్ని (హియరింగ్ ఎయిడ్) అమర్చవచ్చు. తరువాత మాట ఉచ్చారణని తక్కిన మాటలని లీఫ్ రీడింగ్ (పెదవి చదువు) ద్వారా నేర్చవచ్చు.
కొందరు పిల్లలలోమనో వికాసం వుండడు. ఇలాంటి వారిలో వారి మేధస్సుని బుద్ధి పరీక్ష చేసిన వారికీ శిక్షణ ఇవ్వవచ్చు దీన్ని "ఐ క్యూటెస్టు " అని అంటారు. "ఐ_క్యూ" 40కంటె తక్కువ వున్న పిల్లలు మాటలు నేర్చుకోలేరు.
కొందరు మగపిల్లలు 14 ఏళ్ళు వచ్చినా అడ పిల్లలాగా కీచు గొంతులో మాట్లాడాతారు. అలా మాట్లాడటానికి కారణం మనసికామే. మానసిక చికిత్స వాక్ చికిత్స ద్వారా ఆ కీచు గొంతు పోగోట్టవచ్చు.
స్వర పెటికకు కేన్సరు అంటు వ్యాధులు వచ్చినప్పుడు స్వరపేటికను తీసివెయవలసిని వస్తుంది. దాంతో వీరు మాట్లాడలేకపోతారు. వీరు కూడా కుత్రిమ స్వరపేటిక ద్వారా తిరిగి మాట్లాడవచ్చు.కుత్రిమ స్వరపేటికచిన్న ఎలక్ట్రానిక్ సాధనం.
దీనిని గొంతుపైన వుంచుకున్నట్లయితే దీని నుంచి శబ్దం గొంతుకలోకి వెళ్ళి మాట్లాడాటానికి వీలుపడుతుంది. ఈ పద్దతి ఇలా వుండగా అన్నవాహిక మాటలు అనే మరొక విధానంవుంది. ఈ విధానంలో గాలిని అన్నవాహిక లోనికి మింగి త్రేపులాగా వెలుపలకి తీసుకొనిస్టూ నోటిలో కదలికలు కదిలించడం ద్వారా మాటలు పలకవచ్చు. ఆ విధానాన్ని కూడా సాధన ద్వారా తేలికగా నేర్చుకోవచ్చు .
సరిగ్గా మాట్లాడలేకపోవడానికి నత్తి ఒక కారణం. నత్తి ప్రతినూరుమందిలో ఒకరికి వుంటుంది. నట్టికి ముఖ్యంగా మానసిక కారణమే మూలం నత్తి రెండున్నర నుండి నాలుగున్నర సంవాత్సరాలలోపు ప్రారంభం అవుతుంది. తర్వాత నత్తి మాట్లాడటం అలవాటుగా మారుతుంది. నత్తిని వాక్చికిత్స, మానసిక చికిత్సలద్వారా బాగుచేయవచ్చు.
కొందరు వ్యక్తులు లారీకి లాలి అనీ, విజయవాడకి, విజవాతనీ, బాసుకి బత్తుఅనీ పలకడమేకాకుండా ఒక శబ్దానికి మరొక శబ్దం పలుకుతూ వుంటారు. పక్షపాతం వంటి వ్యాధులు రావడంవల్ల, పరిసరాలలోపంవాళ్ళా ఉచ్చారణలో దోషాలు ఏర్పడతాయి. వ్యాధులు కలిగినపుడు ఉచ్చారణలో లోపం ఏర్పడితే మరికొందరికి మాట్లాడటంలోనే లోపం యేర్పడవచ్చు.
మెదడుకి రక్త ప్రసరణ సరిగ్గాలేక పోవడంవల్ల మాటలు పూర్తిగా పోవచ్చు. ఇటువంటప్పుడు ఇంకొందరితో మాటలు అర్ధం చేసుకోవడంలో లోపం ఏర్పడితే మరికొందరికి మాట్లాడటంలోనే లోపం యేర్పడవచ్చు. మెదడుకు తగిలిన గాయాన్ని బట్టి, అలాంటివారికీ మాటలు రావడం రాకపవడం ఆధారపడి వుంటుంది.
ఎవరైనా సరిగ్గా మాట్లాడకపోతూ వుంటే మాటల్లో స్పష్టత లోపిస్తే, వయస్సు కు తగినట్లు మాట్లాడకపోతే వెంటనే "స్పీచ్ ధేరపిథిస్ట్" కి చూపించాలి. వీరు తగిన పరీక్షలు జరిపి "స్పీచ్ ప్రాబ్లమ్" వుంటే వాక్చికిత్స పద్దతుల ద్వారా సరిగ్గా మాట్లాడేతట్లు కృషిచేస్తారు. అంతేగాని ఏ పిల్లవాణికైనా మాటలు రాకపోయినా, అపరేషనుచేసి స్వరపేటిక తొలగించినా "మా దురదృష్టం" అంటూ కూర్చోకూడదు.