వీళ్ళలో కొంతమంది పచ్చి అబద్దాలు చెప్పి, తమ పనులు చేయించుకొనే సామర్ద్యం కలిగివున్నా, ఎక్కువమంది చేదునిజాలు మాట్లాడి అందరికీ దూరం అయోప్రమాదముంది. వీరు చేసేపనులు అందువల్లే కొందరికి చాలా విపరీతంగా అనిపిస్తాయి.
మారుతున్న కాలంతోపాటూ మనమూ మారాలి అనేది వీరి స్వభావం. తమమాటే నెగ్గితీరాలి అనే మొండి పట్టుదల కూడా వుంది.
వీరికి గర్వం తక్కువ. వీరికి గర్వం వుందని, తెలిసిన వాళ్లెవ్వరూ అనుకోరు. అవతలివాళ్లు దగ్గిర వీరు తమ భార్య/ భర్త తెలివిలో తమ కంటే ఎక్కువని నిరూపించ బడాలని మనసులో కోరుకుంటూ వుంటారు.
చిన్న అక్షరాలు:
రెండో రకం చేతివ్రాత చూడండి. మామూలు పేజీకి 30 35 అక్షరాలు వ్రాసేవారు ఈ కేటగిరీలోకి వస్తారు.
చిన్న అక్షరాలు వ్రాసేవారు నెమ్మదస్తులు, మర్యాదతెలిసిన వారు అయివుంటారు. పబ్లిసిటీ అంటే వీరికిష్టం వుండదు. కొంచెం ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగివుంటారు.
ప్రతీ విషయం మీద అమితమైన శ్రద్ద చూపుతారు. తమ శక్తులని ఎక్కువగా ఆలోచించటానికే ఉపయోగిస్తారు తప్ప, ఆచరణలో పెట్టడానికి ఎక్కువ ఇష్టపడరు. వీరు తెలివైనవారు. "థీయరీ" ని ఎక్కువ నమ్ముతారు.
వీరిలో గమనించే గుణం ఎక్కువగా వుంటుంది. ఎప్పుడూ స్పృహలోనే వుంటారు. తాము స్పృహలోవుంటూ, అవతల వాళ్లని ఎక్కువగా గమనించటానికి ఇష్టపడతారు.
వీళ్ళు రియలిస్టులు. జీవితపువాస్తవాలని ఎప్పుడూ గమనిస్తూవుంటారు. వీరిలో వున్న ఒక గొప్ప గుణం ఏమిటంటే 'ఓర్పు'అవతలి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఓర్పుతో సహిస్తారు. అయితే, కాస్తరిజర్వ్ డు గా వుండడం వల్ల మిగతా వాళ్లెవ్వరూ వీరిని అర్దం చేసుకోలేక పోయే ప్రమాదం కూడా వుంది.
వీరికి ఏకాగ్రత అంటే ఇష్టం. వ్యాపార లక్షణాలు కొద్దిగా ఎక్కువగానే వుంటాయి.
వీరిలో ఆలోచనా శక్తి అద్బుతమైనది. ప్రతీవిషయాన్ని తాము రక్తప్రసరణని పెంచుకోకుండా ఆలోచించగలిగే సమర్దులు.
వీళ్లు బాగాచదువుతారు. మోడెస్ట్ గా వుంటారు. చిన్నవిషయాన్నైనా ఎక్కువగా విశ్లేషించుకొని, మంచిచెడులునిర్ణయించుకోగలుగుతారు.
వీరిలోవున్న మరో గొప్ప శక్తి ఏమిటంటే, 'విమర్శనాత్మక' దృష్టి ఒక అభిప్రాయం తమకి రాగానే వెంటనే ఆచరించకుండా అందులోవున్న మంచిచెడులను గమనించగలుగుతారు.
వీరిలోనూ కొన్ని లోపాలు లేకపోలేదు.
తమ మీద తమకి నమ్మకం వున్నా, ఆ నమ్మకాన్ని ప్రకటించే శక్తితక్కువ.
వీరి పరిధి చాలా చిన్నగా వుండాలని కోరుకుంటారు. దాన్ని విస్తృత పరిచే ప్రయత్నాలు సాధారణంగా చెయ్యరు. దీనికి కారణం, కొద్దిగా ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ వుండటం. ఏ పనైనా చివరి వరకూచేసి సాధించాలనుకొనే పట్టుదలకన్నా,ఆ పని ఎలాగూ పూర్తికాదనే నిర్ణయానికి రాగానే వదిలేయటానికి సిద్దపడతారు.
ప్రతీ విషయంలోనూ అవసరమైన దానికన్నా ఎక్కువ జాగ్రత్త వుండటం వల్ల వీరు కొన్ని విషయాల్లో నష్టపోతారు.
అవతలి వాళ్లు డామినేట్ చేసేశక్తి కలిగి వున్నవాళ్లైతే, సాధారణంగా వీళ్లు లొంగి వుండటానికే ఎక్కువ ఇష్టపడతారు. వీరు లొంగిపోవటమనేది - అవతలవాళ్లు గొప్పతనాన్ని ఒప్పుకొని మాత్రం కాదు. కేవలం, అవతలవాళ్లతో మనకెందుకులే గొడవ అన్న ఆలోచనతో అయి వుంటుంది.
తల్లిదండ్రులంటే వీరికి అపారమైన ఫ్రేమాభిమానాలుంటాయి. అయినా వాటిని ప్రదర్శించే పనులేలవీ చేపట్టరు. వీరికి తల్లిదండ్రులంటే ఎంతటి అభిమానమంటే, ప్రియురాలిని కూడా తల్లిలాగ వ్యవహరించాలని కోరుకునే మనస్తత్వం వీరిది! అంత జాలి, క్షమ అవతలివాళ్ళ నుంచి కూడా ఆశిస్తూ వుంటారు.అసలు వీళ్లని చూసే సిగ్గనేది సిగ్గెలా వుండాలో తెలుసుకుంటుంది.
డబ్బు విషయంలో చాలా జాగ్రత్తపరులు. అవసరానికేతప్ప, అనవసరంగా ఒక్క పైసాకూడా ఖర్చు చెయ్యటానికి ఇష్టపడరు.
అద్బుతమైన కలలు కనటంలో వీళ్లకి వీరే సాటి. కలలకోసం చదువునీ, పనిని కూడా వదిలివేసే సమర్దులు వీరు.
తమకు తెలిసిన కళను, ప్రొఫెషన్ నూ ఆత్మ సంతృప్తికోసమే కాకుండా, నలుగురి సంతోషానికి ఉపయోగించి ఎలా క్యాష్ చేసుకోవాలో వీరికి బాగా తెలుసు.
పొగిడితే పొంగిపోయే చంచల మనస్కులుగా కనిపించే వీళ్లు, చాలా నెమ్మదస్తులుగానూ, బాధ్యతలను విస్మరించకుండాను వుండగలరు. హాస్యాన్ని వీరు ఇష్టపడినంతగా ఇంకెవ్వరూ ఇష్టపడరు. ఈ కారణంగా చుట్టుపక్కల ఇళ్లలో పిల్లలు కూడా వీరితో కబుర్లు చెప్పడానికి ఆసక్తి చూపిస్తే అందులో అతిశయోక్తి ఏమీలేదు.
పార్టీల్లోనూ, మీటింగుల్లోనూ, వీళ్ళు ఎదుటివారిని ఎక్కువగా గమనించే అలవాటుని కలిగివుంటారు. నిజానికి వీళ్ళెంత గొప్పవారో అవతలవాళ్లకి ఒక్కసారిగా అర్దంకాదు. వీళ్ళని మొదటిసారిగా చూసిన అమ్మాయిలు / అబ్బాయిలు వీళ్ళల్లోవుండే గొప్పతనాన్ని గుర్తించలేక వీరిని కోల్పోతారు.