జానీ__ ఆ గ్యాంగ్ హిట్టార్ గా గుర్తింపు పొందినవాడు. అనుక్షణం తంబిని అంటిపెట్టుకుని వుంటాడు.
ఈ మాఫియా గ్రూపుకి ఓడల నుంచి దొంగసరుకు తీరానికి తీసుకురావడం, హెరాయిన్ తదితర మాదకద్రవ్యాల దొంగా రవాణా, అమ్మాయిల వ్యాపారంతోపాటు ఒక వర్గంవారు. తమ ప్రత్యర్దిని అంతం చేసే బాధ్యతను కూడా ఈ మాఫియా గ్రూపుకి అప్పజేప్పాతారు. ఏ సాక్ష్యాధారలు లేకుండా చంపడానికి ఒక వ్యక్తిని వినియోగిస్తారు. అవసరం అనుకుంటే ఆ వ్యక్తీ మిగతవారి సాయం తీసుకుంటాడు. ఇలా హత్యలు చేసే వ్యక్తిని "హిట్టార్" అంటారు. ఇతను మర్దర్సులో ఎక్స్ పార్ట్. ఒక హత్య జరిగిన తీరునుబట్టి అతడ్ని అనుమానించాల్సిందేగాని అందుకు సరైన సాక్ష్యాధరాలంటూ దొరకవు.
తంబిని టేబుల్ మీదున్న సిగరెట తీసి, ధైర్యం వీరిద్దరికే వుంది. గ్యాంగ్ లీడరు గా తంబి ఎదగడానికి వీరు మృత్యువుతో పోటీ పడిన సంఘటనలు ఎన్నెన్నో!
సమాధానంగా టేబుల్ మీదున్న సిగరెట తీసి, సిగరెట వెలిగించాడు తంబి. అతడి నోటినుంచి వలయంగా వెలువడుతున్న సిగరెట పోగా అతడి మనోభావాలను తెలియజేస్తోంది.
"జానీ! సీసామందుకోసం ప్రాణాలకు తెగించి పోరాటానికి దిగిన డబ్బు చేతికొచ్చిన తర్వాత కడుపునిండా తాగుతాం. అప్పుడుగాని మనకి ఆడది గుర్తుకురాదు. ఒళ్ళుమ్ముకునే ఆడది సయితం ఎవడో ఒకడ్ని ఇష్టపడుతుంది.అతడితో మరావుగంత అదనంగా గడుపుతోంది! ఆమె చూపే అభిమానానికి_స్నేహానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? మన కోసం గాలిస్తున్న పోలీసుల కాలిబాటు దెబ్బలు! తమ రహస్యాలు తెలిసిన ఆడదాన్ని హత్య చేసిన వారున్నారు. మాయ మాటలు చెప్పి ఆమెను మరో ఊరు తీసికెళ్ళి అమ్మినవారున్నారు. కన్నతల్లి విలువ తెలియని మనకు ఆడదాన్ని అర్ధం చేసుకోలేం_ అంతే! ఎవడో వడయారు_ వాడి కూతురుషిప్పింగ్ కార్పోరేషన్ కాంట్రాక్ట్ తీసుకోబోతుంది. ఏం.వి. అయ్య అనే వాడుడానికి అడ్డుపడ్డాడు.
అది వారి సొంతగొడవ_ మనకు ప్రమేయం లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడితేస్తూ అదనపు జాగ్రత్తగా త్రాలర్లమీద సముద్రం మీదికి వెళ్ళి 'సీకోస్తా' అనే జర్మ్స్ వదిలిపేట్టాడు. దీనివల్ల చేపలకు రోగం వస్తుంది. ఆ చేపల్ని తిన్నవారు అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతారు. ఫలితంగా షిప్పింగ్ కార్పోరేషన్ మీద నియంత్రణ మావుదలవుతుంది. యిమ్తకీ ఆ వడయారు కూతురు చేయబోతున్న వ్యాపారం ఏమిటో_ ఆ అయ్యకి ఆమె వ్యాపారం పట్ల అంత యిమ్త్రస్తూ ఎందుకో తెలుసుకోవడానికే వెళ్ళాం."
"దీనికి పేపరుకి సంభందం ఏమిటి?"
"81కోట్ల జనాభావున్నా ఈ దేశంలో పట్టణాలలోని రోడ్లపైన ప్లాట్ ఫార్మ్స్ పైన బ్రతికేవారు 3కోట్లమంది! వీరిలో అధిక సంఖ్యాకులు ఇల్లీగల్ యాక్టివిటీస్ తో బ్రతుకుతున్నారు. రేపటిరోజున దాదాలుగా మారేది వారే! వారి కోసమే ఈ పత్రిక."
"ఇప్పటికే నీ సంపాదనలో మూడోవంతు స్కూలుకి ఇస్తున్నావు యింకొక నష్టామా?"
"ఈ పేపరుకి నష్టంరాదు. దేశంలో ఏ పేపరు ఇవ్వని వార్తాలు. ఈ ఫాపియా లీడర్ల ఇంటర్యూలు, జీవితగాధలు అందిస్తాం. అవసరమైతే రాజీకీయ నాయుకుల లొసుగులు బయటపెడతాం. నాకు తెలుసు_మన పత్రికకి నష్టం వస్తుందని. అందుకే చాలా కొద్ది కాఫీలు ప్రింటు చేస్తాను. మన మాత్రికలో వచ్చిన స్టోరీని మిగతా పత్రికలవారు, మిగాతాభాషలవారు మన పత్రికను పేర్కొంటూ వారి వారి పత్రికలో తిరిగి ప్రింట్ చేస్తారు. ఆ విధంగా మన పత్రికకి గుర్తింపు వస్తుంది. అప్పుడు బిజినెస్ గా చేద్దాం. మనచేతిలో పేపరు వున్నంతకాలం అధికార్లు, రాజికీయ నాయుకులు మనపై దాడి చేయడానికి జంకుతారు."
"తంబీ! గుడ్ లక్!"
"ఒకరోజున పండిట్ జీ వచ్చి వినాయుకుని గుళ్ళో స్కూలూ ప్రారంభిస్తున్నాను. సాయం చేయమంటే ముందుకు అడుగేసినప్పుడు నున్నుకాదనుకున్నాం. తరుచుగా స్కూలుకి వెళుతుంటే టైం వేస్ట్ చేస్తూన్నావని బాధపడ్డం. ఇప్పుడు అర్దమవుతోంది. చదువు వులువ ఏమిటో" అన్నాడు జానీ.
"నా జీవితానికి ఒక లక్ష్యం వుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నావుమెట్లు కట్టుకుంటూ పోవాలి..." స్వగతంగా అనుకుమ్తున్నట్టే పైకి మటీరియలైజ్ చేస్తున్నాడు.
* * * *
ఆ వార్త వుంటూనే ముఖ్యమంత్రి దిగ్ర్భాంతి చెందాడు.
చేపలు తిన్నవారు వేళ సంఖ్యలో అస్వస్థులై హస్పిటల్ లో చేరారు. అంతకుమించి చచ్చిపోయిన చేపలు గుట్టలు గుట్టలుగా తీరానికి కొట్టుకోస్తున్నాయి.
వైరల్ డీసిజ్ వల్ల చేపలు చచ్చిపోతున్నాయి.
హాస్పిటల్ లోని రోగులకి తక్షణవైద్య సౌకర్యం కల్పించడం ఒక ఎత్తు, చనిపోయిన చేపల్ని ఏం చేయాలన్నది మరొక ఎత్తు. ఆ చేపల్ని అలాగే వదిలేస్తే అవి కుళ్ళిపోయి మరింత హాని కలిగించడం ఖాయం.
ఏం చేయాలి?
* * * *
రెండు వేల కాఫీలతో అందునా టే బ్లాయిడ్ సైజులో వెలువడిన ఆ పత్రిక అధికార యంత్రాగాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రిని ఓ కుదుపు కుదిపింది.సాటి పత్రికల్ని పట్నవాసుల ఇక్కట్లని ఏకరువు పెడితే ఈ పత్రిక మరో అడుగు ముందుకేసింది. చేపలు చచ్చిపడి వుండటం వెనుకగల ముడి విప్పదీసింది. సముద్రంమీదకి ఎవరెవరు వెళ్లిందీ, ఏమ్చేసిమ్డీ కళ్ళకు కట్టినట్టు తేదీలు, గంటలతోపాటు రాశారు. ఇద్దరు పారిశ్రామిక వేట్టాలు తమ ప్రాబల్యంకోసం జరిపిన పెనుగులాటలో ఎన్ని లక్షల చేపలు చచ్చిపడింది._ఆ ఇన్ ఫెక్ట్ డ్ షికత్ ఎంతమంది అస్వస్తులయిందీ ఫోటోలతో సహా ప్రచురించింది.