వీరికి 'వ్రాయటం' కంటే ఇతర విషయాలమీద ఆలోచన వున్నట్టు గమనించవచ్చు. వాలుగా, ఒక పద్దతిలేకుండా వ్రాసిన పద్దతి వలన వీరి యొక్క అనాసక్తిని తెలుసుకోవచ్చు. వీరికి వీరి శక్తిమీద నమ్మకం లేక ఇతరులను నిందించే తత్వంతో కూడి, త్వరత్వరగా ఆలోచనావిధానాన్ని మార్చుకుంటూ వుంటారు.
అక్షరాలు నిలువుగా మొదలుపెట్టి, ఒకే విధంగా వ్రాసిన ఈ చేతివ్రాత వారియొక్క సాదారణతను తెలుపుతుంది. మార్పుని, వెరైటీని తట్టుకోలేక అతి మామూలు జీవితానికి అలవాటు పడిపోతారు. వీరు పెద్దయితే వ్యాపారంగంలో రాణించలేరు.
ముద్దలుగా :
కొంతమంది పిల్లలు వ్రాసేటప్పుడు అక్షరాలపైన ఇంకు పులిమేస్తూ వ్రాస్తూ వుంటారు. దీనివలన వీరు ప్రతి చిన్నపనికి ఎక్కువ శ్రమపడుతూ, ఎప్పుడూ ఏదో తెలియని బాధతో వుంటారు. ఇల్లన్నా, పాఠశాలన్నా వీరికి ఇష్టం వుండదు. నిశ్సబ్దంగా ఎవరికీ పట్టనట్టు వుంటారు.
స్పష్టంగా:
అక్షరాలు పెద్దవిగా, కొట్టొచ్చినట్టు, స్పష్టంగా కన్పించే విధంగా వ్రాసే ఈ విదానం వల్ల వీరికి ప్రతి విషయంమీదా శ్రద్ద ఎక్కువగా వుంటుంది. ప్రతిదాన్ని పొందాలని వీరు ఉబలాట పడుతుంటారు. దేన్నయినా చాలా త్వరగా అర్దంచేసుకోగలుగుతారు. గుర్తింపు కోసం తహతహలాడతారు.
అసాధారణ కోణాలతో:
వీరు శ్రద్దగా చదువుతూ, ఆటల్లో కూడా చాలా యాక్టివ్ గా వుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు అతిగా కూడా ప్రవర్తిస్తూ వుంటారు. వీరికి ఇల్లన్నా ,స్కూలన్నా చాలా ఇష్టం. తల్లితండ్రుల పట్ల చాలా ప్రేమగా, భక్తిగా వుంటారు. అటువంటి ఆప్యాయతనే కోరుకుంటారు.