"ఖస్ ఉమ్మక్!" అంది చిలక తిడుతున్నట్లు.
అది ఏమంటోందో అర్ధం కాలేదు సుదీరకి.
"అమ్మయ్ గారూ! అమ్మయ్ గారూ!" అని ఏడుపు గొంతులో వచ్చాడు ఛోటూ. "ఆ చిల్కా నా చిట్కెన్ వెల్ కోర్కి పారిపోయింది, అమ్మాయ్ గారూ!"
"ఖస్ ఉమ్మాక్!" అంది చిలక తిడుతున్నట్లు.
అది ఏమంటుందో అర్ధం కాలేదు సుధీరకు.
"ఆ" అని నోరెళ్ళబెట్టాడు ఛోటూ. "విన్నారా అమ్మయ్ గారూ! ఇది అరబిక్ లో ఏమంటుందో!"
"అరబిక్ లోనా! ఏమంటోంది?" అంది సుదీర కుతూహలం ఆపుకోలేక.
"ఏంటి అంటే , నీ.........యా అల్లా! చెపితే మీరూ చెప్పు తీస్క కొడ్తారు! ఇది చిల్కా కాదు. సైతాన్! సైతాన్! " అని బేజారుగా వెళ్ళి పోయాడు.
హఠాత్తుగా గుర్తు వచ్చినట్లు "భరత్ భరత్ భరత్ భరత్" అంది చిలక చెప్పలేనంత వేగంతో.
నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది సుదీర.
"ఒక మనిషికి మరో మనిషి మీద ఇష్టం కలగడానికి రకరకాల పరిస్థితులు కారణం కావచ్చు."
తనకు భరత్ మీద ఇష్టం కలగడానికి ఆ చిలక కారణమవుతుందని సుదీరకి తెలియదు.......అప్పట్లో.
----------
ఆ రోజు లంచ్ అవర్ కి ముందే క్లాసులన్ని పూర్తీ అయ్యాయి భారతికి. ఇంటికి వెళుతూ, చల్లటి మంచినీళ్ళు తాగి వెళదామని కాంటిన్ లోకి వచ్చింది.
ఆమె వచ్చేటప్పటికి కాంటిన్ లో ఎవరూ లేరు. దయాకర్ తప్ప. అతను సాయంత్రం మసాలా వడలు చెయ్యడానికి పప్పు రుబ్బుతున్నాడు. భారతిని చూడగానే సంతోషంగా లేచి వచ్చి, మంచినీళ్ళు అందించాడు.
"కాఫీ తీసుకుంటారా?"
"థాంక్స్, వద్దు, ఇంటికెళ్ళి పోతున్నాను."
"మీకు చెప్పానా, భారతిగారు! నా వ్యాపారం జాంగ్రీ పాకంలా బాగా సాగిపోతోంది.....మీ స్టూడెంట్స్ అందరూ అబిమానం చూపిస్తూ ఉండడం వల్ల! అందుకని ఓ పక్కగా పక్కా షెడ్డు వేయించి, మిల్సు సెక్షన్ కూడా పెట్టేద్దామనుకుంటున్నాను."
"వెరి గుడ్!" అంది భారతి.
"అప్పుకోసం అప్పుడే అప్లికేషన్ కూడా పెట్టేశానండోయ్!"
"అలాగా.....బెస్టాఫ్ లక్!"
"మీ నోటితో అన్నారు. ఇంక జరిగి తీరుతుంది. మీ మీద నాకు చాలా గురి భారతిగారు! అప్లికేషన్ కూడా మంచి శుభప్రదమైన రోజు చూసి పెట్టాలెండి!"
"ఎప్పుడూ? మొన్న దశమి....."
"దశమి కాదూ. దసరా కాదూ? మీరు పుట్టిన రోజు కంటే ఉత్తమోత్తమమైన రోజేముంటుంది చెప్పండి! మీరు ఎ రోజున పుడితే ఆ రోజుకే పవిత్రత వచ్చేసిందన్న మాటే........అది అష్టమి అయినా, అమావస్య అయినా సరే!"
కాదన్నట్లు సిగ్గుగా తల వూపి, పక్కచుపులు చూసింది భారతి."
లోను రావడం ఖాయమండి. మనది పెద్ద హొటలయిపోతుంది. ఆ తర్వాత నేనూ పెళ్ళి చేసేసుకుని, ఇడ్లి, వడా అనుకుంటూ నిశ్చింతగా వుంటాను.
"అయితే సంబంధం నిశ్చయమయిండన్నమాట."
"సగం నిశ్చయమైపోయిందండి. నేను ఇష్టపడ్డాను. ఆ అమ్మాయే ఒప్పుకోవాలి!"
నవ్వింది భారతి. :"ఇంతకీ ఎవరా అమ్మాయి.?"
దయాకర్ జవాబు చెప్పకుండా భారతి స్లిప్పర్స్ వంక చూశాడు. "చెప్పులు బాగున్నాయి. ఎక్కడ కొన్నారండి?"
"మాములువే.....బాటా."
"రబ్బరాండి? లేదరా?"
"ఫోం లేదరనుకుంటాను."
"ఈడ్చి పెట్టి కొడితే బాగా దెబ్బ తగులుతుందాండి?"
నవ్విందిభారతి. "నాకెలా తెలుస్తుంది?"
"మీది కుడి చేతి వాటమా, ఎడమ చేతి వాటామా?"
"కుడి చేతి వాటమే! అయినా, మీరు ఇష్టపడిన అమ్మాయి ఎవరని అడిగితే చెప్పకుండా ఇవేం ప్రశ్నలూ?"
"పాపం నా చెంప అంటే నాకు చాలా ప్రేమకదండీ. నేను ఇష్టపడిన అమ్మాయి ఎవరో చెప్పగానే మీరు నా చెంప పగల గోడితే అది పూరిలా ఉబ్బిపోతుందేమోనని దిగులండి. అందుకనే ముందు జాగ్రత్త పడుతున్నాను."
"మధ్యలో నేనెందుకు కొడతా....." అని సగంలోనే ఆపేసి, అతని అంతరార్ధం అర్ధం కాగా తల వంచేసుకుంది భారతి.
"భారతి గారూ!" అన్నాడు దయాకర్.
".........."
"నేను హద్దు మీరి మాట్లాడి వుంటే క్షమించండి. "మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను" అని చెప్పడానికి సాహసించే ముందు నా వివరాలు, ముఖ్యంగా నా లోపాలూ చెప్పుకోవడం ధర్మం. నేను అనాధని భారతిగారూ. చదువు తిండి పెడుతుందంటారు. నాకు చదువు లేదు. అయినా, నేను తిని , నలుగురికి పెడుతున్నాను- ఈ హోటల్ వల్ల!"
కనురెప్పలు అంత బరువుగా ఉంటాయని ఆరోజు దాకా భారతికి తెలియదు. చూపులు వాలిపోయాయి. తల వంచుకుని వింటోంది.
"సరిగ్గా ఐదేళ్ళ క్రితం , భారతిగారూ! నేను తిండికి లేక అష్టకష్టాలు పడుతూ అల్లల్లాడి పోతుంటే ఒకతను దేవుడిలా ఆదుకుని , డబ్బు సాయం చేసి ఈ చిన్న హొటలు పెట్టించాడు. నాచేత. నాకే కాదు ఇంకా చాలా మందికి సాయం చేశాడు అతను. అన్ని గుప్తదానాలు. అయినా నాకు తెలిశాయి. తన పేరు ఎవరికి చెప్పవోద్దని మరి మరి హెచ్చరించాడు అతను. కానీ చెప్పకుండా ఉండలేను. భారతిగారూ! అన్ని భారాల కంటే కృతజ్ఞత భారాన్ని భరించడం కష్టం. మాట తప్పి పాపం ముతాకట్టుకున్నా సరే చెప్పేస్తున్నాను ఇవాళ! అతను మీ అన్నయ్య విజయ భరత్! తన నృత్య ప్రదర్శనకు మొదటి పారితోషకంగా వచ్చిన డబ్బుని నాకు ఇచ్చేశాడు."
భారతి ముఖం సంతోషంతో వికసించింది.
"పెద్ద ఇంటి పిల్ల అయిన మీ మీద ఆశలు పెట్టుకోవడం తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అవుతుందేమో నాకు తెలియదు భారతిగారూ! నేను ఆకాశాన్ని తెచ్చి మీ అరచేతిలో పెట్టేస్తానని అరిచి కేకలు పెట్టను. కానీ, నన్ను చేసుకుంటే తీపి, పులుపూ, ఉప్పూ, కారం , వగరు, చెదూ- అన్ని కలిసిన నవరసభరితమయిన జీవితాన్ని వండి వడ్డిస్తాను మీకు. చిన్న సంసారం, చిన్న చిన్న కష్టాలు..........
పూరిపాకలో ఉండే ఈ పూర్ మాన్ ని పెళ్ళి చేసుకోవడమా అని చిరాకు పడకండి భారతి గారూ. మీ కనురెప్పల పందిరి కింద నాకు ఇంత ఆసరా ఇస్తే, ఆ ఉత్సాహంతో పుంజుకుని ఆకాశం దాకా అల్లుకు పోగలను నేను భారతిగారూ!"
అప్పటికే పది అడుగులు వేసి మెల్లిగా వెళ్ళిపోతోంది భారతి.
___________
విశాలంగా వుంటుంది సుదీర గది. లేత నీలం రంగు వేసిన గోడలు, పెద్ద పెద్ద పిక్చర్ విండోస్. వాటికీ పలచటి తెరలు. దానికి అటాచ్ డ్ బాత్ రూమ్ ఉంది.
గులాబి రంగు బాత్ టబ్ లో బెతింగ్ సాల్ట్స్ వేసి, బబుల్ బాత్ పౌడరు కలిపి, వెచ్చటి నీళ్ళలో ఉద్రుతమైన నురుగు రాగానే దానిలో పడుకుని తీరిగ్గా చాలాసేపు స్నానం చేసింది సుదీర.
స్నానం పూర్తీ అయ్యాక పెద్ద టర్కిష్ టవల్ తో ఒళ్ళు తుడుచుకుంటూ వచ్చి అక్కడే వున్న చిన్న వెయ్యింగ్ మిషిన్ మీద నిలబడి వెయిట్ చూసుకుంది. నలబై ఎనిమిది కిలోలు. తన పొడుగుకి తగిన వెయిట్ అది.
గోడలకు నాలుగువైపులా ఉన్న నిలువుటద్దాలలో తన ప్రతిబింబం చూసుకుంది సుదీర- ముందునుంచి, వెనుకనుంచి పక్కల నుంచి తన రూపం కనబడుతోంది.
"ఎక్స్ లెంట్ ఫిగర్!" అని తనకు తానె కాంప్లిమెంట్ ఇచ్చుకుంది సుదీర. బాగా పొడుగ్గా వున్న కాళ్ళు, బలంగా వున్న తొడలు, ప్లాట్ గా ఉన్న పొట్ట, లోతైన నాభి, సన్నటి నడుము, భారంగా ఉన్న వక్షం, శంఖం లాంటి మెడ మీద చందమామ లాంటి ముఖం.
గదిలో టి.వి. అన్ చేసి వుంది. మెల్లిగా ఏదో ప్రణయ గీతం వినబడుతోంది.
"గుట్టు తెలిసిందిలే- చెట్టు చాటుందిలే!"
అంత గొప్పగా లేని, అలవాటయిపోయిన సాహిత్యం, అరిగిపోయిన పదాలు.
అయినా రొమాంటిక్ గా ఉన్న ఆ వాతావరణంలో అది కూడా బాగానే ఉందనిపించింది. తన ప్రతిబింబంతో తనే ప్రేమలో పడిపోతానేమో అనిపించి, చిన్నగా నవ్వుకుంది సుదీర.
ఆ లక్షణాన్నే సైకాలజీ లో నార్సిసిజమ్ అంటారు!