అయన అలా వెళ్ళిపోగానే గుమ్మం పక్కనుంచి రాజు బయటకు వస్తూ "పడ నీళ్ళున్నాయి.... ఈ రోజు వేణ్ణీళ్ళులే. స్పెషల్..... అంతేకాదు ప్రతిరోజూ లాగా అక్కడ రష్ గా వుండదు. వాళ్ళంతా లేచే సమయానికి నువ్వెళ్ళిపోతావ్ గా" అన్నాడు. అదే శాడిస్టు నవ్వుతో .
చిరంజీవి మాట్లాడలేదు. అతడి మనసంతా అదోలాటిస్థబ్ధత అపరించి వుంది. ఏదో లోకంలో వున్నట్టు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కొద్దిసేపట్లో, చాలా కొద్దిసేపట్లో ఒకతాడు తన మెడకి బిగుసుకోబోతున్నదన్న ఆలోచనే నమ్మశక్యం కాకుండావుంది. కానీ అదంతా మామూలుగా జరిగిపోతూంది.__ ఏడీ ఆగటంలేదు ప్రాణం కూడా అలానే పోతుంది.
నాలుగు గోడలమధ్య__ నెమ్మదిగా నాలుగు చెంబుల నీళ్ళు పోసుకొని,స్నానం అయిందనిపించాడు. జైలు దుస్తులు కొత్తవి __ తెల్లవి ఉరికి ముందు తోడగబడేవి__ ఇవ్వబడ్డాయి.
వాటిని ధరించాడు.
వేడినీటి తాలూకు ప్రాభవం పోయి, కొద్దిగా చలి పెట్టసాగింది. చుట్టూ ఇద్దరు గార్డులు. అతడి కళ్ళు తడబడ్డాయి.కనీ బహుశా,అది చలివల్ల వచ్చింది అయి వుంటుంది.మెట్లెక్కి వరండా గుండా తన సెల్ కి వచ్చాడు. అక్కడో ఇద్దరు సెంట్రీలున్నారు. అందరూ వొక్కరొక్కరే చాలా నిశ్శబ్దంగా తమ పనులకి తాయారవాటం తెలుస్తూంది.
అతడు సెల్ వైపుకి రాగానే, అక్కడివాళ్ళు కొద్దిగా దూరంగా వెళ్ళి నిలబడ్డారు.
దైవప్రార్ధనచేసుకోవటం కోసం ఏకాంతం కల్పించబడింది. మోకాళ్ళమీద వంగి కొద్దిసేపు, చాలా కొదిసేపు తన ఇష్టదైవాన్ని పార్ధించాడు. తరువాత కళ్ళు తెరిచాడు. అతడి చూపు కాగితాల మీద పడింది. సర్వోత్తమారావు ఇచ్చిన కాగితాలు అవి. ఉరి రద్దుకోసం ఏర్పాటుచేసిన ఉపన్యాసం కాగితాలు. అనుకున్నది అనుకోన్నట్టూ జరిగితే ఎత్తయిన ఉపన్యాస వేదికమీద చదవవలసినవి!
ప్రార్ధన ముగియగానే, అతను వాటిని చదవటం ప్రారంభించాడు. సర్వోత్తమరావు చేతి వ్రాతతో వున్న వ్యాసం అది.
"ప్రతీ సహజమైన చావు భయం, కరుణ, బాధ వుంటాయి. రక్షించటానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తూ వుంటారు. బంధువులు ఆశతో ఆవేదనతోఎదురుచూస్తూ వుంటారు. ఎన్నోకన్నీటిచుక్కలు రాలటానికి సిద్ధంగా ఉంటాయి. ముందు కోమా వస్తుంది. ఆ నిద్రలో మరణం నెమ్మదిగా వచ్చి, తనతోపాటుహాయిగా తీసుకుపోతుంది. కానీ "ఉరి" వెనుక భయం తప్ప ఇంకేమి లేదు. ఆర్నెల్లముందే ప్రాణం ఎప్పుడు పోతుందో తెలుస్తుంది. అప్పట్నుంఛీ క్షణం క్షణమూ దిగులే. ఆశ ఉండదు. మన కోసం ఏడ్చే వాళ్ళుండరు. అనారోగ్యం ఉండదు. చాలా స్థబ్దంగా, అమనుషంగా తోటి మనిషి ప్రాణం మేడద్వారా బయటకి లాగి వేయబడుతుంది.
హత్య చేసిన వ్యక్తికీ మరణమే సరి అయిన శిక్ష అన్న భావం మనలోంచి పోవాలి. 1956 లో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం అడిగినప్పుడు చాలా ప్రభుత్వాలు ఉరిని " ఉంచుకుని" కోరటం దురదృష్టం. 1972 లో ఎర్పాటయిన"లా కమీషన్ " కూడా కొన్ని ప్రత్యెక సందర్భాలలో ఉరి అమలు జరపవచ్చునన్నది. అయితే ఏ ఏ ప్రత్యెక సందర్భాల్లో వివరించలేదు. ఈ కమిటీ అడవాల్లాని కూడా ఉరి తీయవచ్చుని రికమెండు చేసింది.
ఉరిశిక్ష దేశంలో నేరాల్ని తగ్గిస్తుందనీ కానీ, ఉరి తీస్తారుమానాన్న భయంతో మనిషి హత్య చేయటం మానేస్తాడన్న వాదనగానీ నిలబడవు. భారతదేశంలో హత్యలు, సెక్సు సమస్యల వల్లగానీ గ్రామీణ ప్రాంతాల్లో భూమి, రాజకీయ తగాదాళవల్ల కాని ఎక్కువగా జరుగుతాయి. వీటికీ, ఉరిశిక్షకీఏ సంబంధమూ లేదు.....
చాలామంది జడ్జీలు ఉరిశిక్షకు వ్యతిరేకులు. జస్టిస్ కారేగట్ తన జీవితంలో ఎవరికీ ఉరిశిక్ష విధించని, ప్రకటించాడు. ప్రభుత్వం అతడిని రాజీనామా చేయమని కోరగానే, మాటమీద నిలబడి ఉద్యోగం వదులుకున్నాడు. ఇలాటి మానవతా వాదులు భారతదేశంలో యెక్కువమందిలేకపోవతండురద్రుష్టకరం. జవహర్ లాల్ నెహ్రూ తాను వ్యక్తిగతంగా ఉరికి వ్యతిరేకినని చెప్పేవారు. శ్రీమతి ఇందిరాగాంధీకూదాయిదే అభిప్రాయం పలుమార్లు వెల్లడించారు.
మన న్యాయశాస్రం బ్రిటన్ నుంచి అరువు తెచ్చుకోబడింది. చిత్ర మేమిటంటే ప్రస్తుతం బ్రిటనే ఉరిని రద్దుచేసింది. మనం యింకా దాన్ని పట్టుకుని వేలాడుతున్నాం. పాకిస్తాను లో నేరస్తుణ్ణి ఇప్పటికీ బహిరంగంగా రాళ్ళతోకొట్టి చంపుతారట. ఒకప్పుడు కాళ్ళకి రాయికట్టి నీళ్ళలో పడవేసిచంపటం, గుర్రాలచేత తొక్కించిచంపడం అమల్లులో ఉండేవట. ఇవన్నీ మనకెంత అనాగరికంగా కనబడ్తూన్నాయో , మన 'ఉరి' మిగతా దేశవాసులకు అంత అనాగరికంగా కనబడ్తుంది. ఒక వందేళ్ళు పోయేక మన భావితరం వాళ్ళు మన గురించి కూడా "వాళ్ళు ఉరి తీసి మనుష్యుల్నిచంపేవారట" అని చిత్రంగా చెప్పుకుంటారు.
ఎటువంటి నేరస్తుల్ని ఉరికంబానికిపంపాలో మన న్యాయశాస్రం సరిగ్గా చెప్పలేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉరిశిక్ష విధించాలో మన జడ్జీలకుతెలీదు. ఒక నిర్దోషికివేసిన "ఉరి" అది అమలు జరిగిన తర్వాత అతడి నిర్దోషిత్వం బయటపడితే, వెనక్కి తీసుకోలేని దారినమైనాశిక్ష. నిర్దోషిత్వం బయటపడింది.
దేశంలో మరణశిక్షని పూర్తిగా రద్దు చేయాలి. దారుణంగా హత్య చేసిన వ్యక్తిని అంతకన్నా దారుణంగా చిత్రహింస పెట్టండి!! మరణించే వరకూ జైల్లో బంధించండి! అంతేకాని మరణశిక్ష విధించకండి.!!
ఉరి అమానుషమైనది!
ఉరి క్రూరమైనది!
మనిషి బ్రతికే హక్కుని సాటిమనిషితీసేయయలేదు!!
ఉరి రద్దు చెయ్యండి! సెక్షన్ 302 మార్చండి!!
అదే మా "అభిలాష!!"