మనవాళ్ళు పసిపిల్ల నెత్తుకున్నట్లుగా.
గోమతి వాళ్ళతో నడుస్తూనే వుంది నడకవల్ల కాస్త రొప్పుతున్నది.
సుండా జాతి వాళ్ళు చాలా వేగంగా నడుస్తున్నారు.
నడవటం మొదలుపెట్టిగంటయినట్లు కీర్తి గ్రహించింది.
ఇంకా ఎంత దూరం నడవాలో కీర్తికి తెలియలేదు.
7
సరిగ్గా రెండు గంటలు ఎక్కడా ఆగకుండా నడిచినతరు వాత సుండా జాతివాళ్ళు నివసించే ప్రదేశం వచ్చింది. వాళ్ళ గుడిసెలన్నీ చెట్లమీద వున్నాయి. సుఖంగా శుభ్రంగా భూమ్మీద వుండక చెట్ల మీద నివసించటం ఎందుకో గోమతి కర్ధం కాలేదు.
ఈ అడవి జాతివాళ్ళ పద్దతులు ఆచార వ్యవహారాలు చాలా విచిత్రంగా విడ్డూరంగా వుంటాయని...కొన్ని దీవుల్లో నివసించేవారు నరమాంస భక్షుకులు, కొందరు దిగంబరులు, మరి కొందరు ఉత్త పిరికివారుగాను పలురకాల వారుంటారనికికీర్తికి తెలుసు. వీళ్ళు ఏ జాతివరో వీరి పద్దతులేమిటో కీర్తికి తెలియలేదు. ముందుగా గమనించింది ఏమిటంటే వీళ్ళు పొట్టి వాళ్ళు ఎంతో అవసరం అయితే తప్ప పెదవి కదపరు. చెట్ల మీద వీరి నివాసం...
ఓ గుడెసెముందు కొచ్చిం తరువాత అందరూ ఆగారు. అన్ని గుడిసెలు చెట్ల మీద వున్నాయి ఒకటి మాత్రం నేల పైనే వుంది.
భుజం మీద నుంచి కీర్తిని క్రిందకు దించాడు. వెంటనే బలంగా చప్పట్లు చరిచాడు.
బిలబిల మంటూ చెట్లమీద గుడిశెలోంచి ఆడ, మగ పిల్లలు, వృద్దులు క్రిందకు దిగారు. వీళ్ళ చుట్టూ మూగారు. కీర్తిని గోమాత్య్ని విచిత్రంగా చూస్తూ వుండి పోయారు.
నేలమీదనున్న పెద్ద గుడిసెలోంచి ఇద్దరు బైటకొచ్చారు. వాళ్ళిద్దరికి ప్రారంభ దశలో కుష్టు వ్యాధి వుంది. వాళ్ళూ వీళ్ళూ కళ్ళతో మాట్లాడుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు.
"చాలా దాహంగా వుంది కమల్ ప్రాణంపోతే బాగుండునని పిస్తున్నది నడిచి నడిచి కాళ్ళు పీక్కుపోతున్నాయి" కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే నెమ్మదిగా చెప్పింది గోమతి.
"ధైర్యం తెచ్చుకుని కాసేపు ఓర్పు వహించు గోమతీ వీళ్ళ కులపెద్ద వుంటాడు అతను చూడటంతో మన పని అటో ఇటో తేలిపోతుంది అప్పుడు..."
కీర్తి మాట పూర్తిగాక ముందే పెద్దగా కొమ్ముబూర ధ్వని గుడిసెలోంచి వినపడింది. ధ్వని వింటూనే అందరూ చేతులు ఎత్తినుంచున్నారు.
వచ్చినతను వాళ్ళ నాయకుడని కీర్తి గ్రహించింది. నాయకుడిని చూస్తూనే నిర్ఘాంతపోయింది.
నాయకుడనేవాడు ముదిరిపోయిన కుష్టురోగి అంతేకాదు నాయకుడితోవచ్చినవారికి కుష్టువుంది. కాని ఇంతగా ముదరలేదు.
కుష్టు నాయకుడేదో అడిగాడు కీర్తిని గోమాతిని మార్చి మార్చి చూస్తూ "మీరు శతృవులా? దేనికొచ్చారు? ఎక్కడి వాళ్ళు? మీ నివాసం ఎక్కడ?" వీటిల్లో ఏదో ప్రశ్న అడిగి వుండొచ్చు, ప్రశ్న తెలియంది బాషరాంది ఏమని జవాబిచ్చేటట్లు?
నాయకుడితో మాట్లాడినట్లు అటు తిరిగి గోమతితో అంది కీర్తి.
"గోమతీ? వీళ్ళ నాయకుడు కుష్టురోగి నాయకుడి దగ్గర వున్న వాళ్ళంతా లెప్రసీ పేషంట్లే చూస్తుంటే తెలియటంలా? మనం కుష్టురోగులను అసహ్యించుకుంటాము. వీళ్ళు ఈ రోగం వచ్చిన వాడికి నాయకుడి పదవిచ్చారు. వాళ్ళభాష మనకర్ధం కాదు, మన భాష వాళ్ళ కర్ధంకాదు. తెలివిగా మసులుకుంటే ఏమన్నా ప్రయోజనముంటుందేమో వీళ్ళంతా చేతులు పైకెత్తి నుంచున్నారు. మనమూ అలా నుంచుందాము" అని కీర్తి చేతులు పైకిచాచింది.
గోమతి భారంగా నిట్టూర్పు విడిచి నెమ్మదిగా చేతులు పైకి ఎత్తింది.
వీళ్ళద్దరూ చేతులు పైకి చాచంగానే నాయకుడి ముఖంలో సంతోషం చోటు చేసుకుంది. ఇద్దరినీ దగ్గరకు రమ్మని సౌంజ్ఞ చేశాడు. గోమతి భయపడుతుంటే కీర్తిగోమతి చెయ్యి పుచ్చుకుని దగ్గరకు వెళ్ళింది.
నాయకుడు వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతూ ఇద్దరివళ్ళు తడిమి చూశాడు. "ఛీ.ఛీ..." అంది గోమతి. "ఉష్ ఏ మాత్రం మన ముఖ కవళికలు కనిపెట్టినా అనుమానిస్తారు" అంది కీర్తి.
నాయకుడు కీర్తి శరీరాన్ని తడిమి చూసినప్పుడు కీర్తికి జ్వరం వుందని గ్రహించాడు. కాలికున్న గాయం చూశాడు. వాళ్ళవాళ్ళకేదో చెప్పాడు.
కాసేపుండి నాయకుడు వెళ్ళిపోయాడు. నాయకుడితో పాటు వచ్చిన కుష్టురోగం శిష్యులు వెళ్ళిపోయారు వెంటనే కొమ్ము బూర ధ్వని వినపడింది.
"ఇప్పుడేం జరుగుతుంది?" నెమ్మదిగా అడిగింది గోమతి.
"వీళ్ళు మన్ని శత్రువుల్లా చూడటం లేదు. అది గ్రహించాను. ఎందుకయినా మంచిది. మనం ఎంతో జాగ్రత్తగా వుండాలి. మనము మనవేష ధారణ వీళ్ళకి కొత్తకదా. మన్ని ఓ కంట గమనిస్తూనే వుంటారు" అంది కీర్తి.