Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 8

 

    "ఒండర్ పుల్ ! అయితే నీ లవ్ సక్సెస్ పుల్ అయినట్లే - డౌటే లేదు -"
    "డౌట్ లేదంటావా?" అనుమానంగా అడిగాడు రాకేష్-
    "కొంచెం కూడా లేదు - రేపు కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకే అంటుంది -"
    "నీకెలా తెలుసు ?"
    "మొన్నే లవర్స్ సైకాలజీ అనే బుక్ సెకండ్ హాండ్ బుక్ స్టాల్లో కొని చదివాను -"
    "అందుకే బ్రదర్ -- అందుకే నేను నిన్ను లైక్ చేసేది - యూ అరే గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్ స్పిరేషన్-"
    "థాంక్యూ రాకేష్  - అయ్ లవ్ సచ్ కాంప్లిమెంట్స్-"
    "అది సరేగానీ - ఇంత క్విక్ గా ఆ పక్క టేబుల్ అమ్మాయినేలా ఫ్రెండ్ షిప్ చేసుకున్నావ్?"
    "డెస్టినీ  బ్రదర్ - దాన్నే లవ్ ఎట్ సెకండ్ సైట్ అంటారు -"
    "లవ్ ఎట్ సెకండ్ సైటా?"
    "యస్ -"
    "ఫస్ట్ సైట్ లో ఏం చేశావ్ మరి ?"
    "ఆ అమ్మాయి అందాన్ని ఓవర్ లుక్ చేశాను - పైగా అప్పుడే ఓ పదిమంది గాళ్స్ వచ్చేసరికి ఎవర్తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏర్పడుతుందో తెలీక కన్ ఫ్యూజ్ అయాను - అది ఒకే గానీ బ్రదర్ -- ఓ ఫ్లాష్ బాక్ లో ఇంకా నాకు తెలీని ఇన్ ఫర్మేషన్ చాలా వుండిపోయింది- అది కొంచెం సప్లయ్ చేస్తే నా బ్రెయిన్ కి విశ్రాంతి దొరుకుతుంది -"
    "యా! అయ్ థింక్ సో! మా డాడీ నా లవ్ ఎఫైర్ ని బాన్ చేశాడని చెప్పాను కదా! దాంతో నేను ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. నేనెక్కడుందీ తెలుస్తే మా డాడీ సైన్యం నన్ను బైఫోర్స్ ఇంటికి తీసుకెళ్ళి పోతారు. అందుకే ఈ స్లమ్ లో, ఈ అటో వాడి గెటప్ లో సీక్రెట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా! పాపం మా డాడీ సైన్యం మాత్రం నా కోసం ఫైవ్ స్టార్ హోటల్స్ లో , గెస్ట్ హౌస్ లలో వెతుకుతుంది. రెండు మూడు సార్లు వాళ్ళకు దొరక్కుండా చాలా నారోగా ఎస్కేప్ అయానానుకో -"
    "మరి నీక్కావలసిన మనీ సప్లయ్ సంగతేమిటి? ఎవరైనా సప్లయ్ చేస్తున్నారా లేక బంగ్లాదేశ్ నుంచి ఓడలతో మన దేశానికి సప్లయ్ అవుతోన్న దొంగనోట్ల తో మానేజ్ చేస్తున్నావా బ్రదర్?"
    "నకిలీ నోట్ల డీలర్స్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయ్ గానీ, సమ్ హౌ కాంషస్ వప్పుకోవడం లేదు భవానీ! ఎందుకంటే ఒకప్పుడు రమణమూర్తి "జై భారత్' లో యాక్టివ్ గా వర్క్ చేశాం కదా!"
    "యా య పోలీసుల్తో తార్నకాలో యుద్ధం కూడా చేశాం - నాకు బాగా గుర్తుంది -"
    'రియల్లీ ఒండర్ పుల్ డేస్ ఆరోజులు -"
    "సూపర్బ్ అనుకో"
    "జస్ట్ తల్చుకుంటేనే చాలా హాపీగా ఉంటుంది -"
    "ఓకే మంచి కాజ్ కోసం ఫైట్ చేయటం, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని అప్పుడే మనకు తెల్సింది -- బ్రదర్ -- ఏకాజ్ లేకుండా కూడా చాలాసార్లు పైటింగ్ లు చేశామనుకో - దటీజ్ డిఫరెంట్ -"
    "యా -- టోటల్లీ డిఫరెంట్-"
    సరిగ్గా అప్పుడే ఓ ముసుగు వ్యక్తీ లోపలికొచ్చాడు.
    "మీ ఇద్దరిలో రాకేష్ ఎవరు ?" అడిగాడతను.
    "నువ్వెవరు?" అడిగాడు రాకేష్-
    "ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు" అన్నాడు ముసుగు .
    "నీ ముఖానికి అది కూడా ఎక్కువ " చెప్పాడు భవానీ.
    అతను సడెన్ గా గన్ తీశాడు.
    "కమాన్ టెల్ మీ! రాకేష్ ఎవరు ?"
    "కనబట్టంలా! కళ్ళు దొబ్బయా/ వాడే -' అంటూ భవానీశంకర్ ని చూపించాడు రాకేష్ - భవానీశంకర్ కి కన్ను గీటుతూ -
    వెంటనే గన్ భవానీ వేపు తిప్పాడు వాడు.
    "మర్యాదగా నాతొ వచ్చి కారెక్కు -- లేకపోతే చస్తావ్ -"
    "నువ్ డైరక్ట్ గా మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చింట్లున్నావ్ మిత్రమా! నీలాంటి టు మ్రీన్ ఎంత ట్రై చేసినా నన్నేం చేయలేరని స్వామి మద్యానందం చెప్పాడు - ఏనభయ్ ఏళ్ళు మినిమమ్ గారంటీ ఇచ్చారు నాకు -"
    "షటప్ - మర్యాదగా బయటకొచ్చి కారెక్కు తావా లేదా ?"
    "ఓకె- బ్రదర్ ! కారెక్కడానికి నాకేం అబ్జెక్షన్ లేదు - కార్ రైడింగ్ అంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం!"
    అతని వెంటే బయటకు నడుస్తూ రాకేష్ కి  సైగ చేసి వెళ్ళిపోయాడు  భవానీ!

            
                                                    ***

    కారు వేగంగా పాతోంది. ముసుగు వ్యక్తీ డ్రైవ్ చేస్తుంటే భవానీ శంకర్ కి అటూ ఇటూ గన్స్ తో కూర్చుని ఉన్నారు ఇంకో ఇద్దరు గూండాలు.
    "మనం ఎక్కడి కేళ్తున్నాం కామ్రేడ్స్ ?" అడిగాడు భవానీ.
    "షటప్ - ఆ సంగతి నీకవసరం -"
    "నీ జీకే - మరీ జీరో లెవల్లో ఉంది కామ్రేడ్ ! నాకు అన్సరివ్వటం చాలా అవసరం! నన్ను మరీ ఎక్కువ దూరం తీసుకెళ్ళ దల్చుకుంటే మీకో షాకింగ్ న్యూస్ చెప్పాలి -"
    వాళ్ళిద్దరూ అనుమానంగా చూశారు.
    "ఏంటది?"
    "మేనర్స్ బ్రదర్ - మేనర్స్ నేర్చుకోండి ! ముందు నేనడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే - తర్వాత నీ ప్రశ్నకి అన్సర్ దొరుకుతుంది -"
    వాళ్ళ మొఖాలు చూసుకున్నారు.
    "ఓకే మనం జూబిలీహిల్స్ కి వెళ్తున్నాం -' అన్నాడొకడు .
    "ఒండర్ పుల్ ! చాలా చక్కని సమాధానం ! మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అచ్చం ఇదే స్టైల్లో చెప్తారు -"
    ఇద్దరూ కోపంగా చూశారు.
    "దిల్లగీనా?"
    "మీతో దిల్లగీ చేయటానికి నేను మీ టైపు కాదు కదా-"
    "అంటే ?"
    "సమాధానంలో ఇంకా క్లారిటీ కావాలి బ్రదర్! జూబిలీ హిల్స్ లో ఎవరింటికి కెళ్తున్నాం ? లేక ఏ ఆఫీస్ కెళ్తున్నాం ?"
    "ఇండస్ట్రియలిస్ట్ జైరాజ్ గారింటికి!"
    "జైరాజా?"
    "అవును-"
    "ఆయనకు నాతొ ఏంటి అవసరం ?"
    "నోమోర్ కోశ్సెన్స్ " అన్నాడు ముసుగు మనిషి.
    "మరి నాకు షాకింగ్ న్యూస్ చెప్తానన్నా వేంటది?' ఇంకోతనడిగాడు.

 Previous Page Next Page