Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 43

                                 

    వాలుగా:
         
     ప్రతి అక్షరం పెద్దగా, సున్నాలు చుట్టినట్లు వాలుగా వ్రాసే పిల్లలకి వ్యాయామం అన్నా,  పరిగెత్తడం అన్నాచాలా  ఇష్టం అని తెలుసుకోవచ్చు. వీరు భవిష్యత్తులో మంచి ఆటగాళ్లుగా తయారవుతారు. సాంకేతికజ్ఞానం వైపు మొగ్గుచూపుతారు.
     దూరదూరంగా:

          

     వీరు తమకంటూ ఒక ప్రత్యేకత వున్నట్టు ప్రవర్తిస్తూ, సంఘంలో ప్రత్యేక వ్యక్తులుగా గుర్తింపబడతారు. వీరు ఏపని చేసినా అది ప్రత్యేకంగా కనిపిస్తుంది.  పదాల మధ్య దూరంగా, అక్షరాల  యొక్క స్పష్టత వీరియొక్క తెలివితేటల్ని తెలుపుతుంది.

    వయసుకన్నా పెద్దగా:

        

     వీరు వ్రాయటంలో మంచి నేర్పు ఉన్నట్టు వ్రాస్తారు. వీరికి పట్టుదల అధికంగా వుంటుంది. కానీ కొన్నికొన్నిసార్లు చాలా మూడీగా ఉంటారు. కానీ అంతలోనే నవ్వుతూ, తుళ్ళుతూ ఉంటారు. వీరు చాలా హుందాగా, చలాకీగా ఉండగలుగుతారు.

     వత్తులు - దీర్ఘాలు - సెక్స్

     అక్షరాలకు పై బాగంలో వుండే ఒంపులు వ్రాసే విధానం, వత్తులు ఇచ్చే విధానం వారిలోని శృంగారపరమైన భావాలని, అంతర్గతమైన కోర్కెలని, ఉద్రేకాలని తెలియజేస్తాయి. వారు శృంగారంలో ఏమాత్రం చురుకుగా వుంటారు అనేదాన్ని దీన్నిబట్టి అంచనా వేయవచ్చు.

     వత్తులు:
          
     1. త్త -వై- ళ్ళ అక్షరాల క్రింది వత్తులు బలహీనంగా వుంటే ఆ రైటింగ్ గల స్తీలు ఫ్రిజిడిటీ వున్నవారుగాను, పురుషులైతే తక్కువ శృంగారాభిలాష గలవారని గ్రహించాలి. వాళ్లకి ఈ లోపం శారీరకంగా, లేదా మానసికంగా, ఇతర అనారోగ్యకారణాల వల్ల వుండవచ్చు.
                                             
     2. ఈ వత్తులు మందంగా వుంటే, ఆ వ్రాతగల వ్యక్తులు శృంగారపరమైన ఊహలను ఎక్కువ స్థాయిలో కలిగివుంటారు.

    దీర్ఘాలు:

     1. దీర్ఘాలలో నిర్దిష్టమైన ఒంపులు, గుండ్రని అక్షరాలు వ్రాసే వ్యక్తులు శృంగారానికి ప్రాముక్యత నివ్వరు. తమ ఉద్రేకాలు, కోరికలపై మంచి కంట్రోల్ కలిగి వుంటారు.

             

    2. ఈ ఒంపులు వెడల్పుగా వ్రాసేవారు కలల్లో తేలిపోయేవారు కావచ్చు. మానసిక   పరిపక్వత లేనివారై వుంటారు. అయితే శృంగారంలో వీరు చాలా ఆసక్తి కలిగి వుంటారు.

    3. త్రికోణాకారంలో వుండే ఒంపులు శృంగారపరమైన నిరుత్సాహాన్ని సూచిస్తాయి. భాగస్వామితో విసిగిపోయినవారుగా గుర్తించవచ్చు. స్త్రీలలో ఇలా వ్రాసేవారు తీవ్రమైన సంఘర్షణలతో ఓడిపోయినవారు, డామినేటింగ్ గా వుండేవారు అయివుంటారు. అదే మగవారి విషయానికొస్తే ఈ విధంగా  వ్రాసేవారు విచారంగా, అలవాట్లకు బానిసలై, ఇన్ హి బిషన్స్ వున్న వ్యక్తులై వుంటారు.
                                       
     దీర్ఘాల్లో ఒంపులు ఎడమవైపు తిరిగివుంటే - అలా వ్రాసేవారు ఒంటరితనంతో బాధపడేవారు, గతం గురించి బాగా ఆలోచించేవారు, పరిసరాలచే ప్రభావం చెందేవారు, మొహమాటాలను  కాదనలేనివారు అయివుంటారు. వీరు నిజమైన ప్రేమకు ప్రాణాలైనా అర్పించే భావకులై వుంటారు. శారీరకంగా కోర్కె అంతర్గతంగా ఎంతవున్నా, మానసికంగా దగ్గరవ్వందే తృప్తిపడలేరు.
                                
     గుణింతాల్లో చాలా పొడవైన, సన్నని ఒంపులు వ్రాసేవాళ్లు మనసులోని భావాలను ఆచరించలేనివారు కావచ్చు. వీరు ముక్కుకు సూటిగా వ్యవహరించేవారై వుంటారు. పనిని చివరివరకూ చేయటంలో వున్న శ్రద్ద, దాని విజయాన్ని ఆస్వాదించటంలో వుండదు వీరికి. వీరిలో ఏమేరకు దొరికితే, శృంగారంలో, అంతవరకే సంతృప్తిపడే గుణం వుంటుంది.

 Previous Page Next Page