Previous Page Next Page 
అభిలాష పేజి 45

    ఇద్దరు గార్ధులు అతడిని చెరోవైపూ పట్టుకుని నడిపిస్తున్నారు. సాలిటరీ సెల్ మెట్లు దిగాడు.
   
    అది విశాలమైన జైలు. ముందో పెద్ద మైదానం, డానికి ఒకవైపు బారేక్స్. అది అరవైమండి నుంచీ డైబ్భైమందిదాకా పట్టే పెద్దహాలు, అటు కాకుండా తిన్నగా వెళ్తే యింకో హాలు. అందులో మంచాలూ, దోమ తెరాలూ కూడా వుంటాయి. అది రాజకేయ ఖైదీల కోసం, డిటేన్యూల కోసం ఏర్పాటు చేయబడిన గది. ఆ గది పక్కనే వంటగదీ, స్టోర్ రూమూ వున్నాయి. డానికి ఎడమవైపు మళ్ళీ ఇంకో బారేక్స్.
   
    ఇరువైపులా సున్నం పూసిన తెల్లటి ఇటుకరాళ్ళు పాతిన ఎర్రటి మట్టిరోడ్డు  ఆ బారేక్స్ మధ్యనుంచి ముందుకు సాగుతుంది. అక్కడ ఇంకో ఇనుపగేటు. అది దాటితే సాలిటరీ సేల్స్. ఒక్కొక్క గదిలో ఖైదీ . ఆ సేల్స్ చుట్టూ పెద్దగోడ... గోడతో పోలేస్తే, చాలా చిన్నదిగా కనిపించే తలుపు. ఆ తలుపు తెరిస్తే ఇంకో విశాలమైన మైదానం.
   
    మైదానం మధ్యలో ఉరికంబం!
   
    దాదాపు ఇరవై అడుగుల పొడవూ, పది అడుగుల వెడల్పూ వున్న ఎత్తైన గచ్చులాటిప్రదేశం. డానికి ఇరువైపులా రెండు ఇనుపగొట్టాలు, వాటికి కొక్కాలు! ఆ గచ్చుమీద తలుపులు... ఆ తలుపులకి లివరు! ఆ ఎత్తైన గచ్చు క్రింద ఖాళీరూము. కందకం లాటిది. ఉరికంబం వెనుక వైపునుంచి ఆ రూమ్ లోకి మెట్లున్నాయిపైన చెక్కతలుపుల గచ్చుమీద ఖైదీని నిలబెట్టి, మెడ కురి బిగించి, లివరు లాగగానేతలుపులు క్రిందకి ఆటోమాటిక్ గా తెరుచుకుంటాయి. క్రింది నాలుగు గోడలమధ్య కందకంలోకిశరీరం జరిపోయి, అక్కడ మెట్లగుండా డిగి, వేలాడుతున్న శరీరపు కాలిని స్పృశించి, మరణాన్ని ధ్రువపర్చాక, పైన తాడు వదులు చేస్తారు__ శరీరం క్రిందకి పదిపోతుంది.
   
    ఉరికంబానికి వందగజాల దూరంలో పెద్దసైజు కోళ్ళగూడు లాటిది వుంది. శ్మశానానికి తీసుకెళ్ళే వరకూ అక్కడ వుంచుటారు శవాన్ని.
   
    ఉరితీత కార్యక్రమం పూర్తీకాగానే సాక్షులు  మరణాన్ని ధ్రువపరుస్తున్నట్టూ సంతకాలు పెడ్తారు. ఆ పత్రం చేయబడుతుంది. అంతటితో ఖైదీచరుత్ర ముగుస్తుంది. (సికింద్రాబాదుజైల్లో ఉరికంబం మెట్ల పక్క ఎవరో సున్నంతో "వెల్ కమ్" అని వ్రాసేరు. అది సెన్స్ ఆఫ్ హ్యూమరో, లేక శాడిజమోతెలీదు.)
   
    ఇద్దరు వార్డెన్లు చెరోవైపు వస్తూంటే చిరంజీవి భారంగా నడుస్తున్నాడు జాగ్రత్తగా చూస్తె, అతడు ఒక పక్కకి వంగి గార్డు అనరాతో నడవటం కనిపిస్తూంది!

    పెద్ద గోడ దగ్గరకి వచ్చారు వాళ్ళు. ఆ గోడకే వున్నది చిన్న తలుపు, అది తీస్తే, ఉరితీసే స్థలం. అక్కడ అందరూ అగరు.... ఒక గార్డు తలుపు తీయబైతున్నాడు. ఇంతలో తనని తాకినట్టయి, చిరంజీవితల తిప్పాడు. ఎవరో ఒక నల్లటి గుడ్డని పైకేత్టడం కనబడింది. అంతే! అ తరువాత అది మెడమీదుగా జారింది.
   
    కళ్ళముందునల్లటి పోరా .... ముసుగువేసినట్టూ!
   
    దా౦తో ప్రపంచం అదృశ్యమయిపోయింది.
   
                                                                                     7
   
    ఆమె నుదుటిమీద చెమట ధారగా కారుతూంది.
   
    ఆమె చేతులు వణుకుతున్నాయి.
   
    కాగితాల్ని చెల్లాచెదురు చేస్తూ, ఆమె వెతుకుతూంది.
   
    పాజిటివ్ ముక్కలూ, నెగిటివ్ ఫిల్మూ, క్లిప్పులూ  లోషనూ__ ట్రేలూ _ అంతా అస్తవ్యస్తంగా పడివున్నాయి. అయినా వాటిని ఆమె అంతగా పట్టించుకోవటం లేదు. ఒక్కో క్షణం గడుస్తున్నకొద్దీ, ఆమెలో అసహనం ఎక్కువ అవుతూంది. అప్పటివరకూచాలా జాగ్రత్తగా తనని కంట్రోలు చేసుకుంటూ వచ్చింది. ఆమె. ఇక అప్పుడు ఆపుకోలేకపోయింది. దాదాపు పిచ్చి, ఆ కాగితాల్నిదై చిందరవందర చేస్తూంది.
   
    అక్కడ చచ్చిపోతున్నవాడు తన ప్రియుడూ, చిరంజీవి అనికాదు. ఒక నిర్దోషి !! అంతే!! ఆమెను ఆ భావనే కోసం వెతుకుతూంది. ఒక్కొక్క నెగిటివ్ ల కోసం వెతుకుతూంది. ఒక్కొక్క నెగిటివ్ నీ చిఇసి, అది తనకి కావాల్సింది కాదు అని నిశ్చయించుకుని పక్కకి పడేయ్యటం!!! నెగిటివ్ చూడవలసిరావటంతో టైమ్మరింత వేస్ట్ అవుతూంది. దానికితోడు నిస్సహాయతతో  కనులవెంట నిండుకునే నీరు. పొరలా అడ్డుపడుతూంది. మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ వెతుకుతూంది.
   
    ఆలోచనలతో ఆమె వెతకటం పూర్తీచేసింది. ఇక వేతకవలసినది ఏమీలేదు. ఆమె చుట్టూ ఫిల్ము ముక్కలు. తెల్ల నీవీ __ నల్లనివీ చీకటి వేలుగుల్లా పరుచుకుని వున్నాయి. చేతులు రెండూవెనక్కీ కట్టుకుని, గోడకి అనుకుని నిస్సహాయంగా గదంతా చూస్తూ నిలబడింది ఆమె. అంతా నిశ్శబ్దంగా వుంది. మనసంతా దిగులు... శూన్యం. అంతా అయిపోయిందన్న భావన.
ఆమె ఇలా నిలబడింది. అరనిముషమే. అదే యుగాలైనట్టుగా తోచి, భ్రమగా అక్కణ్ణుంచి కడలి బైటకి వచ్చింది.
   
    రాబోతూ వుంటే__ అప్పుడు మీదనుంచి క్రింద పడటానికి సిద్ధంగా వుంది.
   
    ఆమె ఒక క్షణం తను చూస్తున్నది కలో నిజమో నమ్మలేక అలాగే నిశ్చలంగా వుండిపోయింది. ఆ తరువాత మెరుపుకన్నా వేగంగా వంగి ఆ కవరు చేతుల్లోకి తీసుకుని విప్పింది. తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తూంది. కంపిస్తూన్న వెళ్ళతో లోపల పేపర్లని బైటకి విసురుగా లాగింది.
   
    అవి నెగిటివ్ లు!
   
    అమె క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫోటో ప్రేముతో బిగించి లైట్ అన్ చేసింది. పాజిటివ్ మీద బొమ్మ ఎడ్జెస్ట్చేసి, దానిమీద ముద్రపడిందని నిశ్చయం అవగానే ట్రేలో వున్న ద్రవంలో ముంచింది.
   
    నెమ్మదిగా _నెమ్మది నెమ్మదిగా పాజిటివ్ మీద బొమ్మరూపు దిద్దుకోసాగింది. కొంచెం సేపటికి ఆ బొమ్మ స్పష్టమైంది. ఏ కేసులో అతడు హంతకుడై ఉరికంబం ఎక్కుతున్నాడో, ఆ సుశీల అనే హతురాలి శరీరాన్ని చిరంజీవి బావిలోపడేసి బొమ్మ. అది నిజాన్ని నిరూపించేది!! అలాటివే మిగతావి.
   
    ఆమె ఒక్క గెంతులో గదిలోంచిబయటకి వచ్చి ఫోన్ చేరుకున్నది. కుర్చీ లాక్కుని కూర్చూంటూ రిసీవర్ ఎత్తి___

 Previous Page Next Page