"ఓ పావుగంటలో డిన్నర్ ప్రారంభమౌతుంది. ఈలోగా ఎవర్తెనా పాడితే వినాలని ఉంది" అన్నాడు సుందర్.
"మంచి ఐడియా! నాకింతవరకూ ఆ ఆలోచనే రాలేదు" రమేష్ ఉత్సాహంగా.
"మాధవిగారూ మీరు బాగా పాడతారు కదూ? కాలేజిలో మీరు గాయనిగా చాలా బహుమతులు తెచ్చుకొన్నారు" అన్నాడు.
"ఈ రోజు మీ భార్యచేత పాడించాలి! నా పాత తరువాత"
"క్రొత్త పెళ్ళికూతురు కదా? ఆవిణ్ణి ఇబ్బంది పెట్టడం భావ్యం కాదేమో!"
"ఏం షర్మిలా? ఆవిడ ఏమంటుందో విన్నావు కదూ? ఓ చిన్నపాట పాడేసెయ్! ఒక్కపాటకు ఆవిడ చేత పదిపాటలు పాడించుకోవచ్చు మనం. జబర్ధస్తిగా!" రమేష్ ఓరగా చూశాడు భార్యకేసి.
షర్మిలా బోలెడంత సిగ్గుపడిపోయింది. "అబ్బే నాకు పాడటం రాదు" అంది షర్మిల భర్తకే వినిపించేంత మెల్లగా.
"ఈ కాలంలోనూ పెళ్ళికూతుళ్ళు ఇంతగా సిగ్గు పడిపోతున్నాప్పుడు మేం పది సంవత్సరాల నుండి పరిచయస్తుల్లా మేలిగాం! అందరూ "పెళ్ళికూతురులా లేదు! పది సంవత్సరాల నుండి కాపురం చేస్తున్న పెళ్ళాంలా ఉంది?" అని, బుగ్గలు నొక్కుకోవడమే!"
"అంటే, పెళ్ళికి ముందే అన్ని జరిగిపోయయన్నమాట!" మరో కామె భుజం పొడిచింది.
"పాడండి మాధవిగారూ! మా ఆవిడ చేత మరోసారి ఎప్పడ్తేనా పాదిస్తాను!"
"అబ్బే! ఆవిడ యిప్పుడు పాడాలి!"
"పాటల కార్యక్రమం త్వరగా ముగించాలి! ఆత్మరామడు ఆవురావురు మంటున్నాడు. రమేష్ పెళ్ళి పార్టి జీవితంలో గుర్తుండిపోయేలా ఉండాలని ఉదయం నుండి నేనేం తినలేదు! కడుపు ఖాళీగా పెట్టుకొని వచ్చాను!" ఒక భోజన ప్రియుడు అన్నాడు చొక్కా పైకెత్తి లంబోదరాన్ని ప్రదర్శిస్తూ.
"విఘ్నశ్వరుడు ఎక్కడో భూలోకంలో మానవాకారంలో పుట్టాడని విన్నాను! ఇక్కడే జన్మ ఎత్తాడని ఇప్పుడు తెలిసింది!" ఆడవాళ్ళ గుంపులో నవ్వులు చెలరేగాయి!
"కానీ, నడుముకు నాగాభరణన్ని, తొండాన్ని మరిచిపోయివచ్చాడు"
"ఏమిటో ఆ నవ్వులు! మాకూ కాస్త పంచండి! ప్రస్తుతానికి ఆ నవ్వులతో కడుపు నింపుకోంటాం!" అసలుసంగతి తెలియని లంబోదరుడు నవ్వుతూ అడిగాడు.
ఆడవాళ్ళింకా నవ్వులు మొదలు పెట్టారు.
"మాధవిగారూ, ఒక్క పాట!"
"ఉహు ఇవాళ నేను పాడలేను!"
"మల్లిక్ గారూ! మీ భార్యకి పాటలు రావా?"
"శాస్త్రీయ సంగితం వచ్చు! ఈ కాలం పాటలు రావు!"
"శాస్త్రీయ సంగితం ఏ కాలం వారిన్తేనా అలరించగలదు! ఇంత సేపు మాధవిగారి వెంట పడ్డాం! మీ మిసెస్ కు వస్తుందని తెలియదు!" సుందర్ ఉత్సాహంతో అన్నాడు.
గాబరా పడిపోయింది త్రిపుర. " ఆబ్బే! ఇంతమందిలో నేనెప్పుడూ పాడలేదు!"
" అయితే మిరోక్కరూ గదిలో కూర్చొని పాడండి! మేం అవతల గదిలో ఉంది వింటాం!"
"ఉహు శ్రుతి లేకుండా పాడడం అస్సలు రాదు!"
"వీణ మీద పాడగలరా? మాఇంట్లో వీణఉంది!" రమేష్ అన్నాడు.
త్రిపుర పర్మిషన్ కోసం చూడలేదు! క్షణం లో చిన్న వేదిక తయర్తేపోయింది! వీణ తెచ్చి అక్కడుంచాడు నౌకరు.
"వాళ్ళచేత మళ్ళి మళ్ళి అడిగించుకోవడం సభ్యతకాదు! పద ఒక పాట పాడి లే! మల్లిక్ మెల్లగా త్రిపుర భుజం తట్టాడు.
ఇంట్లో అమ్మతో కలిసి సాధన చేసుకోవడం, ఒకరిద్దరు శ్రోతల ముందు పాడడం తప్ప ఇందరు శ్రోతల ముందు పాడే సంధర్చం ఎప్పడూ రాలేదు త్రిపురకు ఒక్క నిమిషం భయం వేసింది పాదగాలనా అని కానీ, వెంటనే ద్తేర్యం తెచ్చుకుంది. పాతమిద లగ్నం చేయగలిగితే ఎందరున్నా భయం వేయదు!
" రాగసుధా రస పానమూ జేసి రంజిల్లవే ఓ మనసా.....!" అందోళిక రాగంలో పాడింది. సూదిపడితే వినిపించేంత నిశ్శబ్దంలో త్రిపుర గానం అమృత వర్షిణిలా సాగింది.
"శాస్త్రి యసంగితం అంటే నాకెంత బోరో! కానీ, త్రిపురసుందరి గారు పాడుతూంటే చాలా మధురంగా అనిపించింది. శాస్త్రీయ సంగితమంటే ఇష్టం ఏర్పడేలా ఉంది ఆమె స్వరం!" ఒకాయన ప్రశంసించాడు.
"సంగితం, సౌందర్యం మూర్తిభావించిన స్త్రీని భార్యగా పొదడం నిన్ను మరోసారి అభినందిస్తున్నాను! నా కెందుకో నువ్వంటే ఈర్ష్య కలుగుతోంది" సుందర్ త్రిపురవంక తన్మయంగా చూస్తూ అన్నాడు. "త్రిపుర మాధరిగారిని ఒకసారి మా ఇంటికి తిసురావాలి. మా అమ్మ గారికి శాస్త్రీయ సంగితమంటే చెప్పలేనంత ఇష్టం! ఆవిడకూ కొంచెం పెఅవేశం ఉందనుకో సంగీతంలో"
"ఘ్యార్! తప్పకుండా తీసుకువస్తాను మీ ఇంటికి!"
తన భర్త ఎదురుగానే సుందర్ ఆరాధన పూర్వకంగా చూడడం, ప్రశంసల వర్షం కురిపించడం త్రిపురకి ఎబ్బెట్టుగా ఉంది. ఇక్కడ ఎవరి భావాలూ దాచుకోకపోవడం సభ్యత కాబోలు! పరాయిమగావాడు భార్యని పోగాడుతూంటే, నీ అదృష్టంచూసి ఈర్ష్య పడుతుబ్బాబూ అంటే సగర్వమ్తెన హాస్యం పెదవుల మిద మెరిపించడం సభ్యత కాబోలు!
"కాస్త ఆవిడచేత అధ్తేనా మాట్లాడించరూ? బొత్తిగా మూగ బొమ్మలా ఉంది!"
"ఒకరు మాట్లాడిస్తే ఎంతవరకు మాట్లాడతారు?"
"నా భార్య కూడా పల్లెటూరి పిల్లే! పెళ్ళయినప్పుడు ఎలా ఉండే ధనుకొన్నారు? నాతో మాట్టాడ్డనికే భయపడిపోయేది. సాన పట్టగా,పట్టగా ఇప్పుడు చూడండి! ఎలాంటి వారోచ్చినా ఆధారాగోట్టేలా మాట్లాడుతుంది."
"ఇలా సిగ్గులు ఒలకబోసేవాళ్ళు లోలోపల కొంపలు ముంచుతారు"
"నా కేమి తినాలనిపించడం లేదు! మీరు వచ్చే వరకూ నేనిక్కడే కూర్చుంటాను" మల్లిక్ తో మెల్లగా చెప్పింది త్రిపుర.
"డిన్నర్ ఏర్పాట్లు పైన రూప్ గార్డెన్ లో జరిగాయి. పైకి పదండి"
"నీ కులం ఫీలింగ్ ఇక్కడ చూపించావంటే నిన్నో గోర్రెలా చూస్తారు. నవ్వులపాలు అవుతం? పద!" మల్లిక్ కదిలాడు.
" పుట్టినప్పటినుండి నేనేమీ ఎక్కడా తినలేదు" త్రిపుర నసిగింది.
"ఇప్పుడు తిను! డాక్టరుగారి భార్యగా నీకు అప్పడప్పడూ డిన్నర్లు తప్పవు! అలవాటు చేసుకో! ఇక్కడ అందరూ తింటుంటే నువ్వొక్క దానివి తినకపోతే ఎంత అసభ్యంగా ఉంటుంది?"
విదిలేనట్టుగా అతడితో కదిలింది త్రిపుర.
రూఫ్ గార్డన్ ఘుమఘుమలతో నిండిపోయివుంది! పువ్వుల వాసన కాదు! వంటకాల వాసన! ఎన్ని జంతువులు బల్తేపోయయో ఈ డిన్నర్ కి! వాటి మాంసం మాసలాలలో ఉడికి ఘుమఘుమ లాడుతోంది!
తినే వాళ్ళకి నోట్లో నీళ్ళూ రుతూంటే, తినని వాళ్ళకి కడుపులో త్రిప్పతోంది.
"నేను రానండి! ఆ వాసనకే కడుపులో త్రిప్పతోంది!"
"వెజి తెరియన్లకి వేరే వంటలు వంటలు సెపరేట్ గా ఉంటాయి పద!"
రమేష్ తండ్రి డిన్నర్ ఏర్పాట్లు చూస్తున్నాడు. "మీరు వెజి టేరి యన్ అనుకొంటాను! ఆ ప్రక్కకు వెళ్ళండి!" అన్నాడు మల్లిక్ తో!
"మల్లిక్ తినడం నేర్చుకొని రెండు సంవత్సరాల్తేంది! భర్య వెంటఉందని వెనుకడుగువేస్తే చెప్పలేం!" అన్నాడు ఒక ప్రెండు.
"అదేంలేదు! ఆవిణ్ణి ఇవాళంటే మోసగించగాలను! ఎల్లకాలం ఎలా మోసగించగాలను! అది ఎప్పుడో ఓ సారి తెలుసు కోవాల్సిందే! త్రిపురా నువ్వాటు వెళ్ళు! నేను ఇటు వెడతాను!" మాంసాహారుల వ్తెపు వెడుతున్న భర్త కేసి స్ద్గాణువ్తే చూడసాగింది త్రిపుర. ఉల్లి పాయ వాసన కూడా గిట్టని సద్బాహ్మనుడి కొడుక్తే ఇంత దిగజారి పోయాడా ఆయన!