"మోతీ నగర్-"
"నేనుండేది రామ్ నగర్ - గనుక మనం ఆవిధంగా కలుసుకోవడం ఇంపాజిబుల్ - ఒకవేళ మీరు టీవి యాంకర్ గ వర్క్ చేశారా?"
"నాట్ ఎగ్జాక్ట్ లీ! అయామే జర్నలిస్ట్-"
"సేసో! నాకిప్పుడిప్పుడే గుర్తొస్తోంది యా! మయూరీ ఛానెల్ వాళ్ళు కండక్ట్ చేసిన "అడవే మయూరీ' డాన్స్ పోటీలో మీరు సూపర్ గ డాన్స్ చేశారు - యామ్ ఐ రైట్?"
మల్లిక స్టన్నయింది.
"ఒగాడ్! సూపర్ రిమెంబరెన్స్ పవరుంది మీకు?" హాపీగా అంది.
"అది నా వీక్ నెస్ డియర్! ఏ విషయమయినా సరే- మర్చిపోవటం నా వాళ్ళ కాదు - ఆ పోటీల్లో మీరే విన్నర్ అని నేను ఎక్స్ పెక్ట్ చేశాను - కానీ సమ్ హౌ ఇంకెవరికో ఆ క్రెడిట్ దక్కింది -"
మల్లికలో ఎగ్జయింట్ మెంట్ కనిపించింది.
"అదంతా ఆ ఇడియట్ జడ్జీలు చేసిన మిస్చీఫ్! అవతలి కాండేట్ దగ్గర డబ్బులు తినేసి అలాంటి జడ్జిమెంట్ ఇచ్చారు -"
"ఓ! దిసీజ్ న్యూస్ టు మీ! అయితే ఈ గేమ్ షోస్ లో అలాంటివి కూడా జరుగుతుంటాయా మిస్?"
"నా ప్రోగ్రామే ఒక ఎగ్జాంపుల్ అనుకోండి -"
వెంటనే శిరీష అందుకుంది.
"నేను చెప్పాను కదా! ఆ జడ్జీలూ, చానెల్ వాళ్ళూ చేసిన ఫ్రాడ్ కి అనవసరంగా నువ్ నీ టాలెంట్ ని వృధా చేసుకుంటున్నావ్- నిజంగా నీ పెర్ఫామెన్స్ సూపర్బ్ గ ఉండబట్టే ఇతను ఇంతకాలమయినా నిన్ను గుర్తుపెట్టుకున్నాడు -'
"ఇంతకూ ఆ జడ్జీ ఎవరు మిస్?"
"క్లౌడ్ నైన్ " అనీ ఒక మ్యూజిక్ గ్రూప్ ఉండేది -- ఆ గ్రూప్ లో మెయిన్ సింగర్ కమ్ డాన్సర్ భవానీ శంకర్-"
భవానీశంకర్ షాకయినట్లు నటించాడు.
"వాడా? వాడో ఇడియట్! రోగ్ -హాఫ్ నాలెడ్జ్ ఫెలో -"
"అంటే ఆ గ్రూపు మీకు తెలుసా ?" ఆశ్చర్యంగా అడిగింది.
"ఎందుకు తెలీదు ? వాడూ నేనూ కాలేజ్ - సేమ్ రూమ్ సేమ్ బెడ్ - " ఆమె మొఖంలో చిరాకు కనిపించింది.
"ఓ! ఇప్పుడెక్కడున్నాడో అయిడియా ఉందా మీకు -" అనుమానంగా అడిగింది.
"సారీ! తెలీదు! అసలు వాడి ముఖం చూడాలంటేనే నాకు ఎలర్జీ! నిజానికి వాడు నాకు చేసిన ద్రోహానికి వాడిని వెతికి మర్డర్ చేయాలని ఉంది నాకు --"
మల్లిక షాకయింది.
"మర్డర్ చేయాలనుందా?"
"ఎగ్జాట్లీ-"
"ఒండర్ పుల్ నాకు ఆ సీన్ కళ్ళారా చూడాలని వుంది - " ఉత్సాహంగా అందామె.
"ఇంతకాలం వాడిని మర్డర్ చేస్తే - నేను జైలు కెళ్ళటం - మళ్ళీ అడ్డమయిన పాలిటిషియన్స్ నీ పట్టుకుని - క్షమాభిక్ష స్కీం ,లో బయటకు రావటం - ఈ గొడవంతా ఎందుకని చేయకుండా వదిలేశాను -- కానీ ఇప్పుడు మీ హాపీ నెస్ కోసమయినా సరే -- వాడిని వెతికి ఉరి వేసేయాలని పిస్తోంది నాకు -"
మల్లిక మొఖంలో హపీనేస్ స్పష్టంగా కనబడుతోంది.
"మరీ మర్డర్ వరకూ ఎందుగ్గానీ - ఏకాలో చెయ్యో విరిచేయండి చాలు! నాకసి కొంతవరకయినా తీర్తుంది - " అంది కొంతవరకూ రాజీపడుతూ.
"సరే - మీరు వద్దంటున్నారు కాబట్టి రాజీ పడుతున్నా! లేకపోతే నేనస్సలు రాజీపడే టైప్ కాదు -"
"ఇంతకూ అతనిని లేపేసేయాలన్న కోరిక ఎందుకు కలిగింది మీకు? వాడు ఏం ద్రోహం చేశాడు?" అడిగింది ఆసక్తిగా.
"అదే డియర్ - కాలేజ్ డేస్ లో -"
"హాలో నన్ను డియర్ అనకండి! ఐ డోంట్ లైకిట్ - ' చిరుకోపంతో అందామె.
"అలాగా! వెరీ స్ట్రెంజ్ డియర్ - డియర్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్-"
"నేను కామన్ టైప్ కాదు -"
"ఓకే ఓకే - ఎబ్ నార్మల్ అన్నమాట! నాకు ముందే డౌటోచ్చిందిలే!"
మల్లిక తన బాగ్ లోనుంచి ఓ కార్డ్ తీసి అతనికిచ్చింది.
కార్డ్ చూస్తూనే ఉలిక్కి పడ్డాడు భవానీ శంకర్ -
"వ్వావ్? మీరు అల్ రెడీ క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేస్తున్నారా/ అయితే మనిద్దరం ఒకేజాతి ఒకే ప్రజా స్కీమ్ లో కొచ్చేస్తాం-'
"అంటే?"
"నేను మాస్ కమ్యునికేషన్స్ గ్రాడ్యుయేట్ ని డియర్-"
"ఓ! గుడ్ - ఇంతకూ మీ పేరు చెప్పలేదు ?"
"భవానీ శంకర్ డియర్ -"
"వాట్ భవానీశంకరా?"
భవానీ శంకర్ కంగారు పడ్డాడు-
"అయ్ మీన్ మనిద్దరికీ కామన్ ఎనిమా భవానీశంకర్! నా పేరు అడిగారు కదా - రాకేష్ - అయాం రాకేష్-"
అప్పుడే వచ్చిన రాకేష్ ఆ మాట షాకయ్యాడు.
"వ్వాట్! నీ పేరు రాకేషా?" అడిగాడు రాకేష్ అతని వంకా ఎదురుగ్గా ఉన్న ఇద్దరమ్మాయిల వంకా ఆశ్చర్యంగా చూస్తూ -
"అవును బ్రదర్ - డిటేయిల్స్ తర్వాత సప్లయ్ చేస్తా-" రహస్యంగా అతనితో చెప్పి మల్లిక వేపు తిరిగి చిరునవ్వు నవ్వాడు భవానీ శంకర్.
"సో సి యూ ఫ్రెండ్! వుయ్ విల్ మీట్ ఎగైన్ , అండ్ ఎగైన్ అండ్ ఎగైన్ -- అండ్ ఎగైన్ -" అంటుంటూ రాకేష్ అతనిని బలవంతంగా ఈడ్చుకెళ్ళి కార్లో పడేశాడు.
"ఒరేయ్ భవానీ! ఇప్పుడు ఎంత అద్భుతం జరిగిందో తెలుసా?"
"అద్భుతమా?"
"యస్!"
"ఏంటది?"
"మోనికాకి కారు దగ్గర బై చెప్తున్నప్పుడు అనుకోకుండా " అయ్ లవ్ యూ" చెప్పేశాను.
"మైగాడ్ - అంత కూల్ గానా?"
"డెడ్ కూల్ అనుకో-"
"మోనికా ఏమంది మరి?"
"సర్ ప్రైజ్ అయింది. కొంచెం సిగ్గుపడింది. ఆ తర్వాత "ఓ - నాకేం మాట్లాడాలో తెలీటం లేదు - నేను కొంచెం ఆలోచించుకోవాలి - అంది -"