Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 6


    "ఎవరా నలుగురు...? వాళ్ళను నియమించిందెవరు...?" ఆ నలుగురిలో ఒక యువకుడు అడిగాడు మెల్లగా.
    
    మిల్లర్ వెంటనే సమాధానమివ్వలేదు.
    
    ఆ నలుగురి అసలు పేర్లు ఏమిటనేది ఒక్క మిల్లర్ కి తప్ప మరెవరికీ తెలీవు.
    
    ఒక వ్యక్తి పేరు 'ఎల్'
    
    రెండో వ్యక్తి పేరు 'ఆర్'
    
    మూడవ వ్యక్తి పేరు 'బి' నాలుగో వ్యక్తి పేరు 'ఎఫ్' అవి వాళ్ళ కోడ్ నేమ్స్.
    
    ఆ నలుగురు నేర ప్రపంచంలో కాకలు తీరిన యోధులు.... ఖరీదైన వ్యక్తుల చారిత్రాత్మక హత్యల నేపథ్యాన్ని క్షుణ్ణంగా ఔపాసన పట్టిన అసాధ్యులు.

    ఆ నలుగురికి, మరో నలభైమందికి, మిల్లర్ బాస్. ఈ నలభై ఐదుగురి బాధ్యత ఒక్కటే...
    
    వాళ్ళ మాస్టర్ ని రక్షించటం.
    
    మిల్లర్ నెలజీతం రెండు లక్షలు.
    
    ఎల్, ఆర్, ఎఫ్, బిల నెల జీతం ఒక్కొక్కరికి పాతికవేలు.
    
    మిల్లర్ సెక్యూరిటీ చీఫ్...
    
    ఎల్, ఆర్, ఎఫ్, బి సెక్యూరిటీ కమెండోస్.
    
    వీళ్ళ క్రిందే మరో నలభైమంది పని చేస్తుంటారు. వాళ్ళకు నెలకు ఐదు వేలు...
    
    వీళ్ళ జీతాలే ఒక్క సంవత్సరానికి అరవై లక్షలు.
    
    వాళ్ళు తీసుకొనే సెక్యూరిటీ మెజర్స్ కి కాస్త అటూ, ఇటూగా కోటీ నలభై లక్షలు ఖర్చవుతుంది.
    
    వెరసి ఒక వ్యక్తి రక్షణకు...
    
    మాస్టర్ రక్షణకు... సంవత్సరానికి రెండుకోట్లు ఖర్చవుతుంది.
    
    ప్రభుత్వాధికారులకు, ప్రధాన మంత్రులకు వివిధ దేశాల ప్రభుత్వాలలో అత్యున్నత స్థానంలో ఉండే వ్యక్తులకు కాకుండా, ప్రయివేట్ వ్యక్తుల రక్షణకు ఇంత ఖర్చు పెట్టడం ఆశ్చర్యమనిపించినా నమ్మక తప్పని నిజం.
    
    మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ సంపాదించే మేగ్నిఫిషియంట్ బిజినెస్ టైకూన్స్ జీవితాలు పెరుగుతున్న ప్రపంచవ్యాపిత నేరాల నేపథ్యంలో మరింత విలువను సంతరించుకున్నాయి. వాళ్ళు ప్రభుత్వపరమైన రక్షణను నమ్మటం, ఆశించటం అవివేకమనే ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు.
    
    లక్షలు, కోట్లు ఖర్చు పెట్టినా, అవసరమైన చట్టాల్ని తీసుకొచ్చినా, అనితరసాధ్యమైన వ్యయ ప్రయాసల కోర్చినా అధికారపరమైన భద్రతా సిబ్బంది ప్రపంచదేశాల ప్రభుత్వాధినేతలకు పూర్తి రక్షణ కల్పించలేక పోతున్నాయి.
    
    స్టేన్ ల్లీ మాస్టర్.
    
    ది గ్రేట్ మాస్టర్...
    
    మనీ మేకింగ్ మిషన్ త్రూ సోమెనీ వేస్...
    
    మాస్టర్ ఇన్ మనీ మేకింగ్.
    
    మాస్టర్ స్టేన్ ల్లీ-
    
    ముఫ్ఫై సంవత్సరాల యువకుడు....
    
    ముఫ్ఫై ఆరాలు తిన్నా, విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా తరగని అపార సంపదకు ఏకైక వారసుడు.
    
    అతని తల్లి ఇండియన్.
    
    తండ్రి చైనీస్.
    
    తండ్రి స్టేన్ లీ రామన్ హో.
    
    తల్లి యశోధర.
    
    విభిన్న జాతుల విచిత్రమైన సంగమం.
    
    యశోధర, హో దంపతులకు ఆరుగురు సంతానం. కాని చివరకు వాళ్ళకు మిగిలింది మాస్టర్ ఒక్కడే.
    
    మాస్టర్ అన్నలు ఇద్దరు.
    
    అక్కలు ముగ్గురూ అసాసినేట్ చేయబడ్డారు.
    
    చూసేవారికి ఏమాత్రం అనుమానం కలగకుండా జస్ట్ ఏక్సి డెంటల్ అన్న పద్దతిలో చంపబడ్డారు. చివరకు మాస్టర్ తండ్రి కూడా అసాసినేట్ చేయబడ్డాడు. ఆ పైన మిగిలింది యశోధర.
    
    ఆమె ఆఖరి సంతనమైన మాస్టర్ స్టేన్ ల్లీ.
    
    అతనికి ఎన్ని ఆస్తులున్నాయో అతనికే తెలీదు.
    
    పొరపాటున ఒక వ్యక్తిని సెకెండ్స్ తో సహా టైమెంతయిందని అడిగితే అతను చెప్పేలోపే మరికొన్ని సెకండ్స్ కాలం ముందుకు వెళ్ళిపోయేట్లు స్టేన్ ల్లీని మీ ఆస్తుల విలువెంతని అడిగితే అతను చెప్పేలోపే మరికొన్ని లక్షలు అతని ఆస్తులకు తోడవుతాయి.
    
    అతని ఆడిటర్ ని అడిగితే ఎప్పుడైనా ఎవరికైనా ఒకటే చెబుతుంటాడు.
    
    "The figure is changing all the time, and the calculations would be too complicated"
    
    అతనికి అఫీషియల్ బ్యాంక్ ఎకౌంట్స్ దాదాపు రెండొందలదాకా ఉంటాయని ఒక అంచనా.
    
    అసలు కొన్ని బ్యాంక్స్ అతని డిపాజిట్స్ మీదే ఆధారపడి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి.
    
    ఇంకొన్ని బ్యాంక్సయితే మా బ్యాంక్ లో మాస్టర్ ఎకౌంట్ వుంది తెలుసా అంటూ గర్వంగా చెప్పుకుంటుంటాయి. ఈరోజు ఏ దేశంలో ఏ ఎకౌంట్ లో ఎంత జమ అవుతుందో మాస్టర్ కి కూడా తెలీదు.
    
    ప్రతినెల చివరకుగాని ప్రపంచవ్యాప్తంగా తన ఎకౌంట్స్ లో ఎంత జమయిందీ తెలీదు.
    
    మల్టీ మిలీనర్ బిజినెస్ మెన్.
    
    లాటిన్ అమెరికన్ బాల్ రూం డేన్సింగ్ యంధూసియెస్టు.
    
    షిప్పింగ్ మేగ్నిట్.
    
    జట్ ఫాయిల్ విజనరీ.
    
    ఇంపోర్టర్ అండ్ ఎక్స్ పోర్టర్.
    
    లాస్ట్ ల్లీ ఆపరేటర్ ఆఫ్ ఏ వేస్టీ అండ్ టూక్రేటివ్ చైన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కేసినోస్.
    
    ప్రాపిటింగ్ ఫ్రమ్ ది చైనీస్ ఫ్యాషన్ ఫర్ ఎనీ గేమ్ ఆఫ్ చాన్స్ స్టేన్ ల్లీహో.

 Previous Page Next Page