Previous Page
Next Page
ఖడ్గసృష్టి పేజి 6
విశాలాంధ్రలో ప్రజారాజ్యం
శక్తికోసమే నడు!
ముక్తికోసమే మను! విముక్తికోసమే మను!
విశ్వశాంతి క్రాంతికోసమే మనస్సు లేకమై,
నడూ నడూ! భయం గియం విడూ!
వేగుజుక్క వెలిగెమింటిపై
వెలుగురేఖ లవిగొ కంటివా!
ఉదయ మెంతొలేదు దూరము
వదలిపోవు నంధకారము
జీవితాశలే
భావి జాడలోయ్
ప్రపంచజాతి శాంతి కాంతి బాటసారివై ||నడూ నడూ||
విరోధించువారు లేరులే
నిరోధించువారు రారులే
అస్తి నాస్తి భేదమేలరా?
వాస్తవం వరించి సాగరా!
విశాలాంధ్రలో
ప్రజారాజ్యమే
ఘటించగా శ్రమించరా పరాక్రమించరా ||నడూ నడూ||
_శక్తికే లియే ఛలో! అనే హిందీ గేయానికి అనువాదం విశాలాంధ్ర దినపత్రిక -1955...
Previous Page
Next Page