ఆ మాటలు అమే మీద వెంటనే ప్రభావం చూపించినట్టూ, ఆమె తలెత్తి, చూసింది. అర్చన ఆ అవకాశం విడవకుండా, "ఔనవ్వా, ఏం జరిగిందో చెప్పు. నీకు డబ్బు ఇప్పించే పూచీ నాది" అంది అభయమిస్తున్నట్టూ.
"సుశీల శానా మంచిపిల్ల ...." ముసలమ్మ మాట్లాడటం ప్రారంభించింది.శ్రోతలిద్దరూఊపిరి బిగపేట్టి వినసాగారు. "ఈ గదిలోనే ఒంటరిగా వుండేది. ఏదో స్కూల్లో టీచరట. ఒకరోజు....... ఒకరోజు...."
"ఒకరోజు .... ఏమైంది ఒకరోజు....."
"నాకు తెల్వదు. ఓటులేసు నడగండి."
అర్చనా, శర్మా మోహమోహాలు చూసుకున్నారు. ఓటులేసు! అవును. ఇందులో అతడు కూడా వున్నాడు. దారాసింగ్ శవం సంగతి చెప్పిందతడే.
"ఎక్కడుంటాడు ఆ ఓటులేసు?" అడిగింది అర్చన.
"ఈ వీధీలోనే...... మసీదు లేదూ, దానేదురు అరుగుమీద పండుకుంటాడు."
అర్చన చురుగ్గా ఆలోచించింది. దగ్గర్లోనే వున్న ఆ ఓటులేసుని కూడా పట్టుకుంటే పని మరింత సిలభతరమవుతుంది. అతడిని చూసి, ఈ ముసలమ్మక్కూడా నిజం చెప్పటానికి ధైర్యం వస్తుంది. ఓటులేసుని కన్వీన్స్ చేయటంకూడా పెద్ద కష్టం కాకపోవచ్చు, అందులోనూ డబ్భుతో .
ఒకవేళ ఓబులేసు దొరక్కపోతే ..... అప్పుడు ఈ ముసలమ్మతోనే ప్రయత్నం చెయ్యేచ్చు. ముందు అతడిని పట్టుకోవటం మంచిదికదా.
క్షణంలో ఇదంతా ఆలోచించి ఆమె జ్వాలా లేచింది. బైటకొచ్చి మెట్లు దిగుతుంటే, వీధికి కుడివైపు చివర మసీదు కనబడింది. వీధి ఇంకా నిద్ర లేవలేదు. కారు వదిలేసి నడకనే ఆమె మసీదు చేరుకుంది. పరుగులాటినడక. వెనుకే శర్మ వచ్చాడు.
మసీదు ఎదురు అరుగుమీద ఇద్దరు, ముగ్గురు భిచ్చగాళ్ళాలావున్న వాళ్ళు పడుకుని వున్నారు. ఓబులేసుగురించి వాకబు చేయగానే __ ముందు అర్చనకి చూసి ఏదో అనబోయారు కానీ, కాకీ బట్టల్లో వున్న శర్మని చూడగానే వెనక్కీ తగ్గేరు.
'ఓబులేసా_ అవును. ఈడే పడుకుంటారు ప్రతిరోజూ."
"ఏడీ? ఎక్కాడున్నాడు.?"
"ఏమో! రాత్రి రాలేదు."
"అంటే ఒక్కోరోజు రాడా?"
"బాగా పైసలున్నజేబు దొరికిందంటే అర్ధరాత్రివరకూకళ్ళుకాంపౌండ్ లోనే తాగి ఆడే తొంగుంటడు."
ఈ జేబులు కొట్టేవాళ్ళు__ తాగేడు వాళ్ళూ_ చిరంజీవి ఎక్కడ దొరికారోఆమెకి అర్ధంకాలేదు. అయినా దాని గురించి అలోచించలేదు. ఇక టైమ్ లేదు. ఆ ముసలమ్మనే తమతో తీసుకెళ్ళి వీలైనంత ప్రయత్నం చేయాలి. ఆమె శర్మవైపు చూసింది. శర్మ కూడా వెళ్దామన్నట్టు తలూపేడు.
ఇద్దరూ తిరిగి ముసలమ్మా ఇంటికొచ్చారు. అర్చన కారు దగ్గరే నిలబడి, అతడిని వెళ్ళి ఆమెని తీసుకురమ్మంది.
శర్మ తలుపు తెరచి లోపలకు వెళ్ళబోయి, షాక్ తిన్నట్టు ఆగిపోయాడు.
లోపల ముసలమ్మ లేదు.
ఆమె పడుకున్న చాపకూడా లేదు.
తెల్లవారుఝామున యిద్దరోచ్చితనని నిద్రలేపిప్రశ్న లాడగటంతో బెదిరిపోయి అక్కణ్నుంచి పారిపొయిందన్నవిషయం తెలుస్తూనే వుంది. ఇక యిప్పట్లో కనబడదు. ఆ ఇరుకు యిళ్ళల్లో ఎక్కడో మాయమై పోయింది. కేవలం ఆవిడ భయం ఆవిడ భయం, అమాయకత్వం, ఒక నిండు ప్రాణాన్ని బలికోరుతూన్నాయి.
శర్మ స్థాణువవటం చూసి అక్కడికి వచ్చిన అర్చన కూడా విషయం ఆవరించింది. ప్రపంచంలో ఇక ఏ శక్తి చిరంజీవిని రక్షించలేదన్నది ఆమెకి అర్ధమైంది. ఆ గుమ్మం పట్టుకుని, నేలమీద జారిపోకుండా నేల దొక్కుకుంది.
ఆ శూన్యమైనా గది వంకే చూస్తూ ఇద్దరూ కొద్దిసేపు నిలబడ్డారు.ముందు కదిలింది. శర్మకూడా వచ్చాడు. కరుకదిలింది. అయితే ఈసారిఅది వేగంగా నడవటం లేదు. లోపల కూర్చున్న వాళ్ళుకూడా తమ తమ ఆలోచన్లలోవున్నారు. చిరంజీవి తో తమ పరిచయాన్ని నెమరువేసుకుంటున్నారు. మెయిన్ రోడ్డు కి వచ్చాక శర్మ నిశ్శబ్దాన్ని భంగాపరుస్తూ "నేనిక్కడ దిగిపోతానమ్మగారూ" అన్నాడు. అతడలా ఎందుకన్నాడో అతనికి తెలీదు. కానీ అతడు వెళ్ళటం అమెకియిష్టంలేదు. మునిగిపోతున్న పడవమీద ఒకరి కొకరు తోడు.
కానీ అంతలోనే, 'ఇక వుంది చేసేదేముంది' అన్న అతడి భావాన్ని అర్ధం చేసుకున్నట్టు కారు పక్కకి తీసి ఆపుచేసింది. అతడు కారు తలుపు తీసుకుని దిగేడు. క్షణం ఆగి, టాటాపాటాయించి, ఏదో చెప్పాలనుకోని, అది చెప్పలేక "నన్ను క్షమించండి అమ్మగారూ" అన్నాడు.
ఆమె నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళలో ఏ భావమూలేదు. శూన్యంగా ఏదో లోకంలో వున్నట్టు వున్నాయి.
"మనం చేయగలిగినంతా చేసేం శర్మా. నాకు పోలీసులంటే చాల చిన్నభావం వుండేది. ఇప్పడది పోయింది. ఈ రాత్రి నువ్వు చేసిన సాయం నేను జీవితమంతా గుర్తుపెట్టుకుంటాను " అంటూ ముందుకు కారు పోనిచ్చింది.
ఆమె ఇంటికి చేరుకునేసరికి ఇల్లంతా లైట్లువేసి వున్నాయి. అందరూ మెలకువగా వుండి, వరండాలో నిలబడి వున్నారు. ఆమె ఆశ్చర్యంతో కారు దిగుతూ వుంటే రామయ్య పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఎప్పుడూ నిశ్శబ్దంగా, భావరహితంగా వుందే అతడిలో టెన్షన్ కొట్టేచ్చినట్టు కనబడ్తూ౦ది.