"అయ్యగారి కారు లోయలో కూలిపోయిందటమ్మగారూ. పోలీసులు ఫోన్ చేశారు. అయ్యగార్ని జనరల్ హాస్పిటల్ లో చేర్పించారట."
ఆమె నిశ్చేస్టురాలై౦ది!
ఎన్నెనో భావాలు ఒక్కసారిగా ఆమెను చుట్టముట్టాయి. సర్వోత్తమారావు అంకుల్ రాష్ట్రపతి దగ్గరకి వెళ్ళపోవడానికి కారణం అదన్నమాట!
ఆమె లోపల ఫోన్ దగ్గరకి పరుగేడ్తూ "మావయ్యకి ఎలా వుందట?" అని అడిగింది.
చిరంజీవిని రక్షించగలిగేది అయనొక్కడే! అయన దగ్గర్నుంచి ప్రెసిడెంట్ కి ఒక్క ఫోన్ కాల చాలు. పోయిన ధైర్యం అంతా మళ్ళీ వచ్చినట్టు అయింది.
"డాక్టర్ పూర్ణచంద్రారావుగారు మిమ్మల్ని రాగానే ఫోన్ చెయ్యమన్నారు" అన్నాడు రామయ్య.
పూర్ణాచంద్రారావు హాస్పిటల్ సూపర్నెండెంటు. అర్చన మేడికో కాబట్టి బాగా తెలుసు.
తొందర తొందరగా, వణుకుతున్న చేతుల్తో ఆమె ఫోన్ తిప్పింది. ఎప్పుడూ ప్రార్ధించింది, అప్పుడు దేముణ్ణి ప్రార్ధించింది. "భగవంతుడా! మావయ్యకి కొద్దిగా మాట్లాడే శక్తిని ప్రసాదించు" అని.
అయితే దేముడు ఆమె ప్రార్ధన వినలేదు.
"అవునమ్మా. నేనే అటెండ్ అయ్యాను. పేషెంట్ డీఫ్ కోమాలో వున్నాడు. కండిషన్ సీరియస్సే...." అన్నాడు డాక్టర్ పూర్ణచంద్రారావు.
"ఆయనకి ఎప్పుడు మెలకువ వస్తుంది డాక్టర్" కంపిస్తున్న కంఠంతోఅడిగింది.
"ఇంకో పదీ_పన్నెండు గంటలు పోతెగానీ చెప్పలేనమ్మా...."
ఫోన్ పడేసి టేబిల్ _మీదకి వాలిపోయింది అర్చన. అప్పుడోచ్చింది ఆమెకి దుఃఖం.
వ్యధాభరితమైనా మనసుతో, అలసటతో అమె అదోరకమైన సుషుప్తిలోకి జారుకుంది. అలా ఎంతకాలం గడిచిందో తెలీదు. అది నిముషమైనా కావొచ్చు. గంట అయినా కావొచ్చు. ఆ శూన్యంలోంచిఒకమెరుపు మెరిసినట్టయింది. ఏదో ఆలోచన స్పురించింది, కళ్ళు విప్పింది. ఫోన్లో ఆస్పత్రి సిబ్బందితో మళ్ళీ ఇంకొకసారి మాట్లాడి, దాదాపు పరుగేడ్తున్నట్టూ బయటకొచ్చి కారు స్టార్ట్ చేసింది.
ఆమె వెళుతున్నది ఆస్పత్రికి కాదు. అక్కడికి వెళ్ళినా లాభం వుండదని తెలుసు. సర్వోత్తమరావు పడిపోయిన చోటికి వెళ్తూంది ఆమె. అప్పటికే తూర్పు బాగా ఎర్రబడటం ప్రారంభం అయింది.
ఆమె హిల్ టాఫ్ నుంచి కారుని సర్రున క్రిందికి కోస్తూ పక్కకి తిప్పింది. ప్రమాదకరమైనా మేలికిల్లో కూడా స్లోచేయటంలేదు. ఒకపర్లాంగు పోలీసు అక్కడ నిలబడివున్నాడు. ఇంకా బాగా నిలబడి చూస్తున్నారు.
వర్షానికి తడిసిన మట్టిమీదనుంచి జారిపోకుండాపెద్ద పెద్ద బండరాళ్ళని చూడసాగేరు. ఆమె దాన్ని పట్టించుకోకుండా కారు దగ్గరకి వచ్చింది. ఆమెని చూసి కానిస్టేబుల్స్ చేసేడు. కారు బోర్లాపడి వుంది. టైర్లు కాలలేదుగానీ సీట్లు పూర్తిగా కాలిపోయినయ్. ఆ మసి చల్లగా పేరుకుని వుంది. తడిపిన బూడిద వర్షపు పాయల్లో తెల్లగా మెరుస్తుంది.
ఆమెని ఆ కారు తాలూకు వ్యక్తిగా గుర్తించి "కారులోంచిబైటపడటం అదృష్టం అమ్మగారూ! లేకపోతె ప్రాణానికి చాలా ప్రమాదం జరిగివుండేది" అంటున్నాడు పోలీసు. అమేతల వూపింది. అతడింకేదో మాట్లాడుతున్నాడు గానీ, ఆమె దాన్ని పట్టించుకికుమ్డా తన పనిలో తానుంది. ఆమె కళ్ళు ఆ ప్రదేశంలో ప్రతి అంగుళాన్నితీక్షణంగా శోధిస్తున్నాయి.
ఊడిపోయిన రేడియేట్ మూత దూరంగా మెరుస్తూంది. చక్రం తాలూకు హాబ్ వూడిపోయి, రాళ్ళమధ్య నొక్కులు పడింది. పగిలిన అద్దం ముక్కలు ధగధగా మెరుస్తున్నాయి. ఆమె వంగి కారులోకి చూసింది. ఊడిన రబ్బరు ముక్కలుసగం కాలివున్నాయి. ఇమ్కావాసన వస్తూనే వుంది. స్టీరింగ్ ఒక ప్రక్క వంగిపోయి వుంది.
"అన్నీ వాళ్ళు తీసుకు పోయారు అమ్మగారూ! అందులో ఏమీలేవు" అన్నాడు పోలీసు ఆమె దేనికోసం వెతుకుతుందో తెలీక! అమెతలూపి కారునుంచి దూరంగా వచ్చింది. ఆ కారులో అది వుందే అవకాశం లేడనీ, వున్నా కాలిపోయి వుంటుందని నిశ్చయించుకుని, ఇక అక్కడ చేసేదేమీ లేదని వెనుదిరుగుతుంటే అక్కడే పెద్ద బండరాయి ప్రక్కన _ ఆమెకి కావాల్సింది దొరికింది_ అదో కవరు! పూర్తిగా కాలిపోయి చివర్లు మిగిలింది. ఆ చివరి అంచులుకూడా వర్షానికి తడిసిపోయాయి. ఆమె చెప్పునవంగి దాన్ని చేతుల్లోకి తీసుకుంది. అవి అసలేం ఫోటోలోకూడా తెలియటంలేదు. కేవలం అంచులు మాత్రం వున్నాయి. అయితే అమే ఆలోచిస్తూన్నదీ__ చూస్తున్నదీ అవి ఏ ఫోటోలూ అనికాదు. ఆ ఫొటోలన్నీ పోజిటివ్ లు?
మరి నెగిటివ్ ఏమయ్యాయి?
తన యింట్లోనే ఎక్కడో వున్నాయన్న మాట!!
ఆమె మరిక ఆలస్యం చేయకుండా తన కారువైపు పరుగేత్తింది.
6
అతడి చేతులుకట్టబడ్తున్నాయి. కళ్ళు మూసుకుని వున్నాడతాడు. జైలరూ మిగత సెంట్రీలూ, గార్దులూ చూస్తున్నారు.
చేతులు సెల్ లోనే వెనక్కీ కడతారు. కాళ్ళు ఆర్డరులోనే వుంటుంది. ఫ్రీజన్ నెంబర్ 555 "ప్రత్యూషవేళ ఉరితీత కనువైన సమయం" అని చెబుతూంది. అంతకన్నా వివరణ లేదు. వేసవికాలంలో కొద్దిగా తెలతెలవారుతూ వుండగానే ఉరి అమలు జరుపుతారు. శీతాకాలంలో కొన్ని సందార్భాల్లో తొమ్మిదింటికి తీసిన సంఘటనలు కూడా వున్నాయి.
రాత్రి వర్షం తాలూకు ప్రభవం ఇంకా తగ్గలేదు. చలిగాలి వీస్తూనే వుంది. అయితే చిరంజీవి శరీరం మాత్రం భాదపడటం లేదు. అతడి శరీరం వణుకూతూంది. సన్నటి అవిర్లు వస్తున్నాయి. దాదాపు కళ్ళు మూసుకునే, ఎవరేం, చెయ్యమంటే అది చేస్తున్నాడు.