అంతమందిలో త్రిపుర ప్రత్యేకంగా సహజ సౌందర్యంతో వెలిగిపోతోంది. మగవాళ్ళు ప్రశంసగా ఆడవాళ్ళు కళ్ళలో ఈర్ష్య నిండుకోగా చూస్తున్నారు.
డాక్టర్ నలిని అడిగింది "వేసవికదా, ఉక్కబోయడం లేదూ, పట్టుచీరలో? కట్టుకొన్న చీరమనకు అందం ఇస్తుందా లేదా అనికాదు చూడాల్సింది. మనకు సౌఖ్యంగా ఉందా లేదా అని చూడాలంటాను!"
త్రిపుర పెదవులమిద చిరునవ్వు మెరిసింది. "అసలు బట్టలే లేకుండా ఉంటే మరింత సౌఖ్యంగా ఉంటుంది కదా?"
"వేసవికదా?" కాస్త హాయిగా ఉండే దుస్తులు వేసుకోవాలన్నాను? వెక్కిరింపుగా ఆ జవాబు ఏమిటి?" నళిని చర్రుమన్నట్టుగా అంది.
"ఎంత పొడుగు జడో! జుట్టు బాగుంది కదూ?" త్రిపుర టేబిల్ కి కొంచెం అవతల ఒక డాక్టరుగారి భార్య,చిన్న గొంతుకతో ప్రక్కనున్న డాక్టరు భార్యతో అంది.
"అది అస్సలు జడంటే నేనునమ్మను! సవరం వేసి ఉంటుంది."
"కాదు అస్సలు జాడే! సవరం వేస్తే అంత విత గా ఉండదు జడ!"
"బెత పదిరూపాయలు! కావాలంటే విప్పిచుడు! బండారం బయటపడుతుంది".
"డాక్టరుగారి భార్య త్రిపుర దగ్గరికివచ్చి, ఏమి అనుకోకండి! మీ జడ ఒకసారి విప్పి చూస్తాను!" అంది.
"ఎందుకు?" త్రిపుర తెల్లబోయి అడిగింది.
"పది రూపాయలు గెల్చుకుందుకు!"
"నా జడ నిప్పితే మీరు పదిరూపాయలు ఎలా గెలుస్తారు?"
"ఆవిడ పందెం కట్టింది! మిది అస్సలు జడ అని! కాదని మరో కావిడ! విప్పి చూపండి" మరొకామె మధ్యవర్తిత్వం స్వీకరించి చెప్పింది."
"జడ విప్పితే మళ్లి వేసుకోవడం నాకు చాతకాదు." త్రిపుర ముఖం దిగులుగా పెట్టింది.
"దువ్వేనతేచ్చి దువ్వి నిట్ గా మళ్లి నేను వేస్తాను! ప్లీజ్ జడ విప్పరూ?"
నా జడ మిద మీరు పందెంకాయడం నాకు చాలా దారుణంగా కనిపిస్తూందండి! మర్యాదగల మనుషులు చేయవలసిన పని కాదిది!" చురుగ్గా అంది త్రిపుర.
"జడ విప్పడానికి ఒప్పుకోవడం లేదంటే తెలిసిపోవడం లేదూ? పది రూపాయలు ఇలాతే."
"ఉన్నజుట్టు మేయలేకే బాబ్డ్ చేయించు కొంటుంటే సవరాలేలా మోస్తారో, బాబూ!" ఒక బాబ్డ్ హెయిర్ అంది.
త్రిపుర చుట్టూ ఆడవాళ్ళు గుమిగూడడం మగవాళ్ళకి ఆసక్తి గొలిపింది.
మల్లిక్, సుందర్ వచ్చారు.
"ఏమిటి, మిసెస్ రవీంద్రా?" మల్లిక్ అడిగాడు.
"కాస్త జడవిప్పమంటే మీ మిసెస్ భలే బెట్టు చేస్తూంది!"
ఇద్దరు బెత వేసుకొన్న సంగతి ఇందాకా మధ్యవర్తిత్వం నెరపి నావిడ చెప్పింది.
"కమాన్, త్రిపురా! వాళ్ళేదో సరదా పడుతూంటే నువ్వు బెట్టు చేయడం బాగాలేదు! జడ నేను విప్పనా?" ఈ విషయం సరదాగా తేల్చి వేయాలని తెచ్చి పెట్టుకొన్న నవ్వుతో అన్నాడు మల్లిక్. వాళ్ళ దృష్టిలో తన భత్య కుసంస్కారిగా ముధ్రపడడం ఇష్టంలేదు!
"మంచి సరసమ్తెన సిన్. మీ భార్య జడని మీరు విప్పతున్న ఫోటో ఒకటి తీసుకో నివ్వండి." ఫంక్షన్ ఫోటోలు తియడానికి వచ్చ్సిన ఫోటో గ్రాఫర్ కెమేరాతో ముందుకు వచ్చాడు.
"నువ్వు తీసే ఫోటో నా భార్యకి జడ వేస్తున్నట్టుగా పడుతుందేమో!" మల్లిక్ పెద్దగా నవ్వాడు.
"నా కేశ సౌందర్యానికి రహస్యం శ్రీ వారిచేత జడవేయించు కోవడమే! అని అడ్వర్ టైజ్ ఇవ్వోచ్చులేండి!"
మక్ల్లిక్ త్రిపుర జడ విప్పాడు జుట్టంతా విపుమిధ పరుచుకోనేలా చేతితో విదిలించాడు. సగర్వంగా చూశాడు అందరివ్తెపూ.
త్రిపుర వీపు మిద పరచుకోన్నది జుట్టో , జలపాతమో తేల్చుకో లేక పోతున్నట్టుగా చూస్తున్నారు ప్రేక్షకులు,మళ్ళి మళ్ళి చూడాలంటే దొరకని దృశ్యం చూస్తున్నట్టుగా చూస్తున్నారు.
సుందర్ ఎక్కడినుండో ఓ కెమెరా పట్టుకువచ్చి, మల్లిక్ త్రిపుర జడ పట్టుకోన్నప్పడు ఒక ఫోటో నూ తీశాడు. "ఈ రెండు ఫోటోలకి చక్కటి వాఖ్యలు జత చేసి పత్రికకి పంపి బహుమతి తేచ్చుకోంటా ను చూడు" అన్నాడు.
"మీ జుట్టు విషయంలో మీరేం జాగ్రత్తలు తీసుకొంటారు, మిసెస్ మల్లిక్?" ఒక అంగ నామణి త్రిపుర జుట్టుని అపురూపంగా చూస్తూ అడిగింది.
"ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏం తీసుకోను!"
"ఏం షాంపూ వాడతారు?"
"సి కాయపొడి వాడతాను! కొబ్బరినూనె పెడతాను!"
"నాజుట్టు విషయంలో నేనెన్ని జాగ్రత్తలు తీసుకొన్నా నన్నొల్లనని వెళ్ళిపోయింది నాజుట్టు! చివరికి ఈ కొత్తి మీర కట్ట మిగిలింది" అంటూ, రబ్బరు బాండ్ తో కట్టిన నాలుగు వెంట్రుకల్ని చేత్తో ఊపి చూపించింది ఒకావిడ.
"అంతకు రెట్టింపు జుట్టు నాకుండేది! తలకి పోసుకోవాలంతే నా ప్రానంమిదకి వచ్చేది! జుట్టు చిక్కులు తీసుకోవాలంటే చేతులు పట్టుకు పోయేవి! ఆ బాధంతా పడలేక జుట్టు బాబ్డ్ చేయించుకొన్నాను!" అంది మరొక బాబ్డ్ హెయిర్.
"ప్చ్! అంత జుట్టుని కత్తిరించుకోడానికి నీకు చేతులేల్లె వచ్చాయి?" కొత్తిమిరకట్ట వాపోయింది.
"ఒపే, సరళా! నిన్ను చిన్నప్పటినుంచి నేనెరుగుదును! ణి జుట్టు ఇంతకు రెండింతలు ఎప్పుడు ఉంది? ఎందుకోచ్చినా కోతలే? తలంతా పెలతో పుచ్చిపోతుంటే ఆ బాధ పడలేక మీ ఆమ్మ మంగలిని పిలిచి గుండు చేయించేది! చివరిసారి పదిహేనేళ్ళప్పుడు చేయించింది గుండు నీకు జ్ఞాపకం లేదేమో గాని నాకుంది!"
"నీ కుళ్ళుబుద్ది పోనిచ్చుకున్నావు కాదు! పరువు తిపే మాటలు మాట్లాడకు!"
"ఈ ఫంక్షన్ సరదాగా గడిచిపోనివ్వరా ఏం?" అన్నాడో కాయన, వాళ్ళిద్దరు సిగపట్లకు తయారవుతుంటే! ఆయనే త్రిపుర వేపు తిరిగి "లోపల డ్రెస్సింగ్ టేబిల్ ఉంది. వెళ్ళి జడ వేసుకోండి!" అన్నాడు మర్యాద ఉట్టి పదే స్వరంతో.
"ఫర్వాలేదు ఊరికే అల్లుకోంటాలేండి"
"మొహం చూస్తే మోహనంగి! అలంకరణ చూస్తే అడవి మనిషి అన్నట్టుగా ఉంది మీ మిసెస్ . రేపటి నెలలో నేను స్ధాపించబోయే బ్యూటి పార్లర్ కి తీసుకురండి. జగదేక సుందరిని చేసి వదిలేస్తాను" అంది ఒకావిడా.
మల్లిక్ ముఖం మ్లానంకాగా " ఫ్యాషన్ గా ఉండాలని ఎంతో చెబుతాను! వినదు; మొండిమనిషి! ఈ మనిషిని ఎలా దారికి తేవాలో తెలియడం లేదు నాకు!" అన్నాడు నాద పడిపోయి.
"నువ్వు ఏంఅనుకోనంటే ఒకమాట చెప్పనా?" సుందర్ అడిగాడు.
"ఏమిటి?" అన్నాడు మల్లిక్.
సరిగ్గా ఇప్పుడు ఎలా ఉందో, అలాగే ఉండనిస్తేనే ఆవిడ అందంగా ఉంటుంది. ఎక్కడా ఏం మిట్టు కొన్న చెడిపోతుంది. ఇంత అందమ్తెన భార్యను పొందిన నువ్వెంతో అదృష్టవంతుదివానీ మరోసారి చెబుతున్నాను ,అల్లిక్! ఇందరు ఆడవాళ్ళ మధ్య చుక్కల్లో చంద్రుడిలా ఉందంటే నమ్ము" త్రిపురని ఆరాధనగా చూస్తూ అన్నాడు సుందర్.
"థాంక్యూ" అన్నాడు మల్లిక్, ముఖం లో గర్వం తొణికిసలాడగా.
త్రిపుర చెంపలు ఎర్రబడిపోగా కళ్ళే త్తి ఎవరి కేసి చూడలేనట్టుగా తల దించుకుంది. త్రిపురమిధ ప్రశంసలూ, విమర్శలూ ముగిశాయి.