ఆ తెల్లవారుఝామున అర్చన తనని రోడ్డుమీద వదిలిపెట్టాక విష్ణుశర్మకి ఏం చెయ్యాలో తప్చలేదు. ఇంటికి కూడా వెళ్ళబుద్ధి కాలేదు. తనే హొటలునుంచి ఫోన్ చేసేడో, ఆ హొటల్ లుకి వెళ్ళి ఒక కప్పు టీ తాగేడు.
తను తప్ప మిగత ప్రపంచం అంతా సంతోషంగా వున్నట్టు అనిపించింది. ఎవరిమీదోతెలియని కసి_ ఉక్రోషం అతనిలో చోటుచేసుకుని, ఏ క్షణమైనా ఉబికి వచ్చేలా వున్నాయి.
టీ తాగి, అతడు ఇంటివైపు వెళ్ళకుండా తిరిగి జైలువైపు నడిచాడు. ,మెయిన్ గేటు దగ్గర గార్డు అతణ్ని పలకరించాడు. కానీ శర్మ అది పట్టించుకోకుండా లోపలి నడిచాడు. రాత్రి డ్యూటీ చేసిన వాళ్ళకి మరుసటి పక్కనే కుర్చీలో కూర్చుని అరచేతుల మధ్య తల అన్చుకుని కళ్ళు మూసుకున్నాడు.
"అలా వున్నావేం భాయ్?" అడిగాడు తోటి సెంట్రీ. అతడు మాట్లాడలేదు. కొద్దిక్షణాల్లో __చాలా కొద్దిక్షణాల్లో .... తమకి ఓ రెండువందల గజాల దూరంలో చిరంజీవి మరణించబోతున్నాడని అతడికి తెలుసు. కనుచూపు మేర నిశ్చబ్ధంగా, నిర్మానుషంగా వుంది. అంటే అందరూ అక్కడికి చేరుకున్నారన్నమాట. అతడు కళ్ళు తెరచి, దూరంగా కనడ్తున్నతెల్ల టిగోడవైపు చూసేడు. గోడమీద పక్షి__ అది డేగో, రాబంధో తెలియటంలేదు. అవతలివైపు జరిగే తమ్తుని ఆసక్తిగా చూస్తూంది.
అతడు తలతిప్పిజైలు గడియారం వంక చూస్తున్నాడు.ఇంకొక్క నిముషం వుంది. ముసలి వాచ్ మెన్ అప్పుడే జైలు గంటలు కొట్టటం కోసం మెట్లెక్కి టాడు పట్టుకున్నాడు.
శర్మ పిడికిళ్ళు బిగించి, నుదురు టపటపా కొట్టుకున్నాడు.
* * * *
తలారి తాడుని చిరంజీవి మేడలో చుట్టూ బిగించాడు. బిగిస్తూ అన్నాడు...... "బాబూ ...ముందు లివరు శబ్దం వినిపిస్తుంది. అప్పుడే కాళ్ళక్రిందతలుపు తెరుచుకోవటం ప్రారంభం అవుతుంది. లివరు శబ్దం వినిపించగానే మనసులోకి మరే ఆలోచనా రానివ్వక దేముణ్ణి ప్రార్దించు..."
తలార్లు ఖైదీలతో చాల జాలి చూపిస్తూ మాట్లాడతారు.ఆఖైదీ ఎన్నో హత్యలు చేసినవాడై వుండొచ్చు. దారుణ మారణకాండ జరిపిన వాడై వుండొచ్చు. కానీ ఆ క్షణం నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోబోతున్నాడు. ఆ బాధేమిటో తలార్లుకే తెలుస్తుంది.
రెండు తలుపులూకలిసేచోటు చిరంజీవి కాళ్ళకి తాకుతూ౦ది. అతడు నిశ్చలంగా నిలబడ్డాడు. ఇప్పుడిక ఏ బాధాలేదు. ప్రాణాలు పోవటానికి ఇకకోద్ది క్షణాలే. అతడు దేముణ్ణి కూడా ప్రార్ధించటం లేదు. భారత దేశపు రాజ్యంగా నిర్మాతల్ని ప్రార్ధిస్తున్నాడు. "ప్రభువుల్లారా ఉరిని రద్దుచేయండి!" అని మనసులోనే వేడుకుంటున్నాను. మరి అది ఆ మేధావుల వరకూ చేరిందో లేదో తెలీదు. తలారి లివరు వద్దకు వెళ్ళిన అడుగుల చప్పుడు వినిపించింది. చిరంజీవి ఆఖరిసారి గుండెల్నిండాగాలి తీసుకుని,ఊపిరి బిగాపెట్టి అచేతనుడయ్యాడు. టైమ్ అయినట్టు మాజీస్ట్రేట్ ధర్మారావ్ వైపు చూసేడు. ధర్మరావ్ తలూపి, వాచీ చూసుకొన్నాడు. దారికి ఇటూ, అటూ వున్న గార్డులు అటెన్షన్ లో నిలబడి వున్నారు. అందరూ శిలాప్రతిమల్లా నిలబడి వుండటంతో గాలికూడా స్థంభించినట్టయింది. ధర్మారావ్ కదిలాడు సెకన్ల ముళ్ళు పన్నెండు మీదకి రాగానే కర్చీఫ్ పైకి యేత్తాడు. చేతిని అతడు పైకియెత్తగానే, తలారి లివర్ ని రెండుచేటులతో పట్టుకుని జరపటం మొదలుపెట్టాడు.
సరీగ్గా అదే సమయానికి, ఆ నిశ్చబ్దాన్నిచేదురుస్తూ, మెయిన్ ఆఫీసులో టేబిల్ మీద ఎంట్రీ బుక్ పక్కనే వున్న ఫోన్ మ్రోగింది. మోచేతులమీద తల ఆన్చి నిస్రాణగా కళ్ళు మూసుకుని వున్న శర్మ ఫోన్ ఎత్తి 'హాలో' అన్నాడు.
ఒక కంఠంచాలా తాఫీగా, "దిసీజ్ పి.యస్.టు గవర్నర్ ..... కేన్ ఐ స్పీక్ " __ అని నెమ్మదిగా అంటూంది. శర్మ చేతిలోరిసీవార్ బిగుసుకుంది.ఒక్కసారిగా రక్తం మొహంలోకి తన్నుకొచ్చింది దాదాపు అరుస్తున్నట్టూ "..... చిరంజీవి గురించా"అన్నాడు.
"యస్. ది గవర్నర్ వాంట్స్ టు స్పీక్."
ఆ మాటల్ని మధ్యలో అపుచేసి, "అర్చనగారున్నారా అక్కడ" అని అరిచాడు శర్మ.
"ఉన్నారు"
అంతే అతను పోన్ వదిలేసేడు.తనంత తొందరగా ఒక నిర్ణయానికి రాకూడదనీ, ఆ నెంబర్ తీసుకుని మళ్ళీ అదే నెంబర్ కి ఫోన్ చేసి నిర్ధారణ పరచుకావాలనీ ఆ తరువాత తనపై అధికారులకి ఆ విషయం తెలపాలనీ అతడికి తెలుసు. అంతేకాదు, ఒకవైపు ఉరి అమలు జరుపుతూ వుండగా, సెక్యూరిటీ ఏర్పాట్లు బాగా పకడ్భందిగా వుంటాయనీ,సెంట్రీ దుస్తులతోవున్న తను ఏమాత్రం తొందరపడి ప్రవర్తించినా, అది తన ఉద్యోగానికి ముప్పు తేవటమే కాక తనకి జైలు శిక్ష పడేటట్టూ చేస్తుందని అతడికి తెలుసు. అయినా అతడు అదేమీ అలోచించలేదు. ముసలి వాచ్ మెన్ తాడు లాగి గంటలు కొట్టటం ప్రారంభీంచేడు.
అతడు లేవటం,కుర్చీ వెనక్కీ తోసి మైదానం వైపు పరుగెత్తడం ఒకేసారి జరిగినయ్.పక్కనున్న వార్డెన్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. శరీరంలో వున్న శక్తినంతా అరికాళ్ళలోకి తెచ్చుకుని దాదాపు గాలిలో ప్రయాణం చేస్తున్నావాడిలా పరుగెత్తాడు. క్షణానికి ఎంత విలువుందోఆ క్షణం తెలిసింది.
ఆ క్షణం గడిచిపోయిందా?
ఏమో!
జైలు గంటలు మ్రోగుతూనే వున్నాయి.