Previous Page Next Page 
అభిలాష పేజి 46

    ఒకటి __ ఆరు __ నాలుగు. తొమ్మిది __ మూడు __ డయల్ చేసి 'హాలో' అంది దాదాపు అరుస్తున్నట్టు. ఆమె ఉద్రిక్తతనీ, ఉద్వేగాన్నీ మరింత పరీక్షిస్తున్నట్టూఅటువైపునుంచి "ఎంగేజ్" శబ్దం వచ్చింది.
   
    ఆమె రిసీవర్ పెట్టేసి, మళ్ళీ వెంటనే ఎత్తి గెస్ట్ హౌస్ కి ఫోన్ చేసింది. ఎవరో నిరాసక్తంగా ఎత్తి ప్రెసిడెంట్ లేరన్న సంగతి చెప్పారు.
   
    ఆమె మళ్ళీ యింకోసారిగవర్నర్ యింటికి ఫోన్ చేసే ప్రయత్నం  చెయ్యలేదు. ఫోటోవున్న కవరు చేత్తో పట్టుకుని వేగంగా కారు చేరుకుంది. మరుక్షణం కారు గేట్లోంచిబైటకి దూసుకుపోయింది.

    సూర్యుడు తూర్పునుంచి పైకి వస్తున్నాడు. దాదాపు సగంపైగా వచ్చేసేడు.
   
                                                                                 8
   
    అతడు కళ్ళముందు చీకటిగా వుంది.
   
    ఉరికంబం ఇంకా పది అడుగుల దూరంలో వుంది. వణుకుతూన్న కాళ్ళతోఅతడు అడుగులు ముందుకేస్తున్నాడు.ఒక్కో అడుగూ వేయటానికిపట్టే క్షణంకాలం, ఒక్కో యుగంలా మారి ఆలోచన్లని రేకెత్తింస్తూంది.
   
    ఎక్కడివాడు తను? ఎక్కడ తన జీవితం అంతం కాబోతుంది? అనుకున్నాడు. ఎక్కణ్ణుంచిపోతుంది ప్రాణం? ఆఖరి శ్వాసనుంచా?  ఎక్కణ్ణుంచి? తల్లి కడుపులో ముడుచుకుని పడుకున్నప్పటిస్థబ్ధత మళ్ళీ ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతాడా? చావు తరువాత ఏమవుతుంది? ఆత్మ ఎక్కడికి వెళుతుంది?
   
    నవ్వేడు. నవ్వించేవాడు. ఆకలితో కడుపు కాలుతున్నా పైకి నవ్వూతూనే వుండేవాడు. తన ఆశయ సాధన కోసం అహర్నిశలూ పనిచేసాడు. అదెవరికీ తెలీదు. భవిష్యత్తులో కూడా తెలీదేమో! తనతోపాటే తన ఆశయమూ, శాశ్వత సమాది కాబడుతుంది. మళ్ళీ ఎప్పటికో.... ఎప్పటికో ఈ దేశంలో ఉరి రద్దు అయ్యేది.
   
    చల్లటిగాలి వీస్తూంది. జామచెట్టు, వేపచెట్టు, చిన్న చిన్న పొదలూ వున్నాయి. మధ్యలో దారి! చుట్టూ పాతిక అడుగుల ఎత్తున్న గోడ.
   
    ఒక్కసారిగా చుట్టూ వున్న వాళ్ళని విదిలించుకుని పారిపోవాలన్న కోర్కె కలిగింది ఏం చేస్తారు? తుఫకులతోకాలుస్తారా? ఉహూ __ అంత సులభంగా చావనివ్వరు? లేడిని వేటాడినట్టూ వేటాడి పట్టుకుంటారు. గోడపైనున్న కరెంటు తీగెలు తాకి చచ్చిపోయే అవకాశం కూడా ఇవ్వరు. క్షణక్షణమూ లెఖ్ఖ పెట్టుకుంటూ చావు కోసం ఎదురు చూడతమేమ్త దుర్భరమైనది! మామూలు చావుకూడా ఏంట హాయిగా వుంటుందోయిప్పుడు తెలుస్తూంది.
   
    అతడికి తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రీ ఇలాగే ఆ క్షణం, చేయని నేరానికి బాధపడ్తూ మరణాన్నిఆహ్వానించి వుంటాడు! ఇక్కడ సమస్య_ నేరం చేయటమా కాదా అని కాదు. మరణం శిక్షగా వుండొచ్చులేదా అన్నది. సమాజానికి ఒక వ్యక్తి చీడపురుగు అని భావిస్తే అతడిని నాల్గోడల మధ్య జీవితాతం బంధించండి! అతడితో రాళ్ళు కొట్టించండి. గనులు తవ్వించండి!! ఇంకా మీకు కసి తీరకపొతే అతడి కాళ్ళు నరకండి. కానీ ప్రాణాలు మాత్రం తీయకండి. ప్రజలారా! కొద్దిగా అలోచించకండి. సాటి మనిషి ప్రాణాలు తీసేహక్కు మీకు లేదు. మార్చండి. సెక్షన్ 302 ని మార్చండి. మార్చ.....
   
    చదునైన గచ్చు తగలగానే తీసుకువెళ్తూన్న చేతులు అతడిని ఆపుచేసేయి! అంతకుముందే అతడికి బ్లాక్ వారెంట్ చదివి వినిపించబడింది. ఎందువల్ల అతడికి మరణశిక్ష విధించబడిందో, ఏ సెక్షన్ ప్రకారం అతడిని ఉరి తీస్తున్నారో కూడా చెప్పాబడింది.
   
    అ తరువాత అతడి కాళ్ళు తాళ్ళతో కట్టివెయబడ్డాయి. ఉరి బిగుసుకొనేటప్పుడు కాళ్ళు గిలగిలా కొట్టుకోకుండా అలా కట్టేయ్యటం జరుగుతుంది.
   
    మాజీస్ట్రేట్ అతడి చూసుకున్నాడు.  ఇంకా రెండు నిముషాలుంది. పై అధికారుల నుంచి వచ్చే ఆర్దర్లోనే ఎన్నింటికి ఉరి తీయాలి అన్నది వ్రాయబడి వుంటుంది. ఆ టైమ్ ని మాజీస్ట్రేట్ జైలరుకి చెప్తాడు. జైలర్ చేతిలో రుమాలుంటుంది. దాన్ని ఊపగానే తలారి లివరు లాగుతాడు. ఖైదీ కాళ్ళ క్రింద తలుపు తెరుచుకుని కదంకంలోకి వేలాడుతుంది శరీరం.
   
    కాళ్ళు కట్టటం పూర్తయిన తరువాత తలారి లేచి చిరంజీవికి నమస్కారం చేసేడు. "సర్కారీ ఆగ్న నననుసరించి నేనీపని చేస్తున్నాను సాబ్. మీమీద నాకు పగలేదు. నన్ను క్షమించండి" అది నిజాయితీ.
   
    ఆ తరువాత ఉరి తాడుని చేతుల్లోకి తీసుకున్నాడు.
   
                                                                               9
   
    తను కారు ఇంజను ఆపుచేసిందో కూడా చూసుకోలేదు. ఆగీ ఆగగానే ధడేలున తలుపు తెరుచుకుని బయటకు దూకింది.
   
    గవర్నరు ఇంటిముందు సెక్యూరిటీ పోలీసు చప్పున ముందుకు రాబోయి, దిగుతూన్నది అమ్మాయని, క్షణం టాటాపాటాయించాడు. ఆ క్షణంలోనే ఆమె లోపలి దూసుకుపోయింది.
   
    విశాలమైన హాలు! పక్కనే ఒక మూల టేభిలు, దానిమీద ఫోన్, హాలంతా నిర్మానుష్యంగా వుంది. ఇంకా అక్కడ డినచర్య ప్రారంభం కాలేదు.
   
    ఆమె దేన్నీ పట్టించుకోలేదు. వింటినుంచి వెలువడిన బాణంలా దూసుకుపోతూంది. ఒకరిద్దరు నౌకర్లు విచిత్రంగా అయోమయంగా చూస్తూన్నారు. తనని గవర్నరు గుర్తుపడ్తాడా  లేదా అన్నాది కూడా ఆమెకి అపనమ్మకమే! ఎప్పుడో మెడికల్ కాలేజీలో ఒకసారి బహుమతి ఇస్తూ అభినందించాడు. ఆ తరువాత ఆమె ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేసేడు. అది గుర్తుంటు౦దో, లేదో.... అయినా తన గురించి చెప్పి __ పరిచయం చేసుకునీ __ అన్నీ విపరించేటంత టైమ్ లేదని ఆమెకి తెలుసు. ఇదంతా అలోచించటానికి క్షణంకూడా పట్టాలేదు. ఆలోచిస్తూనే పరుగేడ్తూ హాల్లోంచి పక్కగదిలోకి తిరిగింది. అంతలో రెండు బలమైన చేతులుచేరావువైపునా పట్టుకోవటంతోముందుకు తూలీపడబోయి నిలదోక్కుకుని నిస్సహాయంగా వాళ్ళవైపు చూసింది.
   
    ఇద్దరు నేపాలీ సెక్యూరిటీ గార్డులు ఇరువైపులా వున్నారు.
   
                                                            *    *    *    *               

 Previous Page Next Page