వీళ్లు ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోరు.
వీళ్ళతో మాట్లాడిన వాళ్లు, వీరియొక్క సంక్లిష్టతను అర్దం చేసుకోలేక వ్యంగ్యంగా మాట్లాడి గాయపర్చినా, తర్వాత వీరిలోవున్న అంతర్గతమైన శక్తిని గుర్తించి స్నేహితులౌతారు.
వీరు, ఎంత ఒంటరిగా వుండాలని ప్రయత్నించినా జనం వీరి కంపెనీ కోరుకుంటారు. వీరి మనస్సు చాలా మెత్తనైనది. అనురాగం, సెంటిమెంటు, పోటీపడి వీరి మనసునుంచీ పెల్లుబకటానికి ప్రయత్నిస్తాయి.
పైకి ఎంత మామూలుగా కనిపించినా, ఎప్పుడూ ఏదో ఒకదానికి రహస్యంగా చింతిస్తూ వుంటారు. ఆ చింత కూడా వారికి ఆనందాన్నిస్తుంది.
వీరితో వీళ్ల బంధువులు తమ ఆప్తులకు కూడా చెప్పని రహస్యాన్ని చెప్పుకొని సంతృప్తి చెందుతారు. వీరు ఒకరకంగా గాడ్ ఫాదర్ లా ప్రవర్తించటానికి ఇష్టపడతారు.
డబ్బు విషయంలో వీరియొక్క జాగ్రత్తని చూసి, ఎవరేనా వీళ్లని పిసినారులని వేలెత్తి చూపిస్తే, కాదని నిరూపించటానికి ఎంతైనా ఖర్చుచేస్తారు.
ఎటువంటి పరిస్థితుల్లోనూ వీరు దివాళా తీయటం అంటూ జరగదు. లక్ష రూపాయలున్న వీరు దివాళా తీసారు అంటే, లక్ష నుంచి వేల స్థానంలోకి వచ్చారని మాత్రమే అర్దం.
ఆడంబరంగా వుండటానికి వీరెప్పుడూ ఇష్టపడరు. అతి సామాన్యంగా, సౌమ్యంగా కనిపించటమే వీరికిష్టం. అయితే విలాస వస్తువులు వీళ్లని బాగా ఆకర్షిస్తాయి.
చిన్న చిన్న విషయాలే వీరికి ఎక్కువ సంతృప్తినిస్తాయి. మేనమామ మొదటిసారిగా కొని ఇచ్చిన పెన్ను, పదికి పది మార్కులు తెచ్చుకున్న మొదటిసారి డిక్టేషన్ పేపర్, స్నేహితుడు/ స్నేహితురాలు ఇచ్చిన చిన్న పువ్వు వీటిని సైతం జీవితాంతం దాచుకోడానికి వీళ్ళు ఇష్టపడతారు.
వీరికున్న అబ్జర్వేషన్ శక్తివల్ల అంత త్వరగా ఎవ్వరిదగ్గరా మోసపోరు.
వీరిని ఏదైనా ఒక విషయంలో ఒప్పించాలంటే ప్రాచీనుల పేర్లో పెద్ద పెద్ద అంకెలో, ఎప్పుడో జరిగిన సంఘటనలో ఉదాహరణలుగా తీసుకొని ఒప్పించటం సులభం.
అల్లరి చిల్లరగా తిరిగే అమ్మాయిలు / అబ్బాయిలతో అవకాశముంటే వీరు కూడా తిరిగినా చివరికొచ్చేసరికి తమ ప్రియురాలు / భార్య / లేదా ప్రియుడు / భర్తతోనే జీవితాన్ని, ఆలోచనలని పంచుకోడానికి ఎక్కువ ఇష్టపడతారు.
మీడియం సైజు అక్షరాలు :-
పైన చెప్పిన మూడు ఉదాహరణల్లో మీరు మూడో కేటగిరికి చెందిన వారైతే మీవి మీడియం సైజు అక్షరాలన్నమాట. కేవలం మీ చేతివ్రాత అవతల వాళ్లకి అర్దమవటానికి అవసరమైన దానికన్నా ఎక్కువగాకుండా, అలాగని మరీ చిన్నగా వ్రాయకుండా వ్రాసే చేతివ్రాత కలిగి వున్న మీరు, జీవితంలో కూడా అంతే బ్యాలన్సు కలిగి వుంటారు.
మీరు మీ మీద మరీ ఎక్కువ నమ్మకం లేనివారు. అలాగని ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడేవారు కారు. సాంప్రదాయం, సంస్కృతి, సాధారణ జీవితం - ఇలాంటివన్నీ ఇష్టపడతారు.
సాదారణంగా కఠినంగా గానీ, మొరటుగాగానీ ప్రవర్తించటానికి ఇష్టపడరు.
అస్తవ్యస్థంగా వున్నా ఏ పరిస్థితులైనా సరే మీ దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి. ఇటువంటి పరిస్థితులను చక్కబెట్టుకోవడంలో మీకు ఆత్మసంతృప్తి కలగడమే కాక, కొత్త కొత్త పనులు చెయ్యడానికి కావలసిన ఉత్సాహాన్ని కూడా పొందుతూ వుంటారు. మనుషులతో కలిసి మెలిసి వుండటానికి ఇష్టపడ్డా, క్రిక్కిరిసిన సమూహాలలో వీరు ఇమడలేరు.
- ఇతరులమధ్య జరిగే గొడవలనీ, తలెత్తే సమస్యలనీ పరిష్కరిస్తూ ఒక జడ్జిలానో, శాంతి పావురంగాన వుండటానికి ఇష్టపడతారు. మళ్లీ మీ వరకు వచ్చేసరికి ఏదేనా అభిప్రాయం మీకు నచ్చకపోతే, మీరుకూడా ఒక న్యాయవాదిలా వాగ్యుద్దానికి తలపడటాన్ని చాలా ఇష్టపడతారు.
- మామూలుగా ఉల్లాసంగా మంచి వారిలా కనబడేమీరు, ఒకోసారి ఇతరులు చెప్పేపనులు నచ్చకపోతే, చెయ్యమని మొరాయించి, అయినదానికి కానిదానికీ కూడా వారితో వాగ్వివాదానికి దిగుతూ వుంటారు.
- అమోఘమైన తెలివితేటలున్నాసరే ఒకోసారి చాలా సులభంగా మోసపోతూ వుంటారు.
- మీరు ఒకోసారి చెవిలో ఊదరగొట్టేసే విధంగా మాట్లాడినా, మీ మాటల్లో ఏదో ఒక విధమైన లాజిక్ వుండటం వల్ల అవతలివాళ్లు మీమాటలను చాలా ఓపికగా వింటారు.
- మానసికంగా ఎంత అశాంతి వున్నా పైకి కనబడనీయకుండా వుల్లాసంగానే వుంటారు. ఏ విషయంల కూడా తొందరపడటం, ఉరుకులు పరుగులుగా చెయ్యటం మీకు ఇష్టం వుండదు.
- ఏ పనైనా అనుకున్న సమయానిక ఖచ్చితంగా చెయ్యటం మీకు ఇష్టం. పరస్పర విరుద్దంగా కనిపిస్తున్న ఇన్ని లక్షణాలు మీల వుండటంవల్ల అది మీకే గందరగోళంగా వుంటుంది.
- మీ గురించి అందరూ ఒకే వాక్యం అనుకుంటారు. "అందం, ప్రేమ, సౌశీల్యం, మంచితనం, కోపం, విసుగు, కరుకుతనం, పట్టుదరల - ఇన్ని గుణాలున్న వ్యక్తిని చూడటం నా జీవితంలో ఇదే మొదటిసారి."
- ప్రశాంతంగా సంతోషంగా తమ చుట్టూ వున్న పరిసరాలని కూడా ఆనందమయం చేసే మీరు ప్రతీచిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటూ, చుట్టు వున్న వాళ్లతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ మొండిగా లేనిపోనివి ఊహించుకుంటూ కనిపిస్తారు.