" అంటే పెళ్ళన్నది నీలో ఎలాంటి మార్పునీ తీసుకురాలేదంటావ్?"
" ఎస్!" ఆర్తి స్థిరంగా అంది. "అవును ధీర! నేను నిజమే చెబుతున్నాను."
" నీ భర్త పరంగా నీకే లోటూ లేదంటావ్?"
మెటీరియలిస్ట్ గా ఆలోచిస్తే నిజంగా ఏ లోటూ లేదామెకి. డబ్బు, స్టేటస్,తిండీ బట్టలాంటివన్నీ లోటు లేకుండా సముకూరుతున్నాయి.
"నన్ను ధీరా!" రిలాక్స్ డ్ గా ఓ సోఫాలో సెటిలైంది.వెంటనే ఓ జోక్ చెబుతున్నట్టుగా టాపిక్ ని మళ్ళించింది " ఓ రోజు భార్యకి ఏ లోటూ చేయని భర్త హఠాత్తుగా ఇంటికి వచ్చేసరికి అతడి భార్య పరాయి మగాడితో బెడ్ మీద వుందట. చాలా ఆవేశపడిన భర్త కోపంగా బయటకి నడవబోతుంటే అమాంతం ఆమె దుఃఖంతో భర్తని చుట్టేసి అందట..... "
"పరాయి మగాడైన ఈ వ్యక్తి ఓ గంట క్రితం తలుపు తట్టాడు.తింటానికి ఏమైనా వుంటే పెట్టమని అడిగాడు. పాపం ఆకలో అనుకుంటూ అతడి చెప్పులకేసి చూసాను. ఛెండాలంగా వున్నాయి. వెంటనే మీరు అయిదేళ్ళుగా వాడని చెప్పులు గురించి గుర్తుకొచ్చి అవి అతడికిచ్చేశాను. అతడి షర్టు చిరిగి వుంది. దానితో రెండేళ్ళుగా మీరు వార్డ్ రోబ్ లో తీసుకొచ్చి ఇచ్చాను. అతడి ఫేంటు కూడా మాసికలతో కనిపించింది. అంతే- ఆరేళ్ళుగా మీరు వాడకుండా వదిలేసిన రోబ్ లోని ఫేంటుని అతడికి దానంగా యిచ్చేశాను."
ఆ వ్యక్తి చాలా ఆనందపడిపోయాడు. ఒంటిమీద వున్న బట్టలన్నీ విప్పేసి మీ వారు ఏళ్ళ తరబడి వాడనిదేమన్నా ఇంకా వుంటే చెప్పండి అన్నాడు. అంతే! మీరు వుపయేగించనిదేదన్నా యిచ్చేయమని మీరొకప్పుడు అన్న మాట గుర్తుకొచ్చింది అందుకే బెడ్ మీదికి రప్పించుకున్నా అంటూ."
అంతసేపూ వున్న నిస్త్ర్రాణ చెదిరిపోయినట్టు ఫకాల్న నవ్విన ఆర్తి " ఇంకా పవే.అవునూ! ఏ కాంటెక్ట్స్ లో ఈ జోక్ చెప్పినట్టు ? అంది.
"లోటు లేకుండా భర్త చూడటమూ అంటే తిండీ,బట్ట పెట్టడం కాదే. మరేదోకూడా అవసరమని భర్త ఆలోచించడం ముఖ్యమని చెప్పటం నా ఉద్దేశ్యం."
" సెక్స్ పరంగా నాకు వెలితే లేదు" అసంకల్పితంగా అనేసింది ఆర్తి.
" తిండీ, బట్ట తర్వాత ఆడదానికి అవసరమయ్యేది సెక్స్ మాత్రమేనా ఆర్తీ?" అంది ధీర.
"నీ జోక్ అలాంటిదేదో ఉద్దేశించి చెప్పిందేగా."
" లేదే! జోక్ ఉద్దేశించింది సెక్స్ కోసమే అయినా నేను నీ విషయంలో వెలితిగా భావిస్తున్నది కంపేనియన్ షిప్."
ఉలికిపాటుగా చూసింది ఆర్తి.
వచ్చి పదినిమిషాలు కాలేదు. ఇంత వెంటనే ధీర ఎలా గుర్తించింది.
తన మొహంలోని భావాలు అంత స్పష్టంగా కనిపిస్తున్నాయా? లేక ధీర అలా వూహించగలిగిందా?
మనసు అదోలా అయిపోయింది.
" ఏమిటే ఆలోచిస్తున్నావ్?" అడిగింది. ధీర. "నేను అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేయగలిగానా అనేనా?"
" లేదే!" వాతావరణాన్ని తేలిక పరచాలనుకుంటూ అంది ఆర్తి- "నీ మాటలు వింటూంటే నాకూ ఓ జోక్ చెప్పాలన్న ఉత్సాహం వచ్చింది."
"నిజమా!" ధీరయించుమించు కావలించుకున్నంత పని చేసింది.
"అవునే! ఓ మతిభ్రమించిన వ్యక్తి ఆదరాబాదరాగా సైకియాట్రిస్ట్ దగ్గరకు వచ్చాడట. రాగానే డాక్టర్ గారూ! నేను చచ్చిపోయినట్టు అనుమానంగా వుంది. వెంటనే చెక్ చేయండి అన్నాడట. డాక్టరుగారు ఎలా నిరూపించాలా అని క్షణం ఆలోచించి వెంటనే పేషెంట్లు వ్రేలి మీద ఓ సూది గుచ్చి రక్తం తీశాడట. 'రక్తప్రవాహం ఆగలేదు కాబట్టి నువ్వు బ్రతికి ఉన్నట్టు లెక్క అన్నాడట. లేదు డాక్టర్! నేను బ్రతికిలేను' అరిచిన పేషెంట్ "రక్తం ప్రవహింటేజి చచ్చినవాళ్ళ శరీరంలో నుంచే అని అర్థమైంది" అంటూ వచ్చినంతగా వేగంగా వెళ్ళిపోయాడట."
ప్రశాంతంగా నవ్విన ధీర " జోక్ బాగుంది కాని ఇది చెప్పడంలో నీ ఉద్దేశ్యం నేనే మెంటల్ పేషెంట్ నని నిరూపించటానికా?" అంది.
"ఓ. కె! చేతులు జోడించింది ధీర . " ఇక ఆ టాపిక్ వదిలేద్దాం."
"గూడ్ ! మంచి నిర్ణయం తీసుకున్నావు. చెప్పు ఇంత హఠాత్తుగా వూడిపడ్డావేం?" అంది ఆర్తి.
"ఇష్టమైన వ్చక్తి కోసం" ఆనాలోచితంగా నోరు జారిన ధీర వెంటనే తనను తాను కరెక్ట్ చేసుకుంటున్నట్టుగా అంది " మరేం లేదు.వాజాగ్ లో నాతో కలిసి జాబ్ చేసిన దాయకర్ అనే ఓ లెక్చరర్ ప్రస్తుతము ఇక్కడే వుంటున్నాడు. ఆయన సిస్టర్ మ్యారేజి వుంటే వచ్చాను."
' దయాకర్' పేరు చెబుతున్నప్పుడు ధీర కళ్ళలో మెరిసిన మెరుపు స్పష్టంగా గమనించింది ఆర్తి.
అదొక్కటే కాదు.
ఇందాక 'ఇష్టమైన వ్యక్తి కోసం' అంటూ నోరు జారింది కూడా.
అర నిమిషం నిశ్శబ్దం తర్వాత అడిగింది ఆర్తి " అదిసరే! మీ బావని పెళ్ళి చేసుకోవడం లేదా?"
" చేసుకున్ననే!"
ఆర్తి ఉలికిపాటుగా చూసింది.
"ఆరునెలల పైనే అయింది" ధీర ముఖకవళికల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. "మా బామ్మ చావు- బ్రతుకుల మధ్య వుండటంతో అర్డెంటుంగా అంతా కానిచ్చేశారు. అందుకే నీకు తెలియచేయలేకపోయాను. ఆ తర్వాతైనా ఉత్తరం రాసేదాన్నే కానీ మొహం చెల్లలేదు. ఎంతైనా ప్రాణస్నేహితురాలివి కదే..... ఆమాత్రం ఫీలవడంలో తప్పు లేదుగా?"