Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 7

 

    "అబ్బబ్బ! ఆగండి ......! అవతల జ్వరం ...."కష్టం మీద విడిపించుకుని నవుతూ అంది వారిజ. "ఊహు! నా తరం కాదు. నాకు ఒక్క క్షణం దూరం కాకు వారిజా ఇంకా! ఇన్నాళ్ళూ నేను విరహంతో ఎలా కాలిపోయానో నీకేం తెలుసు? నువ్వు  మరొకరి సోత్తువన్న భావనతో ఎంత చిత్ర హింసననుభావించానో ఎలా ఊహించగలవు? నన్నింత హింస ఎందుకు పెట్టావో చెప్పు?" మళ్ళీ వారిజ చెయ్యి పట్టుకుని మీదకు లాక్కుంటూ అన్నాడు. అతని గుండెల మీద వాలిపోయిన వారిజ చటుక్కున లేవలేకపోయింది.
    "చెప్తాను .....అంతా చెప్తాను......కాని విన్నాక నన్నిలా దగ్గరికీ తీసుకుంటారో లేదో?" "నువ్వు మరొకరి సోత్తువు కాకపోయిన తరువాత ఎంతటి బలమైన కారనమున్నా నిన్ను నా నుండి వేరు చెయ్యలేదు.....చెప్పు."
    "ఆహా! ఇప్పుడు కాదు మీకు నయమయ్యాక..."
    "అదేం కుదరదు....ఇప్పుడే చెప్పు."
    "ఇలా పెంకితనం చేస్తే నేను వెళ్ళిపోతాను. నేను చెప్పినట్లు వినాలి మరి.'
    "ఆ ఆ వెళ్ళిపోకు. ఈ దాసుడు నీ అజ్ఞా అతిక్రమించాడు.....నవ్వాడు రామచంద్ర.
    రామచంద్రకు వచ్చింది మాములు జ్వరమే! రెండు రోజుల్లోనే తగ్గిపోయింది. ఆ రెండు రోజులు వారిజ రామచంద్రం దగ్గిరే ఉండిపోయింది. ఊరు ఊరంతా ఏ ఇద్దరు తారసపడ్డా ఆ విషయమే చెప్పుకున్నారు.
    వీరన్న మనసులో ఏమనుకున్నాడో ....ఆ రెండు రోజులూ ఆ ఇంటి చాయలకు కూడా రాలేదు. కనీసం జ్వరం ఎలా ఉందని అయినా పలకరించలేదు. అతనికి భోజనం వడ్డిస్తే యధాలాపంగా గోదామీదకి చూసిన వారిజ అక్కడి ఫోటో చూసి 'ఆ ఫోటో లో ఎవరది?" అని అడిగింది."
    "మా అమ్మా, నాన్నగారూ - వాళ్ళ చిన్నప్పటిది."
    "ఆయనను ఎక్కడో చూసినట్లనిపిస్తోంది...."
    "ఎక్కడ చూసి ఉంటావు? ఎప్పుడయినా కాకినాడ వెళ్ళావా?"
    "ఎప్పుడూ వెళ్ళలేదూ...."
    "కొన్నాళ్ళూ మా నాన్నగారు బెజవాడలో కూడా ఉన్నారు. కాని అప్పటికి నువు పుట్టి వుండవు. ' ఉలిక్కిపడింది వారిజ.
    "బెజవాడ?"
    "అవును...అక్కడ మీవాళ్ళున్నారా?"
    "అదే మా స్వస్థలం....."
    "కానీ మా నాన్నగారు అక్కడి నుంచి చాలాకాలం క్రిందటే కాకినాడ వచ్చేశారు. ప్లీడర్ సత్యనారాయణ గారి దగ్గర గుమస్తాగా ఉండే రోజుల్లో బెజవాడలో ఉన్నారు. సత్యనారాయణ గారు వ్యసనాలకి బానిసయి ఆస్తినీ ప్రాక్టీస్ నీ కూడా నాశనం చేసుకున్నాక కాకినాడ వచ్చేసి ఏదో కంపెనీలో క్లర్క్ గా చేశారు. నేనూ, మా చెల్లెలూ ఇద్దరమే సంతానం. మా తల్లిదండ్రులకు. గుమాస్తా అయినా కష్టపడి మమ్మల్నిద్దరినీ పైకి తీసుకొచ్చారు. చెల్లికి పెళ్ళయింది. అత్తవారింట్లో వుంది."
    వారిజ కర్ధమయిపోయింది. అయన తన తండ్రి దగ్గిర గుమాస్తా, ఏదో ఫంక్షను'లో తీయుంచుకున్న గ్రూప్ ఫోటో తన తండ్రి పక్కన ఆయనున్నాడు.....ఫోటోలో చూసింది ఆయన్ని ఇదివరలో." ఎమిటాలోచిస్తున్నావు? నాకేదో చెప్తానన్నావు చెప్పవా?"
    "ఇప్పుడు కాదు . పూర్తిగా కోలుకున్నాక. మా ఇంటికి భోజానానికి రండి. సావకాశంగా అన్నీ చెప్తాను. నేను వెళ్తాను."
    'అప్పుడేనా?"
    "అప్పుడేనా! రెండు రోజులున్నాను....మీకు తగ్గిపోయిందిగా? నా అవసరం లేదు.... అదీ గాక ...." ఆగిపోయి నవింది వారిజ . "అదీ గాక....?'
    "మీరు జ్వరంతో ఉన్నప్పుడు నిశ్చింతగా ఉన్నాను. ఇప్పుడింక మీ ధోరణి చూస్తుంటే భయం వేస్తోంది బాబు!"
    "భయం దేనికి? నువు నా దానివేగా?" దగ్గరకు లాక్కోబోయాడు - నవుతూనే దూరంగా జరిగింది.
    "కాస్త కట్టెయ్యండి గుర్రాన్ని .....ఎల్లుండి రండి మా ఇంటికి.' నవుతూ వెళ్ళిపోయింది వారిజ. ఆ రాత్రి ఎంత ప్రయత్నించింది వారిజ కళ్ళు మూతపడలేదు. తన తండ్రి ప్లీడరు.....ప్రాక్టీస్ ఉంది . ఆస్థి ఉంది. అయినా అయన సంతానంలో ఒక్కరు కూడా సుఖపడటం లేదు. తన తండ్రి దగ్గర గుమాస్తా శంకరం గారు ....అయన పిల్లలిద్దరూ పైకి వచ్చారు. హాయిగా బతుకుతున్నారు. ఎక్కడుంది లోపం? ఎవరి పొరపాటు. ఈ దురదృష్టానికి కారణం? అతనికి తన సంగతి చెప్పాలి. అవును చెప్పి తీరాలి." ఎలా చెప్పాలి? చెప్పాక ఏమవుతుంది? భగవంతుడా? పగిలిపోతున్న వారిజ హృదయం తాను విన్నవి, చూసినవి, తెలుసుకున్నవి విషయాలను కలబోసుకుంటూ గతంలో ప్రరిభ్రమించ సాగింది.


                                                           3

    మొట్టమొదటి కూతురు మొదరి పుట్టిన రోజు పండుగ అతి వైభవంగా జరుపుతోంది పార్వతి. సత్యనారాయణ గారికి ఊళ్ళో చాలామంది తెలుసు. ఆ కారణం చేత ఆహ్వానితులు చాలామందే వచ్చారు.....వాళ్ళందరి అదర సత్కారాలు చూడలేక సతమతమయిపోతోంది. అప్పటి కావిడ ఆరునెలల గర్భిణి సంపన్నురాలు గనుక, ఏడాది నిండని పాపను చూసుకోవడానికి ఆయా వుంది గనుక ఆవిడ మరీ అంత నలిగిపోలేదు. అయినా ప్రయాసగానే వుంది. ఆ పందిట్లో కల్యాణి ఆవిడా కంటికసలు అనలేదు. ధగధగ రవల నక్లెస్ లూ, రెప రెపలాడే పట్టుచీరలు రాజ్యం చేస్తున్న ఆ సమావేశంలో ,, నూలు చీరతో, మెడలో నల్లపూసలతో వున్న కల్యాణి ఎవరి కంటి కానుతుంది?

 Previous Page Next Page