Previous Page Next Page 
అభయారణ్యం పేజి 8


       ఆర్తికి ఆమె మాటలు బాధని మాత్రమే కాక ఉక్రోషాన్నీ కలిగిస్తున్నాయి. అయినా ధీరది తప్పెలా  అవుతుంది. కనీసం అతిథుల ముందు అలా ప్రవర్తించకూడదన్న  ఇంగితం లేని ముసలావిడది.

    "మా అత్తయ్య రాజసంగా బ్రతికిన ఆడది ధీరా! అందుకే అలా స్వాతిశయాన్ని ప్రదర్శిస్తూంటుంది"  నిభాయించుకోసేనట్టు చెప్పేసింది ఆర్తి.

      "గుడ్! కొంత నిజం చెప్పావు."   అందామె. "కానీ స్వాతిశయం అంటే తనను తాను ఎక్కువగా అంచనా వేసుకుంటూ బ్రతకడం. ఎదుటి వాళ్ళని తక్కువగా భావించడం కాదు."

    " అబ్బా..... వదిలిపెట్టవే."

    " లేదు ఆర్తీ!" ధీర నిజాయితీగా అంది. "నేను వదిలిపెట్టలేను! ఎందుకంటే నీకు నేను స్నేహితురాల్ని మాత్రమే కాదు- నువ్వెంత సౌమ్యురాలివో తెలిసిన ఆడదాన్ని కూడా కాబట్టి. నాకు గుర్తుందే..... అప్పుడు కాలేజీలో మన స్నేహితురాళ్ళంతా ఏమనేవారు నీ గురించి.... నీలాంటి కోడలు దొరికితే  అత్త- మామలకి కూతురు దక్కినంత కఅదృష్టం అనేవారు. కట్టుకున్నవాడు నికృష్డుడైనా నీ మూలంగా సకలగుణాభిరాముడై సుఖపడిపోతాడూ అనేవారు."

    "ధీరా! భావరహితంగా అంది ఆర్తి. "నేను నువ్వనుకున్నట్లు దురదృష్టవంతురాల్ని కాదే. మీ అందరూ ఆలోచించినంత  ఆనందంగానే వున్నాను. కాకపోతే అత్తయ్యతో కాస్త కష్టంగా వున్నమాట నిజం. అయినా  నేను అదంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ఎందుకంటే నాభర్త  సకలగుణాభిరాముడు  అవునే  కాదో నాకు తెలీదుకానీ నాకు అన్నీ సమకుర్చగల మగాడు కాబట్టి"

     " అదిగో! ఇందాక నేనో జోక్ చెప్పింది  యిలాంటి స్టేట్ మెంటు విన్నాకనే."

     ధీర  మాటలకి నిజంగానే  కోపం వచ్చింది. " అదికాదు ధీరా!  నువ్వనుకున్నట్టు ఏ ఆడపిల్లా అన్ని కోణాల్లోనూ సుఖపడే  అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆడది కోరుకునే అపురూపమైన  లక్షణాలు ఒకే మగాడిలో వుండటం సాధ్యం కాదు కాబట్టి. అలాగే భార్యపరంగా అందరు భర్తలూ సుఖపడలేరు. కారణం.ఎస్! ఇది నిజం.  ఇంతవరకూ వచ్చింది కాబట్టి  కొన్ని వస్తవాల్ని  నీకు నేను చెప్పకుండా వుండలేను. నాకు భర్తయిన వ్యక్తి నాలాగే భావుకుడిలా వుండాలీ అని  నేను ఒకనాడు అనుకున్న మాట నిజం.  అతడి ప్రతి ఆలోచనలో,ప్రతి కదలికలో నా గురించి కన్ సర్న్ చూపిస్తూ వుండాలీ  అన్నది నా కోరిక. కానీ భాస్వంత్ అలాంటి నాటికి అతీతుడు."   

    అది పెరిగిన వాతావరణం కావచ్చు లేదా అతడి బేసిక్ కేరెక్టరు కావచ్చు. ఏం కావాలన్నా యిస్తాడు. కానీ ఇవ్వటంలో వున్న ఆనందాన్ని నాకు అర్థమయ్యేట్లు వ్యక్తం చేయడు. అలాగే తీసుకున్న నేను కృతజ్ఞతని ప్రకటించడాన్నీ  అశించడు.   అతడీ దృష్టిలో భార్యంటే    అతడి మీద  ఆధారపడి  బ్రతికే  ప్రాణి.కాబట్టే అన్నీ ఇవ్వటం తన డ్యూటీ అనుకుంటుంటాడు. అలాగే భార్యకుడా  అడగ్గానే తనకు అన్నీ అందించాలని ఆలోచిస్తాడు.  అదిప్రేమ కావచ్చు. శరీరం కావచ్చు...... మరేదన్నా కావ్చచు. చాలా యాంత్రికంగా ఇవ్వడమూ, తీసుకోవడమూ అనే ప్రక్రియల్లో  ఇన్ స్టేంట్ నియస్ గా రియాక్టవుతాడు."

    " అప్పుడది దాంపత్యం అనిపించుకుంటుందా?" ధీర  అడిగింది. "బిజినెస్  అవుతుంది."

     "దానికి నువ్వే పేరు పెట్టినా మన ఫ్రీక్వెన్సీకి వైబ్రేట్ అయ్యే సగభాగం దొరకనప్పుడు ఈ బంధాలు ఇలాగే వుంటాయి.  ఇలాగే కొనసాగుతాయి. ఇరుపక్కలా అశాంతితో నలిగిపోతూనే వుటారు."

    " అలా అని మనం సరిపెట్టు కోగలదూ   ఆర్తీ! దాంపత్యంలో గానీ, జీవితంలో గానీ కొంతవరకూ రాజీపడడం తప్పనిసరి అని నేను అంగీకరిస్తాను కానీ  ఇతడు నా మనిషి..... నీ కోసం వున్న మనిషి. అతడి కోసం నేనేమైనా చేయాలీ అనే ఫీలింగ్స్ రాని స్థితిలో బ్రతకడం ఓ  బ్రతుక్కాదు."

     "చిత్రమేమిటంటే! భార్య గురించి భర్త కూడా ఇలానే అనుకుంటుంటాడు" అంది  ఆర్తి నిర్లిప్తంగా నవ్వుతూ.

    "అలా అనుకునేది భార్యని ఓ మనిషిగాకాక పొస్సెషన్ గా భావించే భర్త మాత్రమే."

    " ఒక్క భర్త మాత్రమే ఏమిటి ధీరా! సంఘంలోని చాలామంది చివరికి  ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులూ తమ బిడ్డని ఓ వస్తువులాగే ఆలోచించి మెట్టినింటికి పంపుతారు. ఇంతా మెటీరియలిస్టి క్ గా  చెప్పాలీ అంటేల సరుకుల్నీ డిస్ట్ర్రిబ్యూటి చేసే డీలర్సులా  వ్యవహరిస్తారు"

    " కానీ లైట్ డిస్ట్ర్రిబ్యూషన్ అంటే  అర్దం రైట్ థింగ్ ని రైట్ పర్సన్ కి అంద చేయడం కూడా" అంది ధీర.

    " నువ్వు జాన్ రస్కిన్ థియరీని గుర్తుచేసుకుని చెబుతున్నావు. కానీ అది దాంపత్యానికి అన్వయించలేం అన్నది నా థియరీ."

    "పొరపాటు పడుతున్నావు ఆర్తీ! మొండిగా  అందామె .  "  మనిషి యంత్రం కాదు! మనసుతో  ఆలోచించగలిగే ప్రాణి కాబట్టే యంత్రాల్లా డీల్ చేయకూడదని కార్మికుడికీ, యజమానికీ మధ్య వుండాల్సిన బాంధవ్యము గురించి రాస్తూ చెప్పాడు రస్కిన్ . మానవ సంబంధాలకి,  నైతిక విలువలకీ వున్న అనుసందానం గురించి  తెలియచెప్పి హార్మోనియస్ రిలేషన్స్ కి మూలం ప్రేమ, అనురాగం   అంటాడు. ఇంటి పనిమనిషైనా యజమానివి గౌరవించేది ఎక్కువ ప్రేమని   అందించినప్పుడే అన్నది రస్కిన్ చెప్పకపోయినా అతడు నిర్దేశించిన థియరీలో భాగమేనా. నా ఉద్ధేశ్యంలో దాంపత్యమూ అంతే. దాంపత్యం సవ్యంగా కొనసాగేది భార్యా- భర్తలు మధ్య వుండే రెసిప్రొకేషన్ మూలంగా."

    " ఇది థియరీకి మాత్రమే పరిమితమైన విషయం ధీరా! పరాయి  ఇంటి  నుంచి ఒక ఆడపిల్లని భార్యగా తెచ్చుకోగలిగిన మగాడు తను ఉన్నవాడుగా ఆలోచిస్తాడు,  ఆధారపడిన బ్రతికే భార్యని లేనిదానిగా పరిగణిస్తాడు. సో...... శ్రామిక  వర్గంలోని ప్రాణిగా మారే భార్యకి బాధ్యతలే తప్ప హక్కులుండవు."

    " బుల్ షిట్!  ధీర ఆవేశంగా అంది.  "ఈ రిచ్ అండ్  పూర్ అనే టెర్మ్స్ కూడా ఎబ్  సొల్యూట్ కాదు. అవి రిలెటివ్ మాత్రమే... కాబట్టే  ' ది ఆర్డాఫ్ బికేమింగ్ రిచ్ ఈజ్ ఆల్సోది ఆర్డాఫ్ కీపింగ్ అవర్స్ పూర్'  అంటాడు రస్కిన్   పొలిటికలే ఎకానామీ గురించి రాస్తూ."
 

 Previous Page Next Page