Previous Page Next Page 
దావాగ్ని పేజి 46


    సత్యజిత్ మొహంలో రిలీఫ్ కనబడింది.

 

    "తప్పకుండా: మీరు ఎలాంటి అగ్నిపరీక్షలు పెట్టినా నా పవిత్ర అందులో సునాయాసంగా నెగ్గుతుందనే నమ్మకం నాకుంది మిస్టర్ రాణా: పవిత్రను నేను పెళ్ళిచేసుకున్నంత మాత్రాన నా దేశభక్తి తగ్గిపోతుందనీ, దేశసేవకి దూరమైపోతాననీ అనుకోకండి. పవిత్ర నా సొంతమైతే నేను దేశసేవకి పూర్తిగా అంకితం అయిపోగలను నిశ్చింతగా అన్నాడు సత్యజిత్.

 

    చిన్నగా నవ్వి లేచి నించున్నాడు రాణా.

 

                                     *    *    *    *

 

    చిత్రద్వీప్ లోని -

 

    పారడైజ్ సిటీలో -

 

    ఉప్పొంగిపోతున్నాడు జనరల్ భోజా. ఆకాశంలోని గ్రహాలు తనకి బాగా అనుకూలంగా వుండి వుండాలి.

 

    లేకపోతే తనకు ఇంత అందమైన లేడీ పైలట్ దొరకడమేమిటి?

 

    లిబ్యాదేశపు అధ్యక్షుడు కల్నల్ గడ్డాఫికి అందమయిన ఆడపిల్లలు బాడీగార్డుగా ఉంటారు. కానీ అతనికికూడా విమానం నడపటానికి లేడీపైలెట్ ఉన్నట్లు లేదు.

 

    బహుశా ప్రపంచంలో ఈ ఘనత తనొక్కడికే దక్కి ఉంటుంది ఇప్పటివరకూ,

 

    అదే కాకుండా - ఈ ఇండియన్ ఆడది తన శరణుకోరడం వల్ల ఇండియాకి ఎంత తలవంపులు: తనకు ఎంత గొప్ప:

 

    ఆ జెట్ విమానం భూమికి నాలుగువేల అడుగుల హైట్ లో గంటకి నాలుగొందల ఏభై కిలోమీటర్లు స్పీడుతో దూసుకెళుతుంది ఆఫ్రికన్ కంట్రీ ఉగండా వైపు.

 

    కాక్ పిట్ వైపు నడిచాడు జనరల్ భోజా. ఖాకీరంగు, ఆకుపచ్చ రంగూ కలిసిన ఆలివ్ రంగు యూనిఫారంలో స్మార్ట్ గా కనబడుతోంది. లేడీ పైలెట్ నీలోఫర్. ఆమె అసలు పేరు వినీల అని జనరల్ భోజాకి తెలియదు,

 

    ఆమె పక్కన కూర్చున్న కో -పైలెట్ ఆమెతో పోల్చి చూస్తే కోతిలా కనబడుతున్నాడు.

 

    "నీలోఫర్: ఓసారి ఇలారా:" అన్నాడు జనరల్ భోజా.

 

    అటోపైలెట్ ఆన్ చేసి, కనిపెట్టి వుండమని కో - పైలెట్ ని హెచ్చరించి కాక్ పిట్ లోంచి బయటికి వచ్చింది వినీల.

 

    "సర్?"

 

    "ఇట్లారా:" అని విమానంలో వున్న తన రూమ్ కి తీసికెళ్ళాడు జనరల్ భోజా.

 

    ఆ విమానంతో మామూలుగా అన్ని విమానాల్లో ఉన్నట్లు సీట్స్ వరుసగా వేసి లేవు. ఒక రూము, ఒక చిన్న కాన్ఫరెన్స్ హాలూ, ఒక సిట్ అవుట్ లాంటిదీ, ఒక టాయిలెట్ బాత్ రూమ్ వున్నాయి. వెనుక భాగంలో ఆయన పరిచారికలకీ. స్టాఫ్ కీ మరో రూమూ, టాయిలెట్సూ వున్నాయి.

 

    తన రూములోకి వినీలను తీసుకు వెళ్ళాడు జనరల్ భోజా.

 

    "ఆకలిగా వుంది" అన్నాడు ఆమెవైపు అర్ధవంతంగా చూస్తూ.

 

    అతని భావం గ్రహించనట్లు, "శాడ్ విచెస్ చేసి పెట్టమంటారా బాస్?" అంది వినీల.

 

    "ఈ ఆకలి అలా తీరదు మంచానికి, నాకూ మధ్య నువ్వు శాండ్ విజ్ అయిపోవాలి. అప్పటికిగానీ శాంతిగా వుండదు నాకు"

 

    "ఏడిశావులే దున్నపోతు వెధవా?" అని మనసులో తిట్టుకొని పైకి మాత్రం నవ్వుతూనే మాట మార్చేసింది వినీల, ఉరఫ్ నీలోఫర్.

 

    "సర్: ఇండియా అంటే నాకు కరుడుకట్టిన ద్వేషం ఉందన్న సంగతి మీకు తెలుసు. ఎప్పటికయినా ఢిల్లీ కోటమీద మీ చిత్రద్వీప్ జెండా నగరాలనీ, అప్పుడు కోట ఋజువు మీద నుంచి మీరూ నేనూ పక్క పక్కనే నిలబడి సగర్వంగా ఢిల్లీచూడాలని నా కోరిక అప్పటిదాకా ఏ సుఖమూ అనుభవించకూడదని నా శపథం మీలాంటివాళ్ళు పక్కనున్నప్పుడు కోర్కెలు చంపుకోవడం దుర్భరం అనుకోండి. అయినా తప్పదు. ఢిల్లీకోటమీద మీ జెండా ఎగిరేదాకా నేను మీ సొంతం కాలేను."

 

    "ఏమిటో నీ చాదస్తం:" అన్నాడు జనరల్ భోజా కొంచెం నిశితంగా.

 

    అయినా అతనికి సంతోషంగానే ఉంది. నీలోఫర్ కి ఇండియా అంటే అంత ద్వేషం వుండడం, ఆమె ఢిల్లీ తన వశం కావాలని అంతగా కోరుకుంటూ వుండడం.

 

    తను ఇండియాని ఆక్రమించుకోవటం అంటే నక్క సింహాన్ని మట్టుపెట్టాలనుకోవటమే అని జనరల్ భోజాకి తెలుసు.

 

    కానీ తను ఉత్త నక్క కాడు.

 

    జిత్తులమారి నక్క:

 

    నక్కినక్కి ఉంటూ, తన నక్క జిత్తులతోనే ఏదో ఒకరోజున ఢిల్లీకోట పట్టుకుంటాడు. చిత్రద్వీప్ తోపాటు భారత ఉపఖండానికి కూడా డిక్టేటర్ అయిపోతాడు.

 

    అందుకు పావుగా ఉపయోగించుకోవాలి ఈ అమ్మాయిని.

 Previous Page Next Page