Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 43

 
    ఆ చివరి వాక్యం చెబుతూనే అవధాన కార్యక్రమం పూర్యినట్టు వెంటనే చేతిని పైకెత్తి అందరికీ విష్ చేశాడు రుత్వి.


 
    పదిహేను సెకెండ్ల వ్వవధిలో తన టేబుల్ దగ్గరకు నడిచి సశ్య ముందు  కూర్చున్నాడు. అపాలజీ చెప్పబోతుంటే "ఇట్స్ ఎనఫ్" రోషంగా అంది సశ్య క్రోధావేశాలతో కంపించిపోతూ "నీకింత పెద్ద సర్కిల్ వుందని చెప్పడానికి నన్ను హాలిడే ఇన్ కి  తీసుకురావాల్సిన అవసరం లేదు. రుత్వి. అసలు  ఏమిటీ నీ వుద్దేశ్యం?" విజూషమీద గెలిచిన నేను ఏం సాధించినట్టు..... నాతో కలిసివచ్చిన నువ్వు ఆ వృద్ద నారీమణులతో ఇంతసేపు....."ఇంకా కడిగేసేదే.

 

    చేతులు జోడించాడు. "ఓకే తప్పయింది" అప్పటికే టేబుల్ మీదున్న డిన్నర్ ని చూస్తూ "ఇప్పుడు జరిగినదానికి నాకు నేను విధించుకుంటున్న శిక్షగా తెల్లవార్లూ నేనుమీ ఇంట్లో వుంటాను. సరేనా?" అన్నాడు వెంటనే సర్వ్ చేయడం మొదలుపెట్టాడు.

 

    అదుగో అప్పుడు చూసింది సశ్య.

 

    దూరంగా మరో టేబుల్ దగ్గర కూర్చని వుంది విజూష స్పూర్తితో.

 

    అంతే......

 

    మొహంలో రంగులు మార్చుకుని "తెల్లవార్లూ నాతోనే వుంటావుగా. మాట తప్పకూడదు" అంది విజూషకి వినిపించేట్టుగా.

 

    "ఓకే" విజూషని చూడని రుత్వి ఆమె అధికారానికి దాసోహమన్నట్లుగా తల పంకించాడు.

 

    అర్దరాత్రి పన్నెండు గంటలు కావస్తుంది.

 

    కబుర్లతో, కంప్యూటర్ గేమ్స్ తోను అంతసేపూ గడిపిన సశ్య రుత్విని చూస్తూ అంది "నిద్రొస్తుందా?" రుత్వి జవాబు చెప్పలేదు.

 

    "నథింగ్ డూయింగ్! తెల్లవార్లూ నాతో వుంటానని మాటిచ్చావ్" చేయి పట్టుకుని అతడ్ని లేవదీసింది "గెస్ట్ రూంలో మంచి కేసెట్ చూపిస్తాను రా."

 

    అరనిమిషంలో గెస్ట్ రూంకి చేరుకున్నారిద్దరూ. "టేన్ డావన్ ఏక్ట్ చేసిన నైబోర్గ్ పిక్చరు. ఇట్స్ ఫెంటాస్టిక్ మూవీ" అలసటని కప్పిపుచ్చుకుంటూ విసిఆర్ ని రిమోట్ తో ఆన్ చేసింది.

 

    కానీ.......

 

    అదిరిపడింది.

 

    ఎదురుగా ఇప్పుడు కనిపిస్తున్నది పిక్చరు కాదు.

 

    ఆ కేసెట్ స్థానంలో మరేదో కేసెట్ ని వుంచారెవరో.

 

    అది త్రిబుల్ ఎక్స్ బ్లూ ఫిలింత

 

    వయసులో వున్న ఓ యువకుడు, ఓ అమ్మాయితో కలిసి బ్రూటల్ గాసెక్స్ లో పాల్గొంటున్నాడు.

 

    అపరాత్రివేళ.....

 

    కోరుకున్న యువకుడి సమక్షంలో కోరని కోరకూడని ఓ దృశ్యం మత్తు సుగంధాన్ని పచ్చిగా కక్కుతూంది.


 
    కాంక్షకీ సంకోచ వ్యాకోచాలుంటాయని తెలియజెప్పే అచంచల దివ్యరస సౌధాల గారుల ద్వారాలను ప్రయ్యలు చేస్తున్న చిత్రమైన యవ్వన చంచలం.

 

    విరహోష్ణ సెగలతో మనోరుధిరాంబరం  ఏ చీకటి లోయల్లోకో జారి నిగూఢ గాఢ నిశ్శబ్దంగా మారి భీకరోల్లాసాల స్వీకారంతో గడ్డకట్టుకు పోవాలన్న వివశత్వం.

 

     పయోధిగా మారి కాలం బల్లెపు మొనతో క్షణాల్ని రేణువులుగా చీల్చి అణువణువునీ ఉప్పెన వేటుతో ఆక్రమించి రాగ సరాగాల నడుమ తడిసిన తుంపర కావాలన్న తమకం.

 

    టీవీలో దృశ్యం ఆగింది.

 

    కాదు....

 

    రుత్వి ఆపు చేశాడు.

 

     అప్పటికే స్వేదంతో తడిసిన సశ్య అసంకల్పితంగా అటుగా వచ్చిన రుత్వి భుజంపై చేయివేసింది.

 

    ఎప్పటి ప్రశాంతతే తప్ప రుత్విలో అణువంతైనా సంచలనం కనిపించదేం?

 

    అది నిగ్రహమో లేక నిగ్రహించుకోలేని స్థితి అందించే నిర్లప్తతో ఆమెకే తెలీదు.

 

    "వెళ్లిపోతావా?" అడిగింది భారంగా చూపుల్ని నేలపైకి జార్చుతూ.

 

    "ఉండి ఏం చేయాలి?" రుత్వి కేజువల్ గా అడిగినా అందులో అదోలాంటి విశ్లేష వినిపించింది.


 
    "నాచేత చెప్పించుకోవాలనుకుంటున్నావా?" అనేసేదే, కానీ నిభాయించుకుంది.

 

    తెల్లవార్లూ నాతో వుంటానని మాటిచ్చావ్?" అంది క్రీగంట చూస్తూ.

 

    "నిజమే! వుంటానన్నానుగానీ ఇలా వుంటాననికాదు."

 

    "ఇలా అంటే?"

 

    "బ్లూఫిలిం చూస్తూ.

 

    "చళ్ మనిపించిందేమో అప్రతిభురాలైంది.

 

    "అది నేను కావాలని వుంచిన కేసెట్ కాదు."

 

    "అని నేననలేదే"మృదువుగా నవ్వాడు ఓ మంచి స్నేహితుడిలా సశ్ కళ్ళలో ఏ భావాన్ని చదివాడో నెమ్మదిగా కిటికీ దగ్గరికి నడిచి బయట చీకట్లోకి చూస్తూ అన్నాడు.

 

    "మీర్జాగాలిబ్ గురించి ఎప్పుడయినా విన్నావా సశ్యా?"

 

    "ఎస్...... ఉర్దూ కవి కదూ"

 

    "అవును" నిట్టూర్పుగా క్షణం ఆగి ఆ తర్వాత చెప్పుకుపోయాడు. "అతనికి ఖాసిం అనే ఓ మంచి స్నేహితుడు వుండేవాడు. ఇద్దరూ ఓ రోజు ఓ ఫంక్షన్ కి వెళ్ళారు. అక్కడ గాలిబ్ మామిడిపళ్లని చూసి చాలా సంబరపడ్డాడట. కారణం మామిడిపళ్ళంటే అతనికి చాలా ఇష్టం కాబట్టి."

 

    ఉన్నట్టుండి రుత్వి ఇలాంటి ప్రసక్తి ఎందుకు తెచ్చాడో అర్దంకాని సశ్య విస్పారితంగా చూస్తోంది.

 

    అయితే ఖాసింకి మామిడిపళ్లంటే అంత ఇష్టం వుండేదికాదు. దానితో ఒక్క పండునీ తాకలేదట. అప్పటికే ఐదారు పళ్ళని తిన్న గాలిబ్ కనీసం ఒక్కటైనా తినొచ్చుగా అన్నాడట ఖాసింని చూసి. అవంటే నాకు అసహ్యం అని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పడం మాత్రమే కాదు గాలిబ్ విసిరిన టెంకని వాసన చూసి వదిలేసిన ఓ గాడిదని చూపిస్తూ "చూశావా! మామిడిపండంటే గాడిదకీ అయిష్టమే అన్నాడట. దానికి వెంటనే స్పందించిన గాలిబ్ "మామిడిపళ్ళంటే గాడిదలకి మాత్రమే ఇష్టం వుండదు" అంటూ చురకవేశాడట."

 

    క్షణం ఆగిన రుత్విని చూస్తూ అంది సశ్య "ఇప్పుడు ఈ కథ నాకెందుకు చెప్పావ్?"

 

    "నేను ఖాసిం లాంటివాడ్ని కానని నీకు తెలియచెప్పడానికి."

 

    "అంటే?"

 Previous Page Next Page