Previous Page Next Page 
పెళ్ళి మంటలు పేజి 6

    "మీరు ఇటురండమ్మా!"

    శాఖాహారుల వ్తెపు అయిదారుగురి కంటే ఎక్కువలేరు!  అది ఆడవాళ్ళే!

    స్టిల్ ప్లేట్లలో  ఏవేవో వడ్డిస్తున్నారు!  తినమని బలవంత పెడుతున్నారు!  తినకపోతే  బాగుండదేమోనని  మ్తేసూర్ పాక్  బిళ్ళలు రెండు  తింది.  ఇంకేం తినాలనిపించలేదు.  కడుపులో త్రిప్పతున్నట్టుగా ఉంది!

    చూడకూడదనుకొంటూనే  అటు చూసింది త్రిపుర.  మల్లిక్ చేతిలో ఎముక పట్టుకొని పళ్ళతో  పీక్కు తింటున్నాడు!  ఇంచుమించు అందరూ అదే పనిలో ఉన్నారు!

    తం పొలంలో ఓసారి చనిపోయిన ఎద్దు చర్మాన్ని ఒలుచుకొని కళేబరాన్ని  పారవేసిపోయారు ఎవరో కళేబరాన్ని చుట్టుముట్టిన కుక్కలు ఆలాగే పీక్కు తింటున్నాయి.  ఎర్రగా,  కండలు కండలు!

    త్రిపురకి కడుపులో తిప్పడం ఎక్కువ్తే పోయింది.

    భళ్ళున వాంతి అయింది.

    "అరె! ఏమిటి? ఏమ్తెంది?"  అందరూ గాబరాగా చుట్టుముట్టారు.

    తిన్న మ్తేసూర్ పాక్ కక్కేసి ఆయాసపడి పోతున్న త్రిపుర ఏం మాట్లాడలేకపోయింది.

    చుట్టు ప్రక్కల తింటున్న వాళ్ళంతా ప్లేట్లు వదిలేసి చేతులు కడుక్కున్నారు.

    "వేవిళ్ళ? చెప్పలేదేం ?  కంగ్రాచ్యులేషన్స్ మల్లిక్!"

    "ఆవిణ్ని క్రిందికి తిసికేళ్ళండి!  పాపం,  ఈ వాసనలు పడనట్టుంది!  రాజయ్యా! ఈ టేబిల్  క్లీన్ చేద్దువురా!"  రమేష్  తండ్రి నౌకరుకి పురమాయించాడు.

    ఆ రాత్రి ఇంటికి వచ్చాక కావలసినన్ని చివాట్లు పెట్టాడు మల్లిక్,  త్రిపురను. 

    "అందరూ భోజనాలు చేస్తుంటే ఎంత అసహ్యమ్తెన  దృశ్యాన్ని కల్పించావు!  అందరూ భోజనాలమీదినుండి లేచిపోయేలా చేశావు కదా?"

    "ఆ వాసనలు పడలేదు నాకు!  నేనసలు రాననే  చెప్పాను కదా?"

      "మరో సారి ఇలా పెంకెమాటలు మాట్లాడితే పళ్ళురాలగోడతాను! నావెంట రావలసిందే!  నాకనుగుణంగా నడుచుకోవలసిందే!"  ఖచ్చితంగా ఆర్డర్ పారేశాడు మల్లిక్.

    "నేను ఎద్తేనా భారిస్తానేమోగాని మీరు మాంసం తింటానంటే  మాత్రం భరించలేను!  బ్రాహ్మణ పుట్టుకపుట్టి  ఏమిటా తిండి?"

    "ఏం  తింటావో,  ఏం మానేస్తానో అది పూర్తిగా నాఇష్టం! నువ్వెవరు  చెప్పడానికి?  తినడం మానెయ్యడం కాదు,  రేపు ఓ కొన్ని తెచ్చి వండి పెట్టమంటాను! వండిపెట్టాలి నువ్వు!"

    "మీరు తింటేనే సహించలేనిదాన్ని,  మీకు నేను వండి పెడతానా?  అది ఈ జన్మలో జరుగని పని ! అయినా మీరు ఎంత అసహ్యంగా తయారు అయ్యారు!  తినకూడనివి  తినడం!  ఆడవాళ్ళతో  రాసుకు పూసుకు తిరగడం, మీ భార్యని  పరాయిమగాళ్ళతో  త్రిప్పడం- ఇదంతా నవనాగరికత?  మాట్లాడితే సభ్యత  సంస్కారాలు అంటారు! వాసనే గిట్టని మీ భార్యతో కోడిని వండించుకు తినడం సభ్యత?  అంతా మీరు చెప్పినట్టుగానే వినాలనడం సభ్యతా?ఏం? మీ భార్య మనసు తెలుసు కొని  ఆమెను నొప్పించకుండా  తిరగడం సభ్యతకాదా?  భార్య అంటే మీ బండికికట్టిన  ఎద్దు ఏదో అయి నట్టు ఆమె మీద అధికారం చేలాయించాడమేనా  సంస్కారమంటే?"  త్రిపుర నదురు బెదురు  లేకుండా ఎదురు ప్రశ్నించింది.

    "మీ భర్త డాక్టరు!  సమాజంలో అతడికొక ఉన్నత స్ధానం ఉంది. అతడి ననుసరించి నడుచుకోవడం భార్యగా నీ ధర్మం! కానీ,  విన్నను  సరించడం నా ధర్మంకాదు  అయినా నా వయసు లో  నీ వయస్సెంత?  నా అనుభవంలో నీ అనుభవమెంత?  నాకు తెలిసినదాంట్లో  నీకు తెలిసిందేంత?  సగం కూడా లేవు! అలాంటప్పుడు నా అధికారం ఒప్పుకోవడంలో నామోషి ఏంలేదు  నీకు!"

    "సంసారంలో చెరిసగమేకదా? నేను లేనిది మీరులేరు! మీరు లేనిది నేనులేను!  అలాంటప్పుడు నా మీద  మీ అదికారం ఎంతుంటుందో మీమీద  నా అధికారం అంతుండాలి!  వయసులో,  చదువులో,  తెలివిలో మీరు ఎక్కువున్నంతమాత్రాన నేను మిక్రిందపడి వుండాల్సిన అవసరం లేదు!

    "అడుగడుగునా ఇలా దిక్కరించే నితో నేను కూడా కాపురం చేయలేను!  నేను నచ్చనప్పుడు  నువ్వు నీ దారి చూచుకోవచ్చు!"  మల్లిక్  కూడా  తన అభిప్రాయాన్ని  ఖచ్చితంగా చెప్పేశాడు.

    మరునాడు ఉదయమే అత్తగారి తో  చెప్పింది త్రిపుర: "మా వూరికి పంపించెయ్యండి,  అత్తయ్య, నన్ను!"

    "ఎందుకే?  ఏం జరిగింది?"

    "మీ డాక్టరు కొడుక్కి నేను తగిన భార్యని కాదు! తగిన భార్యని చూచుకోంటారేమో! నన్ను పంపించేయ్యండి!"

    "వాడు తగిన భార్యను చూచుకొంటే  నువ్వు తగిన భర్తను చూచుకోంటావా?"  యశోదమ్మ కటు స్వరంతో అడిగింది.

    "అత్తయ్య!"

    "ముల్లు  అరిటాకుమీదపడ్డా,  అరిటాకు ముల్లుమీదపడినా అన్నట్టు తప్ప,  అతడిద్తేన చేడిపోయేది  మాత్రం నువ్వె! నువ్వు తొలగిపోతే వాడు మళ్ళి పెళ్ళి చేసుకుంటాడు. సుఖపడతాడు!  కానీ,  నువ్వు? మనసులో కూడా  ఆ భావం  రానియని  సంప్రదాయ కుటుంబంలో  పుట్టి పెరిగిన పిల్లవు! జీవితం నాశనం అయ్యేది  నికేకదా? త్రాగుబోతులతో,  కూని కోరులతో,  వ్యభిచారులతో కాపురం చేసే భార్యలున్నారు!  అంతకంటే హినమౌతుందా నీ కాపురం?  వాడు డాక్టరు!  వాడివి  మొదటినుండి పెద్ద పెద్ద పోకళ్ళు!  గోప్ప గోప్ప  వాళ్ళతో స్వేహాలు చేసుకోవడం వాళ్ళలాగా గొప్పగా బ్రతకాలనుకోవడం వాడికి  అలవాటు,  వాడి మనసు గ్రహించి వాడికి నచ్చినట్టుగా మెలిగితే నీ ముల్లెంపోయింది?  కొంతకాలం ఓపికపట్టి  వాడు చెప్పినట్టుగా నడుచుకోంటే,  ఆ తరువాత జీవితఅంతా  నీమాట వాడు వినే  అదికారం సంపాదించుకోవచ్చు నువ్వు!"

    "బ్రాహ్మణుడ్తె పుట్టి మాంసం తినడం పాపంకాదా,  అత్తయ్యా?"

    "ఆ తప్పోప్పలు  నిర్ణయించాల్సింది భగవంతుడు !  నువ్వు, నేను కాదు!"

    "తల్లిగా నువ్వు ఆయనకీ ఏమి చెప్పలేవా?"

    "నేను చెబితే వినేవయసు దాటిపోయిందమ్మా! వాడ్ఫు చెబితే మేం వినే రోజులివి"


                                                       4

    మల్లిక్ ఎక్కడికో బయలుదేరుతున్నాడు.

    గడపలో కాలుతిస్తూంటే  సుందర్  కారు దిగాడు.

    "అరె! ఎక్కడికో బయలుదేరుతున్నావు"

    "పనిమీద వెడుతున్నాను!"

    "నేనూ ఒక పనిమీద వచ్చానే!"

    "ఏమిటి?"

              "త్రిపుర   సుందరిగారిని  తీసుకు వస్తానని అమ్మకు మాటిచ్చి వచ్చాను!"

    "తిసికేళ్ళు!  దానికేం!"

    "నువ్వూ వస్తే బాగుంటుంది?  తనోక్కతి ఎలా వస్తుంది"

    "రావడానికేం? కారులో తీసికెళ్ళి కారులో  దించేస్తావు!"

    "అడిగి చూడుమారి; వస్తుందేమో;  రెండు గంటల  తరువాత క్షేమంగా  దిగాబెడతాను"
    మల్లిక్ లోపలికివెళ్ళి  త్రిపురతో చెప్పాడు "నిన్ను తీసుకువస్తానని సుందర్ వాళ్ళమ్మకు మాటిచ్చివచ్చాడట!  నేను రావడానికి వీలుకాలేదు; అర్జెంటు పనిమీద  వెడుతున్నాను.  సుందర్ నిన్ను కారులో తీసికెళ్ళి కారులో వదిలేస్తాడు.  త్వరగా తయర్తే వెళ్ళు"

    "మీరు లేకుండా నేనొక్కదాన్ని  ఎలా వెళ్ళను?"

    "ఒక్కదానివి వెడితే ఏమౌతుంది?  ఎవరూ కోరుక్కుతినరులే"  కొంచెం చిరాకుగా అన్నాడు మల్లిక్. "బయట ద్తేర్యంగా స్వేచ్చగా తిరగడం నేర్చుకోకపోతే మీ  స్త్రి జాతికి మోక్షం ఉండదు!   మగడి అదికారం అమగికరించడం నామోషి అనుకోంటున్నావు! మళ్ళి ఆయన పంచకొంగుపట్టుకు  తిరగాలను కొంటావు! ఈ పరస్పర విరుద్దమ్తెన  భావాలమధ్య కొట్టుకొంటూ లేనిపోని సమస్యలు తెచ్చుకోంటుంది మీ స్త్రి లోకం" 

 Previous Page Next Page