Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 10

       
                                   కచ్చడాల్ కట్టించిన సందడేకాని
                       కానున్న ప్రమాదాలు కనబడవు


   మరుగుబిళ్ళలకు దారితీసినవి ఈ కచ్చడాలే. ఈ మరుగుబిళ్ళలు ఎటువంటి ఆకారాలలో ఇప్పుడున్నా ఆ రోజులలో ఇవి రావిఆకు లాగా ఉండేవి. అదియే కచ్చడాలకు సరిఅయిన ఆకారము "పిప్పలదనము" అని ఆంధ్ర సంస్కృత కవులు వర్ణించినది. ఇదే ఫిగ్ లీఫ్ (Fig Leaf) అని జపానులో స్నానసమయాలలో ఉపయోగించినది ఇదే. ఈ రావి ఆకు ఆకారాలలో ఉన్న కచ్చడాలను బిగించి, ఇనుపరేకు ఒడ్డాణాలతో బంధించి విడిచిపెట్టేవారు స్త్రీలను. ఈ విధంగా వారి పాతివ్రత్యాన్ని భద్రపరిచేవారు.
    శరీరానికి ఈ ఇనుపరేకులు ఒత్తుకుని బాధించకుండా ఉండడానికి ఒక ఉపాయం చేసేవారు. రేకులకు లోపలిభాగం-అంటే శరీరానికి తగిలి ఉండే భాగంలో-మెత్తని తోలుగాని, గుడ్డగాని అతికించేవారు. ధనమున్న వారు మరింత అందంగా ఉండి, బాధ అన్నదే లేకుండా వుండేటట్లు చేసేవారు.
    ఇకను ఈ ఒడ్డాణాలను బిగించి తాళం వెయ్యడానికి, శిల్పులు తమ తెలివితేటలన్నిటినీ ఉపయోగించేవారు. ఎవరుగాని, ఎలాంటి మారుతాళంతోగాని, ఈ బీగాలను తెరవడానికి వీలులేకుండా ఉండే విధంగా కొత్త కొత్త రకాల తాళాలు తయారుచేసేవారు.
    ఇలాంటి అద్భుతమయిన తాళం చేయించాడట ఒకడు. భార్యకు ఈ కచ్చడం కట్టాడు. తాను ప్రయాణంమీద పోయాడు. దారిలో పెద్ద ప్రమాదం సంభవించింది. ప్రాణాలవు కాచుకోవటమే కష్టమయింది. తనకున్న సర్వస్వం నష్టపోయాడు. ఈ కచ్చడం తాళం గూడా పోయింది. ఇంటికి తిరిగివచ్చాడు. పెళ్ళాం పతివ్రతగానే వుంది. వేసినతాళం వేసినట్టే వుంది. కాని- ఈ భర్త ఆ తాళం తీయడం ఎలాగ? ఆ పతివ్రతతో కాపరం చేయడం ఎలాగ?
    పాపం! ఏమీతోచింది కాదు. ఈరుకోవడానికి వీలేలేదు. కాపరానికే నీళ్ళధార. ఇంత మహాప్రయత్నంతో కాపాడుకునవ్న తనభార్య సౌఖ్యం తనకు తప్పుతుంది. బయటకి చెప్పితే నలుగురూ ఏమంటారు? ఇంత మంచి ఇల్లాలు మీద గూడా అనుమానం పడ్డాడా అంటారు. నిందలపాలయిపోతాడు. ఏదో రహస్యంగా ఏడుస్తామంటే అఏది నిర్బేద్యంగా ఉంది ఈ కచ్చడం!
    శిల్పకారుడికయినా తెలియక తప్పదు. పాట్లుపడ్డాడు. ప్రయత్నించాడు. బదద్లు కొట్టడానికి ఏమేమో చేశాడు. వీలులేకపోయింది. తుట్టతుదకు ఒక విశ్వకర్మ వృద్ధుడిని పిలిచి సహాయం చెయ్యమన్నాడు. తాను చేసిన దోషానికి తగిన ప్రతిఫలం అనుభవించాడు.
    అన్నిచోట్లా ఇంత సధర్మంగానే సాగుతుందా పాతివ్రత్య సంరక్షణం! ఇంకొకడు ఈ తాళంబిగించి యాత్రమీద పోయాడు. ఇంటిలోని ఇల్లాలికి ఒక యువకుడి మీద ప్రేమ. వాడిని పిలిచింది. ఈ కచ్చడం సంగతి తెలియజేసింది. ఆ .యువకుడు ఒక శిల్పిని మంచి చేసుకున్నాడు. ఒక చక్కని మారుతాళం చెయ్యించాడు. ఎన్నాళ్ళనుంచో ఉవ్విళ్ళూరుతూ వున్న ఆ కాంత సౌఖ్యం అవిచ్ఛిన్నంగా అనుభవించాడు. భర్త వచ్చినప్పటికీ ఆ ఇల్లాలు ఇనుపకచ్చడంతో సురక్షితంగానే వుంది. కచ్చడం, తాళం అన్నీ వేసినల్టే వుందిగాని, తన ఇల్లాలి శీలం మాత్రం మారిపోయింది. ఈ సంగతి ఎలా తెలుస్తుంది, ఆ భర్తకి పాపం!
    ఇంకొక మహానుభావుడు ఇలాగనే కచ్చడం బిగించి వెళ్ళిపోయాడు. పాపం! ఆ ఇల్లాలు పరమసాధ్వి. ఆ కచ్చడాన్నే తన భర్తకంటే ఎక్కువగా పూజిస్తూ వుండేది. ఆ భర్త ఏదో ఓడ ప్రమాదం వల్ల మరణించాడో మాయమయిపోయినాడో తెలియదు.
    ఈ కాంత ముసలి అయిపోయింది. భర్తకోసం చూచిచూచి వాచిపోయింది. రోగి అయింది. తుదకు చచ్చిపోయింది. కూడను తన కచ్చడం శరీరం మీదనే వుండిపోయింది. తీసేవాడెవడు? ఎలాగ ఆ ఇల్లాలు బొందెలో ప్రాణం వున్నంతవరకు ఆ కచ్చడాన్ని తీయనిస్తుందా?
    ఆ దేశ ఆచారం ప్రకారం ఆమె శరీరాన్ని అలాగే పెట్టలో పెట్టి పాతిపెట్టారు. కాంతతో కచ్చడంగూడా పాతేశారు. శరీరం శిధిలం అయిపోయింది. భూమిలో ఎముకలు మాత్రం నిలిచాయి, కంకాళరూపంగా. కాని, ఈ కచ్చడం మాత్రం అవిచ్ఛిన్నంగా అలాగే వుంది భూగర్భంలో.
    కొన్ని శతాబ్దాల తరువాత, ఆ స్థలం తవ్వినప్పుడు ఈ స్త్రీ కంకాళం అంతా కనబడ్డది. జాగ్రత్తగా ఆ ఎముకలు, ఆ పెట్టె అంతా చూడగా అది ఒక స్త్రీ కంకాళం అనీ, ఈ ఇనుపకచ్చడంతోనే మరణించిందనీ అంతా బోధపడ్డది. ఈ కచ్చడం నేటికీ జాగ్రత్తపరచి వుంచారు.

 Previous Page Next Page