- మీ జీవితంలో మిమ్మల్ని గొప్పగా స్పందింపజేసే వ్యక్తులుగానీ, విపరీతంగా మీరు అసహ్యించుకునే వ్యక్తులుగానీ ఎవరూ వుండరు. అలా ఎప్పుడేినా వున్నా కాలక్రమేణా వాళ్ల ప్రభావం నుంచి బైటపడి మీ స్వంతవ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటారు. హిమాలయ పర్వతాలలోని ఒక మంచి యోగి కనిపించినా, అమాయకంగా చిరునవ్వులు చిందించే పసివాడు కనిపించినా - ఇద్దరినీ ఒకే దృష్టిలో మీరు పరికిస్తారు.
- పదిమందిల మిమ్మల్ని చూడగానే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించరు. కానీ, మీలో ఏదో తెలియని ఆకర్షణ వుందని ఒప్పుకుంటారు.
- కోపంతో ఉడికిపోతున్నా చాలా సమయాల్లో మాత్రం మీ మొహం చాలా ప్రశాంతంగా వుంటుంది. అది మీరు కొనితెచ్చుకునేది కాదు. స్వాభావికంగా మీలో వుండే లక్షణం.
- మీ స్వరంకూడా తియ్యగా, మధురంగా వుంటుంది. ఒకవేళ అలా లేకపోయినా కంఠాన్ని పెంచి అరవటం, గొంతు చించుకోవడంలాంటి పనులు అమర్యాదకరమైనవిగా అసభ్యకరమైనవిగా మీరు గుర్తిస్తారు.
- మీరు ఒక వ్యక్తి మీద విపరీతమైన కోపం తెచ్చుకున్నప్పుడు కూడా "నువ్వు అంటే నాకసహ్యం. నేనిప్పుడు నీ ముక్కు పచ్చడి చెయ్యదల్చుకున్నాను" అని చెప్పగలరు. చిత్రం ఏమిటంటే అలా చెప్తున్నప్పుడు కూడా మీ స్వరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రేమగీతం అంత మధురంగా వుంటుంది.
- గట్టిగా వుండే చక్కిలాలు కంటే, మెత్తగా వుండే జిలేబీలను ఇష్టపడటంలోనే మీ స్వభావాన్ని అంచనా వేసుకోవచ్చు.
- ఒకోసారి మీకు భరించలేనంత డిప్రెషన్ వస్తూ వుంటుంది. సోమరితనంలో మునిగిపోవాలనిపిస్తుంది. అయినా ఆ స్టేజినుంచి తొందరగానే బైటపడతారు. విరామంలేకుండా పని చేయాలనేదే మీ స్వభావం. కానీ శరీరతత్వం మాత్రం వేరేవిధంగా వుంటుంది.
కొద్దిగ అనారోగ్యం వున్నా ఆశ్చర్యపోనవసరంలేదు. పని చేస్తున్నంతసేపూ చైతన్యంతో నవనవలాడే జీవనాడులు బాగా అలసిపోయే స్థితికి తొందరగానే వస్తాయి. మరి పనిచెయ్యమని మొరాయిస్తాయి. దాంతో మీకు ఒక విధమైన నిరాసక్తత ఏర్పడుతుంది. అయినా తొందర్లోనే దాని నుంచి బైటపడతారు. ఈ నిస్సత్తువని అవతలివారు అపార్దం చేసుకునే ప్రమాదం కూడా వుంది.
- ఒకోసారి మీరు మహాయోగుల్లా కనిపిస్తుంటారు. దానికి విరుద్దంగా మీ మనసులో మాత్రం ఒకేసారి కొన్నివేల భావాలు చెలరేగుతుంటాయి. వాటిల చాలాభావాలు వజ్రాలంత విలువైనవి గాను, గట్టిగానూ వుంటాయి.
- సాదారణంగా మీరు మనుషులని నమ్మరు. నమ్మినట్లుగా నటిస్తారు. అలా నటించడం వల్ల అవతల వాళ్లు తమ ముసుగులు తియ్యగానే వాళ్ల వ్యక్తిత్వం మీకు కనపడుతుంది. చిత్రమేమిటంటే అది మీరేరకంగా ఊహించారో అదేవిధంగా కనబడుతుంది. దానివల్ల మీ అహం సంతృప్తి చెందుతుంది. ఇలాంటి స్వభావం వల్ల మీరు చాలా తక్కువమంది మనుషులకే మానసికంగా దగ్గరవగలరు.
- మీకు సెల్ప్ - కంట్రాల్ తక్కువ. మీరు కంట్రోల్ చేసుకోలేరని కాదు. ఏదైనా ఒక కొత్త అనుభూతికి గానీ, అనుభవానికి గానీ తొందరగాలోనవుతారు. అదెలావుందో పరిశీలించాలనే మనస్తత్వం మీకు ఎక్కువగా వుంటుంది. కానీ, ఆ అలవాటు అభిరుచి మిమ్మల్ని డామినేట్ చెయ్యగలదని మీరు తెలుసుకున్న వెంటనే తొందరగా దాన్లొంచి మీరు బైటపడతారు.
- మీరు ఏ పని చేసినా నిజాయితీగా చేస్తారు గనుక ఒక పని చేసేటప్పుడు వేరోపని చెయ్యడానికి ఇష్టపడరు. దీనివల్ల అవతలవాళ్లకి కొన్న ఇబ్బందులు కలిగే అవకాశం కూడా వుంది.
2. అక్షరాల వంకర :
కొందరు వ్రాసే అక్షరాలు కుడివైపుకి వంగి వుంటాయి. మరికొందరు ఎడమవైపుకి వంచి వ్రాస్తారు. మరికొంతమంది అక్షరాలను నిలువుగా వ్రాస్తారు. ఇంగ్లీషులో ఇలాంటి వంకరలను పట్టుకోవటం చాలా సులభం. తెలుగులో కాస్త కష్టం. ముఖ్యంగా ఈ క్రింది అక్షరాలను గమనించండి.
'స', 'న' అనే అక్షరాలని, తలకట్లని గుర్తించడం ద్వారా, మనం ఏ కేటగిరిలోకి చెందుతామో సులభంగా తెలుసుకోవచ్చు. మీరు వ్రాసిన స్క్రిప్ట్ లో ఈ రెండు అక్షరాలని గమనిస్తే, క్రింద చెప్పిన మూడు వర్గాలలో మీరు దేనికి చెందుతారో మీకే అర్దమౌతుంది. మరికొంతమంది 'కొ' 'లొ' అనే అక్షరాలని వెనక్కి వ్రాయటం ద్వారా తమ యొక్క మనస్తత్వాన్ని తెలుపుతూ వుంటారు. ఈ క్రింది చేతి వ్రాతని గమనించండి.
ఇలా అక్షరాలు వ్రాసేవారు ఎడమవైపుకి వంచి వ్రాసే కేటగిరిలోకి చెందుతారు.
మీరు వ్రాసిన వ్రాతపతిలో అక్షరాలని గమనిస్తే ఈ క్రింది మూడు రకాల్లో ఏదో ఒక వర్గానికి చెందిన వారైవుంటారు.
మీరు ఓ వర్గానికి చెందుతారు అనేది తెలుసుకోవాలంటే, అక్షరం మీద నిలువుగా పెన్సిల్ తో గీతగీయండి. మీ అక్షరం కుడివైపునకు వంగివుంటే మొదటి రకం. ఎడమవైపుకు వంగి వుంటే రెండోరకం మీరు గీసిన పెన్సిల్ గీట్ తో పాటూ నిలువుగా వుంటే అది మూడో రకం. ఇప్పుడు ఈ క్రింది ఆధారాలతో మీ మనస్తత్వాన్ని విశ్లేషించుకొండి.