Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 7


    లోన అక్క.

 

    ఇంకో వ్యక్తి ఒడిలో.

 

    అక్కడ ఉండకూడదనే ఆలోచనతో బయటికొస్తున్నప్పుడు అడుగుల చప్పుడికి అక్క, అవినాష్ ని చూసి కంగారుతో లేచిపోయింది.

 

    ఆ వ్యక్తి గబగబా కొట్టుగది తలుపులు తీసుకొని బయటికొచ్చి తల దించుకొని పెరట్లోకి వెళ్ళిపోయాడు.

 

    లోన్నించి అక్క చీర సర్దుకుంటూ గబగబా వచ్చి అవినాష్ ని పట్టుకుని-

 

    "అమ్మతో చెప్పొద్దురా..." అని బుజ్జగించింది.

 

    "మరి నాన్నకు..." ప్రశ్నించాడు అవినాష్.

 

    "నాన్నకు తెల్సు..." ఆ ఒక్కమాట మాత్రం అక్క నోటినుంచి వచ్చింది.

 

    ఆ వయసులో ఆ మాట వెనక అర్థం అవినాష్ కి అర్థంకాలేదు.

 

    కానీ-

 

    ఆ తర్వాత, ఓ నెల్రోజుల తర్వాత-

 

    ఇంట్లో అక్క కన్పించకపోవడం, మర్నాడుదయం అక్క శవం ఊరి చెరువు గట్టున తేలడం.

 

    అంతా మిస్టరీలా అన్పించింది అవినాష్ కి.

 

    అక్క ఆత్మహత్య చేసుకుందని కొందరన్నారు.

 

    ఎవరో 'రేప్' చేసి చెరువులో పడేసారని కొందరన్నారు. మోసపోయి, గర్భవతయి మొహం చూపించక నీళ్ళలో పడిందని కొందరన్నారు.

 

    కానీ-

 

    అక్క చావుకి నాన్నే కారణమని ఎందరికి తెల్సు.

 

    పేదరికమే కారణమని ఎందరికి తెల్సు.

 

    ఊర్లో మోతుబరి కొడుక్కి అక్కంటే ఇష్టమని, కూతురిమీద ప్రేమని డబ్బుతో కొలిచి, ఆ కుర్రాడు ఇంటికి వస్తూ, పోతున్నా చూడనట్టు నటించాడు నాన్న.

 

    అక్క చనిపోడానికి ముందురోజు.

 

    తన గెస్టుహౌసుకి అక్కని తీసికెళ్ళాడు వాడు.

 

    కానీ అక్కడ వాడొక్కడే కాదు. మరో ఆరుగురు.

 

    అందరూ తాగి అక్కమీద పడ్డారు.

 

    మనుషుల ముసుగేసుకున్న ఆ రాక్షసులతో గంటసేపు పోరాడింది అక్క.

 

    ఆఖరకు ఓడిపోయింది.

 

    తియ్యని ఆశలతో, కమ్మని కలలతో పాతికేళ్ళ యౌవనాన్ని దుర్మార్గుల చేతిలో పెట్టేసి,

 

    తండ్రి చేసిన మోసానికి-

 

    తల్లి, తండ్రిని ఎదిరించలేక ఊరుకున్న మౌనానికి-

 

    డబ్బు చేసిన మోసానికి-

 

    అక్క ఆహుతైపోయింది.

 

    ఆ తర్వాత-

 

    అవినాష్ కి మొట్టమొదటి సారి తెల్సింది.

 

    డబ్బు మనిషికి చాలా అవసరమని.

 

    అందుకే ఆ డబ్బు సంపాదించడం కోసమే తను బతకాలని నిర్ణయించుకున్నాడు.

 

    తన సుఖం కోసం ఎవర్ని మోసం చేసినా పర్వాలేదు.

 

    ఎన్ని ప్రేమల్ని దగా చేసినా ఫర్వాలేదు.

 

    ఎందరమ్మాయిల్ని మోసం చేసినా ఫర్వాలేదు.

 

    అక్కని మోసం చేసిన ఈ వ్యవస్థను తను మోసం చేయాలి.

 

    ఏ కన్నీళ్ళతో, ఏ రక్తంతో అందమైన అక్క వయసు తడిచిపోయిందో-

 

    కాలిపోతున్న కాగితపు పువ్వుల్లా అయిపోవాలి.

 

    వాడిపోతున్న గులాబీ పువ్వులై పోవాలి.

 

    అప్పుడే తనకు మనశ్శాంతి.

 

    ఈ మనశ్శాంతిలో మాత్రమే తను బతగ్గలడు.

 

    -అవినాష్ మనసు చిందర వందరగా ఉంది. గబుక్కున లేచి, లైటు వేసి, సిగరెట్ వెలిగించుకొని కిటికీ పక్క కుర్చీ వేసుకుని మసక చీకట్లో కన్పిస్తున్న రోడ్డువేపు చూస్తున్నాడు.

 

    ఓ పావుగంట తర్వాత లైటార్పేశాడు.

 

    అతనికి వరుసగా ప్రేమ పేరుతో మోసం చేసిన అమ్మాయిలందరూ గుర్తు కొస్తున్నారు.

 

    లక్ష్మి, రమ, సుజాత, అనూరాధ, ముంతాజ్.

 

    ఊహ తెలిసాక ప్రేమ పేరుతో వీళ్ళందర్నీ వంచించాడు అవినాష్.

 

    ఒక్కొక్కరితో కొన్ని నెలలు తిరగడం, వాళ్ళచేత డబ్బు ఖర్చు పెట్టించడం, కోరికలు తీర్చుకోవడం, మాయమైపోవడం...

 

    కానీ-

 

    అయిదుగురు అమ్మాయిల్లో ముంతాజ్ తెలివైంది. వాళ్ళ నాన్న డి.ఎస్.పి.

 

    ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు అవినాష్.

 

    ఏ మాత్రం కష్టపడకుండానే అవినాష్ వలలో పడిపోయింది ఆ అమ్మాయి.

 

    కాలేజీ పేరుతో వారానికి రెండురోజులు అవినాష్ రూంకి వచ్చేసేది ముంతాజ్.

 

    అలాగే ఆ రోజు కూడా వచ్చింది.

 

    ఆ అమ్మాయికి పదహారేళ్ళుంటాయి.

 

    ఎర్రగా, దృఢంగా ఉండేది.

 

    లోనికి రాగానే తలుపులోన గెడపెట్టేసి, బాత్ రూంలో స్నానం చేస్తున్న అవినాష్ దగ్గరకు లోనికి నేరుగా వచ్చేసింది ముంతాజ్.

 

    "ఇద్దరంకల్సి స్నానం చేద్దాంరా..." చెయ్యిపట్టుకుని లాగుతూ అన్నాడు అవినాష్.

 Previous Page Next Page