Previous Page Next Page 
అభిలాష పేజి 42

    చదవటం పూర్తీచేసేడు చిరంజీవి. ఎందుకో తెలియదుకానీ, అతడికళ్ళనిండా నీళ్ళు నిలిచాయి. అదిదుఃఖం కాదు, వేదన కాదు. వేదాంతం, నిరాశ, నిస్పృహ యిలాటివేవీ కావు కూడా. తండ్రి మరణం, ఎనిమిదేళ్ళ వయసులో తల్లిపోవటం, తండ్రి ఉరికంబం ఎక్కినప్పుడు తను మనసు లోనే అనుకున్న ప్రతిజ్ఞ . వారాలు చేసుకుంటూ ఎల్లేల్ల్సీ చదవటం అంతా జ్ఞాపకం వచ్చింది. ఏదో అద్భుతం జరిగి తన ప్రతిజ్ఞ నేరవేరుతుందనుకున్నాడు. కానీ అంతా తారుమారయింది. తను పోయేకైనా అర్చానకి నిజం తెలిసి ఈ పోరాటం కోనసాగిస్తుందా? ఏమో... ఎందుకు సాగించాలి?
   
    అయినా ఈ పోరాటం ఒకరు కొనసాగిస్తే సాగేది కాదు: లేకపొతే ఆగిపోయేదికాదు. ఇది నిరంతరం.
   
    అతడు తన కాగితాలవైపు చూసుకున్నాడు. జైలు గోడలనుంచి బైటకు పొడుచుకొచ్చిన రాయిమెడ బొటనవేలుగట్టిగా అదిమేడు చర్మం చిట్లి రక్తం స్రవిమ్చటం ప్ప్రరంభం కాగానే, దామ్తావుయా కాగితాల మీద ముద్రవేసేడు.
   
    అదే అతడి నిజమైన ప్రార్ధన!
   
    అది ముగించి బయటకొచ్చాడు. వరండాచివర ధర్మారావు చీకట్లోకి నిలబడి చూస్తూ వున్నాడు. "సూపర్నెండెంటుగారూ" పిలిచాడు. ధర్మారావు తలతిప్పిచూసి, దగ్గరకొచ్చాడు. "ఈ కాగితాలు... ఈ కాగితాలు అర్చన గారికి అండజేస్తారా? ప్లీజ్."
   
    ధర్మారావు మాట్లాడకుండా అతడివద్హ నుమ్చియా కాగితాలు తీసుకున్నాడు. మరణశిక్ష విధించబడిన ఖైదీ సాలిటరీసెల్ లోకి ఆకాగితాలు ఎలా వచ్చాయా అన్న ప్రశ్న కూడా వేయలేదు. 
   
    అతడు కాగితాలు వుండగా లయబాధ్హంగా అడుగులచప్పుడు వినిపించింది.
   
    పోలీస్ గార్డ్ వస్తూంది.
   
    పడిమంది పోలీసులూ, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ రెండు వరుసల్లో వస్తున్నారు.... చిరంజీవి ఉరికంబం దగ్గరికి తీసుకెళ్ళే సమయంలో ఆసన్నమైంది.
   
    తూర్పునుంచి మొట్టమొదటి వెలుగురేఖ కొద్దిగా పోడచూపింది. రాత్రంతా రాని తల్లికోసం పక్షిపిల్ల ఇక అరవటం మానేసి, నిస్రాణంగా పడుకొన్నట్టుంది.
   
                                                                             5
   
    ఆ ఇరుకు సందులోకి వచ్చి, అర్చన కారు ఎంత వేగంగా ఆగిందంటేపక్కనే కూర్చున్న శర్మ నుదురు ఎదుటి అద్దానికి కొట్టుకోబోయి కొద్దిలో తప్పింది. అర్చన ఇదంతా పట్టించుకోకుండా ఆగీ ఆగగానే ఒక్క ఉదుటున కారులోంచి డిగి లోపలి పరుగెత్తింది.
   
    కూలిపోవటానికి సిద్ధంగా వున్న పై కప్పు, విరిగిన మెట్లు_ ముందు దర్భరమైన వాసనతో మురిక్కాలువ.....
   
    ఆమె కర్చీఫ్ అడ్డు పెట్టుకుని వెళ్ళింది.  అదృష్టవశాత్తు తలుపులు గడియవేసి లేవు. ఆమె తోయగానే కిర్రుమన్న చప్పుడుతో తెరుచుకున్నాయి. లోపల ఒకే గది, దుమ్ముపట్టి వుంది. ఒకపక్క చిన్న కిరోసిన్ దీపం వుంది. ఆ వెలుగులో ఒక మూల ఒకామె పడుకుని వుండటం వినిపించింది. శర్మ వచ్చి మౌనంగా నిలబడ్డాడు.
   
    అర్చన తలుపు తట్టింది. మగత నిద్రలో వున్న ముసలమ్మా కళ్ళు విప్పి, అపరిచితుల్ని చూసి చప్పున లేచి కూర్చుంటూ "ఎవరిదీ?" అంది భయంగా. అర్చన మరిఅలస్యం చెయ్యలేదు. లోపలికి అడుగు లేస్తూ "నీతో కొంచెం పనివుండివచ్చాం" అంది. ముసలమ్మమాట్లాడలేదు కానీ, ఆ కళ్ళల్లో బెదురు కనిపించింది.
   
    అర్చన మోకాళ్ళమీద కూర్చుని, "సుశీల వుండేది ఈ గదిలోనే కదూ "అంది. ముసలమ్మా మరింత బెదిరి "మళ్ళీ మీ రెవరు? పోలీసులా" అంది శర్మ దుస్తులపై చూస్తూ. అప్పటికే అంతకుముందు పోలీసులు ఒకటి రెండుసార్లువచ్చి ఎంక్వయిరీ చేస్తే తనకేం తెలీడుఅని చెప్పింది.
   
    "ఊహూ, కాదు" అంది అర్చన . "కానీ ముందది చెప్పు. సుశీల వుండేది ఈ గదిలోనేనా?"
   
    ముసలమ్మ తలూపింది.
   
    "ఎలా చచ్చిపోయింది ఆమె."
   
    ముసలమ్మమాట్లాడలేదు.
   
    "రాత్రి  చచ్చిపొతే అర్ధరాత్రి ఒకతను వచ్చి శవాన్ని తీసుకువెళ్ళాడు కదూ"
   
    దీనిక్కూడా ముసలమ్మ మాట్లాడలేదు. కానీ ఆమె చేతి వేళ్ళు కొద్దిగా వణకటం గమనించింది అర్చన.ఆమె అమితంగా భయపడ్తూందని గుర్తించి, అనునయిస్తున్నట్టు "చూడు అవ్వా, ఇందులో నువ్వు భయపడవలసిందేమీ లేదు. మేము పోలీసులం కాదు. ఆ రోజుజరిగింది ఏమిటో ఉన్నద్దన్నట్టు చెప్పు. మామూలుగా చచ్చిపోయిన ఆ సుశీల __ అలా చాపలేదనీ, చిరంజీవి   అనే మనిషిని రక్షించిన దానివవుతావు. చెప్పు.... ఆ సుశీల ముందురాత్రేమరణించింది కదూ! అంతకుముందు ఒకటి_ రెండు రోజుల్నించీ అనారోగ్యంగా వుందికదూ."
   
    "నాకు తెల్వదు."
   
    అర్చన హతాశురాలైంది. నిర్లిప్తంగా వున్న ఆ ముసలమ్మ మోహం చూస్తుంటే అర్చానకి కోపమూ,  ఉక్రోషమూ కట్టలు తెంచుకొనేలా వున్నాయి. అతికష్టంమీద వాటిని అణచుకోని, మరోసారి అనునయిస్తున్నట్టూ"నీకేం భయంలేదు అవ్వా. అంతా  మేం చూసుకుంటాం. నువ్వు చెయ్యవలసినదల్లా, ఉన్నదనట్టూ చెప్పటమే. అందువల్ల ఒక నిండు ప్రాణం రక్షింపబడుతుంది" అంది.
   
    ముసలమ్మ మాట్లాడలేదు.
   
    శర్మ అడుగు ముందుకేసి, "నిజం చెప్తావా? స్టేషన్ కి తీసుకెళ్ళమంటావా?" ఆని గద్దించాడు. అతడిలోఅసహనం ఎక్కువ అవుతూంది.  ఇంకొద్దిసేపయితే ఎవరుచేసేదీ ఏమీ లేదని తెలూస్తూంది. అతడలా  బెదిరించగానే ముసలమ్మ మరింత వణికింది. శత్రువుని చూడగానే లోపలి ముడుచుకుపోయే నత్తలా మరింత కుదించుకు పోయింది. అర్చన చేత్తో అతడిని వారించి, ముసలమ్మవైపు తిరిగి, "నువ్వీ నిజం చెప్తే ప్రభుత్వం నీకు అయిదోందలిస్తుంది. అవ్వా" అంది.   

 Previous Page Next Page