ఎదురుగా ఎత్తైన గోడ,ఇనుప తలుపు. అక్కడ నిలబడి అతడు దిక్కులు చెదిరిపోయేలా_ ప్రకృతి కదిలిపోయేలా_ గొంతులో రక్తనాళాలు తెగిపోయేలా "అపండీ!!" అనికేకపెట్టాడు. ఆకేకకి గోడమీద కూర్చున్న డేగ రెక్కలు టపటప కొట్టుకుంటూ గాలిలోకి లేచింది. నిశ్చబ్దంగా ఆ రెక్కల చప్పుడికి మరింత చెల్లాచేదరైనట్టయింది. తరువాత ఏం జరిగిందో శర్మ తెలియదు. గొంతు పగిలేలా అరిచిన ఆ అరుపులతో పాటు అతడికి స్పృహా తప్పింది.మోకాళ్ళమీద నేలమీదకి సొమ్మసిల్లినట్టు జారిపోయాడు.
మళ్ళీ తిరిగి శర్మకి స్పృహా వచేసరికి,ఇద్దరు గార్డులు చెరో వైపునా కనబడ్డారు. మోహంమీద నీళ్ళు జల్లి తుడుస్తున్నారు.
చప్పున లేచి కూర్చుంటూ "ఆ చిరంజీవి.... అదే... ఖైదీ.... ఉరి__ ఏమైంది" అనిఅదిగాడు తడబడుతూ.
"మాజిస్త్రేట్ సాబ్ ఫోన్లో మాట్లాడి వచ్చి కాన్సిల్ చేసిండుగా" అన్నాడు సెంట్రీ. శర్మ తాపీగా కళ్ళు మూసుకుని వెనక్కీ వాలెడు. మళ్ళీ అతడికిస్ప్రుహా తప్పిందేమోఅనుకుని నీళ్ళు జల్లారేవరో. శర్మ కళ్ళు తెరవలేదు. మోహంమీద అలల్లా నీళ్ళు పడుతూవుంటే హాయిగా వుంది. మనసుకూడా హాయిగా ఎక్కడో టెలిపోతున్నట్టూ వుంది.
"కథ సుఖాంతమైందన్న మాట" అనుకున్నాడు శర్మ. అసలు కథ అప్పుడే ప్రారంభం అయింది.
మూడోఅధ్యాయం.
రకరకాల లైట్లకాంతిఆ హలులో ధగధగా మెరుస్తూంది. చిరంజీవి పుల్ సూట్ లో వున్నాడు. గెలుపు తెచ్చిన అనందం అతడి మొహానికి అడోలాటి మెరుపుని సమకూర్చింది. నీట గా షేవ్ చేసుకున్న చెంపల మీద వెల్తురుపడి అందంగా మెరుస్తూంది. ఆ హాల్లో దాదాపు పాతికమండి దాకా అతిథులు వున్నారు. ఆడవాళ్ళు కళ్ళు మాటిమాటికీ చిరంజీవి మీద పడటం చూసి తనలో తనే అర్చన నవ్వుకొంటూంది. సర్వోత్తమరావు ఒక్కడే అక్కడలేదు. ఇంకా తోడ ఎముక ఎటుక్కుని కారణంగా అయన నర్సింగ్ హొమ్ లోనే వున్నాడు.
ఒక ఫోటోగ్రాఫర్ ప్లాష్ తో చిరంజీవిని ఫోటోలు తీస్తున్నాడు. ఇద్దరు, ముగ్గురు జర్నలిస్టులు అతడివద్ద చేరి ఉరికి సంబంధించివివరాలు అడుగుతూన్నారు.
"ఇంతవరకు చరిత్రలో ఎక్కడా మెడలో తాడు వేసిన తర్వాత బైటపడటం అనేది జరగలేదు. ఆ క్షణం మీరెలా ఫీలయ్యారు."
చిరంజీవి నవ్వి "చెప్పలేను" అన్నాడు. "నాకు భాష సరీగ్గా రాదు. బహూశామనసంతా వేదాంతం నిండివుందేమోఆ క్షణం చెప్పలేను."
"ఉరికన్నా ఎలక్ట్రిక్ చెయిర్ మంచిసాధనమేమోప్రాణాలు తియ్యటానికి" అన్నారేవరో.
"ప్రాణాలు ఎంతసులభంగా తీయగాలమో అన్నదికాదు మేం కోరుకునేది. అసలు మరణశిక్షనే రద్దుచేయాలని" అంటూ చిరంజీవి అక్కణ్నుంచి మరోగ్రూపు వద్దకు కదిలేదు.అర్చన అక్కడే వుంది. అతడిని చూసి నవ్వింది.
ఆ గ్రూపులోనే వున్న లావుపాటావిడ చిరంజీవిని చూసి, "ఏమబ్బాయ్ మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావ్" అంది, ఆవిడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి భార్య. చిరంజీవి నవ్వి వూరుకున్నాడు. అర్చన అతడివైపు ఓరగా చూసింది.
"ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుంది" అడిగిందామె మళ్ళీ.
ఇంకా పూర్తవటానికేముంది" అన్నాడామే భర్త. అతడు ప్రాసిక్యూటరేగానీ, చిరంజీవికి వ్యతిరేకంగా వడించినవాడు కాదు. ఈయనకి నలభై అయిదేళ్ళు౦టాయి. 'లా' క్షుణ్ణంగా తెలిసినవాడు. "సర్వోత్తమరావుగారిసాక్ష్యంతోకేసు కొట్టేస్తారు. అప్పటివరకూ మాత్రం బెయిల్ మీద వుండాలి" అని చిరంజీవివైపు తిరిగి "మొత్తంమీద భలే సెన్స్ షేన్ క్రియేట్ చేసేవోయ్. ఈ ఉరి రద్దుగురించి పేపర్లు ఏడిటోరియల్స్ వ్రాయుటము మొదలు పెట్టినయ్. అధికార వార్తా ఏమిటంటే, అప్పుడే డీల్లిలో ఈ రద్దుకోసం 'కదలిక' మొదలై౦దట! కొంతమంది ఏమ్. పి. లు. ప్రధాన మంత్రిని కలుసుకున్నారట కూడా."
"కంగ్రాచ్యులేషన్స్"
ఆ ప్లాతరీతో చిరంజీవి అక్కణ్ణుంచి తప్పుకుని హాలు బైట బాల్కానీలోకి వచ్చాడు. బోగన్ విల్లా అందంగా వూగుతుంది. గాజు అద్దాల వెనుకనుంచిజనం నీడల్లా కనబడుతున్నారు.
అతడు ఒంటరిగా నిలబడి వుండటం చూసి, అర్చన కూడా బైటకి వచ్చింది. ఇద్దరూ చాలాసేపుమౌనంగా వున్న తర్వాత, ఆ నిశ్చబ్దాన్ని చేధిస్తూ "ఐయామ్ సారీ అర్చనా" అన్నాడు.
ఆమె విస్మయంతో "ఎందుకు" అంది.
"ఇదంతా చిన్నపిల్లవాడిలా చేసెను. అనవసరంగా మీ అందరికీ టెన్షనూ,పేపర్లోనీ గురించి ఒక హంతకుడిని ప్రేమించిన అమ్మాయిగా వర్ణించటం ..... నీ సర్కిల్స్ లో అది నీకు తలవంపులు" అంటూ యోదోఅనబోతూవుంటే ఆమె వారిస్తూ, "నువ్వు ఇదంతా చేసింది ఒక ఆశయ సాధనకోసం ! పైకి నవ్వుగానే వాళ్ళకే తెలుస్తుంది" అంది.
"కానీ..." అంటూ ఏదో అనబోయేడు.
"ఇక అదంతా మర్చిపో. ఈ హత్య__ జైలు, అంతా ఒక కల అనుకో."
అతడు నవ్వి "సుశీల గురించి కూడా మర్చిపోమంటావ్" అన్నాడు. ఆమె కోపంగా చూసి 'ఊ' అంది. అతడు కొద్దిగా బిగ్గరగా నవ్వి "ఓ.కే .ఓ.కే. మర్చిపోదాం. ఈ హత్య గురించీ __ సుశీల గురించీ పూర్తిగా మర్చిపోదాం. అంతకన్నా కావాలసిందేముంది." అన్నాడు.


