Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 9

 

    "మెహదీపట్నంలో శిరీష అనే అమ్మాయ్ తనను ప్రేమించే బాయ్ ఫ్రెండ్  ఫాదర్ తో లేచిపోయింది.
    ఇద్దరూ మతి పోయినట్లు చూశారు.
    "ఇది షాకింగ్ న్యూసా?"
    "షాకింగ్ న్యూస్ అనే హెడ్డింగ్ తోనే ఆ న్యూస్ 24 గంటల నుంచీ ఏకదాటిన స్క్రోలింగ్ వేస్తోందో చానెల్ -"
    "మహా తుగ్లక్ లాగున్నాడేవడో గానీ - ఆ చానెల్ పేరేంటి ?"
    "తుగ్లక్ చానెల్-"
    కారు జూబిలీ హిల్స్ లో ఓ పెద్ద బంగళా ముందాగింది. వాచ్ మెన్ వచ్చి ముసుగు మనిషితో మాట్లాడి -- తర్వాత ఫోన్ లో ఇంకెవరితోనో మాట్లాడి గేటు ఓపెన్ చేశాడు.
    కారు విశాలమయిన గార్డెన్ మధ్య నుంచి బంగళా పోర్టికో లో కెళ్ళి ఆగింది.
    "దిగు ' అన్నాడొకడు భవానీశంకర్ ని.
    భవానీదిగి ఆ బిల్దింగంతా చూశాడు.
    "అడ్రస్ చెప్తే నేనే వచ్చేవాడిని కదా! అనవసరంగా ఇంతమంది మనుషులు , గన్ లు, కారు, ఆ ముసుగులు -- క్రిమినల్ వేస్ట్ బ్రదర్ ! దేశం అసలే అర్దికమాన్యంలో మట్టికొట్టుకుపోతోంది-"
    భవానీ మాటలు వినిపించుకోకుండా "కమాన్" అన్నాడు ముసుగు వీరుడు.
    భవానీ అతని వెనకే లోపలకు నడిచాడు.
    విజిటర్స్ రూమ్ చాలా పెద్దదిగా ఉంది.
    కాసేపు వెయిట్ చేశాక లోపల్నుంచీ ఓ సూట్ వాలా వచ్చాడు.
    ముగ్గురూ లేచి నిలబడ్డారు.
    "ఇతనే రాకేష్ సార్ - చాలా శ్రమపడి ట్రేస్ చేశాం !" చెప్పాడు ముసుగు వ్యక్తీ ముసుగు తీసేస్తూ.
    "హాయ్ రాకేష్ " అంటూ భవానీశంకర్ తో కరచాలనం చేశాడు సూట్ వాలా!"
    "అయాం జైరాజ్! నేనూ మీ నాయనా జిగిరీ -కాలేజ్ డేస్ లో కెళ్ళి దోస్తానా అనుకోరాదు ? ఇక ఈ బిజినెస్ లోపద్దాక అదివరకు లెక్క కల్సుకొనికేడవుతది! అయినా గాని మీ నాయన సంవత్సరానికి ఒక్క దినమయినా అమెరికా కెళ్ళి ఈడ కొచ్చి నాతొ ఖుషామత్ జెయాలె! గంత జిగిరీ అనుకో -"
    "సమాజ్ గయా బాస్! స్నేహమేరా జీవితం - స్నేహమేరా శాశ్వతం టైపన్నమాట!"
    "మంచిగ జెప్పినావ్ - ఒక్క నిమిషం! నేను ఈ బాచ్ ని పంపించేసి వస్తా! అప్పుడు ఖుల్లం ఖుల్ల మాట్లాడుతోవచ్చు - ఏమంటున్నా?"
    "ఒకే సార్! కారీ యాన్-"
    సూట్ వాలా ఆ ముగ్గురు వ్యక్తులూ బయటి కెళ్ళారు. భవానీ తలుపు దగ్గర కెళ్ళి వాళ్ళ మాటలు చెవులు రిక్కించి విన్నాడు. ఆ ముసుగు వీరులు డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళనీ, రాకేష్ ని వెతికి పట్టుకుని తన ఫ్రెండ్ జైరాజ్ కి అప్పగించడానికి పదిలక్షలు ఇచ్చాడనీ అర్ధమయిందతనికి!
    సూట్ వాలా వాళ్ళను పంపించి లోపలికొచ్చాడు.
    "సో - హౌ ఈజ్ లైఫ్ మై డియర్ యాంగ్ మేన్?" అడిగాడు జైరాజ్ .
    "ఓవర్ ఫ్లోయింగ్ విత్ హపీనేస్ సర్-"
    "ఓ - ఒండర్ పుల్ ! అన్నట్లు -- వాళ్ళు నిన్ను గన్ పాయింట్ తోటి ఈడికి తీసికొచ్చినందుకు -- అయాం ఎక్స్ ట్రీమ్లీ సారీ -- " నొచ్చుకుంటూ అన్నాడతను.
    "ఏం ఫర్లేదు సార్ - నేను వాళ్ళ పూలిష్ నెస్ ని చాలా ఎంజాయ్ చేశాను -"
    అతను షాకయ్యాడు.
    "వ్వాట్ / ఎంజాయ్ చేసినావా?"
    "అవున్సార్-"
    "వాళ్ళలా గన్ పెడితే మళ్ళా పరేషానవలేదా?"
    "జర్రంతా కూడా అవలేద్సార్-"
    "అరె - చానా డేర్ డెవిలున్నావ్ నువ్వు -"
    "ఏం జేయ్యాలి సార్! అదత్ సే మజ్ బూర్"
    జైరాజ్ పగలబడి నవ్వాడు.
    "వావ్! సూపర్ డైలాగులు ఇడుస్తున్నావ్ రా భయ్ నువ్వు. ఈ ఉర్దూ ఏడకెళ్ళి నేర్చినావ్?"
    "ఓల్డ్ సిటీ లింక్స్ అంకుల్-"
    "హాయ్ రే - నేను భీ గంతే! జందగీ మొత్తం ఓల్డ్ సిటీ లో గుజరాయించినా నన్నట్లు -- ఖానా, పీనా - అంతా గాడ దోస్త్ ల తోనే - ఇగో ఆదట్లుండనీ గానీ - రా! ఈడ కూసో - గిప్పుడు మనం దిల్ ఖులాయించి ఖుల్లమ్ ఖుల్లా మాట్లాడుకోవాలె ! ఏమంటున్నా?"
    'అయ్ లివిట్ అంకుల్!"
    "సంగతెందంటే - నువ్ ఇల్లొదిలి పోయినావని మీ నాయన నాకు అమెరికా కెళ్ళి ఫోన్ జేసిండు . ఇక నీతాన దాచెడిదేమున్నది - నీ లవ్ స్టోరీ గురించి గూడా జెప్పిండు ! ఇగో - చూడు రాకేష్! నీగిట్టా హైదరాబాద్ లోనే ఉండాల్నంటే - నా ఇంట్లో ఉండు! గంతనే గానీ స్లమ్ లోనూ, లేబర్ కాలనీల్లో ఉండొద్దు - ఏమంటున్న?"
    "మీరు జెప్పినాక కాదనేట్లా అంటానంకుల్-"
    "గుడ్! ఇగో - మీ నాయనకు ఒక్కడే కొడుకువ్ రా నువ్వు! అమెరికాలో కోట్లు కమాయించిండు మీ నాయన! దేన్నీ గురించి? మీ ఫామిలీ మొత్తం హాపీ గుండాల్ననే కదా- సమజయిందా?"
    "సూపర్ గా అయింది -"
    'అయితే ఇయ్యాల్టి కెళ్ళి నా ఇంట్లోనే ఉంటావా?"
    "నువ్ గెంటినా ఫోనంకుల్-"
    'చానా హుషారున్నావ్ రా భయ్ నువ్వు - గింత మంచిగ రెస్పాన్స్ ఇస్తున్నావ్ - మరి మీ నాయన నీ గురించి గట్ల పరేషానవుతాడింది?"
    "నాకు అదే సమజ్ కావటం లేదనకుల్--"
    "ఏంది ? రేవర్సోస్తున్నావా/ ఇలారా సబిత ఆంటీని ఇంట్రడ్యూస్ జేస్త -" అంటూ అతని భుజం మీద చెయ్యేసి లోపలి హాల్లోకి తీసుకెళ్ళాడు. క్రోటన్స్ మొక్కలు ట్రిమ్ చేస్తోన్న అంటీ వాళ్ళను చూసి పలుకరింపుగా నవ్వింది.
    "అయితే - కొనాకు మీ దోస్త్ కొడుకుని పట్టి తెచ్చినా వన్నమాట-" అంది హాపీగా. '    
    "అవునాంటీ! జబర్ధస్ట్ గా పట్టి తెచ్చాడంకుల్-"
    "మీ అంకులెం జేసినా అంతే - నా మారేజ్ అయినప్పటి కెళ్ళి చూస్తున్నా కదా!"
    'అంటే అంకుల్ మిమ్మల్ని జబర్ధస్ట్ మ్యారేజ్ చేస్తూకున్నడా అంటీ?" ఇద్దరూ నవ్వారు.
    జబర్ధస్ట్ మారేజే గానీ నేను జబర్ధస్ట్ జేస్తేనే అంకుల్ నాకు తాళి కట్టిండనుకో! లేకుంటే అంజలీ అనే పోరితో నడిపిస్తుండే....."
    జైరాజ్ హాపీగా నవ్వాడు.
    "థాంక్ గాడ్ - మేడమ్ కి రజని అనే పోరితో నేను నడిపించిన కతలు సంగతి ఎరక లేదు. ' నెమ్మదిగా భవానీ చెవిలో చెప్పాడు.

 Previous Page Next Page